Skip to main content

ఫైన్‌ ఆర్ట్స్‌


ఇతర రంగాలకు భిన్నంగా..కళాత్మాక రంగంలో కెరీర్‌ను ప్రారంభించాలనుకునే వారికి చక్కని వేదికగా నిలుస్తున్నాయి..ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సులు. తమ స జనాత్మకత శక్తి, ఊహకల్పనతో గుర్తింపు పొందడానికి సరైన అవకాశాలు కల్పిస్తున్నాయి ఈ కోర్సులు. పెయిం టింగ్‌, ఫోటోగ్రఫీ, అప్లయిడ్‌ ఆర్ట్స్‌,స్కల్‌ప్చ్‌ర్‌, మ్యూజిక్‌, నాట్యం, యానిమేషన్‌ తదితర కోర్సులు ఫైన్‌ ఆర్ట్స్‌ పరిధిలోకి వస్తాయి. చదువుకుంటూనే సంపాదించుకునే అవకాశంతోపాటు..స జనాత్మకతతో కూడిన కెరీర్‌లో స్థిర పడడానికి దోహదం చేస్తున్నాయి ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సులు.

ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ వంటి ప్రొఫెషనల్‌ కోర్సులకు విభిన్నమైనవి..ఫైన్‌ ఆర్ట్‌ కోర్సులు. స జనాత్మకత, నైపుణ్యం, ఊహశక్తి, భిన్నంగా ఆలోచించడం వంటివి ఈ కోర్సులో రాణించడానికి సాధనాలు. అందమైన భావానికి దశ్య రూపం ఇవ్వడం, మాటకందని భావాలను ఫోటోరూపంలో బంధించడం వంటి క్రియేటీవిటీ వర్క్‌కు అధిక ప్రాధాన్యమిచ్చే ఈ కోర్సులకు ప్రస్తుతం చాలా డిమాండ్‌ ఉంది. ముఖ్యంగా పెయింటింగ్‌, స్కల్‌ప్చ్‌ర్‌, అప్లయిడ్‌ ఆర్ట్స్‌, ఫోటోగ్రఫీ వంటి కళాత్మాక విభాగాలను నేడు చాలా మంది తమ కెరీర్‌ ఆప్షన్స్‌గా ఎంచుకుంటున్నారు.

ప్రవేశం:
మన రాష్ట్రంలో జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ(జేఎన్‌ఏఎఫ్‌యూ), ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, పద్మావతి మహిళ విశ్వవిద్యాలయం..ఫైన్‌ ఆర్ట్స్‌ విభాగంలో డిప్లొమా నుంచి మాస్టర్‌ స్థాయి వరకు కోర్సులను ఆఫర్‌ చేస్తున్నాయి. యూనివర్సిటీలను బట్టి అర్హత, ఎంపిక విధానం, కోర్సు వ్యవధి సంబంధిత అంశాలు మారుతు ఉంటాయి. వివరాలు..

జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ(జేఎన్‌ఏఎఫ్‌యూ)-హైదరాబాద్‌.
ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సులకు ప్రామాణికంగా నిలిచే దేశంలోనే కొన్ని వర్సిటీల్లో జేఎన్‌ఏఎఫ్‌యూ ఒకటి. ఈ యూనివర్సిటీ ఫైన్‌ ఆర్ట్స్‌ విభాగంలో బ్యాచిలర్‌, మాస్టర్‌ కోర్సులతోపాటు బ్రిడ్జ్‌ కోర్సులను కూడా ఆఫర్‌ చేస్తుంది.

