యాప్ డెవలపర్‌గా కావాలంటే...!
Sakshi Education
టెక్నాలజీ అరచేతిలోకి చేరింది. సినిమా టిక్కెట్ నుంచి సివిల్స్ ప్రిపరేషన్ వరకూ.. ప్రతి అవసరానికి యాప్స్ వచ్చేశాయ్! యాప్ లేకుండా క్షణం గడిచే పరిస్థితి లేదు. ముఖ్యంగా మిలీనియల్స్‌కు ఈ యాప్స్ యమా క్రేజ్!! స్మార్ట్‌ఫోన్‌ల వాడకం గణనీయంగా పెరగడమే ఇందుకు కారణం.
ప్రతి అవసరానికీ యాప్‌ల వినియోగం పెరుగుతుండటంతో మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ ఇప్పుడు ఆకర్షణీయమైన కెరీర్‌గా మారింది. ఆండ్రాయిడ్, ఐఫోన్ అప్లికేషన్స్, విండోస్ అప్లికేషన్స్, బ్లాక్‌బెర్రీ అప్లికేషన్స్.. మొదలైన వేర్వేరు ఆపరేటింగ్ సిస్టమ్స్‌పై పనిచేసే మొబైల్ అప్లికేషన్స్ తయారుచేసే వారికి మంచి డిమాండ్ ఉంది. ఇంతటి క్రేజీ యాప్స్‌ను ఎలా డెవలప్ చేయొచ్చో తెలుసుకుందామా..
యాప్ డెవలప్ చేయాలంటే..?
మొబైల్ యాప్ డెవలప్ చేయడం అంత సులువేమీ కాదు. ఒకవేళ డెవలప్ చేసినా... దాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లి నిలదొక్కుకోవడం సవాలే. యాప్ డెవలప్ చేయాలనుకునే క్రమంలో అందుకు ఎంతో గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. యాప్ డెవలప్ చేసేందుకు ముందుగా చక్కటి ఐడియా ఉండాలి. ఉదాహరణకు బెంగళూరులో ఉద్యోగం చేసే ఉమేశ్ అక్కడ ట్రాఫిక్‌ను చూసి భయకంపితుడయ్యాడు. తన పరిస్థితే ఇలాఉంటే స్కూల్ నుంచి వచ్చే పిల్లల గురించి తల్లిదండ్రుల ఆందోళన అంతాఇంతా కాదు! ఈ ట్రాఫిక్‌లో పిల్లలు ఎప్పుడు ఇంటికి చేరుకుంటారో తెలియని పరిస్థితి. వారికోసం పేరెంట్స్ బోర్డింగ్ పాయింట్ దగ్గర నిరీక్షించాల్సిందే! ఈ సమస్య నుంచే ఉమేశ్‌కు ఒక మంచి ఐడియా వచ్చింది. పిల్లల స్కూల్ బస్సు ఉన్న లోకేషన్‌ను తెలుసుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుందని అనుకున్నాడు. అప్లికేషన్ ద్వారా పిల్లల లోకేషన్ తెలుసుకునేలా, లైవ్‌బస్ లొకేషన్ ట్రాకింగ్, స్కూల్‌కి చేరుకోగానే పేరెంట్స్ మొబైల్స్‌కు నోటిఫికేషన్స్ వెళ్లే విధంగా యాప్ డెవలప్ చేశాడు. ఈ యాప్ పేరెంట్స్‌ను ఆకట్టుకుంటోంది. ఇలా సమస్యలు గుర్తించి వాటికి పరిష్కార మార్గాలు కనుగొనే ఐడియాలతో ముందడుగు వేస్తే యాప్స్‌కు విజయవంతం అవుతాయి.
