Skip to main content

సమాజానికే కాదు.. కెరీర్‌కూ కొండంత అండగా...!

జాతి ఏదైనా.. సంస్కృతి మరేదైనా.. ప్రజల్ని పట్టిపీడించే సమస్యలు చాలానే! ఆ సమస్యల సుడిగుండం నుంచి గట్టెక్కడమెలాగో తెలియని వారు కోకొల్లలు.. ఇలాంటి నేపథ్యం ఉన్నవారు ్ల జన భారతంలో మరింత ఎక్కువ. ఇలాంటి వారికి ఆపన్నహస్తం అందించేందుకు అవకాశం కల్పించే కోర్సు.. సోషియాలజీ. సంప్రదాయ కోర్సుల్లో క్రేజీ కోర్సుగా నిలుస్తున్న ‘సోషియాలజీ’పై ఫోకస్..

ఒక మనిషి వ్యవహారశైలిని సమాజానికి అనుగుణంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నైపుణ్యాలను అందించే కోర్సు..
సోషియాలజీ!

సోషియాలజీ.. సోషల్ వర్క్‌తో సమానంగా అవకాశాలు కల్పిస్తోంది. గత అయిదారేళ్ల కాలంలో స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు సామాజిక కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో నిపుణుల అవసరం పెరగడంతో యువత సోషియాలజీ వైపు అడుగులు వేస్తోంది..
-విద్యావేత్తలు, పరిశ్రమ వర్గాలు

సోషియాలజీ- అకడెమిక్ కోర్సులు:
  • మన రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లోనూ బీఏలో సోషియాలజీ ఒక సబ్జెక్ట్‌గా అందుబాటులో ఉంది.
  • వివిధ విద్యా సంస్థలు సోషియాలజీలో ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.
  • జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ వంటి ఉన్నత సంస్థలు, సెంట్రల్ యూనివర్సిటీలు పీజీ స్థాయిలో సోషియాలజీని అందిస్తున్నాయి.
ఉన్నత కెరీర్‌కు రాచ మార్గం:
సోషియాలజీలో పీహెచ్‌డీ, పోస్ట్ డాక్టోరల్ స్టడీస్ అవకాశాలున్నాయి. ఉమెన్ డవలప్‌మెంట్, రూరల్ డవలప్‌మెంట్, ట్రైబల్ డవలప్‌మెంట్ వంటి స్పెషలైజేషన్లలో రీసెర్చ్ చేయడం ద్వారా అద్భుత అవకాశాలను అందుకోవచ్చు. ప్రధానంగా అమెరికా, ఐరోపా దేశాల్లోని ఎన్నో పరిశోధన సంస్థలు పీహెచ్‌డీ కోర్సులను అందిస్తున్నాయి. పీహెచ్‌డీ పూర్తిచేసి అకడమిక్‌తో పాటు వివిధ రంగాల్లో డేటా అనలిస్ట్, సర్వే రీసెర్చర్, ప్రాజెక్టు మేనేజర్ వంటి ఉన్నత ఉద్యోగావకాశాలను చేజిక్కించుకోవచ్చు.

ఐఐటీల్లోనూ..
ఐఐటీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లు.. సాధారణంగా ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులకు కేరాఫ్‌గా నిలిచే సంస్థలు. కానీ, ఇవి ఇప్పుడు సామాజిక బాధ్యతలో భాగంగా సోషల్ సెన్సైస్ కోర్సులను కూడా అందిస్తున్నాయి. సోషియాలజీని కోర్ సబ్జెక్ట్‌గా లేదా ఇంటర్ డిసిప్లినరీ కోర్సుగా పలు స్థాయిల్లో (ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ) అందిస్తున్నాయి. అవి..
  • ఐఐటీ-కాన్పూర్; కోర్సులు: పీజీ, పీహెచ్‌డీ.
  • ఐఐటీ-ఢిల్లీ; కోర్సులు: పీజీ, పీహెచ్‌డీ.
  • ఐఐటీ- ఖరగ్‌పూర్; కోర్సులు: పీజీ, పీహెచ్‌డీ.
  • ఐఐటీ-గువహటి; కోర్సులు: పీజీ, పీహెచ్‌డీ.
  • ఐఐటీ-బాంబే; కోర్సులు: పీజీ, పీహెచ్‌డీ.
జాతీయ స్థాయిలో కోర్సులను అందించే సంస్థలు:
  • జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, న్యూఢిల్లీ
  • ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ)
  • యూనివర్సిటీ ఆఫ్ పుణె (ఎంఏ)
  • యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ)
  • పుదుచ్చేరి యూనివర్సిటీ (ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ)
ఇగ్నో సహా మరెన్నో యూనివర్సిటీలు దూర విద్యా విధానంలో సోషియాలజీలో బ్యాచిలర్ నుంచి పీహెచ్‌డీ వరకు పలు కోర్సులను అందిస్తున్నాయి.

