బ్యాచిలర్ డిగ్రీతోబెటర్ ఫ్యూచర్!!
Sakshi Education
తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియెట్ పూర్తయిన విద్యార్థుల్లో ఎక్కువ మంది చూపు.. ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులవైపే! ప్రొఫెషనల్ కోర్సులవైపు విద్యార్థులు మొగ్గు చూపుతున్నా.. సంప్రదాయ బీఏ/బీఎస్సీ/బీకామ్ కోర్సులకూ జాబ్ మార్కెట్‌లో ఏమాత్రం వన్నె తగ్గలేదంటున్నారు నిపుణులు. కార్పొరేట్ రంగం విస్తరిస్తుండటం, కంపెనీలకు వివిధ నైపుణ్యాలున్న మానవ వనరుల అవసరం ఏర్పడుతుండటమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో సంప్రదాయ డిగ్రీ కోర్సులతో కెరీర్ స్కోప్..
కాంపిటీషన్ కింగ్..బీఏ:
పోటీ పరీక్షల ప్రపంచంలో బీఏ విద్యార్థులదే పైచేయి. సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీపరీక్షలకు ఉపయోగపడే పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ, తెలుగు సాహిత్యం వంటి సబ్జెక్టులను డిగ్రీ స్థాయిలోనే చదివుండటం వల్ల ప్రిపరేషన్‌లో ఎంతో కలిసొస్తుంది. ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులు సైతం సివిల్స్‌లో సోషల్‌సెన్సైస్ సబ్జెక్టులు ఎంచుకుని విజయాలు సాధిస్తున్నారంటేనే ఆర్ట్స్ సబ్జెక్టుల ప్రాధాన్యత ఏమిటో తెలుస్తోంది. బీఏలో చేరిన మొదట్నుంచే సివిల్స్ లక్ష్యంగా కృషి చేస్తే తేలికగా విజయం సాధించొచ్చని నిపుణులు అంటున్నారు. వివిధ వర్సిటీలందించే పీజీ కోర్సుల్లో చేరి ఎంఏలో ఎకనామిక్స్, హిస్టరీ, ఇంగ్లిష్, సోషల్‌వర్‌క, ఫారెన్ లాంగ్వేజెస్, పాలిటీ వంటి కోర్సులు అభ్యసిస్తే మంచి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ఎకనామిక్స్ చేసినవారికి ఉద్యోగాలెన్నో! హిస్టరీ విద్యార్థులు ఆర్కియాలజీ విభాగాల్లో పనిచేయొచ్చు. పాలిటీ చదివితే వివిధ పత్రికలు, న్యూస్ చానెళ్లు, పోటీ పరీక్షల కోచింగ్ కేంద్రాల్లో అవకాశాలు లభిస్తాయి. లాంగ్వేజెస్ చేసినవారు వివిధ రాయబార కార్యాలయాల్లో, కళాశాలల్లో లెక్చరర్‌గా పనిచేయొచ్చు.
కెరీర్ షైనింగ్..కామర్స్:
ప్రస్తుత జాబ్ మార్కెట్ అవసరాలకనుగుణంగా బీకాంలో ఈ-కామర్స్; ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్; కార్పొరేట్ సెక్రటరీషిప్ వంటి వినూత్న స్పెషలైజేషన్లు ఉన్నాయి. కంపెనీలకు అవసరమైన అకౌంటింగ్ కార్యకలాపాల నిర్వహణకు కామర్స్ పట్టభద్రులు తప్పనిసరి. వివిధ దేశీయ, విదేశీ సంస్థలు ఒక మాదిరి పట్టణాల్లో సైతం తమ బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. వీటిల్లో ఖాతాల నిర్వహణ వంటి విభాగాల్లో బీకాం విద్యార్థుల అవసరం ఎంతో ఉంది. కాబట్టి డిగ్రీలో బీకాం, బీకాం(కంప్యూటర్స్ విద్యార్థులు)లు అకౌంటింగ్ ప్యాకేజెస్, ట్యాలీ వంటి కోర్సులను నేర్చుకోవడంతోపాటు, స్పోకెన్ ఇంగ్లిష్‌పై దృష్టిపెడితే ప్రారంభంలోనే ఐదెంకెల వేతనాలు ఖాయం. ఇక చార్టర్‌డ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ వంటి కోర్సులు పూర్తి చేస్తే.. అవకాశాలు కోకొల్లలు.
భావి శాస్త్రవేత్తలకు... బీఎస్సీ:
‘దేశవ్యాప్తంగా పరిశోధనలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే అభివృద్ధి కుంటుపడటం ఖాయం’. ఇది దేశంలోని మేధావులు, నిపుణులు తరచుగా వ్యక్తం చేస్తున్న ఆందోళన! ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే.. నిష్ణాతులైన శాస్త్రవేత్తల అవసరం ఎంతో. డిగ్రీలో కెమిస్ట్రీ, న్యూక్లియర్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఆస్ట్రోఫిజిక్స్, మెరైన్ బయాలజీ, మైక్రోబయాలజీ, బోటనీ, జువాలజీ, మ్యాథ్స్, బయోటెక్నాలజీ, జెనెటిక్స్, స్టాటిస్టిక్స్ వంటి కోర్సులను దీర్ఘకాలిక దృష్టితో చదవాలి. డిగ్రీ మొదటి ఏడాది నుంచే సబ్జెక్టులను క్షుణ్నంగా చదువుతూ.. ఇష్టమైన అంశంపై పీజీ చేస్తే ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. సీఎస్‌ఐఆర్ నెట్‌లో జేఆర్‌ఎఫ్ సాధిస్తే ప్రతినెలా ఫెలోషిప్ పొందడంతోపాటు దేశవ్యాప్తంగా ప్రముఖ విద్యా సంస్థల్లో పీహెచ్‌డీ కూడా చేయొచ్చు. తర్వాత పరిశోధన సంస్థల్లో శాస్త్రవేత్తలుగా పనిచేస్తూ ఆకర్షణీయ జీతాలూ పొందొచ్చు.
డిగ్రీ కోర్సులకు.. పూర్వ వైభవం
మూడేళ్ల నుంచి సంప్రదాయ కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. ఎక్కువగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారిని బీఏ బాగా ఆకర్షిస్తోంది. సివిల్స్, గ్రూప్స్ వంటి పరీక్షల్లో బీఏ సబ్జెక్ట్స్ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. బీకాంలో కూడా ఎక్కువ మంది చేరుతున్నారు. సీఏ, కాస్ట్ అకౌంటెంట్స్, సీఎస్ కోర్సుల్లో చేరాలనుకునేవారికి బీకాం సరైన మార్గం. కార్పొరేట్ సంస్థలు సైతం డిగ్రీ ఉత్తీర్ణులకే ప్రాధాన్యతనిస్తున్నాయి. కంపెనీలు క్యాంపస్ నియామకాల ద్వారా బీఎస్సీ ఫైనలియర్ విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. గత నెలలో 40 మందికి పైగా సైన్స్ విద్యార్థులను రూ.15 వేలతో కంపెనీలు నియమించుకున్నాయి.
ప్రొ. టీఎల్‌ఎన్ స్వామి,
ప్రిన్సిపాల్, నిజాం కాలేజ్

Published date : 05 May 2016 05:45PM