స్ట్రాటజీ, కాంపిటీషన్ :
యాప్ డెవలప్‌మెంట్ కమర్షియల్‌గా విజయవంతం కావడం కోసం వ్యూహాలు రచించుకోవాలి. మార్కెట్‌లో మీ ఐడియాలకు తగిన అప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా, వాటిలో ఉన్న లోపాలు ఏంటి, మీరు డెవలప్ చేయబోయే యాప్ .. గత యాప్ కన్నా ఏ విధంగా ప్రయోజనకరంగా ఉంటుంది మొదలైన అంశాలన్నీ బేరీజు వేసుకోవాలి. కస్టమర్లు/క్లైయింట్స్‌ను తెచ్చుకోవడం ప్రధానం. మొత్తంగా యాప్ డెవలప్‌మెంట్.. ఐడియాతో మొదలై స్ట్రాటజీ, కాంపిటీషన్, క్లైయింట్స్ ఎంపిక, పర్యవేక్షణ, మార్కెటింగ్, యూజర్ ఎక్స్‌పీరియెన్స్ డిజైన్, ఆర్కిటెక్చర్, వైర్‌ఫ్రేమ్, వర్క్‌ఫ్లోస్, డిజైన్ టు డెవలప్‌మెంట్, ఫ్రంట్ ఎండ్ డిజైన్, బ్యాక్ ఎండ్ డిజైన్, అప్లికేషన్ డెవలప్‌మెంట్, ప్లానింగ్, డెవలపింగ్, టెస్టింగ్, ఎక్స్‌టెండెడ్ టెస్టింగ్, క్రాషెస్, పెర్ఫామెన్స్, యాప్ స్టోర్ మేనేజ్‌మెంట్ వంటి పలు దశలు దాటాల్సి ఉంటుంది.
టెక్నికల్ స్కిల్స్ :
యాప్ డెవలప్‌మెంట్‌లో టెక్నికల్ స్కిల్స్ అవసరం ఎంతో ఉంటుంది. ‘మొబైల్ యూజర్ ఇంటర్‌ఫేస్ డిజైన్’ ఆకర్షణీయంగా ఉంటే యాప్ సగం విజయం సాధించినట్లే! ఇది వినియోగదారులకు, సాఫ్ట్‌వేర్‌కు మధ్య వారధి అని చెప్పవచ్చు. లక్షల యాప్స్ అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన యాప్‌కు క్రేజ్ ఉంటుంది. కాబట్టి డవలపర్స్‌కు.. డెవలప్‌మెంట్, బ్యాక్ ఎండ్ పనితీరుపై అవగాహన ఉంటే సరిపోదు. సులువుగా ఉపయోగించే విధంగా కూడా యాప్‌ను సిద్ధం చేయాలి. అందుకోసం కలర్స్ వినియోగం, త్వరగా లోడ్ అయ్యే విధంగా చూసుకోవడం, కస్టమర్‌కు హెల్ప్ చేసే టిప్స్, యాక్టివిటీ ఇంటికేటర్స్ మొదలైన ఫీచర్స్ ఉండేలా చూసుకోవాలి.
లాంగ్వేజ్ స్కిల్స్ :
యాప్ డెవలప్‌మెంట్‌లో కోర్ విభాగం కోడింగ్‌ది. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లు.. సీ++, జావా, సీ షాప్‌లపై పట్టు సాధించాలి. వెబ్ డెవలప్‌మెంట్ లాంగ్వేజ్‌లు.. హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్‌పై శిక్షణ పొందాల్సి ఉంటుంది. దాంతోపాటు ఆండ్రాయిడ్, విండోస్ మొబైల్, యాపిల్ ఐవోఎస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేసెస్ (ఏపీఐ)ను సరిగ్గా ఉపయోగించగలగాలి. బ్యాక్ ఎండ్ టెక్నాలజీ తెలిసుండటం మేలు చేస్తుంది. నోడ్ జేఎస్, యాంగ్యులర్, జేక్వెరీ, డాట్‌నెట్ వంటి బ్యాక్ ఎండ్ టెక్నాలజీపైనా అవగాహన ఉంటే మేలంటున్నారు నిపుణులు.
బిజినెస్ స్కిల్స్ :
యాప్‌ను విజయవంతం చేయాలంటే... టెక్నికల్ స్కిల్స్‌తోపాటు నాన్ టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి. ముఖ్యంగా సొంతంగా యాప్ డెవలప్ చేసుకునే వారికి కమ్యూనికేషన్ స్కిల్స్, బిజినెస్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, నెట్‌వర్కింగ్ నైపుణ్యాలు తప్పనిసరి. బిజినెస్‌పరంగా చూస్తే.. డెవలప్ చేసిన యాప్..ఇప్పటికే సదరు అంశంపై అందుబాటులో ఉన్న ఇతర యాప్‌ల కంటే మెరుగైనదిగా ఉండాలి. ఉత్తమ యాప్ డెవలప్ చేసినప్పటికీ.. మార్కెటింగ్‌లో వెనకబడితే ఉపయోగం ఉండదు. డిజిటల్ రంగం కాబట్టి మార్కెటింగ్ టెక్నిక్స్ ద్వారా పోటీదారుల కంటే ముందు నిలిచేలా చూసుకోవాలి.
