సవాళ్లతో కూడిన వృత్తి.. మార్కెటింగ్ మేనేజర్!
Sakshi Education
సేల్స్ అండ్ మార్కెటింగ్... ప్రపంచవ్యాప్తంగా వందల ఏళ్లుగా అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్న ప్రక్రియ. ఇది కంపెనీలో తయారు చేసిన ఉత్పత్తులను, సంస్థల సేవలను సంబంధిత వినియోగదారులకు విక్రయించే బహుముఖ వ్యాపారం. అమ్మకాలపైనే సంస్థల మనుగడ ఆధారపడి ఉంటుంది. ఇలా అమ్మకాలు సాగిస్తూ కంపెనీకి, వినియోగదారులకు మధ్య వారధిగా పనిచేసేవారే.. సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజర్లు. ప్రపంచీకరణ నేపథ్యంలో అన్ని దేశాల మధ్య సరిహద్దులు చెదిరిపోతూ వ్యాపార సంస్కృతి విస్తరిస్తుండడంతో మార్కెటింగ్ నిపుణులకు అవకాశాలు మిన్నంటుతున్నాయి. దేశ విదేశాల్లో భారీగా ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఇకపై భవిష్యత్తంతా సేల్స్ అండ్ మార్కెటింగ్ రంగానిదేనని చెప్పడం అతిశయోక్తి కాదు. కాబట్టి దీన్ని కెరీర్గా ఎంచుకుంటే అవకాశాలకు, ఆదాయానికి నింగే హద్దు.
మార్కెటింగ్ నిపుణుల కొరత తీవ్రం
నేడు అన్ని రంగాల్లో సేల్స్ మేనేజర్ల పాత్ర తప్పనిసరి. ప్రధానంగా రిటైల్, ఐటీ, హాస్పిటాలిటీ, ట్రావెల్, హెల్త్కేర్, ఇన్సూరెన్స్ వంటి వాటిలో అధిక ఉద్యోగాలున్నాయి. ప్రస్తుతం నిపుణులైన మేనేజర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. డిమాండ్, సప్లై మధ్య అంతరం ఎక్కువగా ఉంది. దీనిపై జనంలో ఇప్పటిదాకా అంతగా అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం. ఈ పరిస్థితిలో క్రమంగా మార్పు వస్తోంది. మార్కెటింగ్ను కెరీర్గా ఎంచుకొనే యవత సంఖ్య పెరుగుతోంది. ప్రారంభంలో సేల్స్ పర్సన్గా పనిచేసినవారు వృత్తిలో నైపుణ్యాలను పెంచుకొని మేనేజర్ స్థాయికి ఎదగొచ్చు. కుటీర పరిశ్రమల నుంచి కార్పొరేట్ సంస్థల వరకు తమ వ్యాపారాభివృద్ధి కోసం మార్కెటింగ్ మేనేజర్లను నియమించుకుంటున్నాయి. ఈ వృత్తి మిగిలినవాటితో పోలిస్తే భిన్నమైనది. తానేం సాధించాలో మేనేజర్కు ముందే తెలుస్తుంది. ఇందులో పోటీ, సవాళ్లు అధికంగా ఉంటాయి. |
కావాల్సిన నైపుణ్యాలు
సేల్స్ మేనేజ్మెంట్లో మెరవాలంటే మాతృభాషతోపాటు ఆంగ్లంపై గట్టి పట్టుండాలి. అనర్గళంగా మాట్లాడే, తప్పుల్లేకుండా రాసే నైపుణ్యం అవసరం. మాటలతో వినియోగదారులను ప్రభావితం చేసి, ఒప్పించగలిగే నేర్పు ఉండాలి. ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినే లక్షణం ముఖ్యం. సాధారణ వ్యాపార లావాదేవీలపై పరిజ్ఞానం పెంచుకోవాలి. తార్కికంగా ఆలోచించగలగాలి. ప్రజంటేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకొనేదాకా ఓపికతో పనిచేయాలి. నాయకత్వ లక్షణాలుండాలి. సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం కావాలి.
అర్హతలు
సేల్స్ రంగాన్ని కెరీర్గా ఎంచుకోవాలంటే గ్రాడ్యుయేషన్ తర్వాత ఎంబీఏ పూర్తిచేయాలి. గతంలో మేనేజ్మెంట్ డిగ్రీ లేకపోయినా సేల్స్ మేనేజర్గా అవకాశాలు లభించేవి. ప్రస్తుతం సేల్స్ అండ్ మార్కెటింగ్లో చేరాలంటే బిజినెస్ స్టడీస్లో డిగ్రీ/డిప్లొమా ఉండడం తప్పనిసరి. తగిన విద్యార్హతలతో కెరీర్లో వేగంగా ఎదగడానికి వీలుంటుంది. మార్కెటింగ్ అర్హతలు లేని సాధారణ గ్రాడ్యుయేట్లు సైతం ఈ రంగంలో స్వయం ప్రతిభతో అద్భుతాలు సృష్టిస్తున్నారు.
వేతనాలు
సేల్స్ మేనేజ్మెంట్ నిపుణులకు అధిక వేతనాలుంటాయి. ప్రారంభంలో సంవత్సరానికి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వేతన ప్యాకేజీ లభిస్తుంది. సీనియారిటీ పెరిగితే ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు అందుకోవచ్చు.
కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు
-ఉస్మానియా యూనివర్సిటీ
వెబ్సైట్: www.osmania.ac.in/
-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్-లక్నో. వెబ్సైట్: www.iiml.ac.in/
-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్
వెబ్సైట్: www.iiswbm.edu/
-ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ
వెబ్సైట్: www.imt.edu/
-ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్-ఢిల్లీ
వెబ్సైట్: https://fms.edu/
-జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్
వెబ్సైట్: www.xlri.ac.in/
======================================================

సమర్థతను బట్టి వేతనాలు ‘‘ప్రపంచ దేశాలు తమ ఉత్పత్తుల విక్రయానికి భారత్నే అతిపెద్ద మార్కెట్గా ఎంచుకున్నాయి. ఇక్కడి ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతోంది. దీంతో సేల్స్ అండ్ మార్కెటింగ్ రంగంలో ఉద్యోగావ కాశాలు పెరుగుతున్నాయి. కేవలం సబ్జెక్టు నాలెడ్జ్ మాత్రమే కాకుండా వృత్తికి అవసరమైన నైపుణ్యాలను పెంచుకోవాలి. కమ్యూనికేషన్స్కిల్స్, ఆటిట్యూడ్, బిహేవియర్ స్కిల్స్ వంటివి అవసరం. మార్కెటింగ్ రంగంలో కెరీర్ పరంగా సాధారణ స్థాయి నుంచి మేనే జింగ్ డెరైక్టర్ వరకూ ఎదగొచ్చు. నైపుణ్యం, సమర్థతను బట్టి వేతనాలు అందుతాయి’’ -వి.అంజిరాజు, అసోసియేట్ ప్రొఫెసర్, ఐపీఈ |
Published date : 15 Sep 2014 05:58PM