బ్యాచిలర్‌ కోర్సులు:
బీఎఫ్‌ఏ(అప్లయిడ్‌ ఆర్ట్‌): సీట్లు: 35
బీఎఫ్‌ఏ(ఫోటోగ్రఫీ): సీట్లు: 30
బీఎఫ్‌ఏ(స్కల్‌ప్చ్‌ర్‌): సీట్లు: 10
బీఎఫ్‌ఏ(పెయింటింగ్‌): సీట్లు: 20
అర్హత: ఏైదె నా గ్రూపుతో ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణత.
ప్రవేశం: యూనివర్సిటీ నిర్వహించే కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఇందులో అబ్జెక్టివ్‌ టైప్‌, ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ అనే రెండు దశలు ఉంటాయి. అబ్జెక్టివ్‌ టైప్‌లో..ఆర్ట్‌ సెన్సిటివీటీ, జనరల్‌ ఇంగ్లిష్‌, విజువల్‌ టెస్ట్‌ ఆఫ్‌ రీజనింగ్‌, జీకే-కరంట్‌ అఫైర్స్‌ అంశాల్లో ప్రశ్నలను అడుగుతారు. ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లో..డ్రాయింగ్‌, కలర్‌ విభాగాలు ఉంటాయి. ఒక ఆబ్జెక్ట్‌ను ఇచ్చి చిత్రించమనడం, ఇచ్చిన డ్రాయింగ్‌ను సరిపడ కలర్లతో పూర్తి చేయడం వంటి అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.

మాస్టర్‌ కోర్సులు:
ఎంఎఫ్‌ఏ(పెయింటింగ్‌)
అర్హత: బీఎఫ్‌ఏ(పెయింటింగ్‌)
సీట్లు: 15
ఎంఎఫ్‌ఏ(స్కల్‌ప్చ్‌ర్‌)
అర్హత: బీఎఫ్‌ఏ(స్కల్‌ప్చ్‌ర్‌)
సీట్లు: 10
ప్రవేశం: యూనివర్సిటీ నిర్వహించే కామన్‌ ఎంట్రెన్స్‌ ద్వారా ప్రవేశం క ల్పిస్తారు. ఇందులో హిస్టరీ ఆఫ్‌ ఆర్ట్‌ విభాగం నుంచి..ప్రీ హిస్టారిక్‌, క్లాసికల్‌, మిడ్‌వేయల్‌, రెన్నిన్సియెన్స్‌, మోడరన్‌ ఆర్ట్‌ అంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.

ఎంఎఫ్‌ఏ(అప్లయిడ్‌ ఆర్ట్‌)
అర్హత: బీఎఫ్‌ఏ(అప్లయిడ్‌ ఆర్ట్‌)
సీట్లు: 25
ప్రవేశం: యూనివర్సిటీ నిర్వహించే కామన్‌ ఎంట్రెన్స్‌ ద్వారా ప్రవేశం క ల్పిస్తారు. ఇందులో ఇల్‌స్ట్రేషన్‌, విజువలైజేషన్‌ విభాగాలపై ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఉంటుంది.

ఎంఎఫ్‌ఏ(ఫోటోగ్రఫీ)
అర్హత: బీఎఫ్‌ఏ(ఫోటోగ్రఫీ)
సీట్లు: 20
ప్రవేశం: యూనివర్సిటీ నిర్వహించే కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఇందులో కెమెరాలు-రకాలు, చరిత్ర, కంప్యూటర్‌, వీడియోగ్రఫీ, కమ్యూనికేషన్‌ తదితర విభాగాలతోపాటు జనరల్‌ నాలెడ్జ్‌ అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి.

బ్రిడ్జ్‌ కోర్సు(ఫోటోగ్రఫీ)
అర్హత: డిప్లొమా (ఫోటోగ్రఫీ)
సీట్లు: 20
ప్రవేశం: యూనివర్సిటీ నిర్వహించే కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ద్వారా ప్రవేశం కల్పిస్తారు.

ఎంఎఫ్‌ఏ(అప్లయిడ్‌ ఆర్ట్‌-పీటీపీజీ)
అర్హత: బీఎఫ్‌ఏ(అప్లయిడ్‌ ఆర్ట్‌)
సీట్లు: 15
ప్రవేశం: యూనివర్సిటీ నిర్వహించే కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ద్వారా ప్రవేశం కల్పిస్తారు.

