ఐఐఎం జీడీ / పీఐల్లో విజయానికి మార్గాలు
Sakshi Education
క్యాట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐఎంలు ప్రవేశ ప్రక్రియ తర్వాతి దశకు శ్రీకారం చుడుతున్నాయి. అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసే క్రమంలో క్యాట్ స్కోర్ తర్వాత గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలు కీలకంగా ఉంటాయి. ఐఐఎంల తుది దశ ఎంపికలో ఆయా అంశాలకు ప్రత్యేక వెయిటేజీ ఉంటుంది. కాబట్టి క్యాట్ ఉత్తీర్ణులు తమ కలల ఐఐఎంలో అడుగుపెట్టాలంటే.. ఈ రెండు దశల్లో తప్పక రాణించాలి. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న జీడీ, పీఐల్లో విజయానికి మార్గాలు..
సమకాలీనం ‘కీలకం’
పదో తరగతి, ఇంటర్మీడియెట్, బ్యాచిలర్ డిగ్రీ కోర్సులకు ప్రత్యేక వెయిటేజీలు ఉంటున్నాయి. ఐఐఎంలు అకడెమిక్ వెయిటేజీని ఒక్కో కోర్సుకు పది శాతంగా పరిగణిస్తున్నాయి. అభ్యర్థులు ఆయా కోర్సుల్లో పొందిన జీపీఏ / ఉత్తీర్ణత శాతం ఆధారంగా నిర్దిష్ట వెయిటేజీలను కేటాయిస్తారు.
ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్
క్యాట్ రాసేందుకు కనీస అర్హత బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. అయితే ఐఐఎంలు తుది దశ ఎంపికలో ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వెయిటేజీ పేరుతో బ్యాచిలర్ డిగ్రీపై స్థాయి కోర్సుల అభ్యర్థులకు ప్రత్యేక వెయిటేజీ ఇస్తున్నాయి. ఇది రెండు నుంచి మూడు శాతం మధ్యలో ఉంటోంది.
వర్క్ ఎక్స్‌పీరియన్స్ వెయిటేజీ
వర్క్ ఎక్స్‌పీరియన్స్ తుది దశలో వెయిటేజీ పరంగా ప్రాధాన్యం ఉన్న అంశం. ఐఐఎంలు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న అభ్యర్థులకు తుది జాబితా రూపకల్పనలో ఐదు నుంచి పది శాతం మధ్యలో వెయిటేజీ ఇస్తున్నాయి. ఇది అభ్యర్థులు పని చేస్తున్న రంగం, అనుభవం తదితర అంశాల ఆధారంగా ఉంటోంది.
ప్రొఫైల్ వెయిటేజీ
కొత్తగా ఏర్పాటైన ఆరు ఐఐఎంలకు సంబంధించి ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తున్న ఐఐఎం-ఉదయ్‌పూర్ ప్రొఫైల్ వెయిటేజీ పేరుతో ప్రత్యేక విధానం అవలంబిస్తోంది. 24 శాతం వెయిటేజీ ఉన్న ప్రొఫైల్ వెయిటేజీలోనే అకడెమిక్ క్వాలిఫికేషన్స్, వర్క్ ఎక్స్‌పీరియన్స్, డైవర్సిటీ అంశాలను పొందుపరచింది.
- ఐఐఎంలు గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలకు ప్రత్యేక వెయిటేజీ ఇస్తున్నాయి. వంద మార్కుల వెయిటేజీ ఫార్మాట్‌లో జీడీ, పీఐల వెయిటేజీ 35 నుంచి 50 శాతం వరకు ఉంటోంది. దీన్ని బట్టి ఎంపిక ప్రక్రియలో వాటి ప్రాధాన్యాన్ని అర్థంచేసుకోవచ్చు.
- మలి దశ ఎంపిక ప్రక్రియలో ఐఐఎంలు ముందుగా గ్రూప్ డిస్కషన్స్ నిర్వహిస్తాయి. అభ్యర్థులను బృందాలుగా విభజించి ఏదైనా ఒక అంశాన్ని ఇచ్చి దానిపై చర్చించమంటారు. ఇటీవల కాలంలో గ్రూప్ డిస్కషన్స్‌లో ఇస్తున్న టాపిక్స్‌లో సామాజిక సమస్యలు, సమకాలీన అంశాలు ఎక్కువగా ఉంటున్నాయి.
