Skip to main content

ఈ నైపుణ్యాలు ఉంటే బీడీఎస్‌ విద్యార్థులకు విదేశాల్లోనూ కొలువులు.. !

బీడీఎస్, ఎండీఎస్‌ ఉత్తీర్ణులకు విదేశాల్లోనూ ఉద్యోగాలు లభిస్తున్నాయి. అమెరికా మొదలు అన్ని దేశాల్లోనూ వీరు ఆఫర్స్‌ దక్కించుకోవచ్చు.

ఇందుకోసం అభ్యర్థులు ఆయా దేశాలు ప్రత్యేకంగా నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. యూఎస్‌లో జాబ్‌ కోసం డెంటల్‌ అడ్మిషన్‌ టెస్ట్‌లో, యూకేకు వెళ్లాలనుకుంటే యూకే జనరల్‌ డెంటల్‌ కౌన్సిల్‌ నిర్వహించే ఓవర్సీస్‌ రిజిస్ట్రేషన్‌ ఎగ్జామ్‌లలో ఉత్తీర్ణత సాధించాలి. ఆస్ట్రేలియా, ఈయూ దేశాలు కూడా డెంటల్‌ నిపుణులకు అవకాశాలు కల్పిస్తున్నాయి. ఆయా దేశాలు నిర్వహించే పరీక్షల్లో అర్హత సాధిస్తే.. వర్క్‌ వీసాలు సులభంగానే లభిస్తాయి.

నైపుణ్యాల ఆవశ్యకత..
ఈ రంగంలో ఉజ్వల భవిష్యత్తు కోరుకునే వారు విస్తృత నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. బీడీఎస్‌తోనే సరిపెట్టుకోకుండా.. ఎండీఎస్, పీహెచ్‌డీ దిశగా అడుగులు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. 2020లో జాతీయ స్థాయిలో 2.7లక్షల మంది డెంటిస్ట్‌లు ఉన్నట్లు డెంటల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గణాంకాలు తెలియజేస్తున్నాయి. దీంతోపాటు ప్రతి ఏటా దాదాపు 27వేల మంది బీడీఎస్, ఎండీఎస్‌ వంటి కోర్సులు పూర్తి చేసుకుని బయటికి వస్తున్నారు. కాబట్టి ఈ రంగంలో సుస్థిరమైన, ఉజ్వలమైన కెరీర్‌ కోసం నిత్యం నైపుణ్యాలు పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇంకా చదవండి : part 3: తెలుగు రాష్ట్రాల్లో బీడీఎస్‌ సీట్లు ఇలా.. ఆల్‌ ఇండియా కోటాకు 15 శాతం..

Published date : 02 Jul 2021 04:56PM

Photo Stories