అవకాశాలు అపారం:
Bavitha
ఒకప్పుడు సంప్రదాయ కోర్సుగా నిలిచిన సోషియాలజీ ఇప్పుడు కార్పొరేట్ రూపును సంతరించుకుంటోంది. ఈ నేపథ్యంలో అవకాశాల పరంగా ఆందోళన అవసరం లేదన్నది నిపుణుల భరోసా!
  • సోషియాలజీ కోర్సు పూర్తి చేసిన వారికి ఉపాధి కల్పిస్తున్న ప్రధాన వేదికలు..
  • అకడమిక్ అండ్ రీసెర్చ్ సంస్థల్లో అధ్యాపకులుగా అవకాశాలు.
  • స్వచ్ఛంద సంస్థల్లో అడుగు పెట్టడం.
  • కార్పొరేట్ సంస్థల కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగాలు.
  • ప్రభుత్వ పథకాల్లో అవకాశాలు.
  • చిన్న పరిశ్రమల్లో మానవ వనరుల విభాగాలు.
వీటిలో ప్రధానమైనవి.. స్వచ్ఛంద సంస్థలు. ప్రభుత్వాలు సామాజిక అభివృద్ధి కోణంలో విద్య, ఆహార భద్రత, ఆరోగ్యం వంటి విషయాల్లో వివిధ పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు సక్రమంగా అంది, సత్ఫలితాలు వచ్చేలా చేసే సుశిక్షితులైన నిపుణుల అవసరం ఉంది. ఈ క్రమంలో సోషియాలజీ చేసిన వారికి అవకాశాలు లభిస్తున్నాయి.
  • 12వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాల్లో జండర్ ఈక్వాలిటీ, మహిళా సాధికారత, యూనివర్సల్ హెల్త్ వంటి అంశాలను చేర్చిన నేపథ్యంలో ఇవి సోషియాలజీ ఉత్తీర్ణులకు అవకాశాలు కల్పిస్తాయనడంలో సందేహం లేదు.
స్వయం ఉపాధికి ఊతం:
సోషియాలజీ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు స్వయం ఉపాధి దిశగా ఆలోచించవచ్చు. ఫ్యామిలీ కౌన్సిలర్లుగా, కమ్యూనిటీ కౌన్సిలర్లుగా మారొచ్చు. ఇలా గంటకు రూ. వేయి నుంచి రూ.5 వేల వరకు ఫీజు పొందుతున్న వారూ ఉన్నారు.
  • సోషియాలజీ కోర్సు పూర్తిచేసిన వారికి ప్రారంభంలో నెలకు కనీసం రూ.15 వేల వేతనం ఖాయం. కార్పొరేట్ సంస్థల్లో కనీసం రెండు లక్షల వార్షిక వేతనం ఉంటుంది.
సివిల్ సర్వీస్‌లో అనుకూల ఆప్షనల్
Bavitha
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్.. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి అత్యున్నత కేంద్ర సర్వీసుల్లో చేరేందుకు వీలుకల్పించే పరీక్ష. సివిల్స్ మెయిన్స్ కోసం సోషియాలజీని ఆప్షనల్‌గా ఎంచుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయన్నది నిపుణుల మాట. సిలబస్ పరిధి కాసింత తక్కువగా ఉండటం, సిలబస్‌లోని అంశాలన్నీ సమాజంతో ముడిపడి ఉండటం, సులభంగా అర్థమయ్యేలా ఉండటమే దీనికి కారణమంటున్నారు.

అవసరమైన నైపుణ్యాలు:
Bavitha
  • విభిన్న సంస్కృతుల ప్రజలతో మమేకం కాగల నేర్పు.
  • ఎదుటి వారి సమస్యలను వినే ఓర్పు.
  • వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించగలగడం.
నిరంతర అవగాహన అవసరం
Bavitha
సోషియాలజీ ఉత్తీర్ణులకు ఇప్పుడు కెరీర్ అవకాశాలు అద్భుతమని చెప్పొచ్చు. ఒకసారి కెరీర్ ప్రస్థానం ప్రారంభించాక నిరంతరం సమాజంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు; విభిన్న జాతులు, సంస్కృతుల్లో మార్పులు, సమస్యలపై అవగాహన పెంపొందించుకోవాలి. సామాజిక సమస్యలకు పరిష్కారాలను కనుగొనే విధంగా అధ్యయనం సాగించాలి. దీన్ని దృష్టిలో ఉంచుకొని కరిక్యులంలో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తున్నాం. సోషియాలజీ కెరీర్‌లో అడుగుపెట్టిన వారిలో తాము ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నామన్న నిబద్ధత ఉంటే ఈ రంగంలో సుస్థిర భవిష్యత్తు సొంతమవుతుంది.

సోషియాలజీ ఉపాధికి వేదిక
Bavitha
సోషియాలజీ, సోషల్ వర్క్.. ఈ రెండూ సోషల్ సెన్సైస్ విభాగాలే. అయితే సోషియాలజీ సమాజ సంబంధిత అంశాలు, సమస్యలపై అవగాహన కల్పిస్తే.. సోషల్ వర్క్‌లో క్షేత్రస్థాయి అధ్యయనానికి ప్రాధాన్యం ఉంటుంది. ఒక విధంగా ఈ రెండు కోర్సుల ఉద్దేశం ఒకటే. కాబట్టి సోషియాలజీ అభ్యర్థులు ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్‌తో సోషల్ వర్క్‌పై కూడా అవగాహన పెంచుకుంటే మరిన్ని అవకాశాలు సొంతమవుతాయి. ప్రస్తుత అవసరాల రీత్యా ఈ రంగాల్లో నిష్ణాతులైన అభ్యర్థుల అవసరం వేలల్లో ఉంటుంది. కానీ, అందుకు తగిన స్థాయిలో విద్యార్థులు అందుబాటులో లేరు. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు సోషియాలజీ, సోషల్ వర్క్ విభాగాలను కూడా చక్కటి ఉపాధి వేదికలుగా మార్చుకునేందుకు ఇదే సరైన సమయం.
Published date : 06 Dec 2013 10:52AM

Photo Stories