ఉన్నత కెరీర్‌కు భద్రత సైబర్ సెక్యూరిటీ
Sakshi Education
ప్రస్తుత సైబర్ ప్రపంచంలో క్యాబ్ బుకింగ్ నుంచి కార్పొరేట్ కంపెనీల కార్యకలాపాల వరకు అన్నీ ఆన్‌లైన్ ఆధారితమే! అన్ని రకాల సేవల్లోనూ ఆన్‌లైన్ కీలకంగా మారిన నేపథ్యంలో సైబర్ భద్రత ఇప్పుడు ఒక సవాల్‌గా పరిణమించింది. ప్రస్తుతం ‘సైబర్ వరల్డ్’.. హ్యాకింగ్ ముప్పును ఎదుర్కొంటోంది. ప్రధాని నరేంద్రమోదీ యూఎస్ పర్యటనలో ఐటీ కంపెనీల అధినేతలతో మాట్లాడుతూ భారత్‌లో డేటా భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వాలు, ప్రైవేటు కంపెనీలు సైబర్ సెక్యూరిటీ కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నాయి. నిపుణులైన మానవ వనరుల కోసం గాలిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉజ్వల కెరీర్ అవకాశాలకు వేదికగా నిలుస్తున్న సైబర్ సెక్యూరిటీ కోర్సులు, అవకాశాలపై ఫోకస్...
సైబర్ సెక్యూరిటీ అంటే
అకడమిక్ ఏదైనా
వివిధ విభాగాలు
ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్ అండ్ సెక్యూరిటీ మానిటరింగ్
ఈ విభాగంలో సంబంధిత సాఫ్ట్‌వేర్‌లో పొందుపర్చిన ఇన్ఫర్మేషన్‌లో మార్పులు, చేర్పులు, భద్రత పరంగా చేపట్టాల్సిన చర్యలను సంబంధిత ప్రోగ్రామర్స్/సంస్థలకు సూచించే నైపుణ్యాలు లభిస్తాయి.
అప్లికేషన్ సెక్యూరిటీ
‘హ్యాకింగ్’ సైబర్ విభాగంలో ఇటీవల తీవ్ర సమస్యగా పరిణమించింది. ప్రముఖ టెక్నో వెబ్‌సైట్లు సైతం హ్యాకింగ్‌కు గురవుతున్నాయి. హ్యాకింగ్ ద్వారా హ్యాకర్లు సంబంధిత ప్రోగ్రామ్స్ రూపొందించిన విధానాలతో పాటు సమగ్ర సమచారం ఇట్టే తెలుసుకుంటున్నారు. దీనికి పరిష్కారంగా ఒక ప్రోగ్రామ్ రూపకల్పన దిశగా అప్లికేషన్ సమయంలోనే పటిష్టమైన భద్రత విధానాలకు సంబంధించిన నైపుణ్యాలు అందించే విభాగం అప్లికేషన్ సెక్యూరిటీ.
డేటా సెక్యూరిటీ
ఒక సంస్థ ఆన్‌లైన్ సేవలు అందించే క్రమంలో డేటా మేనేజ్‌మెంట్‌కు అధిక ప్రాధాన్యం ఉంటుంది. సంబంధిత సంస్థ ఎండ్ యూజర్స్ వివరాలు, ప్రొడక్ట్స్ / సర్వీసుల వివరాలతో కూడిన డేటాను ఆయా సంస్థలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురవుతుంది. ఒక్కసారి అలాంటి పరిస్థితి ఏర్పడితే సంస్థకు సంబంధించిన వివరాలు క్షణాల్లో హ్యాకర్లకు తెలిసిపోతాయి. డేటా వివరాలను పటిష్టంగా నిర్వహించడం, ఏ స్థాయిలోనూ డేటాను ఇతరులు యాక్సెస్ చేసే వీలు లేకుండా చూసే నైపుణ్యాలు అందించే విభాగం డేటా సెక్యూరిటీ.
