‘ఫొటోగ్రఫీ’ కెరీర్... యువతకు చక్కటి ఉపాధి వేదిక
Sakshi Education
వర్తమాన విశేషాలను భవిష్యత్తుకు అందించే సాధనం.. కెమెరా. నడిచే చరిత్రను దృశ్యరూపంలో నిక్షిప్తం చేసే మాధ్యమం..
ఫొటోగ్రఫీ. జ్ఞాపకాల దొంతర్లను చిరస్థాయిగా నిలిపే ఛాయాచిత్రం.. జీవిత కాలానికి సరిపడా స్మృతులను మన లైబ్రరీలో చేరుస్తుంది. పండగలు, వేడుకలు, ఆనందాలు, విజయాలు, విషాదాలు, పరిణామక్రమం, దేశాల మధ్య ఒప్పందాలు, యుద్ధాలు, ప్రకృతి సోయగాలు, జంతుజాలం, పశుపక్ష్యాదులు.. ఇలా ఎన్నో అపురూపమైన, విశిష్ట సంఘటనలను యాదికి తెచ్చే కెమెరా పనితనం ఫొటోగ్రఫీ. వర్తమానానికి భవిష్యత్తులో ‘సాక్షి’గా నిలుస్తున్న ఫొటోగ్రఫీ యువతకు చక్కటి ఉపాధి వేదికగా మారుతోంది. సంప్రదాయ వివాహాలు, ఈవెంట్ దశలు దాటి.. ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్‌ల ట్రెండ్ కొనసాగుతున్న తరుణంలో అవకాశాలకు భరోసాగా నిలుస్తున్న ‘‘ఫొటోగ్రఫీ’’ కెరీర్‌పై ఫోకస్...
సందర్భం ఏదైనా ఒక ఫొటో వెయి్య పదాల కంటే బలమైన భావాన్ని వ్యక్తంచేస్తుంది. ఒకప్పుడు ఫొటోగ్రఫీ వివాహ వేడుకలు, ఈవెంట్స్‌కు మాత్రమే పరిమితమయ్యేది. కానీ, ఇప్పుడు పరిధి పెరిగింది. నేటి డిజిటల్ యుగంలో ఫొటోగ్రాఫర్లకు అవకాశాలకు కొదవలేదు. యువత హాబీగా ఫొటోగ్రఫీ నైపుణ్యాలు నేర్చుకొని.. ఆఫ్‌బీట్ కెరీర్‌గా మలచుకుంటోంది. ఈ-కామర్స్, ఫ్యాషన్, అడ్వర్‌టైజింగ్, మాస్ మీడియా, స్పోర్‌ట్స, వైల్డ్‌లైఫ్, జర్నలిజం, ట్రావెల్, టూరిజం వంటి అనేక రంగాలో సృజనాత్మకత కలిగిన ఫొటోగ్రాఫర్లకు డిమాండ్ పెరుగుతోంది.
విద్యార్హతలు-వేతనాలు :
ఫొటోగ్రాఫర్లుగా రాణించేందుకు ప్రత్యేకమైన విద్యార్హతలు అవసరం లేదు. కానీ, సృజనాత్మకత ముఖ్యం. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హతతో డిప్లొమా, షార్ట్‌టర్మ్ సర్టిఫికెట్ కోర్సులకు నమోదు చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ ఆఫ్ ఫైన్ ఆర్‌ట్సలో ఫొటోగ్రఫీ ఆప్షన్ సబ్జెక్టులుగా ఉన్నాయి. ఇవి పూర్తిచేస్తే పీజీ స్థాయి కోర్సుల్లోనూ చేరొచ్చు. ఫొటోగ్రఫీకి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో ప్రైవేటు విద్యాసంస్థలు, ఇన్‌స్టిట్యూట్లు ఫొటోగ్రఫీ కోర్సులను అందిస్తున్నాయి. పదోతరగతి అర్హతతోనూ షార్ట్‌టర్మ్ కోర్సుల్లో చేరే వీలుంది.
ఈ నైపుణ్యాలుంటే...
ఫొటోగ్రాఫర్‌గా రాణించాలనుకునే వారికి స్వతహాగా సృజనాత్మకత, ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ల పరిజ్ఞానం అవసరం. దాంతోపాటు కెమెరా పనితీరులో ముఖ్యమైన లైటింగ్, షేప్స్ ప్యాట్రన్‌స, కంటిచూపు, ఫొటోగ్రాఫిక్ దృష్టి లాంటి నైపుణ్యాలు ఉండాలి. ఫొటోలను అందంగా చూపడంలో కీలక పాత్ర పోషించే బ్యాక్‌గ్రౌండ్ కలర్స్, లైటింగ్, అపెక్చర్ వంటి అంశాల్లో చక్కని అవగాహన అవసరం. సాంకేతికంగా ఈ రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.
అవకాశాలు..
వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ, ఫ్యాషన్ ఫొటోగ్రఫీ, ల్యాండ్‌స్కేప్ ఫొటోగ్రఫీ, ఏరియల్ ఫొటోగ్రఫీ, యాక్షన్/స్పోర్‌ట్స ఫొటోగ్రఫీ, ఆర్కిటెక్చరల్ ఫొటోగ్రఫీ, వెడ్డింగ్ ఫొటోగ్రఫీ, మాక్రో ఫొటోగ్రఫీ, ఫ్యామిలీ ఫొటోగ్రఫీ, పెట్ ఫొటోగ్రఫీ, ఈవెంట్ ఫొటోగ్రఫీ, ఆస్ట్రో ఫొటోగ్రఫీ, ఫొటో జర్నలిజం, ప్రొడక్ట్ ఫొటోగ్రఫీ, స్టాక్ ఫొటోగ్రఫీ... వంటి విభిన్న రకాలు ఫొటోగ్రఫీ కెరీర్‌లు ఎంచుకోవచ్చు.
వేతనం :
ఫొటోగ్రాఫర్ల వేతనం వివిధ రంగాల్లో వేర్వేరుగా ఉంటుంది. ప్రారంభంలో రూ.2 లక్షలు నుంచి రూ.3.5 లక్షల వార్షిక వేతనం అందుకోవచ్చు. అనుభవం, నైపుణ్యంతో వేతనాల్లో పెంపు ఉంటుంది. సొంతంగా ఆర్జించే అవకాశముంది.
ఫొటోగ్రఫీ కోర్సులు - అందిస్తున్న సంస్థలు :
1. జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్‌ఆర్‌ట్స యూనివర్సిటీ, హైదరాబాద్.
2. సత్యజిత్‌రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ - కోల్‌కతా.
3. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్)-న్యూఢిల్లీ.
4. సెయింట్ జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్-ముంబై.
5. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫొటోగ్రఫీ, ముంబై.
6. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్.
7. ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఫొటోగ్రఫీ.
8. సర్ జేజే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్, ముంబై.
9. జామియా మిలీయా ఇస్లామియా, సెంట్రల్ యూనివర్సిటీ, న్యూఢిల్లీ.
10. ఫిలిం, టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పుణె.
11. సింబయాసిస్ స్కూల్ ఆఫ్ ఫొటోగ్రఫీ, పుణె.
12. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ ఆర్‌ట్స అండ్ యానిమేషన్, కోల్‌కతా.

- ఫొటోగ్రఫీ కోర్సుచేసిన వారికి అవకాశాలకు కొదవలేదు. సృజనాత్మకత, నైపుణ్యాల ఆధారంగా వేగంగా వృత్తిలో ఎదిగే వీలుంది. ఫొటో జర్నలిస్ట్‌లకు వివిధ పత్రికలు, టీవీ ఛానెళ్లల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి.
- ఎంచుకున్న స్పెషలైజేషన్‌సను బట్టి ఎలక్ట్రానిక్ మీడియా, సినిమా నిర్మాణ సంస్థలు, టీవీ ప్రొడక్షన్ హౌజెస్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు, కార్పొరేట్ సంస్థలు, సైంటిఫిక్ జర్నల్స్, ఫ్యాషన్ హౌస్‌లు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల్లో అవకాశాలు అందుకోవచ్చు.
- ప్రధానంగా వన్యమృగాల(వైల్డ్‌లైఫ్) ఫొటోగ్రఫీకి ఎక్కువ ఆదరణ ఉంది. ప్రకృతి ఒడిలో జంతు, పక్షిజాలాన్ని అందంగా.. వివిధ కోణాల్లో ఎవరూ తీయని విధంగా ప్రత్యేకంగా క్లిక్‌మనిపిస్తే ఎంతో గుర్తింపు లభిస్తుంది. అరుదైన పక్షులు, జంతువుల ఫొటోలు తీయగలిగితే ఎనలేని పేరు సంపాదించుకోవచ్చు. ఇందుకోసం కొండంత సహనం అవసరం.
- జాతీయంగా, అంతర్జాతీయంగా ఉన్న పార్కులు, కీకారణ్యాలు, అభయారణ్యాల్లో అద్భుతమైన ఫొటోలు తీసి జర్నల్స్‌లో ప్రచురించటం, ఎగ్జిబిషన్‌సలో ప్రదర్శించడం ద్వారా పేరుతోపాటు డబ్బు గడిస్తారు.
- సాహసోపేతమైన జీవితం గడపాలనుకునే వారికి వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ సరిగ్గా నప్పుతుంది. వీరు నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెల్, డిస్కవరీ ఛానెల్, యానిమల్ ప్లానెట్ వంటి అంతర్జాతీయ మీడియా హౌస్‌లలో సైతం పనిచేసే సౌలభ్యం ఉంటుంది.
