Skip to main content

మార్కులు ముఖ్యమా లేక క్షేత్రస్థాయి నెపుణ్యాలా..?

గ్రేడ్‌ పాయింట్లు.. లేదా మార్కులు. అకడమిక్‌గా విద్యార్థుల ప్రతిభకు కొలమానాలు! ఎన్ని ఎక్కువ మార్కులు సాధిస్తే.. భవిష్యత్‌లో అన్ని ఎక్కువ అవకాశాలు లభిస్తాయనే అభిప్రాయం! అందుకే కోర్సు ఏదైనా.. మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యేందుకు ఎక్కువ మంది విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు.

మరోవైపు.. మార్కులుంటేనే సరిపోదు.. క్షేత్రస్థాయి నైపుణ్యాలు చాలా ముఖ్యమనే వాదన!! ఈ నేపథ్యంలో.. మార్కులు ముఖ్యమా.. నైపుణ్యాలా..! జాబ్‌ మార్కెట్‌లో వేటికి ఎక్కువ ప్రాధాన్యం ఉంది.. గ్రేడ్‌ పాయింట్స్‌ వర్సెస్‌ స్కిల్స్‌పై ప్రత్యేక కథనం..

‘ఉన్నత విద్య కోర్సుల ప్రవేశాల్లో గ్రేడ్‌ పాయింట్లు/మార్కులకు వెయిటేజీ విధానం అమలవుతోంది. కాబట్టి విద్యార్థులు.. అకడమిక్‌గా మంచి మార్కులు సాధించేందుకు కృషి చేయాలి’ – అకడమిక్‌ వర్గాల అభిప్రాయం ఇది!
ఠి ‘విద్యార్థులు కేవలం మార్కుల సాధనకే పరిమితం కాకుండా.. రియల్‌ టైమ్‌ స్కిల్స్‌ సొంతం చేసుకుంటేనే ఉద్యోగాల్లో రాణించడం సాధ్యమవుతుంది’–ఇది ఇండస్ట్రీ వర్గాల భావన!! ఈ రెండు అభిప్రాయాలను పరిశీలిస్తే.. విద్యార్థులు తమ కెరీర్‌ ఉన్నతికి అకడమిక్‌గా మంచి మార్కులతోపాటు వాస్తవ నైపుణ్యాలు కూడా సొంతం చేసుకోవాల్సిన అవసరముందని స్పష్టమవుతోంది.

మార్కులు.. వెయిటేజీ..
ప్రస్తుతం దేశంలో ఉన్నత విద్య కోర్సులకు నిర్వహించే ఎంట్రన్స్‌ టెస్ట్‌లు, ఆ తర్వాత నిర్వహించే ఎంపిక ప్రక్రియలో అకడమిక్‌ మార్కులకు వెయిటేజీ లభిస్తోంది. ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవే శం కల్పించే జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్, ఎంసెట్‌ తదితర ప్రముఖ ఎంట్రన్స్‌ టెస్ట్‌లు, ర్యాంకుల రూపకల్పనలో ఇంటర్మీడియెట్‌ మార్కులకు గత కొన్నేళ్లుగా వెయిటేజీ విధానం అమలవుతోంది. కరోనా కారణంగా ప్రస్తుతం దీని నుంచి మినహాయించినా.. భవిష్యత్తులో మళ్లీ ఇంటర్మీడియెట్‌ మార్కులకు వెయిటేజీ విధానం అమలు చేసే అవకాశముంది.

  • బీటెక్‌ అర్హతగా ఐఐటీలు, ఎన్‌ఐటీలలో ఎంటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి గేట్‌ స్కోర్‌తో పాటు బీటెక్‌ మార్కులకు కూడా నిర్దిష్ట శాతం వెయిటేజీ కల్పిస్తున్న పరిస్థితి నెలకొంది.
  • బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతగా.. మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే ఐఐఎంలు కూడా క్యాట్‌ స్కోర్‌తోపాటు పదో తరగతి నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ వరకూ.. అకడెమిక్‌గా సాధించిన మార్కులకు నిర్దిష్ట వెయిటేజీ విధానం అమలు చేస్తున్నాయి.
  • బిట్స్, ట్రిపుల్‌ ఐటీలు వంటి ఇతర ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు కూడా ఇంటర్మీడియెట్‌ మార్కులకు వెయిటేజీ కల్పిస్తూ ప్రవేశాలు ఖరారు చేస్తున్నాయి. అంతేకాకుండా బిట్స్‌ ఆయా స్టేట్‌ బోర్డ్‌ల టాపర్లకు నేరుగా బీటెక్‌లో ప్రవేశం కల్పిస్తోంది. ఇవన్నీ కూడా అకడమిక్‌ మార్కుల ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి.

ఇంకా చదవండి : part 2: ఉన్నత విద్యలో ప్రవేశానికి కనీస అర్హత మార్కులు..!

Published date : 07 Jul 2021 05:16PM

Photo Stories