ఐటీ సెక్యూరిటీ
సైబర్ సెక్యూరిటీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్యూరిటీ మరో ముఖ్య విభాగం. ఐటీ సెక్యూరిటీ నిపుణులు ఆన్‌లైన్ మోసాలను అరికట్టడం, సెక్యూర్డ్ అప్లికేషన్స్ రూపొందించడం చేస్తారు. ఈ క్రమంలో హ్యాకింగ్ చేసిన డొమైన్/ఐపీ వివరాలు; ఎక్కడ నుంచి హ్యాక్ చేశారు అనే విషయాలు గుర్తించడం; హ్యాకింగ్ క్రమంలో సదరు సంస్థ వెబ్‌సైట్‌లో హ్యాకర్లు అప్‌లోడ్ చేసిన ఫేక్ అంశాలను గుర్తించి తొలగించడం వంటివి చేస్తారు. అంతేకాకుండా లాన్ సెక్యూరిటీ; సర్వర్ సెక్యూరిటీ; రూటర్ సెక్యూరిటీ; డిజిటల్ సెక్యూరిటీ విభాగాల్లోనూ ఐటీ సెక్యూరిటీ శిక్షణలో నైపుణ్యాలు లభిస్తాయి.
సైబర్ సెక్యూరిటీ.. అవకాశాలు
ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ నిపుణుల కోసం సంస్థలు పెద్ద ఎత్తున అన్వేషిస్తున్నాయి. సైబర్ సెక్యూరిటీ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు సంస్థల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎన్‌ఎస్‌డీసీ అంచనాల ప్రకారం ప్రస్తుతం దేశంలో చిన్న, మధ్య తరహా, భారీ సంస్థలు అన్నీ కలిపి 44 మిలియన్ల వరకు ఉన్నాయి. వీటిలో అయిదు నుంచి పది శాతం కంపెనీలు ఆన్‌లైన్ కార్యకలాపాలు, వెబ్‌సైట్ నిర్వహణ వంటివి చేపడతాయనుకుంటే 2020 నాటికి దాదాపు పది లక్షల మంది సైబర్ సెక్యూరిటీ నిపుణుల అవసరం ఏర్పడుతుంది.
ప్రభుత్వం- పెరిగిన ప్రాధాన్యత
సైబర్ సెక్యూరిటీ పరంగా కేంద్ర, రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ పరంగానూ ప్రాధాన్యం పెరిగింది. ఈ క్రమంలో కేంద్రం ప్రత్యేకంగా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ పాలసీ-2013ను రూపొందింది. దీని ప్రకారం 2018 నాటికి సైబర్ సెక్యూరిటీ విభాగంలో అయిదు లక్షల మంది నిపుణులను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు యూజీసీ, ఏఐసీటీఈలు కూడా సైబర్ సెక్యూరిటీ/ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ప్రోగ్రామ్‌లను రూపొందించాలని తమ పరిధిలోని యూనివర్సిటీ, ఇన్‌స్టిట్యూట్‌లకు సూచించాయి. ఈ పరిణామాల దృష్ట్యా సైబర్ సెక్యూరిటీ.. భవిష్యత్తుకు సెక్యూరిటీగా నిలిచే రంగంగా మారుతోంది.
ఉద్యోగాలు-హోదాలు
సైబర్ సెక్యూరిటీ విభాగంలో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఆయా సంస్థల స్థాయిని బట్టి హోదాలు, వేతనాలు లభిస్తాయి. ప్రస్తుతం దేశంలో సంస్థలు ఐదు స్థాయిల్లో సైబర్ సెక్యూరిటీ నిపుణులను నియమించుకుంటున్నాయి. అవి... ఎంట్రీ లెవల్ (ఎగ్జిక్యూటివ్ మేనేజర్ హోదా); మిడిల్ లెవల్ (మేనేజర్ హోదా); సీనియర్ లెవల్.
సీనియర్ లెవల్ స్థాయిలోనే సెక్యూరిటీ అడ్వయిజర్స్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ వంటి రెండు హోదాలు లభిస్తున్నాయి. ఎంట్రీ లెవల్‌లో రూ. 20 వేలతో కెరీర్ ప్రారంభించొచ్చు. తర్వాత అనుభవం, పనితీరు ఆధారంగా మూడేళ్లలో నెలకు రూ. 50 వేల వరకు వేతనం అందుకునే అవకాశం ఉంది.