- ఫొటోగ్రాఫర్స్‌గా ఉద్యోగంలో కంటే సొంతంగా రాణించే వారి సంఖ్యే ఎక్కువ. వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్లుగా మంచి పేరు సంపాదించుకుంటే.. సొంతంగా స్టూడియో నిర్వహించుకుంటూ ఆర్జించొచ్చు.
- ఇటీవల కాలంలో డిజిటల్ మీడియా వినియోగం బాగా పెరిగిపోవడంతో ప్రొడక్ట్ ఫొటోగ్రఫీకి డిమాండ్ కనిపిస్తోంది. దుస్తులు, షూస్, బ్యాగులు, కార్లు, వాహనాలు, అలంకరణ వస్తువులు.. తదితర ఈ-కామర్స్ వెబ్‌సైట్స్‌లో ఉత్పత్తుల ఫొటోలు తీయడానికి ప్రొడక్ట్ ఫొటోగ్రాఫర్ల అవసరం ఎక్కువగా ఏర్పడింది.
- ఫ్యాషన్ ఫొటోగ్రఫీలో భాగంగా మోడల్స్ సంఖ్యకు అనుగుణంగా ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్లకూ డిమాండ్ పెరుగుతోంది. వీరికి ఆకర్షణీయమైన వేతనాలు ఇస్తున్నారు. ఆదర్శ్ ఆనంద్, అకాశ్ దాస్, అమిత్ మెహ్రా, ఆనంద్ శరణ్ మొదలైన ఎంతో మంది ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్స్‌గా పేరొందారు.
- సోషల్ మీడియాలో సెలబ్రిటీల హడావుడి పెరుగుతున్న నేపథ్యంలో నిపుణులైన ఫొటోగ్రాఫర్ల అవసరం నెలకొంది. అలానే, ఫ్యాషన్ మ్యాగజైన్‌స, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్లను నియమించుకుంటున్నాయి.
- ముఖ్యంగా ఫ్రీలాన్సింగ్ ప్రముఖ కెరీర్ ఆప్షన్లల్లో ఒకటి. బిజినెస్ మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు ఉన్నవారు ఫ్రీలాన్సింగ్‌లో స్థిరపడొచ్చు. ప్రముఖ వెబ్‌సైట్లకు ఫొటోలు తీసి పంపించడం ద్వారా రాయల్టీ ఆదాయం పొందవచ్చు.
వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ, ఫ్యాషన్ ఫొటోగ్రఫీ, ల్యాండ్‌స్కేప్ ఫొటోగ్రఫీ, ఏరియల్ ఫొటోగ్రఫీ, యాక్షన్/స్పోర్‌ట్స ఫొటోగ్రఫీ, ఆర్కిటెక్చరల్ ఫొటోగ్రఫీ, వెడ్డింగ్ ఫొటోగ్రఫీ, మాక్రో ఫొటోగ్రఫీ, ఫ్యామిలీ ఫొటోగ్రఫీ, పెట్ ఫొటోగ్రఫీ, ఈవెంట్ ఫొటోగ్రఫీ, ఆస్ట్రో ఫొటోగ్రఫీ, ఫొటో జర్నలిజం, ప్రొడక్ట్ ఫొటోగ్రఫీ, స్టాక్ ఫొటోగ్రఫీ... వంటి విభిన్న రకాలు ఫొటోగ్రఫీ కెరీర్‌లు ఎంచుకోవచ్చు.
వేతనం :
ఫొటోగ్రాఫర్ల వేతనం వివిధ రంగాల్లో వేర్వేరుగా ఉంటుంది. ప్రారంభంలో రూ.2 లక్షలు నుంచి రూ.3.5 లక్షల వార్షిక వేతనం అందుకోవచ్చు. అనుభవం, నైపుణ్యంతో వేతనాల్లో పెంపు ఉంటుంది. సొంతంగా ఆర్జించే అవకాశముంది.
ఫొటోగ్రఫీ కోర్సులు - అందిస్తున్న సంస్థలు :
1. జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్‌ఆర్‌ట్స యూనివర్సిటీ, హైదరాబాద్.
2. సత్యజిత్‌రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ - కోల్‌కతా.
3. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్)-న్యూఢిల్లీ.
4. సెయింట్ జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్-ముంబై.
5. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫొటోగ్రఫీ, ముంబై.
6. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్.
7. ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఫొటోగ్రఫీ.
8. సర్ జేజే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్, ముంబై.
9. జామియా మిలీయా ఇస్లామియా, సెంట్రల్ యూనివర్సిటీ, న్యూఢిల్లీ.
10. ఫిలిం, టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పుణె.
11. సింబయాసిస్ స్కూల్ ఆఫ్ ఫొటోగ్రఫీ, పుణె.
12. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ ఆర్‌ట్స అండ్ యానిమేషన్, కోల్‌కతా.
Published date : 20 Aug 2019 02:55PM