- గ్రూప్ డిస్కషన్‌లో నిర్దిష్టంగా ఒక రంగానికి పరిమితం కావటం లేదు. అన్ని రంగాల్లోని అంశాలను పేర్కొంటున్నారు. బిజినెస్ మేనేజ్‌మెంట్‌తో సంబంధం లేని ప్యూర్ సైన్స్ నుంచి కూడా టాపిక్స్ ఇచ్చే అవకాశం ఉంది.
- ఐఐఎం బెంగళూరు జీడీలో (గత ఏడాది) ప్రభుత్వం ఎన్ని నివారణ చర్యలు తీసుకున్నప్పటికీ.. వ్యాక్సీన్స్ సరఫరా చేస్తున్నప్పటికీ స్వైన్ ఫ్లూ విస్తరిస్తోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి మీ సలహా ఏంటి?, భారత దేశ విద్యా విధానం, విద్యార్థులు కేవలం ఉద్యోగం సాధించే మార్గంగానే ఉంటోంది. దీనిపై చర్చించండి అనే అంశాలను అడిగారు.
- గ్రూప్ డిస్కషన్‌లో టాపిక్ ఏ రంగం నుంచి ఇచ్చినా, దాన్ని సమయస్ఫూర్తితో సమగ్రంగా విశ్లేషిస్తే విజయం తథ్యం. కాబట్టి ఐఐఎంల పిలుపు కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు సమకాలీన ప్రాధాన్యత అంశాలపై లోతైన అవగాహన ఏర్పరచుకోవాలి.
- గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూల క్రమంలో అభ్యర్థులకు ఎదురవుతున్న పరీక్ష.. రిటెన్ ఎబిలిటీ టెస్ట్. ఇందులో నిర్దిష్ట అంశాన్ని పేర్కొని దానిపై అభ్యర్థులు అభిప్రాయం లేదా సలహాలు వ్యక్తీకరించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. వీటికి మూడు నుంచి నాలుగు వందల పదాల మధ్యలో సమాధానం రాయాల్సి ఉంటుంది.
- రిటెన్ ఎబిలిటీ టెస్ట్‌లో పేర్కొనే అంశాలు కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్, సోషల్ అవేర్‌నెస్ సమ్మిళితంగా ఉంటున్నాయి. గత ఏడాది ఐఐఎం కోజికోడ్ రిటెన్ ఎబిలిటీ టెస్ట్‌లో.. బి-స్కూల్లో నేర్చుకునే అంశాలు, తరగతి గది వెలుపల జరిగిన సంఘటనలు - దీనిపై అభిప్రాయం రాయండి అని అడిగారు. ఐఐఎం అహ్మదాబాద్ రిటెన్ ఎబిలిటీ టెస్ట్‌లో.. విద్యార్థి సంఘాల్లో రాజకీయాల ప్రమేయంపై అభిప్రాయం తెలపమన్నారు.
- జీడీలో ఒకే అంశంపై పది లేదా ఇరవై మందితో కూడిన బృందంలో చర్చించడం, ఆమోదయోగ్యమైన రీతిలో అభిప్రాయం వ్యక్తం చేయడం వంటివి ఉంటాయి. ఇది పూర్తిగా మౌఖికంగా ఉంటుంది. ఇందులో అభ్యర్థులు వ్యక్తం చేసే అభిప్రాయాలు, అభ్యర్థుల వ్యవహార శైలి ఆధారంగా మార్కులు ఉంటాయి.
- రిటెన్ ఎబిలిటీ టెస్ట్‌లో ఒక అంశంపై అభ్యర్థి తనకున్న అభిప్రాయాన్ని రాతపూర్వకంగా వ్యక్తం చేయాలి. అభిప్రాయ వ్యక్తీకరణకు వినియోగించిన పదజాలం, వాక్య నిర్మాణం, స్థూలంగా అభ్యర్థులు వ్యక్తం చేసిన అభిప్రాయం ఆధారంగా మార్కులు లభిస్తాయి.
