బ్యాంకింగ్ రంగంలో కొలువుల జాతర!
Sakshi Education
ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల విషయంలో ‘ఆర్థిక రంగానికి బ్యాంకులు వెన్నెముక’ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వివిధ అధ్యయనాల ప్రకారం దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న రంగాల్లో బ్యాంకింగ్ రంగం ఒకటి. ఈ విస్తరణ నవతరం కుర్రకారుకు కొత్త కొత్త కొలువులను అందుబాటులో ఉంచుతోంది. సుస్థిర కెరీర్‌ను సొంతం చేసుకునేందుకు ద్వారాలు తెరుస్తోంది.. దేశంలో బ్యాంకింగ్ రంగం భారీ సంఖ్యలో కొలువులను సృష్టించనుందని అసోచామ్ తాజా అధ్యయనంలో వెల్లడించింది. వచ్చే ఆరేళ్లలో భారత బ్యాంకింగ్ రంగం ఎనిమిది లక్షల కొత్త ఉద్యోగాలను అందించనున్నట్లు అంచనా వేసింది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ రంగంలో కెరీర్‌పై స్పెషల్ ఫోకస్..
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్).. ఉమ్మడి రాత పరీక్ష ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 39 వేల క్లరికల్ ఉద్యోగాల భర్తీకి సంకల్పించింది.
8 వేల కొత్త బ్యాంక్ శాఖలు ప్రారంభించాలని వివిధ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం నిర్దేశించారు. ఇలాంటి పరిస్థితుల్లో వివిధ స్థాయిల్లో 50 వేల వరకు కొత్త ఉద్యోగాలు వచ్చేందుకు అవకాశముంది.
అసోచాం తాజా అంచనాల ప్రకారం 2013-14 ఆర్థిక సంవత్సరంలో 26 ప్రభుత్వ రంగ బ్యాంకులు 50 వేల ఉద్యోగాలు ఇవ్వనున్నాయి. 20 ప్రైవేటు రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు 50 వేలకు పైనే ఉద్యోగులను నియమించుకోనున్నాయి. మొత్తంమీద వచ్చే ఆరేళ్లలో భారత బ్యాంకింగ్ రంగం ఎనిమిది లక్షల కొత్త ఉద్యోగాలను అందించనుంది. బ్యాంకింగ్ రంగంలో పదవీ విరమణల వల్ల ఏర్పడే ఖాళీలు, కొత్తగా ప్రారంభించే శాఖలు తదితరాలను దృష్టిలో ఉంచుకొని ఈ అంచనాలు వేశారు.
కొత్త బ్యాంకులతో కొలువుల జోరు:
దేశంలో పెద్ద కార్పొరేట్లు(రిలయన్స్, టాటా వంటివి) కొత్త బ్యాంకులు ప్రారంభించేందుకు రిజర్వ్ బ్యాంక్ అనుమతి కోసం చేసిన దరఖాస్తులపై మూడు, నాలుగు నెలల్లో తుది నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడా ది జనవరి నాటికి కొత్త బ్యాంకుల ఏర్పాటుకు అనుమతులు మంజూరైతే చాలా ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి.
బ్యాంకు ఉద్యోగాలను చేజిక్కించుకోవాలనుకునే నిరుద్యోగులకు వచ్చే నాలుగైదు సంవత్సరాలు స్వర్ణయుగమంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ రంగంలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? వాటిని పొందేందుకు ఎలా కృషి చేయాలి? జీతభత్యాల తీరుతెన్నులు? కెరీర్‌లో ఉన్నత శిఖరాలు అందుకునేందుకు అవసరమైన నైపుణ్యాలు? తదితర అంశాలను పరిశీలిస్తే..
మన దేశంలోని బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు ముఖ్యమైనవి. సహకార (కో-ఆపరేటివ్) బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు కూడా ఉన్నప్పటికీ వాటిలో ఉద్యోగాలు స్థానికులకు మాత్రమే కేటాయించినందువల్ల ఆయా ప్రాంతాల్లో నివసించే వారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. వాటిలో ఉద్యోగాల సంఖ్య కూడా పరిమితంగా ఉంటుంది. ఈ సంవత్సరం నుంచి ఐబీపీఎస్ అన్ని గ్రామీణ బ్యాంకుల సౌకర్యార్థం ఉమ్మడి రాత పరీక్ష (సీడబ్ల్యూఈ) ప్రారంభించింది. ఈ బ్యాంకులన్నింటిలోనూ ఉన్న ఖాళీలను కలిపినందువల్ల సంఖ్య పెద్దదిగా కనిపిస్తున్నప్పటికీ ఆయా బ్యాంకులు పనిచేసే ప్రాంతాల్లో ఉండే అభ్యర్థులు మాత్రమే అర్హులు కాబట్టి అవకాశాలు పరిమితమనే చెప్పొచ్చు.