ఎంఎఫ్‌ఏ(ఫోటోగ్రఫీ-పీటీపీజీ)
అర్హత: బీఎఫ్‌ఏ(ఫోటోగ్రఫీ)
సీట్లు: 15
ప్రవేశం: యూనివర్సిటీ నిర్వహించే కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ద్వారా ప్రవేశం కల్పిస్తారు.

నోటిఫికేషన్‌: అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ ఏప్రిల్‌/మే/జూన్‌ నెలలో వెలువడుతుంది.
వెబ్‌సైట్‌: https://www.jnafau.ac.in/

ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్‌.
ఈ యూనివర్సిటీ పరిధిలో శ్రీ వేంకటే శ్వర కాలేజ్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌-హైదరాబాద్‌ మాత్రమే ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సులను ఆఫర్‌ చేస్తుంది. సాధారణంగా అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ మే చివరి వారం/జూన్‌ మొదటి వారంలో వస్తుంది.

వివరాలు..
బీఎఫ్‌ఏ(ఫోటోగ్రఫీ): కాల వ్యవధి: మూడేళ్లు
సీట్లు: 40
అర్హత: ఏదైనా గ్రూపుతో ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణత లేదా తత్సమానం
ప్రవేశం: ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహించే రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం. 120 మార్కులకు ఎంట్రెన్స్‌ ఉంటుంది. ఇందులో జనరల్‌ ఆవేర్‌నెస్‌, హిస్టరీ ఆఫ్‌ ఆర్ట్స్‌, సంబంధిత రంగంపై అభ్యర్థి ఆసక్తిని పరీక్షించే ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ అంశాలు ఉంటాయి.

బీఎఫ్‌ఏ(అప్లయిడ్‌ ఆర్ట్‌). కాలవ్యవధి: ఐదేళ్లు
సీట్లు: 60
బీఎఫ్‌ఏ(పెయింటింగ్‌). కాలవ్యవధి: ఐదేళ్లు
సీట్లు: 40
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత
కాల వ్యవధి: ఐదేళ్లు
ప్రవేశం: 120 మార్కులకు నిర్వహించే ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఇందులో హిస్టరీ ఆఫ్‌ ఆర్ట్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌, సంబంధిత రంగంలో అభ్యర్థి ఆసక్తిని పరీక్షించే విధంగా ఒక ఆబ్జెక్ట్‌ను ఇచ్చి చిత్రించమనడం, కలర్ల ఎంపిక-ఆవగాహన వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.

వెబ్‌సైట్‌: www.surabhieducationalsociety.com

శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం-తిరుపతి. ఈ యూనివర్సిటీ మ్యూజిక్‌, నాట్యంకు సంబంధించి సర్టిఫికెట్‌, మాస్టర్‌ కోర్సులను ఆఫర్‌ చేస్తుంది. వివరాలు..

ఎంఏ(మ్యూజిక్‌)
సీట్లు: 10(వీణ, గ్రాతం విభాగంలో 10 సీట్ల చొప్పున)
అర్హత: డిగ్రీతోపాటు ప్రముఖ గురువు వద్ద 5 ఏళ్లపాటు సంగీతంలో శిక్షణ

ఎంఏ(భరతనాట్యం)
సీట్లు: 10
అర్హత: గ్రాడ్యుయేషన్‌తోపాటు నాట్యంలో సర్టిఫికెట్లు నాట్య విశారద/ప్రవీణ డిప్లొమా/తత్సమాన టైటిల్‌ డిగ్రీ/ బీ-గ్రేడ్‌/యూనివర్సిటీ ఇంటర్వ్యూలో ఫర్ఫెమన్స్‌/బ్యాచిలర్‌ డిగ్రీ(డ్యాన్స్‌).

