Skip to main content

సీఓఏపీలో రిజిస్ట్రేషన్.. మూడేళ్ల గేట్ స్కోరు ఆధారంగా..

గత మూడేళ్లు అంటే 2021, 2020, 2019లలో గేట్‌ స్కోర్లు ఆధారంగా రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం ఉంది. విద్యార్థులు మూడేళ్ల స్కోర్‌లలో బెస్ట్‌ స్కోర్‌ ఆధారంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.

 ఆ తర్వాత మిగతా రెండు స్కోర్ల వివరాలు పొందుపరిచే అవకాశం ఉంటుంది. గేట్‌కు ఒకటి కంటే ఎక్కువసార్లు హాజరైన విద్యార్థులకు ఇది మేలు చేకూర్చే విధానమే. 


వేర్వేరు పేపర్లలో స్కోర్‌ సాధిస్తే?

ఒకవేళ విద్యార్థులు గేట్‌లోని వేర్వేరు పేపర్లలో స్కోర్‌ సాధిస్తే.. నిర్దిష్టంగా ఏదైనా ఒక పేపర్‌ స్కోర్‌ ఆధారంగానే రిజిస్టర్‌ చేసుకోవాలి. ఆ తర్వాత సీఓఏపీ ఆన్‌లైన్‌ అప్లికేషన్‌లో మిగతా పేపర్ల స్కోర్‌ను పొందుపర్చుకునే అవకాశం ఉంటుంది. సీఎస్, ఈసీఈ, ఈఈఈ విద్యార్థులకు గేట్‌లో ఒకటి కంటే ఎక్కువ పేపర్లకు హాజరయ్యే అర్హత ఉంటోంది. ఇలా వేర్వేరు పేపర్లకు హాజరైన అభ్యర్థులకు ఈ విధానం మేలు చేస్తుందని చెప్పొచ్చు. 


సీఓఏపీ రిజిస్ట్రేషన్‌.. ఇలా

 1. ముందుగా సీఓఏపీ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఇందుకోసం అభ్యర్థులు గేట్‌ రిజిస్ట్రేషన్‌ నెంబర్, గేట్‌ పేపర్‌ స్కోర్, గేట్‌ స్కోర్, పేరు, పుట్టిన తేదీ వివరాలు నింపి.. సబ్మిట్‌ టు రిజిస్టర్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి.
 2. తర్వాత రీడ్‌ ప్రొసీజర్‌ అండ్‌ ఇన్‌స్ట్రక్షన్‌్్పై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత యాక్సెప్ట్‌ టర్మ్స్‌ ఆఫ్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌పై క్లిక్‌ చేయాలి.
 3. ఈ ప్రక్రియ పూర్తయ్యాక.. గేట్‌ రిజిస్ట్రేషన్‌ నెంబర్, గేట్‌ పేపర్‌ కోడ్, గేట్‌ స్కోర్, పేరు, పుట్టిన తేదీ, ఈ–మెయిల్‌ ఐటీ, మొబైల్‌ నెంబర్‌ కాలమ్స్‌ను పూర్తి చేసి.. సబ్మిట్‌ రిజిస్ట్రేషన్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
 4. ఇలా సబ్మిట్‌ రిజిస్ట్రేషన్‌ బటన్‌పై క్లిక్‌ చేశాక.. అభ్యర్థులకు ఈ–మెయిల్‌ లేదా మొబైల్‌కు ఎస్‌ఎంఎస్‌ రూపంలో లాగిన్‌ సమాచారం వస్తుంది.
 5. ఈ–మెయిల్‌లో వెబ్‌సైట్‌ యూఆర్‌ఎల్, లాగిన్‌ వివరాలు, ఎస్‌ఎంఎస్‌లో పాస్‌వర్డ్‌ వివరాలు వస్తాయి.
 6. వీటి ఆధారంగా లాగిన్‌ అండ్‌ వెరిఫై రిజిస్ట్రేషన్‌ డిటెయిల్స్‌ను క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత గేట్‌ స్కోర్లకు సంబంధించి ఇతర స్కోర్లు ఉంటే.. వాటిని తెలియజేసి సబ్మిట్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి.
 7. దీంతో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయి.. అభ్యర్థులకు ఐఐటీల్లో అడ్మిషన్‌ లేదా పీఎస్‌యూ జాబ్‌ ఆఫర్ల వివరాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది.

అప్పుడే రిజెక్ట్‌ ఆఫ్షన్‌..

అభ్యర్థులు ఆయా రౌండ్లకు నిర్దేశించిన తేదీల్లోనే తమకు లభించిన సీటు, ఇన్‌స్టిట్యూట్‌ వివరాలను తెలుసుకొని.. వాటికి సంబందించి ‘యాక్సెప్ట్‌ అండ్‌ ఫ్రీజ్‌’,లేదా‘రిటెయిన్‌ అండ్‌ వెయిట్‌’లేదా ‘రిజెక్ట్‌ అండ్‌ వెయిట్‌’ ఆప్షన్లను ఎంచుకోవాలి.