భారతదేశం - బ్యాంకింగ్:
భారతదేశంలో మొదటి సారిగా 1969లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ 14 ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేశారు. తర్వాత 1980లో మరో ఆరు బ్యాంకులను జాతీయం చేశారు. ఆ విధంగా రెండు దశాబ్దాల పాటు 20 జాతీయ బ్యాంకులు ఉండేవి. తర్వాత కొన్ని చిన్న బ్యాంకులను లాభదాయకత సరిగా లేని కారణంగా పెద్ద బ్యాంకుల్లో విలీనం చేశారు. ఈ గ్రూపులోకి ఆంధ్రా బ్యాంక్, కెనరా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేనా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, విజయా బ్యాంక్ వంటివి వస్తాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) భారత దేశంలో అత్యధిక శాఖలు కలిగి అనేక విషయాల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. దీనికి ఏడు అనుబంధ బ్యాంకులుండేవి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్‌లను ఎస్‌బీఐలో విలీనం చేయడం వల్ల ఇప్పుడు అయిదు అనుబంధ బ్యాంకులు మాత్రమే ఉన్నాయి. అవి: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా.
హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఇండ్‌స్‌ఇండ్, కర్ణాటక, లక్ష్మీవిలాస్, యునెటైడ్ వెస్టర్న్ బ్యాంక్, యూటీఐ వంటివి ప్రైవేటు రంగ బ్యాంకులు.
ఏబీఎన్ ఆమ్రో, అబూదబి కమర్షియల్, బ్యాంక్ ఆఫ్ సిలన్, సిటీ బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీ, స్టాండర్డ్ ఛార్టర్‌డ వంటివి విదేశీ బ్యాంకులు.
నియామక ప్రక్రియ:
అన్ని రకాల బ్యాంకుల్లోనూ ప్యూన్ స్థాయి ఉద్యోగాల్లో స్థానికులకు మాత్రమే అవకాశం లభిస్తుంది. సాధారణంగా ఉపాధి కల్పన కార్యాలయాల ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ జరుగుతుంది.
క్లరికల్, ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకు అభ్యర్థులు డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. కొన్ని బ్యాంకులు డిగ్రీలో నిర్దేశిత మార్కులు సాధించాలని నిబంధనలు విధిస్తున్నాయి. ఈ ఉద్యోగాల భర్తీ సాధారణంగా రాత పరీక్షల ద్వారా జరుగుతుంది. ఐబీపీఎస్ ఉమ్మడి రాత పరీక్ష ద్వారా ప్రభుత్వ రంగ, కొన్ని ప్రైవేటు రంగ బ్యాంకులకు ఉద్యోగ నియామకాల ప్రక్రియను నిర్వహిస్తోంది. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), దాని అనుబంధ బ్యాంకుల్లో భర్తీకి ఎస్‌బీఐ ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తోంది.
విదేశీ బ్యాంకులు మాత్రం పేరొందిన విద్యా సంస్థల (ఐఐఎంలు వంటివి)లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లు నిర్వహించి ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అనుభవం ఉన్న వారికి అధిక వేతనాలు ఇవ్వడం ద్వారా ఆకర్షిస్తున్నాయి.
రాత పరీక్ష నుంచి శిక్షణ వరకు:
బ్యాంకు ఉద్యోగాలకు నిర్వహించే రాత పరీక్ష (Written Examination) కోసం అభ్యర్థులు జనరల్ ఇంగ్లిష్, మ్యా థమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్, మార్కె టింగ్, కంప్యూటర్ అవేర్‌నెస్‌లకు సంబంధించిన అంశాలను నేర్చుకోవాలి. వీటిని క్షుణ్నంగా నేర్చుకోవడం ద్వారా అన్ని బ్యాంకుల పరీక్షలకూ సిద్ధం కావచ్చు. క్లరికల్ పరీక్షలతో పోలిస్తే ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల భర్తీ పరీక్షల స్థాయి కొంచెం ఎక్కువగా ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఉంటుంది. కొన్ని బ్యాంకులు బృంద చర్చ (జీడీ) కూడా నిర్వహిస్తాయి.