ఎంఏ(పెర్ఫామింగ్‌ ఆర్ట్స్‌-ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సు)
ఈ కోర్సులో మూడేళ్లు మ్యూజిక్‌, డ్యాన్స్‌ కామన్‌గా ఉంటుంది. తర్వాత రెండేళ్లు వీణ/వోకల్‌/భరతనాట్యంలలో ఏదో ఒక స్పెషలైజేషన్‌ను ఎంచుకోవాలి.
అర్హత: ఇంటర్మీడియెట్‌/10+2. డిగ్రీ ఉండి గురువు వద్ద శిక్షణ పొందుతున్న వారికి నేరుగా నాలుగో ఏడాదిలో ప్రవేశం కల్పిస్తారు.
ఎంపిక విధానం: కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ద్వారా మాస్టర్‌ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.

ఈవినింగ్‌ కోర్సెస్‌(సర్టిఫికెట్‌ కోర్సులు):
సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ వోకల్‌(సెల్ఫ్‌ ఫైనాన్స్‌)
సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ వీణ(సెల్ఫ్‌ ఫైనాన్స్‌)
సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ భరతనాట్యం(సెల్ఫ్‌ ఫైనాన్స్‌)
సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ కూచిపూడి(సెల్ఫ్‌ ఫైనాన్స్‌)
సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ ట్రెడిషనల్‌ ఫ్లోక్‌ మ్యూజిక్‌(సెల్ఫ్‌ ఫైనాన్స్‌)
అర్హత: ఈ కోర్సులకు నిర్దిష్ట అర్హతంటూ లేదు. ఆసక్తి ఉన్న వారు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష, కౌన్సెలింగ్‌ ఉండదు. వర్సిటీ నిబంధనల మేరకు..కోర్సుకు హాజరైతే యూనివర్సిటీ సర్టిఫికెట్‌ ప్రదానం చేస్తుంది. సంబంధిత విభా గంలో ఉన్నత విద్యనభ్యసించే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది.
వెబ్‌సైట్‌: https://www.spmvv.ac.in/

పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ-హైదరాబాద్‌.
లలిత కళలకు ఈ యూనివర్సిటీ పెట్టింది పేరు. యూనివర్సిటీ వివిధ విభాగాల్లో..డిప్లొమా నుంచి పీహెచ్‌డీ వరకు పలు రకాల కోర్సులను ఆఫర్‌ చేస్తుంది. వివరాలు..
బీఎఫ్‌ఏ(శిల్పం,చిత్రలేఖనం,ప్రింట్‌ మేకింగ్‌)
సీట్లు: 25
అర్హత: ఇంటర్మీడియెట్‌
ఎంఏ:కర్ణాటక సంగీతం(గాత్రం/మదంగం,వీణ,వయోలిన్‌)
సీట్లు: 20
అర్హత: బీఏ/బీకాం/బీఎస్సీ/బీఎఫ్‌ఏ లేదా తత్సమాన డిగ్రీతోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంగీతంలో(సంబంధిత అంశంలో) డిప్లొమా లేదా సంగీతంలో(సంబంధిత అంశంలో) ఆకాశవాణి ‘బి’ గ్రేడ్‌ ఆర్టిస్టు.
ఎంపీఏ-కూచిపూడి నత్యం:
సీట్లు: 20
అర్హత: కూచిపూడి నత్యంలో డిగ్రీ లేదా బీఏ/బీకాం/బీఎస్సీ/బీఎఫ్‌ఏ లేదా తత్సమాన డిగ్రీ లేదా కూచిపూడి, సురభి వంటి సంప్రదాయ కుటుంబాలలో నాట్య, నాటక సంబంధిత విషయంలో ఐదేళ్ల అనుభవం లేదా గుర్తింపు పొందిన సంస్థ నుంచి కూచిపూడి నత్యంలో సర్టిఫికెట్‌ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రసిద్ధ నాట్య, నాటక కళాసంస్థలలో ఐదేళ్ల ప్రదర్శనానుభవం లేదా సంబంధిత విషయంలో దూరదర్శన్‌ ‘బి’ గ్రేడ్‌ ఆర్టిస్ట్‌ అయి ఉండాలి.

