ఉన్నత విద్యలో ప్రవేశానికి కనీస అర్హత మార్కులు..!
ఉదాహరణకు.. ఐఐఎం–క్యాట్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే.. బ్యాచిలర్ డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులు లేదా దానికి సమానమైన జీపీఏతో ఉత్తీర్ణులై ఉండాలి. ఇతర ఎంట్రన్స్‌లు, ప్రవేశాల విషయంలోనూ కనీస మార్కుల నిబంధనను చాలా ఇన్‌స్టిట్యూట్‌లు అనుసరిస్తున్నాయి. అంటే.. కోర్సు ఏదైనా విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడం అవసరమని చెప్పొచ్చు.
‘ఉన్నతం’గా రాణించేందుకు..
సాధారణంగా ఉన్నత స్థాయి కోర్సుల స్వరూపం.. అప్పటికే సదరు విద్యార్థులు పూర్తిచేసుకున్న కోర్సులకు కొనసాగింపుగా ఉంటుంది. అలాంటి ఉన్నత కోర్సుల్లో రాణించేందుకు.. విద్యార్థులకు దిగువ తరగతుల్లో సబ్జెక్ట్ పరమైన నైపుణ్యాలు తప్పనిసరి. ఈ నైపుణ్యాలను మూల్యాంకన చేసేందుకే వార్షిక పరీక్షలు లేదా సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల ఫలితాల ఆధారంగా సదరు విద్యార్థులు ఉన్నత విద్య కోర్సుల్లో రాణించే అవకాశంపై ఒక నిర్ణయానికి వస్తారు. అందుకే ఆయా ఉన్నత కోర్సుల్లో ప్రవేశాలకు కనీస అర్హత మార్కుల నిబంధన అమలవుతోంది.
ఇంకా చదవండి : part 3: మార్కులా లేక ఆయా ఎంట్రన్స్ టెస్ట్‌లా.. అడ్మిషన్‌కి ఏది కోలమానం..!