Skip to main content

ఈ యూజీసి పోర్టల్‌ ఇప్పటికే నమోదు చేసుకున్న వారి వివరాలిలా..!

పోర్టల్‌ను ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే అభ్యర్థుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

నెట్‌ఉత్తీర్ణులు– 60,958 మంది, నెట్‌–జేఆర్‌ఎఫ్‌–15,659 మంది, సెట్‌–18,519 మంది, పీహెచ్‌డీ ఉత్తీర్ణులు 30,417 మంది ఇప్పటికే యూజీసీ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకున్నారు.

ఎవరెంత మంది..
ఇప్పటి వరకు యూజీసీ జాబ్‌ పోర్టల్‌లో మొత్తం 60,958 మంది నెట్‌ క్వాలిఫయర్లు నమోదు చేసుకోగా... వీరిలో మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ నుంచి 6,570 మంది, కామర్స్‌ 6,622, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ అప్లికేషన్స్‌ 3,720 ఎడ్యుకేషన్‌ 3,479, లైఫ్‌ సైన్సెస్‌ 2,502 మంది ముందు వరుసలో ఉన్నారు.

  • నెట్‌–జేఆర్‌ఎఫ్‌కు సంబంధించి ఇప్పటి వరకు 15,659 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వీరిలో కామర్స్‌ నుంచి 1302 మంది, మేనేజ్‌మెంట్‌ నుంచి 1085 మంది, ఎడ్యుకేషన్‌ స్పెషలైజేషన్‌ నుంచి 853 మంది, జాగ్రఫీ నుంచి 710 మంది, హిందీ నుంచి 676 మంది, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌ నుంచి 648 మంది ఉన్నారు.
  • ప్రస్తుతానికి 18,519 మంది సెట్‌ క్వాలిఫయర్లు పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. వీరిలో కామర్స్‌ 1993, బయాలజీ 1487, ఇంగ్లిష్‌ 1369, కంప్యూటర్‌ సైన్స్‌ అప్లికేషన్స్‌1100, మేనేజ్‌మెంట్‌ 883, ఎకనామిక్స్‌ 820, ఎడ్యుకేషన్‌ 800, కెమిస్ట్రీ 809 విద్యార్థులు ముందు వరుసలో ఉన్నారు.
  • మొత్తం 30,417 మంది పీహె చ్‌డీ హోల్డర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో

బయాలజీ..
4893, కెమిస్ట్రీ 2968, ఫిజిక్స్‌ 2018 , కామర్స్‌1417, మేనేజ్‌మెంట్‌ 1360, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ అప్లికేషన్స్‌1242 అభ్యర్థులు ముందున్నారు.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.ugc.ac.in/jobportal

ఇంకా చదవండి : part 1: ఈ ప్రభుత్వ జాబ్‌ పోర్టల్‌లో నమోదుతో.. చదువుకి తగ్గ కొలువు మీ చెంతకు..!

Published date : 07 Jul 2021 05:43PM

Photo Stories