ఎంబీఏ, పీజీడీఎంతో మంచి ఉద్యోగ అవకాశాలు.. లక్షల్లో జీతాలు
Sakshi Education
మేనేజ్‌మెంట్ కోర్సులకు యువతలో ఎంతో క్రేజ్! కారణం.. దేశ విదేశాల్లో లభిస్తున్న అవకాశాలే!! ఏదైనా డిగ్రీతో మేనేజ్‌మెంట్ పీజీలో చేరొచ్చు.ముఖ్యంగా ఇంజనీరింగ్+ మేనేజ్‌మెంట్ పీజీ పూర్తిచేసిన వారి కెరీర్ ఉజ్వలంగా ఉంటుందనే అభిప్రాయం ఉంది.
మేనేజ్‌మెంట్ పీజీ అనగానే గుర్తుకొచ్చే కోర్సులు.. ఎంబీఏ, పీజీడీఎం/పీజీపీఎం. ఈ రెండు కోర్సులు ఒకటే అని కొందరు.. కాదు వేర్వేరు అని మరికొందరు వాదిస్తారు. దాంతోపాటే ఎంబీఏలో చేరాలా..?! లేదా పీజీడీఎం/పీజీపీఎం ఎంచుకోవాలా అనే సందేహం విద్యార్థుల్లో మొదలవుతుంది. ఈ నేపథ్యంలో.. ఎంబీఏ, పీజీడీఎం/పీజీపీఎంల మధ్య తేడా.. ప్రత్యేకతలు, ప్రాధాన్యతల గురించి తెలుసుకుందాం..
ఎంబీఏ వర్సెస్ పీజీడీఎం
ఎంబీఏ వర్సెస్ పీజీడీఎం
- మేనేజ్‌మెంట్ కోర్సుల్లో తరచుగా వినిపించే పేర్లు.. ఎంబీఏ (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్).. పీజీడీఎం (పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్).. పీజీపీఎం(పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్). ఎంబీఏ అంటే మాస్టర్ కోర్సు.. పీజీడీఎం/పీజీపీఎం అంటే డిప్లొమా కోర్సు అని చాలామంది భావిస్తుంటారు. వాస్తవానికి ఇవి రెండూ రెండేళ్ల కోర్సులే. అకడమిక్‌గా రెండూ సమానమే!
- ఎంబీఏ: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీలు, వాటికి అనుబంధంగా ఉన్న కళాశాలల్లో ఎంబీఏ సర్టిఫికెట్ అందిస్తారు.
- పీజీడీఎం/పీజీపీఎం: యూనివర్సిటీలతో సంబంధం లేకుండా ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) గుర్తింపుపొందిన కళాశాలలు, స్వయం ప్రతిపత్తి కలిగిన విద్యాసంస్థలు పీజీడీఎం/పీజీపీఎం అందిస్తాయి. అందువల్ల వీటికి డిగ్రీ అని కాకుండా.. డిప్లొమా అని సర్టిఫికెట్ ఇస్తారు.
- ఉద్యోగ నియామకాల్లో ఎంబీఏ, పీజీడీఎం రెండు కోర్సులు సమానమేనని అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ ప్రకటించింది.
- యూనివర్సిటీలు అందించే ఎంబీఏ కోర్సు కరిక్యులమ్ ముందుగానే రూపొందించి.. దానిని మాత్రమే బోధిస్తారు. పాఠ్యాంశాలను స్వేచ్ఛగా ఎప్పుడుపడితే అప్పుడు మార్చడానికి అవకాశం ఉండదు.