ఎంపీఏ-ఆంధ్రనాట్యం:
సీట్లు-20
అర్హత: బీఏ/బీకాం/బీఎస్సీ/బీఎఫ్‌ఏ లేదా గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఆంధ్ర నాట్యంలో సర్టిఫికెట్‌ లేదా సంబంధిత విషయంలో దూరదర్శన్‌ ‘బి’ గ్రేడ్‌ ఆర్టిస్ట్‌ అయి ఉండాలి లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రసిద్ధ నాట్య, నాటక కళా సంస్థలలో ఐదేళ్ల ప్రదర్శనానుభవం ఉండాలి.

ఎంపీఏ-జానపద కళలు:
సీట్లు: 20
అర్హత: జానపద కళల్లో బీఏ లేదా తెలుగు రెండో భాషగా బీఏ/బీకాం/బీఎస్సీ/బీఎఫ్‌ఏ/బీఏ(లాంగ్వేజెస్‌). గుర్తింపు పొందిన సంస్థల నుంచి జానపద కళలు, రంగస్థల కళలు, సంగీతం, నత్యాలలో డిప్లొమా/సర్టిఫికెట్‌ లేదా దూరదర్శన్‌/రేడియోలో జానపద సంగీతం/నత్యం సర్టిఫికెట్‌.

ఎంఫిల్‌-జానపదకళలు:
సీట్లు-10
అర్హత: 55 శాతం మార్కులతో ఎంఏ/ఎంపీఏ(జానపద కళలు/తెలుగు/హిస్టరీ అండ్‌ కల్చర్‌/సోషియాలజీ/ఆంత్రోపాలజీ/సైకాలజీ/రంగస్థల కళలు/సంగీతం/నత్యాలలో).

ఎంఫిల్‌ సంగీతం:
సీట్లు: 5
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 55 శాతం మార్కులతో సంగీతంలో ఎంఏ/ఎంపీఏ డిగ్రీ.

ఎంఫిల్‌ నత్యం:
సీట్లు: 5
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 55 శాతం మార్కులతో నత్యంలో
ఎంఏ/ఎంపీఏ డిగ్రీ.
డిప్లొమా కోర్సులు:

లలితసంగీతం
సీట్లు: 20
అర్హత: పదో తరగతి

కూచిపూడి/ఆంధ్రనాట్యం
సీట్లు: 20
అర్హత: కూచిపూడి/ఆంధ్రనాట్యం కోర్సుల్లో సర్టిఫికెట్‌ ఉండాలి.

సర్టిఫికెట్‌ కోర్సులు:
కళా ప్రవేశిక-కర్ణాటక సంగీతం(గాత్రం/మదంగం/వీణ/వేణువు/వయోలిన్‌/నాదస్వరం/డోలు)
సీట్లు:40

కళాప్రవేశిక-భక్తి సంగీతం
సీట్లు: 20

కళాప్రవేశిక-కూచిపూడి నత్యం
సీట్లు: 20
అర్హత: తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో పరిజ్ఞానంతోపాటు సంబంధిత విషయంలో అభిరుచి ఉండాలి.
ప్రవేశం:
యూనివర్సిటీ నిర్వహించే ఎంట్రె న్స్‌ టెస్ట్‌ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఇందులో 100 మార్కులు ఉంటాయి. ప్రదర్శన క ళల కోర్సులో ప్రవేశ పరీక్షకు 50 మార్కులు, ప్రాయోగికానికి 50 మార్కులు కేటాయించారు. సాయంకాలం కోర్సులన్నింటికీ మౌఖిక పరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తారు.
ఎంఫిల్‌: ఈ కోర్సుల్లో ప్రవేశానికి 55 శాతం మార్కులతో సంబంధిత పీజీ(ఎస్సీ/ఎస్టీలకు 50 శాతం). ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్‌ కల్పిస్తారు.