సర్టిఫికేషన్లు తప్పనిసరి
సైబర్ సెక్యూరిటీ విభాగంలో ప్రవేశించేందుకు జనరల్ డిగ్రీ హోల్డర్స్ నుంచి ఐటీ ప్రొఫెషనల్స్ వరకు అందరూ అర్హులే. అయితే ఈ విభాగంలో ప్రత్యేకంగా శిక్షణనిచ్చే సర్టిఫికేషన్లు ఉన్నాయి. వాటిని పూర్తి చేసిన వారు కొలువుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా సులభంగా కెరీర్‌లో స్థిరపడవచ్చు.
పీజీ స్పెషలైజేషన్స్
బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో సైబర్ సెక్యూరిటీ/ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో పూర్తి స్థాయి కోర్సులు అందుబాటులో లేవు. బీసీఏ, బీటెక్ ప్రోగ్రామ్‌లలో ఒక సబ్జెక్ట్‌గా ఈ అంశాలను బోధిస్తున్నారు. అయితే పీజీ స్థాయిలో మాత్రం ఎంటెక్, ఎంసీఏలలో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
కొన్ని ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు
- సాఫ్ట్‌వేర్ ఉపయోగించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత ఆన్‌లైన్ కార్యకలాపాల భద్రతను పర్యవేక్షించడమే సైబర్ సెక్యూరిటీ.
- సైబర్ సెక్యూరిటీ విధానాలతో కంప్యూటర్లు, నెట్‌వర్క్ సిస్టమ్స్, సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్స్, విలువైన డేటాలు హ్యాకింగ్‌కు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.
- ప్రస్తుత సిలికాన్ వరల్డ్‌లో సైబర్‌పోటీ, సైబర్ క్రైమ్‌లు రోజు రోజుకీ పెరుగుతున్నాయి.
- ఈ క్రమంలో ఆన్‌లైన్ విధానంలో కార్యకలాపాలు నిర్వహించే చిన్న స్థాయి ప్రైవేటు సంస్థల నుంచి బహుళ జాతి సంస్థల వరకు సైబర్ నిపుణులపై ఆధారపడక తప్పని పరిస్థితి.
- దీంతో సైబర్ నిపుణులకు డిమాండ్ పెరగడంతో పాటు ఆకర్షణీయ వేతనాలు లభిస్తున్నాయి.
అకడమిక్ ఏదైనా
- సైబర్ సెక్యూరిటీ... పూర్తిగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన అంశం.
- అయినప్పటికీ ఈ విభాగంలో కేవలం ఐటీ రంగ నిపుణులు మాత్రమే రాణించగలరు అనుకుంటే పొరపాటు. సాధారణ డిగ్రీ విద్యార్థులు సైతం సైబర్ సెక్యూరిటీ సంబంధిత కోర్సులు చేయవచ్చు.
- ఇప్పటికే జనరల్ డిగ్రీ విద్యార్థులు అకడమిక్‌తో సంబంధం లేకుండా సైబర్ సెక్యూరిటీ కోర్సులు పూర్తి చేసి ఉన్నత కొలువులను సొంతం చేసుకుంటున్నారు.
- ఇంటర్నెట్, డేటా ఇన్ఫర్మేషన్ దాని ప్రాధాన్యం తదితర అంశాలపై అవగాహన ఉన్న వారంతా సైబర్ కోర్సులకు చక్కగా సరిపోతారు.
- గత కొంత కాలంగా సైబర్ సెక్యూరిటీ ప్రధానాంశంగా అకడమిక్ కోర్సులు/ సబ్జెక్ట్‌లు ప్రారంభమవుతున్నాయి. ఈ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు అద్భుత అవకాశాలు లభిస్తున్నాయి.
వివిధ విభాగాలు
- సైబర్ సెక్యూరిటీలో వివిధ విభాగాలున్నాయి.
- ఇన్సిడెండ్ మేనేజ్‌మెంట్ అండ్ సెక్యూరిటీ మానిటరింగ్, అప్లికేషన్ సెక్యూరిటీ, డేటా సెక్యూరిటీ, ఐటీ సెక్యూరిటీ.. ఈ విభాగాలు సైబర్ సెక్యూరిటీలో కీలక పాత్ర పోషిస్తాయి.