- పీజీడీఎం కోర్సులు అందించే సంస్థలు స్వయంప్రతిపత్తి గలవి. వీటిలో ఐఐఎంలు, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ, ఐఎస్‌బీ వంటి అగ్రశ్రేణి కళాశాలలు ఉన్నారుు. ఇవి ఏ యూనివర్సిటీకీ అనుబంధంగా ఉండకపోవడం వల్ల కరిక్యులమ్ తరచూ మార్చుకునే అవకాశం ఉంటుంది. మార్కెట్, కంపెనీల అవసరాలకు అనుగుణంగా డిమాండ్‌ను బట్టి పాఠ్యాంశాలను ఎప్పటికప్పుడు మారుస్తుంటారు.
- తెలుగు రాష్ట్రాల్లో యూనివర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలల్లో ఎంబీఏలో ప్రవేశానికి ఐసెట్‌లో ర్యాంకు సాధించాల్సి ఉంటుంది.
- స్వయం ప్రతిపత్తి గల ఐఐఎంలు, ఐఎస్‌బీ(ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్), ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ వంటి సంస్థలు మేనేజ్‌మెంట్ పీజీ (పీజీడీఎం/పీజీపీఎం) కోర్సుల్లో ప్రవేశాలకు ప్రత్యేకంగా ఎంట్రన్‌స టెస్ట్ నిర్వహిస్తారుు. ఐఐఎంలు క్యాట్ స్కోర్, జీడీ, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారుు. మరికొన్ని సంస్థల్లో క్యాట్/మ్యాట్/జీమ్యాట్ స్కోర్ ఆధారంగా అడ్మిషన్ పొందొచ్చు.
- యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో ఫీజు స్వయం ప్రతిపత్తి బీస్కూల్స్‌తో పోల్చినప్పుడు తక్కువగానే ఉంటుంది. ప్రభుత్వ యూనివర్సిటీ కళాశాలలో ఎంబీఏ ఫీజు రూ.35వేల వరకూ ఉంటుంది. యూనివర్సిటీ అనుబంధ ప్రైవేటు కళాశాలల్లో సాధారణంగా రూ.60 వేలకు మించదు.
- కానీ స్వయం ప్రతిపత్తి బీస్కూల్స్‌లో పీజీడీఎం/పీజీపీఎం కోర్సు ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు వసూలు చేస్తారు. దేశంలో ఉన్న 20 ఐఐఎంలలో ఫీజు ఎక్కడా ఒకేరకంగా లేదు. ఐఐఎం అహ్మదాబాద్‌లో రూ.23 లక్షలు ఉంటే.. ఐఐఎం సిర్‌మూర్‌లో రూ10.30 లక్షలు ఉంది. ఐఎస్‌బీ-హైదరాబాద్‌లో పీజీపీఎం కోర్సుకు రూ.40 లక్షలకు పైగానే వ్యయం అవుతుంది.
ఉద్యోగ అవకాశాలు..
వాస్తవానికి ఉద్యోగ అవకాశాల పరంగా చూస్తే.. ఎంబీఏ.. పీజీడీఎం/పీజీపీఎం చేసినవారి మధ్య పెద్దగా ఎలాంటి వ్యత్యాసం లేదు. కార్పొరేట్ కంపెనీలు తమ అవసరాలకు తగ్గ నైపుణ్యాలున్న అభ్యర్థులను నియమించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తాయి. ప్లేస్‌మెంట్స్ విషయానికి వస్తే కళాశాల బ్రాండ్, పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్, విద్యార్థుల నాణ్యత ప్రమాణాలు తదితర అంశాలు ప్రభావితం చేస్తారుు.
వేతనాలు..

- పీజీపీఎం/పీజీడీఎం లేదా ఎంబీఏ పూర్తిచేసిన వారిలో ఎవరికి అధిక వేతనాలు లభిస్తాయో చెప్పడం కష్టమే. ఐఐఎం-అహ్మదాబాద్‌లో చదివినవారికి, స్థానిక యూనివర్సిటీ కాలేజీలో చదివిన వారి వేతనాల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. నియామకాల్లో ప్రముఖ కార్పొరేట్ సంస్థలు ఐఐఎం అహ్మదాబాద్‌కు ప్రాధాన్యం ఇస్తారుు. ఎంబీఏనా లేదా పీజీడీఎం/పీజీపీఎం కోర్సా అనేది కాకుండా... పేరున్న ఇన్‌స్టిట్యూట్‌లో చదివి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో టాప్ కంపెనీలో అవకాశం దక్కించుకుంటే వేతన ప్యాకేజీ ఆకర్షణీయంగా ఉంటుంది.