పీహెచ్‌డీ: ఈ కోర్సుల్లో ప్రవేశానికి 55 శాతం మార్కులతో సంబంధిత పీజీ(ఎస్సీ/ఎస్టీలకు 50 శాతం). ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్‌ కల్పిస్తారు. రెగ్యులర్‌గా ఎంఫిల్‌/యూజీసీ నెట్‌/స్లెట్‌ క్వాలిఫై అయిన వారికి/టీచర్‌ ఫెలోషిప్‌ ఉన్న వారికి ఎంట్రెన్స్‌ టెస్ట్‌ నుంచి మినహాయింపు ఉంటుంది.
వెబ్‌సైట్‌: https://www.teluguuniversity.ac.in/

సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌
సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌-సరోజినీ నాయుడు స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, ఫైన్‌ ఆర్ట్స్‌లో కేవలం మాస్టర్‌ స్థాయి కోర్సులను మాత్రమే ఆఫర్‌ చేస్తుంది. అవి..

ఎంపీఏ డ్యాన్స్‌(కూచిపూడి, భరతనాట్యం)
అర్హత: డ్యాన్స్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ లేదా ఏదైనా గ్రాడ్యుయేషన్‌తోపాటు గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి సంబంధిత రంగంలో ప్రొఫెషనల్‌ డిప్లొమా/సర్టిఫికెట్‌. లేదా ఏదైనా గ్రాడ్యుయేషన్‌తోపాటు ప్రముఖ గురువు వద్ద ఐదేళ్ల శిక్షణ లేదా 10+2 తర్వాత మూడేళ్ల డిప్లొమా.

ఎంపీఏ డ్యాన్స్‌(ఫ్లోక్‌):
అర్హత: గ్రాడ్యుయేషన్‌తోపాటు ఏదైనా సంప్రదాయ నత్యంలో మూడేళ్ల శిక్షణ లేదా గ్రాడ్యుయేషన్‌ చేసిన సంప్రదాయ నత్య కళాకారుడు.

ఎంఎఫ్‌ఏ(పెయింటింగ్‌, ప్రింట్‌ మేకింగ్‌, స్కల్‌ప్చ్‌ర్‌)
అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ ఇన్‌(పెయింటింగ్‌/ప్రింట్‌మేకింగ్‌/స్కల్‌ప్చ్‌ర్‌)
ఎంపిక విధానం: రాత పరీక్ష, ప్రాక్టీకల్‌ టెస్ట్‌ రెండు విధాలుగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. రాత పరీక్షలోసంబంధిత సబ్జెక్ట్‌లో అబ్జెక్టివ్‌ టైప్‌, ఎస్సే టైప్‌ కొశ్చన్స్‌గా ప్రశ్నలు ఉంటాయి. రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులు ప్రాక్టీకల్‌ టెస్ట్‌కు హాజరు కావాలి.

నోటిఫికేషన్‌: అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ ఏప్రిల్‌/మే/జూన్‌ నెలలో వెలువడుతుంది.
వెబ్‌సైట్‌: www.uohyd.ernet.in

ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం.
బీఎఫ్‌ఏ(పెయింటింగ్‌)
బీఎఫ్‌ఏ(స్కల్‌ప్చ్‌ర్‌)
అర్హత: ఏైదె నా గ్రూపుతో ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణత.
సీట్లు: 30
ఎంపిక: యూనివర్సిటీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ద్వారా ప్రవేశం కల్పిస్తుది. రాతపరీక్ష , ప్రాక్టికల్‌ రెండు విధాగాలుగా ప్రవేశ పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో హిస్టరీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అంశంపై ప్రశ్నలుంటాయి. ప్రాక్టికల్స్‌లో పెయింటింగ్‌, డ్రాయింగ్‌, స్కల్‌ప్చ్‌ర్‌ అంశాల్లో అభ్యర్థి ప్రావీణ్యాన్ని పరీక్షిస్తారు.

