Skip to main content

కోవిడ్- 19 కాలంలోనూ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ జోరు చూపిస్తున్న టాప్ సెక్టార్స్ ఇవే.. కొలువులు కొట్టేందుకు కావాల్సిన నైపుణ్యాలు ఇవే..

నియామకాల పరంగా ప్రస్తుతం ఐటీ, మాన్యుఫ్యాక్చరింగ్, ఫిన్‌టెక్, ఈ-కామర్స్, ఈ-లెర్నింగ్, హెల్త్‌కేర్ రంగాలు టాప్‌లో నిలుస్తున్నాయి. దీనికి కారణం.. ఇప్పుడు ఈ రంగాల్లో కార్యకలాపాలన్నీ సాంకేతిక విధానాల ద్వారా సాగించాలని సంస్థలు భావిస్తుండటమే. దీంతో తాజా గ్రాడ్యుయేట్లు అకడమిక్ అర్హతలతోపాటు టెక్నికల్ స్కిల్స్ కూడా సొంతం చేసుకుంటే అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు.
ఈ నైపుణ్యాలు తప్పనిసరి..
టెక్, ఐటీ విభాగాల్లో ఫ్రెషర్స్ రిక్రూట్‌మెంట్ కోణంలో విద్యార్థులకు ఇప్పుడు కీలకంగా నిలుస్తున్న నైపుణ్యాలు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ బ్లాక్‌చైన్ టెక్నాలజీ డేటా అనాలిసిస్ క్లౌడ్ కంప్యూటింగ్ సైబర్ సెక్యూరిటీ; రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ బిగ్ డేటా.

నైపుణ్యాలకు మార్గాలు..
ఆయా టెక్ స్కిల్స్ సొంతం చేసుకోవడానికి ప్రస్తుతం ఎన్నో మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి. సదరు విభాగాలకు సంబంధించి పలు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సర్టిఫికేషన్ కోర్సులు పూర్తిచేసుకునే అవకాశం ఉంది. మూక్స్ వంటి ఆన్‌లైన్ మార్గాల్లో స్వీయ శిక్షణకు ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఏ డొమైన్‌లో ఉద్యోగం ఆశిస్తున్నామో.. ఆ విభాగంలో కొత్త నైపుణ్యాలు సొంతం చేసుకోవడంపై దృష్టిపెట్టాలంటున్నారు. అప్పుడే కొలువుల పోటీలో ముందంజలో నిలిచి.. ఆఫర్ ఖరారు చేసుకునే అవకాశాలు మెరుగవుతాయని చెబుతున్నారు.

ఇంకా చదవండి: part 4: క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఈ జాబ్ ప్రొఫైల్స్లో ఎక్కువ నియమకాలు.. రూ. లక్ష వరకు వేతనం..
Published date : 25 Dec 2020 01:36PM

Photo Stories