Skip to main content

కోవిడ్- 19 కాలంలోనూ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ షురూ..కోర్ టెక్నికల్ విభాగాల్లోనూ ఆశాజనకమే..

ఐటీ కంపెనీలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ చేపట్టే విషయంలో పరిస్థితులు ఆశాజనకంగానే కనిపిస్తున్నాయి. ఐఐటీల్లో ఇప్పటికే సమ్మర్ ప్లేస్‌మెంట్ ఆఫర్స్ 90 శాతం మందికి లభించాయి. ఫైనల్ ప్లేస్‌మెంట్ ప్రక్రియలోనూ ఇదే తరహా ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే ఐఐటీల విద్యార్థులు చాలా మందికి జాతీయ, అంతర్జాతీయ అవకాశాలు లభిస్తున్నా యి. ప్యాకేజీలు సైతం ఆకర్షణీయంగానే ఉంటున్నాయి.
కోర్ టెక్నికల్ విభాగాల్లోనూ..
కోర్ టెక్నికల్ విభాగాలుగా భావించే ఎలక్ట్రికల్, ఎలక్ట్రా నిక్స్, మాన్యుఫ్యాక్చరింగ్, మెకానికల్ విభాగాల్లోనూ రాను న్న రోజుల్లో తాజా గ్రాడ్యుయేట్ల నియామకాలు ఆశాజన కంగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. అన్ని రంగాల్లోనూ 73 శాతం సంస్థలు తాము ఫ్రెషర్స్ రిక్రూట్‌మెంట్స్ చేపడ తామని పేర్కొనడమే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఉత్పత్తి రంగంలోని సంస్థలు తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తున్నాయి. దీంతో ఈ సంస్థల్లో ఐటీ సంబంధిత కొత్త నియామకాలు ఉంటాయని భావిస్తున్నారు. 2020లో కొవిడ్ కారణంగా జాయినింగ్ లెటర్స్ ఇవ్వడంలో పలు సంస్థలు జాప్యం చేశాయి. కాని 2021లో ఇలాంటి పరిస్థితి ఉండదని కంపెనీలు పేర్కొనడం తాజా గ్రాడ్యుయేట్లకు ఆనందం కలిగించే విషయంగా పేర్కొనొచ్చు.

ఇంకా చదవండి: part 3: కోవిడ్- 19 కాలంలోనూ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ జోరు చూపిస్తున్న టాప్ సెక్టార్స్ ఇవే.. కొలువులు కొట్టేందుకు కావాల్సిన నైపుణ్యాలు ఇవే..
Published date : 25 Dec 2020 01:34PM

Photo Stories