- గత ఏడాది ఐఎస్‌బీలో పీజీపీఎం చేసినవారికి దేశీయ కంపెనీ ఏడాదికి రూ.37 లక్షల ప్యాకేజీ ప్రకటించింది. ఇక్కడ జరిగిన 2019 క్యాంపస్ సెలక్షన్‌సలో 1194 మందిలో 886 మందికి సరాసరి వార్షిక వేతనం రూ.25.06 లక్షలుగా ఉంది. ఐఐఎం-కోల్‌కతాలో జరిగిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఓ విద్యార్థి అత్యధికంగా రూ.75 లక్షల వేతనం అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని యూనివర్సిటీ క్యాంపస్‌లలో ఎంబీఏ చేసినవారు కూడా సగటున 8లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ వార్షిక వేతనం అందుకుంటున్నారు.
ఉన్నత విద్యకు ఎంబీఏ..
మేనేజ్‌మెంట్ పీజీ తర్వాత ఎంఫిల్, పీహెచ్‌డీ చేయాలనుకుంటే మాత్రం ఎంబీఏ ఉత్తీర్ణులకే అవకాశం ఉంటుంది. విదేశాల్లో సైతం ఉన్నత విద్యను అభ్యసించాలంటే.. ఎంబీఏకే అక్కడి వర్సిటీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అందువల్ల ఎవరైనా మేనేజ్‌మెంట్ పీజీ కోర్సు చేసి కార్పొరేట్ కొలువు దక్కించుకోవాలనుకుంటే ప్లేస్‌మెంట్స్ జరిగే బీస్కూల్స్‌లో పీజీడీఎం/పీజీపీఎంలో చేరొచ్చు. అలాగే దేశ విదేశాల్లో ఎంఫిల్, పీహెచ్‌డీ చేయాలనుకుంటే ఎంబీఏలో చేరడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.
ఏ కోర్సు ప్రత్యేకత దానిదే..
మేనేజ్‌మెంట్ విద్యలో.. డిప్లొమా కోర్సుకు, పూర్తి స్థారుు డిగ్రీకి ఎంతో తారతమ్యం ఉంటుంది. డిప్లొమా కోర్సులు కంపెనీల అవసరాలకు అనుగుణంగా రూపొందించినవి. అవసరాలకు తగ్గట్టు డిమాండ్‌ను బట్టి ఈ కోర్సులు ఉంటారుు. కానీ ఎంబీఏ అలా కాదు.. దీనికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. విదేశాల్లో మేనేజ్‌మెంట్‌లో ఉన్నత చదువులు చదవాలంటే.. ఈ రంగంలో ఫుల్‌టైమ్ పీజీ డిగ్రీ కోర్సు ఉండాల్సిందే. ఉన్నత విద్యకు వెళ్లాలంటే పీజీ డిప్లొమా కోర్సులు సరిపోవు. ప్లేస్‌మెంట్స్ సెలక్షన్‌సలో కంపెనీలు.. విద్యార్థుల అకడమిక్ గ్రేడ్ పారుుంట్స్,ఇంటర్న్‌షిప్ వంటి బ్యాక్ గ్రౌండ్ చూస్తారుు. మంచి కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేస్తే డిప్లొమా, పీజీ డిగ్రీలకు సమానమైన అవకాశాలు కల్పిస్తున్నారుు.
-డాక్టర్ పి.జ్యోతి, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ డీన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ

Published date : 04 Jun 2020 06:59PM