ఎంఏ(డ్యాన్స్‌)
సీట్లు: 10
అర్హత: బీఏ డ్యాన్స్‌ లేదా ఏదైనా బ్యాచిలర్స్‌ డిగ్రీ. డ్యాన్స్‌లో డిప్లొమా/సర్టిఫికెట్‌ ఉన్న వారికి ప్రాధాన్యం

ఎంఏ(మ్యూజిక్‌)
సీట్లు: 10
అర్హత: బీఏ మ్యూజిక్‌దా ఏదైనా బ్యాచిలర్స్‌ డిగ్రీతోపాటు మ్యూజిక్‌లో డిప్లొమా/సర్టిఫికెట్‌. లేదా డిగ్రీతోపాటు ఆల్‌ఇండియా రేడియో ద్వారా కర్ణాటక సంగీతంలో ఏదైనా గ్రేడ్‌ ఉన్న అభ్యర్థులు.
ఎంపిక విధానం: ఈ రెండు కోర్సుల్లో ఎటువంటి రాత పరీక్ష లేకుండానే ప్రవేశం కల్పిస్తారు.
నోటిఫికేషన్‌: అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ ఏప్రిల్‌/మే నెలలో వెలువడుతుంది.
వెబ్‌సైట్‌: www.andhrauniversity.info

అవకాశాలు:
ఫైన్‌ ఆర్ట్స్‌ విద్యార్థులు చదువుకుంటూనే సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఫైన్‌ ఆర్ట్స్‌ విద్యార్థులు కేవలం బ్యాచిలర్‌ కోర్సులకు మాత్రమే పరిమితం కాకూడదు. మాస్టర్‌ కోర్సులను అభ్యసించడం ద్వారా మరిన్ని అవకాశాలను దక్కించుకోవచ్చు. ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న అభివద్ధి ఫలితంగా ఇండస్ట్రీయల్‌, అడ్వర్‌టైజింగ్‌ సంబంధిత రంగాల్లో విస్తత్ర అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. పెయింటింగ్‌, కమర్షియల్‌ ఆర్ట్స్‌, ఫోటోగ్రఫీలో ప్రొఫెషనల్‌ డిగ్రీ ఉన్న అభ్యర్థులకు కూడా ఈ అంశం చాలా కలిసి వచ్చింది. ఫైన్‌ ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసిన అభ్యర్థులకు పబ్లిక్‌, ప్రైవేట్‌ సెక్టార్‌లో విపరీతమైన డిమాండ్‌ఉంది. వీరికి ముఖ్యంగా మ్యూజియం, పబ్లికేషన్స్‌, యూనివర్సిటీలు, అడ్వర్‌టైజింగ్‌, టెక్స్‌టైల్‌ ఇండస్ట్రీస్‌, మీడియా సంస్థలు, ఫ్యాషన్‌ హౌసెస్‌, డ్రామా థియేటర్స్‌, ఆర్ట్‌ స్టూడియోలు, ప్రొడక్షన్‌ హౌస్‌లలో పలు హోదాల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయి. పెయింటింగ్‌, ఫోటోగ్రఫీ, సంగీతం, నత్య విభాగాల అభ్యర్థులు టెలివిజన్‌, సినిమా రంగాల్లో కూడా స్థిర పడొచ్చు. ప్రభుత్వ విభాగాల విషయానికొస్తే..ట్రై బల్‌ వేల్పేర్‌ డిపార్ట్‌మెంట్‌, దూరదర్శన్‌, ఆకాశవాణి, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ డిపార్ట్‌మెంట్లలలో అవకాశాలు ఉంటాయి. పెయింటింగ్‌, స్కల్‌ప్చ్‌ర్‌, మ్యూజిక్‌లలో ప్రొఫెషనల్‌ డిగ్రీ ఉన్న అభ్యర్థులు సొంతంగా ప్రాక్టీస్‌ చేసుకోవచ్చు. వివిధ సంస్థల్లో కాంట్రాక్ట్‌బేస్డ్‌ పద్ధతిలో పని చేయవచ్చు. సొంతంగా ఆర్ట్‌ గ్యాలరీలను నెలకొల్పడం, ఆర్ట్‌ ఎగ్జిబిషన్లను నిర్వహించడం వంటి వాటి ద్వారా స్వయం ఉపాధిని పొందొచ్చు. వివిధ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్లలో మ్యూజిక్‌, డ్యాన్స్‌, సంబంధిత విభాగాల్లో ఫ్యాకల్టీగా సేవలు అందించవచ్చు. సొంతంగా మ్యూజిక్‌, డ్యాన్స్‌, పెయింటింగ్‌ స్కూళ్లను స్థాపించవచ్చు. సంబంధిత రంగంపై రచనలు చేయడం, విమర్శనాత్మక వ్యాసాలు రాయడం, నూతనంగా వస్తున్న మార్పులను వివరించడం వంటి అంశాలపై వివిధ పత్రికల ఆర్టికల్స్‌ రాస్తూ కూడా ఉపాధిని పొందొచ్చు.