- సంస్థలు/ప్రొడక్ట్/ప్రాజెక్టులకు సంబంధించిన కీలక సమాచార భద్రత, మార్పిడిలలో ఈ నాలుగు విభాగాలు కీలకంగా వ్యవహరిస్తాయి.
- ఎంఎన్‌సీ కంపెనీల నుంచి స్కేల్-3 ఆన్‌లైన్ ఆధారిత సంస్థల వరకు ఆయా సంస్థల ఆర్థిక వ్యవహారాల భద్రతా పర్యవేక్షణకు(మానిటరింగ్) సైబర్ సెక్యూరిటీ అత్యవసరం.
- దీంతో ఈ విభాగాల్లో సర్టిఫికేషన్లు చేసిన వారికి జాబ్ మార్కెట్‌లో మంచి అవకాశాలు లభిస్తున్నాయి.
ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్ అండ్ సెక్యూరిటీ మానిటరింగ్
ఈ విభాగంలో సంబంధిత సాఫ్ట్‌వేర్‌లో పొందుపర్చిన ఇన్ఫర్మేషన్‌లో మార్పులు, చేర్పులు, భద్రత పరంగా చేపట్టాల్సిన చర్యలను సంబంధిత ప్రోగ్రామర్స్/సంస్థలకు సూచించే నైపుణ్యాలు లభిస్తాయి.
అప్లికేషన్ సెక్యూరిటీ
‘హ్యాకింగ్’ సైబర్ విభాగంలో ఇటీవల తీవ్ర సమస్యగా పరిణమించింది. ప్రముఖ టెక్నో వెబ్‌సైట్లు సైతం హ్యాకింగ్‌కు గురవుతున్నాయి. హ్యాకింగ్ ద్వారా హ్యాకర్లు సంబంధిత ప్రోగ్రామ్స్ రూపొందించిన విధానాలతో పాటు సమగ్ర సమచారం ఇట్టే తెలుసుకుంటున్నారు. దీనికి పరిష్కారంగా ఒక ప్రోగ్రామ్ రూపకల్పన దిశగా అప్లికేషన్ సమయంలోనే పటిష్టమైన భద్రత విధానాలకు సంబంధించిన నైపుణ్యాలు అందించే విభాగం అప్లికేషన్ సెక్యూరిటీ.
డేటా సెక్యూరిటీ
ఒక సంస్థ ఆన్‌లైన్ సేవలు అందించే క్రమంలో డేటా మేనేజ్‌మెంట్‌కు అధిక ప్రాధాన్యం ఉంటుంది. సంబంధిత సంస్థ ఎండ్ యూజర్స్ వివరాలు, ప్రొడక్ట్స్ / సర్వీసుల వివరాలతో కూడిన డేటాను ఆయా సంస్థలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురవుతుంది. ఒక్కసారి అలాంటి పరిస్థితి ఏర్పడితే సంస్థకు సంబంధించిన వివరాలు క్షణాల్లో హ్యాకర్లకు తెలిసిపోతాయి. డేటా వివరాలను పటిష్టంగా నిర్వహించడం, ఏ స్థాయిలోనూ డేటాను ఇతరులు యాక్సెస్ చేసే వీలు లేకుండా చూసే నైపుణ్యాలు అందించే విభాగం డేటా సెక్యూరిటీ.
ఐటీ సెక్యూరిటీ
సైబర్ సెక్యూరిటీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్యూరిటీ మరో ముఖ్య విభాగం. ఐటీ సెక్యూరిటీ నిపుణులు ఆన్‌లైన్ మోసాలను అరికట్టడం, సెక్యూర్డ్ అప్లికేషన్స్ రూపొందించడం చేస్తారు. ఈ క్రమంలో హ్యాకింగ్ చేసిన డొమైన్/ఐపీ వివరాలు; ఎక్కడ నుంచి హ్యాక్ చేశారు అనే విషయాలు గుర్తించడం; హ్యాకింగ్ క్రమంలో సదరు సంస్థ వెబ్‌సైట్‌లో హ్యాకర్లు అప్‌లోడ్ చేసిన ఫేక్ అంశాలను గుర్తించి తొలగించడం వంటివి చేస్తారు. అంతేకాకుండా లాన్ సెక్యూరిటీ; సర్వర్ సెక్యూరిటీ; రూటర్ సెక్యూరిటీ; డిజిటల్ సెక్యూరిటీ విభాగాల్లోనూ ఐటీ సెక్యూరిటీ శిక్షణలో నైపుణ్యాలు లభిస్తాయి.