అదనపు రౌండ్లు అనేవి ఒక విధంగా స్పాట్‌ కౌన్సెలింగ్‌ వంటిదే. ఈ రౌండ్లలో కేవలం యాక్సెప్ట్‌ అండ్‌ ఫ్రీజ్, రిజెక్ట్‌ ఆప్షన్లే అందుబాటులో ఉంటాయి. అంటే.. అదనపు రౌండ్లలో ప్రతి రౌండ్‌లోనూ తమకు లభించిన సీటు లేదా ఇన్‌స్టిట్యూట్‌ విషయంలో సమ్మతి లేదా తిరస్కరణ మాత్రమే తెలియజేసే అవకాశం ఉంటుంది. ఇలా అయిదు రౌండ్లోనూ కొనసాగుతుంది. అభ్యర్థులు తమ స్కోర్‌కు మరింత మెరుగైన ఇన్‌స్టిట్యూట్‌లో సీటు లభిస్తుంది అనుకుంటేనే.. రిజెక్ట్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.


సీఓఏపీ–2021 సమాచారం

అర్హత: బీటెక్‌ ఉత్తీర్ణతతోపాటు 2019, 2020, 2021లో ఏదో ఒక సంవత్సరంలో గేట్‌ ర్యాంకు సాధించి ఉండాలి. ఊ ఐఐటీల్లో బీటెక్‌ చదువుతూ సీజీపీఏ 8కి పైగా ఉన్న అభ్యర్థులకు సీఓఏపీ రిజిస్ట్రేషన్‌ నుంచి మినహాయింపు ఉంది. అలాంటి అబ్యర్థులు నేరుగా ఐఐటీల్లోని ఎంటెక్‌ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://coap.iitd.ac.in
 
సీఓఏపీ రిజిస్ట్రేషన్‌ వెబ్‌సైట్‌: https://cdn.digialm.com//EForms/configuredHtml/844/51671/Registration.html

సీఓఏపీ ఆఫర్‌ రౌండ్లు తేదీలు..

మొదటి రౌండ్‌: మే 28 –మే 30

 1. రెండో రౌండ్‌: జూన్‌ 4 – జూన్‌ 6
 2. మూడో రౌండ్‌: జూన్‌ 11– జూన్‌ 13
 3. నాలుగో రౌండ్‌: జూన్‌ 18– జూన్‌ 20 
 4. అయిదో రౌండ్‌: జూన్‌ 25 – జూన్‌ 27


సీఓఏపీ అదనపు రౌండ్ల తేదీలు

 1. మొదటి రౌండ్‌: జూలై 2 – జూలై 4
 2. రెండో రౌండ్‌: జూలై 9 –జూలై 11
 3. మూడో రౌండ్‌: జూలై 16 – జూలై 18
 4. నాలుగో రౌండ్‌: జూలై 23 – జూలై 25
 5. అయిదో రౌండ్‌: జూలై 30 – ఆగస్ట్‌ 1


విద్యార్థులకు అనుకూలం..

సీఓఏపీ పోర్టల్‌ ద్వారా ఎంటెక్‌ అడ్మిషన్‌ ఆఫర్స్‌ తెలుసుకునే విధానం విద్యార్థులకు ఎంతో ఉపయుక్తం. విద్యార్థులు తాము దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎన్ని ఇన్‌స్టిట్యూట్‌లు ఆఫర్లు ఇచ్చాయో తెలుస్తుంది. దానివల్ల తమకు నచ్చిన ఇన్‌స్టిట్యూట్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రిటెయిన్‌ ఆప్షన్‌ వల్ల మరింత మెరుగైన ఇన్‌స్టిట్యూట్‌లో ఆఫర్‌ను పొందే అవకాశం లభిస్తుంది. విద్యార్థులు ఆఫర్లు యాక్సెప్ట్‌ చేయడానికి ముందే ఆయా ఇన్‌స్టిట్యూట్‌లలో అందుబాటులో ఉన్న స్పెషలైజేషన్లు, ఇతర అకడమిక్‌ సదుపాయాల గురించి తెలుసుకోవడం మంచిది. 

–ప్రొ‘‘వి.జగదీశ్‌ కుమార్, డీన్, అకడమిక్‌ కోర్సెస్, ఐఐటీ–చెన్నై

ఇంకా చ‌ద‌వండి: part 1: ఐఐటీల్లో ఎంటెక్ లేదా పీఎస్‌యూల్లో ఉద్యోగ‌మా.. సీఓఏపీతో తెలుసుకోండిలా!

Published date : 19 May 2021 02:54PM

Photo Stories