ఐటీ ఫ్రెషర్స్ రిక్రూట్‌మెంట్స్.. ముందుంది మంచి కాలమేనా!
Sakshi Education
సాఫ్ట్‌వేర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ..గత కొన్నేళ్లుగా నియామకాల పరంగా ఫ్రెషర్స్‌కు ఆకర్షణీయమైన ఉద్యోగాలు కల్పించే రంగాలు! అందుకే ఏటా లక్షల మంది బీటెక్ విద్యార్థుల లక్ష్యం.. ఐటీలో జాబ్! కోర్ నుంచి సీఎస్‌ఈ వరకూ.. బ్రాంచ్ ఏదైనా.. బీటెక్ విద్యార్థులు తొలిరోజు నుంచే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం కృషి చేస్తున్న వైనం! కానీ.. కొవిడ్ కారణంగా ఈ ఏడాది ఫ్రెషర్స్‌కు అవకాశాలు ఉంటాయా?! సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఆశించిన విధంగా ఆఫర్లు అందిస్తాయా.. ఆన్-క్యాంపస్‌లో ఐటీ జాబ్ రాకుంటే.. ప్రత్యామ్నాయ మార్గం ఏమిటి? అనే సందేహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో.. ఐటీలో ఫ్రెషర్స్ రిక్రూట్‌మెంట్ ట్రెండ్స్‌పై విశ్లేషణ...
కొవిడ్ కారణంగా సాఫ్ట్‌వేర్ కొలువుల ఆశలు గల్లంతవుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాలుగేళ్లు చదివిన బీటెక్ చదువుకు సార్థకత కష్టమే. ఐటీ కంపెనీల్లో ఒకవేళ నియామకాలు జరిగినా.. సీనియర్ల స్థాయిలోనే ఉంటాయి. ఫ్రెషర్స్‌ను నియమించుకునేందుకు కంపెనీలు అంతగా ఆసక్తి చూపకపోవచ్చు.-ఇలాంటి భావన ప్రస్తుతం కొంతమంది బీటెక్ విద్యార్థుల్లో కనిపిస్తోంది!!
వాస్తవానికి సంస్థలు ఫ్రెషర్స్‌ను రిక్రూట్ చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయనే అంచనాలు వెలువడుతున్నాయి. కారణం.. కంపెనీలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో.. కొత్తగా నియామకాలు చేపట్టే విధంగా ప్రణాళికలు రూపొందిస్తుండటమే! ఫ్రెషర్స్‌కు ఆఫర్లు ఇచ్చేముందు అకడమిక్ అర్హతల తోపాటు స్కిల్స్‌ను పరిగణనలోకి తీసుకోనున్నాయి.
గాడిలో పడుతున్న ఐటీ..
కొవిడ్ కాలంలో ఐటీ రంగంలో నియామకాలు కొంత తగ్గుముఖం పట్టినా.. ఇప్పుడు మళ్లీ గాడిలో పడుతున్నాయి. దేశంలోని ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థలు.. తాము ఫ్రెషర్స్ రిక్రూట్‌మెంట్స్ చేపడతామని ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. రెండు నెలల క్రితమే టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎస్ వంటి ప్రముఖ కంపెనీలు.. ఈ ఏడాది తాము కొత్త నియామకాలు చేపట్టనున్నట్ల ప్రకటించాయి. మధ్య స్థాయి ఐటీ సంస్థలు మాత్రం ఫ్రెషర్స్ రిక్రూట్‌మెంట్స్ కోణంలో కొంత వేచి చూసే ధోరణితో అడుగులు వేస్తున్నాయి. ఇటీవల ఓ ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం-ఐటీ, ఐటీఈఎస్ రంగంలోని 13 శాతం సంస్థలు.. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ-2, క్యూ-3లలో నియామకాలు కొంత మేర తగ్గించిన పరిస్థితి ఉంది.
ఇంకా చదవండి: part 2: కోవిడ్- 19 కాలంలోనూ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ షురూ.. కోర్ టెక్నికల్ విభాగాల్లోనూ ఆశాజనకమే..

Published date : 25 Dec 2020 01:33PM