సైబర్ సెక్యూరిటీ.. అవకాశాలు
ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ నిపుణుల కోసం సంస్థలు పెద్ద ఎత్తున అన్వేషిస్తున్నాయి. సైబర్ సెక్యూరిటీ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు సంస్థల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎన్‌ఎస్‌డీసీ అంచనాల ప్రకారం ప్రస్తుతం దేశంలో చిన్న, మధ్య తరహా, భారీ సంస్థలు అన్నీ కలిపి 44 మిలియన్ల వరకు ఉన్నాయి. వీటిలో అయిదు నుంచి పది శాతం కంపెనీలు ఆన్‌లైన్ కార్యకలాపాలు, వెబ్‌సైట్ నిర్వహణ వంటివి చేపడతాయనుకుంటే 2020 నాటికి దాదాపు పది లక్షల మంది సైబర్ సెక్యూరిటీ నిపుణుల అవసరం ఏర్పడుతుంది.
ప్రభుత్వం- పెరిగిన ప్రాధాన్యత
సైబర్ సెక్యూరిటీ పరంగా కేంద్ర, రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ పరంగానూ ప్రాధాన్యం పెరిగింది. ఈ క్రమంలో కేంద్రం ప్రత్యేకంగా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ పాలసీ-2013ను రూపొందింది. దీని ప్రకారం 2018 నాటికి సైబర్ సెక్యూరిటీ విభాగంలో అయిదు లక్షల మంది నిపుణులను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు యూజీసీ, ఏఐసీటీఈలు కూడా సైబర్ సెక్యూరిటీ/ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ప్రోగ్రామ్‌లను రూపొందించాలని తమ పరిధిలోని యూనివర్సిటీ, ఇన్‌స్టిట్యూట్‌లకు సూచించాయి. ఈ పరిణామాల దృష్ట్యా సైబర్ సెక్యూరిటీ.. భవిష్యత్తుకు సెక్యూరిటీగా నిలిచే రంగంగా మారుతోంది.
ఉద్యోగాలు-హోదాలు
సైబర్ సెక్యూరిటీ విభాగంలో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఆయా సంస్థల స్థాయిని బట్టి హోదాలు, వేతనాలు లభిస్తాయి. ప్రస్తుతం దేశంలో సంస్థలు ఐదు స్థాయిల్లో సైబర్ సెక్యూరిటీ నిపుణులను నియమించుకుంటున్నాయి. అవి... ఎంట్రీ లెవల్ (ఎగ్జిక్యూటివ్ మేనేజర్ హోదా); మిడిల్ లెవల్ (మేనేజర్ హోదా); సీనియర్ లెవల్.
సీనియర్ లెవల్ స్థాయిలోనే సెక్యూరిటీ అడ్వయిజర్స్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ వంటి రెండు హోదాలు లభిస్తున్నాయి. ఎంట్రీ లెవల్‌లో రూ. 20 వేలతో కెరీర్ ప్రారంభించొచ్చు. తర్వాత అనుభవం, పనితీరు ఆధారంగా మూడేళ్లలో నెలకు రూ. 50 వేల వరకు వేతనం అందుకునే అవకాశం ఉంది.
సర్టిఫికేషన్లు తప్పనిసరి
సైబర్ సెక్యూరిటీ విభాగంలో ప్రవేశించేందుకు జనరల్ డిగ్రీ హోల్డర్స్ నుంచి ఐటీ ప్రొఫెషనల్స్ వరకు అందరూ అర్హులే. అయితే ఈ విభాగంలో ప్రత్యేకంగా శిక్షణనిచ్చే సర్టిఫికేషన్లు ఉన్నాయి. వాటిని పూర్తి చేసిన వారు కొలువుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా సులభంగా కెరీర్‌లో స్థిరపడవచ్చు.