ఉద్యోగంలో చేరిన అభ్యర్థులను కొంత కాలం శిక్షణ కాలంలో ఉంచుతారు. ప్రత్యేక శిక్షణ కళాశాలల్లోనూ, బ్యాంకుల శాఖల్లోనూ శిక్షణ ఉంటుంది. ఎస్‌బీఐలో అయితే అభ్యర్థులకు శిక్షణ ఇచ్చిన తర్వాత పరీక్షలు కూడా నిర్వహిస్తారు.
క్లరికల్ ఉద్యోగులు ఫ్రంట్ ఆఫీస్ విధులు నిర్వహిస్తారు. ఆఫీసర్ స్థాయి ఉద్యోగులు క్లరికల్ ఉద్యోగుల పనిని పర్యవేక్షిస్తారు. బ్యాంకుల్లో ప్రతి పనీ డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ ద్వారా జరుగుతుంది. అదే విధంగా మేకర్- చెకర్ విధానాన్ని పాటిస్తారు. క్లరికల్ స్థాయి ఉద్యోగులు మేకర్ పని, ఆఫీసర్‌స్థాయి ఉద్యోగులు చెకర్ పని చేస్తారు.
జీతాలకు ప్రామాణికం:
ప్రభుత్వ రంగ, ప్రైవేటు రంగ బ్యాంక్ ఉద్యోగులందరికీ ఒకే విధమైన జీతాలుంటాయి. బ్యాంకింగ్ రంగంలో ద్వైపాక్షిక ఒప్పందం ద్వారా జీతాలను నిర్ధరిస్తారు. ప్రస్తుతం అమల్లో ఉన్న వేతన ఒప్పందం కాల పరిమితి 2012 అక్టోబర్‌లో ముగిసింది. తర్వాతి ఒప్పందం 2012 నవంబర్ నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. చర్చలు ముగిస్తే ఇది కొలిక్కి వస్తుంది. ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలో చేరే అభ్యర్థులు అందరికీ కొత్త వేతన ఒప్పందం వర్తిస్తుంది. ఒప్పందానికి సంబంధించిన చర్చలు పూర్తయితే ఎరియర్స్ వస్తాయి.
ప్యూన్ (Peon) స్థాయిలో చేరిన అభ్యర్థులు డిగ్రీ పూర్తిచేసి, అంతర్గత పోటీ పరీక్షలు రాయడం ద్వారా క్లర్కులుగా పదోన్నతి పొందొచ్చు. క్లర్కులుగా చేరిన వారు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ నిర్వహించే జేఏఐఐబీ, సీఏఐఐబీ పరీక్షలు పూర్తిచేసి ఇతర పదోన్నతుల పరీక్షలు రాయడం ద్వారా ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు పొందొచ్చు.
తొలుత బ్యాంకుల్లో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల్లో చేరిన వారు పదోన్నతుల ద్వారా జూనియర్ మేనేజ్‌మెంట్ స్థాయి నుంచి మిడిల్ మేనేజ్‌మెంట్, ఆపైన సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయికి చేరొచ్చు. దీని తర్వాత టాప్ ఎగ్జిక్యూటివ్ కేడర్‌లకు సంబంధించిన ఉద్యోగాలను కైవసం చేసుకోవచ్చు. ఒకటో స్కేల్ నుంచి ఏడో స్కేల్ వరకు పదోన్నతులు ఉంటాయి.
కొన్ని సందర్భాల్లో డెరైక్ట్ రిక్రూట్‌మెంట్:
జూనియర్ స్థాయి నుంచి ప్రారంభించి కెరీర్‌లో ఎదిగేందుకు అనేక సంవత్సరాలు పడుతుంది. కొన్ని సందర్భాల్లో అత్యవసరంగా అనుభవం ఉన్న ఉద్యోగులు అవసరమైతే ఆయా బ్యాంక్‌లు ఉన్నతస్థాయిలో డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో ఉద్యోగులను భర్తీ చేసుకుంటాయి. ఇటీవల బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి చిదంబరం ప్రతిపాదించిన మహిళా బ్యాంక్‌కు అన్ని స్థాయిల్లోనూ ఉద్యోగులు అవసరమవడంతో తాత్కాలిక ప్రాతిపదికన కొందరు ఉద్యోగులను డిప్యుటేషన్‌పై పంపాలని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను కోరారు. కొత్తగా ప్రారంభించబోయే ప్రైవేటు రంగ బ్యాంకులు ఇలా డిప్యుటేషన్ అడగలేవు కనుక అన్ని స్థాయిల్లోనూ ఉద్యోగులను భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది.
