ప్రస్తుత పరిస్థితుల్లో అకడమిక్ మార్కులతోపాటు ఈ స్కిల్స్‌కు ప్రాధాన్యం..!
చదివే అంశాలను అప్లికేషన్ దృక్పథంతో అవగాహన చేసుకోవాలి. ఫలితంగా మంచి గ్రేడ్‌లు పొందడమే కాకుండా.. రియల్ టైమ్ స్కిల్స్ కూడా సొంతమవుతాయి. తద్వారా భవిష్యత్‌లో ఉన్నత విద్య, ఉద్యోగావకాశాల పరంగా రాణించేందుకు అవకాశం ఉంటుంది.
గ్రేడ్ పాయింట్లు.. ప్రయోజనాలు
కోర్సుల ప్రవేశాల్లో అకడమిక్ గ్రేడ్ పాయింట్లకు వెయిటేజీ విధానం.
మార్కులు.. మెరుగైన ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశానికి తొలి మార్గం.
మంచి మార్కులుంటే.. సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగుందనే అభిప్రాయం.
పరిశోధనలకు ఎంపిక పరంగా కీలకంగా నిలుస్తున్న జీపీఏలు.
టెక్నికల్ కోర్సుల్లో అకడమిక్ ప్రతిభ, రియల్ స్కిల్స్‌తో కార్పొరేట్ ఆఫర్స్.
సబ్జెక్ట్ అవగాహన తెలిపే మార్కులు..
విద్యార్థికి సబ్జెక్ట్‌పై ఉన్న అవగాహనను తెలిపే సాధనంగా మార్కులు లేదా గ్రేడ్‌లు ఉపయోగపడతాయి. దాని ఆధారంగా చేరాలనుకుంటున్న కోర్సులో రాణించగలడా.. లేదా.. అని నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. పరీక్షలు, మార్కుల కోణంలో బట్టీ పట్టి చదవకుండా.. వాస్తవ నైపుణ్యాలు సొంతం చేసుకునే విధంగా చదవాలి. అప్పుడే పై తరగతుల్లో, కోర్సుల్లో రాణించగలరు. ఇక ప్రొఫెషనల్ కోర్సుల విషయానికొస్తే.. రీసెర్చ్, కేస్ అనాలిసిస్‌ల వంటి వాటిల్లో బేసిక్స్‌కు ప్రాధాన్యం ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని మార్కుల కోసం కృషి చేస్తూనే అప్లికేషన్ నైపుణ్యాలు అందిపుచ్చుకోవాలి.
– ప్రొ‘‘ వాసుదేవ వర్మ, డీన్, ట్రిపుల్‌ఐటీ–హెచ్.
ఇంకా చదవండి : part 1: మార్కులు ముఖ్యమా లేక క్షేత్రస్థాయి నెపుణ్యాలా..?