- EC కౌన్సిల్ నిర్వహించే సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్
వెబ్‌సైట్: www.eccouncil.org
- డేటా సెక్యూరిటీ కౌన్సిల్ అందించే సర్టిఫికేషన్ కోర్సులు
వెబ్‌సైట్: www.dsci.in
- సిస్కో సంస్థ అందించే సీసీఎన్‌ఏ సెక్యూరిటీ; సీసీఎన్‌పీ సెక్యూరిటీ; సీసీఐఈ సెక్యూరిటీ.
వెబ్‌సైట్: www.cisco.com
- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కోర్సులు
వెబ్‌సైట్: www.iisecurity.in
పీజీ స్పెషలైజేషన్స్
బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో సైబర్ సెక్యూరిటీ/ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో పూర్తి స్థాయి కోర్సులు అందుబాటులో లేవు. బీసీఏ, బీటెక్ ప్రోగ్రామ్‌లలో ఒక సబ్జెక్ట్‌గా ఈ అంశాలను బోధిస్తున్నారు. అయితే పీజీ స్థాయిలో మాత్రం ఎంటెక్, ఎంసీఏలలో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
కొన్ని ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు
- జేఎన్‌టీయూ - హైదరాబాద్
వెబ్‌సైట్: www.jntuh.ac.in
- ఐఐఐటీ - అలహాబాద్
వెబ్‌సైట్: www.clis.iiita.ac.in
- సీడాక్
వెబ్‌సైట్: www.cdac.in
- ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.srmuniv.ac.in
- అమిటీ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.amity.edu
- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీ
వెబ్‌సైట్: www.imt.edu
అప్‌కమింగ్ కెరీర్ ఆప్షన్ సైబర్ సెక్యూరిటీ/ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఇప్పుడు అప్‌కమింగ్ కెరీర్ ఆప్షన్‌గా నిలుస్తోంది. యువ విద్యార్థులు మారుతున్న పరిణామాలను గుర్తించి అందుకు అనుగుణమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇందులో భాగంగా సైబర్ సెక్యూరిటీ కోర్సులు పూర్తి చేసిన వారికి భవిష్యత్తులో ఉపాధి పరంగా ఎలాటి డోకా ఉండదు. సి-డాక్‌లో వీటికి సంబంధించి స్వల్పకాలిక కోర్సులు అందిస్తున్నాం. అంతే కాకుండా సంస్థలతో సంప్రదింపుల ద్వారా ప్లేస్‌మెంట్స్ లభించే ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. - ఇ.మాగేశ్, సెంటర్ హెడ్, సీ-డాక్, హైదరాబాద్ |
ముందుగానే గుర్తించే లక్షణం సైబర్ సెక్యూరిటీ రంగంలో రాణించాలనుకునే అభ్యర్థులకు సూక్ష్మ పరిశీలన నైపుణ్యాలు ఎంతో అవసరం. ఒక ప్రోగ్రామ్ లేదా సాఫ్ట్‌వేర్‌ను హ్యాక్ చేయడానికి ఉన్న అవకాశాల గురించి ముందుగానే గుర్తించే సామర్థ్యం కలిగి ఉండాలి. ఈ విధమైన ఆలోచనా దృక్పథం ఉన్నప్పుడే లోపాలు లేకుండా సదరు ప్రొడక్ట్‌కు భద్రత కల్పించే దిశగా సమర్థవంతంగా విధులు నిర్వహించగలరు. ఈ రంగం కేవలం ఐటీ నిపుణులకే పరిమితం అనుకోవడం పొరపాటు. సునిశిత గ్రాహక శక్తి, మంచి ఆలోచన సామర్థ్యం ఉన్న వారెవరైనా ఈ రంగంలో అద్భుతంగా రాణించవచ్చు. అయితే కొలువులు సొంతం చేసుకోవాలంటే సర్టిఫికేషన్లు తప్పనిసరి. సర్టిఫికేషన్లు పూర్తి చేసిన వారికి కెరీర్ పరంగా అధిక గుర్తింపు లభిస్తుంది. - కె.ఈశ్వర్, కన్సల్టెంట్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్, టోటెమ్ కంప్యూటర్స్ |
Published date : 02 Oct 2015 10:58AM