సక్సెస్ అయితే... కాసుల పంటే
మొబైల్ ఫోన్ల రంగంలో ఆండ్రాయిడ్ విని యోగదారుల వాటా 90 శాతానికిపైగా ఉంది. దాంతో ఆండ్రాయిడ్ డవలపర్స్‌కు మంచి డిమాండ్ కనిపిస్తుంది. మొబైల్ కమర్షియల్ యాప్ డెవలప్‌మెంట్‌కు కనీసం రూ.4 నుంచి రూ.8 లక్షల వరకు ఖర్చు అవుతుంది. యాప్ సక్సెస్ అయితే బాగానే ఆర్జించే అవకాశ ఉంటుంది.
ఇవెంతో ముఖ్యం..
మొబైల్ యాప్ డెవలప్ చేసే క్రమంలో పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
అవి...
యాప్ డెవలప్‌మెంట్‌లో యూజర్ ఇంటర్‌ఫేస్ డవలప్‌మెంట్ ఆకర్షణీయంగా ఉండేలా చూసుకోవాలి. కోడింగ్ కోసం ఊప్స్ కాన్సెప్టులపై స్పష్టత అవసరం. సీ, జావా లాంగ్వేజ్‌లు తెలిస్తే ఆండ్రాయిడ్ డెవపలర్‌గా రాణించవచ్చు. యాప్ సక్సెస్‌కు.. మంచి ఐడియాతోపాటు సహనం, బిజినెస్ నైపుణ్యాలు ఉండాలి. మార్కెట్లో డెవలప్ చేయబోయే యాప్‌కు భవిష్యత్ మార్కెట్‌ను అంచనా వేయగలగాలి.
- కాట్రపల్లి ఉమేశ్, రీచ్డ్ టెక్నాలజీస్ సీఈవో.

- ఏ ప్లాట్‌ఫాం మీద అప్లికేషన్ డెవలప్ చేయాలనుకుంటున్నారో (ఐఫోన్, ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ, విండోస్ మొబైల్ మొదలైనవి) స్పష్టత తెచ్చుకోవాలి.
- స్టాటిక్‌గా ఉండాలా.. లేదా ఎప్పటికప్పుడు మారుతూ కొత్త కంటెంట్‌తో డైనమిక్‌గా కనిపించాలా!
- యాప్‌కు ఎలాంటి ఫీచర్లు అవసరమవుతాయి. కెమెరా, జీపీఎస్, హార్డ్‌వేర్ పరికరాలు!
- ఆయా అప్లికేషన్స్‌ను ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం వంటి సామాజిక మాధ్యమాలతో లింక్ క్రియేట్ చేస్తారా!
- 3డీ యానిమేషన్స్ ఏమైనా అవసరమా! బ్యాకెండ్ డేటాబేసెస్‌తో కనెక్ట్ చేస్తారా! బడ్జెట్ ఎంత అవుతుంది? మొదలైన ఎన్నో అంశాలను యాప్ డెవలప్‌మెంట్‌లో పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
యాప్ డెవలప్‌మెంట్‌లో యూజర్ ఇంటర్‌ఫేస్ డవలప్‌మెంట్ ఆకర్షణీయంగా ఉండేలా చూసుకోవాలి. కోడింగ్ కోసం ఊప్స్ కాన్సెప్టులపై స్పష్టత అవసరం. సీ, జావా లాంగ్వేజ్‌లు తెలిస్తే ఆండ్రాయిడ్ డెవపలర్‌గా రాణించవచ్చు. యాప్ సక్సెస్‌కు.. మంచి ఐడియాతోపాటు సహనం, బిజినెస్ నైపుణ్యాలు ఉండాలి. మార్కెట్లో డెవలప్ చేయబోయే యాప్‌కు భవిష్యత్ మార్కెట్‌ను అంచనా వేయగలగాలి.
- కాట్రపల్లి ఉమేశ్, రీచ్డ్ టెక్నాలజీస్ సీఈవో.
Published date : 08 Nov 2018 05:47PM