2001లో అనేక మంది బ్యాంక్ ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ చేసి కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో చేరారు. అదే విధంగా 2014లో రాబోయే ప్రైవేటు బ్యాంకుల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీకి ఇతర బ్యాంక్ ఉద్యోగులపైనే ఆధారపడాల్సి ఉంటుంది. త్వరగా ఉన్నత అవకాశాలను పొందాలనుకునే వారికి ఇలా కొత్తగా స్థాపించే బ్యాంకులు ఔత్సాహికులకు అనుభవానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి. ఈ విధంగా ఉన్నత స్థానాలు పొందాలనుకునేవారు కొన్ని రంగాలను ఎంపిక చేసుకొని వాటిలో ప్రావీణ్యత సంపాదించాలి. అడ్వాన్స్‌లు (ఇన్ బ్యాంకింగ్), ఫారిన్ ఎక్స్‌ఛేంజ్, కంప్యూటర్ ఆధారిత సేవలు నిత్యం అవసరమైనవి. సాధారణ నైపుణ్యాలతో పాటు వీటిలో ప్రావీణ్యం ఉన్న వారికోసం అన్ని బ్యాంకులు నిరీక్షిస్తుంటాయి. ఆయా రంగాల్లో పనిచేయడంతో పాటు ఐఐబీఎఫ్ నిర్వహించే పరీక్షలు పూర్తిచేయడం ద్వారా థియరిటికల్ పరిజ్ఞానం ఉందని కూడా నిరూపించుకోవచ్చు. వ్యవహార పరిజ్ఞానం చివరి విజయాన్ని అందిస్తుంది.
రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో బ్యాంకింగ్ రంగం లో సుస్థిర స్థానం సంపాదించాలనుకునే అభ్యర్థులకు అన్ని స్థాయిల్లోనూ అద్భుతమైన అవకాశాలు అందుబాటులో ఉంటాయి. వాటిని అందుకునేందుకు అవసరమైన నైపుణ్యాలను సంపాదించి విజేతలుగా నిలవాలి..
కొలువుల జాతరకు కారణాలు:
దేశంలోని బ్యాంకులు అధిక సంఖ్యలో శాఖలను విస్తరిస్తుండటం.
భారీగా పదవీ విరమణలు.
వివిధ వ్యాపార సంస్థలు బ్యాంకుల ఏర్పాటుకు ప్రయత్నిస్తుండటం.
వివిధ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ).. పూర్తిస్థాయి బ్యాంకులుగా మారేందుకు ఆసక్తికనబరుస్తుండటం.
బ్యాంకులు అందించే సేవల విస్తరణ.
ప్రాక్టీస్ కీలకం..
రోజుకు ఎన్ని గంటలు చదివామనే దానికన్నా ఎంతగా విశ్లేషిస్తూ చదివామన్న దానిపైనే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. బ్యాంకు ఉద్యోగాల పరీక్షల్లో విజయం సాధించాలంటే వీలైనన్ని ప్రీవియస్ పేపర్లు, మోడల్ పేపర్లు సాధన చేయాలి. దినపత్రికల్లోని బిజినెస్ పేజీలను చదవడం ద్వారా బ్యాంకింగ్ రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను తెలుసుకోవచ్చు. అభ్యర్థులకు బ్యాంకింగ్ సర్వీసెస్ క్రానికల్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ ఉపయోగకరంగా ఉంటాయి.
- బి.శ్రీకాంత్, ఐవోబీ.
(2012 ఐబీపీఎస్ పీఓ విజేత)
// బెస్ట్ ఆఫ్ లక్... //
---------------------------------------------------
కిరణ్‌కుమార్ అడుసుమిల్లి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్

Published date : 20 Sep 2013 02:16PM