Skip to main content

తెలుగు రాష్ట్రాల్లో బీడీఎస్‌ సీట్లు ఇలా.. ఆల్‌ ఇండియా కోటాకు 15 శాతం..

2020–21 కౌన్సెలింగ్‌ గణాంకాల ప్రకారం–ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రభుత్వ డెంటల్‌ కళాశాలలో 40 సీట్లు, 15 ప్రైవేట్‌ కళాశాలల్లో 1400 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

తెలంగాణలో ఒక ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో వంద సీట్లు, పదకొండు ప్రైవేటు కళాశాలల్లో వేయి సీట్లు అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు సికింద్రాబాద్‌లోని ఆర్మీ డెంటల్‌ కళాశాలలో మరో ఆరు సీట్లు ఉన్నాయి. ప్రైవేట్‌ కళాశాలల్లోని మొత్తం సీట్లలో యాభై శాతం సీట్లు కన్వీనర్‌ కోటాలో కేటాయిస్తారు. మిగతా సీట్లను ఆయా కళాశాలల యాజమాన్యాలు ఎన్‌ఆర్‌ఐ కోటా, మేనేజ్‌మెంట్‌ కోటా పేరుతో సొంతంగా భర్తీ చేస్తాయి. ప్రభుత్వ కళాశాలల్లోని మొత్తం సీట్లలో 15శాతం సీట్లను ఆల్‌ ఇండియా కోటాకు కేటాయిస్తారు. ఈ సీట్లను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ పర్యవేక్షణలో ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తారు.

స్పెషలైజేషన్‌ తప్పనిసరి..
బీడీఎస్‌ స్థాయిలో అకడమిక్స్‌కే పరిమితం కాకుండా.. క్లినికల్, నాన్‌–క్లినికల్‌.. ఇలా అన్ని విభాగాలకు సంబంధించి క్షేత్ర నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. రోగులకు అందిస్తున్న చికిత్స విధానాలను తెలుసుకునేందుకు కొంత సమయం కేటాయించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో డెంటల్‌ కెరీర్‌లో రాణించాలంటే.. స్పెషలైజేషన్‌ అవసరం ఎంతో ఉంది. కాబట్టి విద్యార్థులు ఎండీఎస్‌ను పూర్తి చేసే ప్రయత్నం చేయాలి.
– డా‘‘ శరద్‌ కపూర్, డెంటల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యులు

ఇంకా చదవండి : part 1: డిమాండ్‌ పెరుగుతున్న బీడీఎస్‌.. కెరీర్‌ అవకాశాలు ఇవే..

Published date : 02 Jul 2021 05:24PM

Photo Stories