- ఎంపిక ప్రక్రియలో అభ్యర్థులు ఎదుర్కొనే ఆఖరి దశ పర్సనల్ ఇంటర్వ్యూ. ఇందులోప్రధానంగా అభ్యర్థికి మేనేజ్‌మెంట్ విద్య పట్ల ఉన్న వాస్తవ ఆసక్తి, భవిష్యత్తు లక్ష్యాలు, వాటిని అందుకునేందుకు ఎంపిక చేసుకున్న మార్గాలు తదితర అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.
- ఐఐఎంలు ఇంజనీరింగ్ నేపథ్య విద్యార్థులకు సంబంధించి బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో వారికున్న ఆసక్తి, లక్ష్యాల స్థాయిల గురించి పూర్తిస్థాయిలో పరీక్షిస్తున్నాయి. గతేడాది ఐఐఎం-ఎ ఇంటర్వ్యూలో ‘ఇంజనీరింగ్ నేపథ్యం ఉన్న వ్యక్తి ఉత్పత్తి రంగంలో వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు ఏంటి?’ అనే ప్రశ్న అడిగారు.
- ఇంటర్వ్యూలో సోషల్ అవేర్‌నెస్ సంబంధ ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. ‘ ఈ రోజు న్యూస్ పేపర్స్‌లో అత్యంత ప్రముఖ వార్త ఏంటి?’ అనే ప్రశ్న ఐఐఎం-ఎ అభ్యర్థికి ఎదురైంది. దీంతో పాటు ‘ఆయా పథకాల సబ్సిడీకి సంబంధించి ప్రారంభించిన డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ స్కీమ్ వల్ల ఏమేరకు ప్రయోజనం చేకూరింది’ అనే ప్రశ్న కూడా అడిగారు.
- జీడీ/పీఐ, రిటెన్ ఎబిలిటీ టెస్టుల్లో సబ్జెక్ట్ పరిజ్ఞానంతో పాటు సమకాలీన అంశాలపైనా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కాబట్టి అభ్యర్థులు తాజా పరిణామాలపై ఎప్పటికప్పుడు అవగాహన కలిగుండాలి.
- క్యాట్ స్కోర్ తర్వాత జీడీ / పీఐ.. ఐఐఎంల ప్రవేశాల గురించి అందరికీ తెలిసిన విధానం ఇది. అయితే ఐఐఎంలు తుది జాబితా రూపకల్పనలో వీటితోపాటు అనేక అంశాలను పరిగణనలోకి తీసకుంటున్నాయి. ఆయా అంశాలకు ప్రత్యేక వెయిటేజీ కేటాయిస్తున్నాయి. ఈ క్రమంలో కీలకంగా మారిన అంశాలు..
- ఐఐఎంలు ప్రవేశ ప్రక్రియలో ప్రామాణికంగా తీసుకుంటున్న అంశాల్లో వైవిధ్యం ప్రధానాంశంగా ఉంటోంది. ఐఐఎంలు,ఐఐటీలు వంటివి ఉన్నత విద్యా వర్గాలకే పరిమితమనే అభిప్రాయాలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐఐఎంలు అసమానతలను తగ్గించేందుకు వైవిధ్యానికి (డైవర్సిటీ) పెద్దపీట వేస్తున్నాయి.
- డైవర్సిటీలో భాగంగా.. జండర్ డైవర్సిటీ, అకడెమిక్ డైవర్సిటీలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. మహిళా అభ్యర్థులను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా జండర్ డైవర్సిటీ కి ప్రాధాన్యాన్ని గుర్తించి ప్రత్యేక వెయిటేజీ కూడా ఇస్తున్నాయి. ఇది ఆయా ఐఐఎంల విధానాన్ని బట్టి 3-5 శాతంగా ఉంటోంది.