వేతనాలు:
అడ్వర్‌టైజింగ్‌ ఏజెన్సీలు,టెక్స్‌టైల్‌ ఇండస్ట్రీస్‌, మీడియా సంస్థలు, ఫ్యాషన్‌ హౌసెస్‌, డ్రామా థియేటర్స్‌, ఆర్ట్‌ స్టూడియోలలో సాధారణంగా అసిస్టెంట్‌/అసిస్టెంట్‌ ఆర్ట్‌ డెరైక్టర్‌/గ్రాఫిక్‌ డిజైనర్‌/విజువలర్స్‌గా కెరీర్‌ ప్రారంభమవుతుంది. ఈ దశలో వీరికి నెలకు ’8 వేల-20 వేల వరకు ఉంటుంది. తర్వాత హోదాను బట్టి నెలకు ’ 25 వేల నుంచి 40 వేలకు సంపాదించవచ్చు. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, ఈ-లెర్నింగ్‌ బిజినెస్‌ సంస్థల్లో గ్రాఫిక్‌ డిజైనర్లకు మంచి డిమాండ్‌ ఉంది. ప్రారంభంలో ’12 వేల నుంచి 25వేల వరకు ఆర్జించవచ్చు. థియేటర్‌, డ్రామా, ప్రొడక్షన్‌ హౌసెస్‌లలో ప్రారంభంలో ’8 వేల నుంచి 20వేల వరకు సంపాదించవచ్చు.

జాతీయ స్థాయి కాలేజ్‌లు:
సర్‌ జేజే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అప్లయిడ్‌ ఆర్ట్‌-ముంబై
వెబ్‌సైట్‌: https://www.jjiaa.org/
కళాభవన-శాంతినికేతన్‌
వెబ్‌సైట్‌: www.visvabharati.ac.in
జామియామిలియా ఇస్లామియా-ఢిల్లీ
వెబ్‌సైట్‌: www.jmi.nic.in
బెనారస్‌ హిందూ యూనివర్సిటీ-వారణాసి
వెబ్‌సైట్‌: www.bhu.ac.in
యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీ-ఢిల్లీ
వెబ్‌సైట్‌: www.du.ac.in
అమిటీ యూనివర్సిటీ-నోయిడా
వెబ్‌సైట్‌: www.amity.edu
ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌-న్యూఢిల్లీ
వెబ్‌సైట్‌: www.iifaindia.org
Published date : 17 Feb 2012 06:23PM

Photo Stories