- అకడెమిక్‌గా అన్ని నేపథ్యాల విద్యార్థులకు అవకాశం కల్పించేందుకు అకడమిక్ డైవర్సిటీని అమలుచేస్తున్నాయి. దీనికి కూడా మూడు నుంచి ఐదు శాతం మధ్యలో వెయిటేజీ ఇస్తున్నాయి.
పదో తరగతి, ఇంటర్మీడియెట్, బ్యాచిలర్ డిగ్రీ కోర్సులకు ప్రత్యేక వెయిటేజీలు ఉంటున్నాయి. ఐఐఎంలు అకడెమిక్ వెయిటేజీని ఒక్కో కోర్సుకు పది శాతంగా పరిగణిస్తున్నాయి. అభ్యర్థులు ఆయా కోర్సుల్లో పొందిన జీపీఏ / ఉత్తీర్ణత శాతం ఆధారంగా నిర్దిష్ట వెయిటేజీలను కేటాయిస్తారు.
ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్
క్యాట్ రాసేందుకు కనీస అర్హత బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. అయితే ఐఐఎంలు తుది దశ ఎంపికలో ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వెయిటేజీ పేరుతో బ్యాచిలర్ డిగ్రీపై స్థాయి కోర్సుల అభ్యర్థులకు ప్రత్యేక వెయిటేజీ ఇస్తున్నాయి. ఇది రెండు నుంచి మూడు శాతం మధ్యలో ఉంటోంది.
వర్క్ ఎక్స్‌పీరియన్స్ వెయిటేజీ
వర్క్ ఎక్స్‌పీరియన్స్ తుది దశలో వెయిటేజీ పరంగా ప్రాధాన్యం ఉన్న అంశం. ఐఐఎంలు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న అభ్యర్థులకు తుది జాబితా రూపకల్పనలో ఐదు నుంచి పది శాతం మధ్యలో వెయిటేజీ ఇస్తున్నాయి. ఇది అభ్యర్థులు పని చేస్తున్న రంగం, అనుభవం తదితర అంశాల ఆధారంగా ఉంటోంది.
ప్రొఫైల్ వెయిటేజీ
కొత్తగా ఏర్పాటైన ఆరు ఐఐఎంలకు సంబంధించి ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తున్న ఐఐఎం-ఉదయ్‌పూర్ ప్రొఫైల్ వెయిటేజీ పేరుతో ప్రత్యేక విధానం అవలంబిస్తోంది. 24 శాతం వెయిటేజీ ఉన్న ప్రొఫైల్ వెయిటేజీలోనే అకడెమిక్ క్వాలిఫికేషన్స్, వర్క్ ఎక్స్‌పీరియన్స్, డైవర్సిటీ అంశాలను పొందుపరచింది.
పీజీపీఎక్స్‌కు కొంత విభిన్నంగా ఐఐఎంల జీడీ/పీఐ ప్రక్రియలో పీజీపీఎం, పీజీపీఎక్స్ కోర్సుల మధ్య కొంత వ్యత్యాసం కన్పిస్తోంది. వర్క్ ఎక్స్‌పీరియన్స్ కచ్చితంగా అవసరమైన పీజీపీఎక్స్ కోర్సు అభ్యర్థులకు గ్రూప్ డిస్కషన్‌లో ఆయా రంగాల్లో ప్రస్తుత వ్యాపార, వాణిజ్య పరిస్థితులు వంటి అంశాలుంటాయి. అదే విధంగా పర్సనల్ ఇంటర్వ్యూలోనూ వర్క్ ఎక్స్‌పీరియన్స్‌కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. ఆటో మొబైల్ రంగం పని అనుభవం (అశోక్ లేలాండ్)లో ఉండటంతో నన్ను దానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు. మీరు చేసిన చివరి ప్రాజెక్ట్ ఏంటి? దానివల్ల మీ కంపెనీకి కలిగిన ప్రయోజనం? ఆటోమొబైల్ రంగం నుంచి మేనేజ్‌మెంట్ వైపు ఎందుకు రావాలనుకుంటున్నారు? తదితర ప్రశ్నలు అడిగారు. నలుగురు ప్రొఫెసర్ల బృందం 20-25 నిమిషాలు ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూ విషయంలో ఆందోళన పడక్కర్లేదు. ఇతర ఇంటర్వ్యూల మాదిరిగానే ‘మీ గురించి చెప్పండి?’ అనే ప్రశ్నతో ప్రారంభించి తర్వాత కోర్ ఏరియా వైపు వెళ్తారు. ఇంజనీరింగ్ నేపథ్యం ఉన్న అభ్యర్ధులు ఇంజనీరింగ్ టు మేనేజ్‌మెంట్ కోర్సుకు సంబంధించి స్పష్టమైన లక్ష్యంతో ఇంటర్వ్యూ రూమ్‌లోకి అడుగు పెట్టాలి. - వి.పవన్ కుమార్, ఐఐఎం-ఎ పీజీపీఎక్స్ |
యంత్ర సామర్థ్యం వర్సస్ స్కిల్డ్ పర్సన్... చర్చించండి... ఐఐఎం కోజికోడ్ జీడీ/పీఐకు హాజరయ్యాను. నైతిక విలువలు, సామాజిక దృక్పథానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు. రిటెన్ ఎబిలిటీ టెస్ట్‌లో.. ఉద్యోగం పరంగా వేతనానికి ప్రాధాన్యమివ్వాలా? లేదా ఆసక్తికి ప్రాధాన్యమివ్వాలా? మీ అభిప్రాయం ఏంటి అని 300 పదాల్లో వ్యాసం రాయమన్నారు. జీడీలో పది మంది చేసే పనిని ఒక యంత్రం చేస్తుంది. కానీ, అసాధారణమైన నైపుణ్యాలున్న వ్యక్తి చేసే పని ఆ యంత్ర సామర్థ్యం కంటే విస్తృతంగా ఉంటుంది. దీనిపై చర్చించండి అని చెప్పారు. పర్సనల్ ఇంటర్వ్యూలో నిట్‌లో ఇంజనీరింగ్, సాఫ్ట్‌వేర్ రంగంలో పని అనుభవం ఉండి.. మేనేజ్‌మెంట్ కోర్సు వైపు ఎందుకు రావాలనుకుంటున్నారు? ఐఐఎంలనే ఎందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు? వంటి ప్రొఫైల్ బేస్డ్ ప్రశ్నలు అడిగారు. అనుభవం అర్హతగా లభించే ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ అయినా.. ఫ్రెషర్స్‌కు అందుబాటులో ఉండే పీజీ ప్రోగ్రామ్‌లు అయినా ప్రొఫైల్ ఆధారంగా అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలా సిద్ధమవ్వాలి. - సీహెచ్.మణికంట శ్రీనివాస్, ఐఐఎం-కోజికోడ్ (పీజీపీఎం) |
లక్ష్యంపై స్పష్టత ఐఐఎంల తుది దశ ప్రవేశ ప్రక్రియకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు తమ లక్ష్యంపై స్పష్టతతో ఆ దిశగా అడుగులు వేయాలి. ఐఐఎం విద్యార్థులకు మార్కెట్‌లో క్రేజ్ కారణంగా క్యాట్‌కు హాజరయ్యామనే రీతిలో సాదాసీదాగా వ్యవహరించకూడదు. ఐఐఎంల్లో చేరాలనుకున్న ఉద్దేశం.. దాని ద్వారా భవిష్యత్తులో సాధించాలనుకునే లక్ష్యాలను ఉన్నతంగా ఉండేలా చూసుకోవాలి. ప్రిపరేషన్‌కు సంబంధించి సమకాలీన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. రిటెన్ ఎబిలిటీ టెస్ట్‌లో మంచి భావ వ్యక్తీకరణ కోసం వొకాబ్యులరీ డెవలప్ చేసుకోవాలి. దీనికోసం ఇంగ్లిష్ దినపత్రికలు చదవడం ఉపయుక్తంగా ఉంటుంది. - ఎ.కృష్ణ, ఫౌండర్, లెర్న్‌పీడియూ |
Published date : 06 Feb 2016 11:56AM