Skip to main content

ఫారిన్‌ లాంగ్వేజెస్

భావ వ్యక్తీకరణకు ఉపయోగిస్తున్న ప్రభావవంతమైన సాధనాల్లో భాష ప్రధానమైంది. నాటి రాతి యుగం నుంచి నేటి కంప్యూటర్‌ యుగం వరకు పరిణామక్రమంలో ఎన్నో మార్పులు వచ్చినా.. భావ వ్యక్తీకరణకు ప్రధాన వేదికగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న‘భాష’.. ప్రపంచీకరణ నేపథ్యంలో ఎన్నో రకాల ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తూ.. సరికొత్త కెరీర్‌ అవెన్యూగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఫారెన్‌ లాంగ్వేజెస్‌’పై అకడెమిక్‌, కెరీర్‌ పరంగా ఫోకస్‌..

గ్లోబలైజేషన్‌తో.. మల్టీనేషనల్‌ కంపెనీలు భారత్‌కు రావడం.. అదే విధంగా స్వదేశీ కంపెనీలు జాయింట్‌ వెంచర్స్‌ పేరిట విదేశాలకు వ్యాపారాన్ని విస్తరిస్తుండటం. ఫలితంగా విదేశీ నిపుణులతో సంప్రదింపులు, డాక్యుమెంటేషన్‌ తదితర వ్యవహారాలు నిత్యకృత్యమయ్యాయి. దీంతో సంబంధిత ఫారెన్‌ లాంగ్వేజ్‌ తెలిసి ఉండటం.. వ్యాపారపరంగా మంచి ఎత్తుగడ. ఈ కారణంగా ఫారెన్‌ లాంగ్వేజ్‌ డిగ్రీ నేర్చుకున్న వారికి డిమాండ్‌ ఏర్పడింది. అంతేకాకుండా మన దేశం.. వివిధ దేశాలతో కుదుర్చుకున్న అవగాహనల ఫలితంగా.. వచ్చే సమాచారాన్ని క్రోడీకరించడం, నాన్‌ ఇంగ్లిష్‌ స్పీకింగ్‌ దేశాలకు ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరగడం వంటి కారణాలతో ఫారెన్‌ లాంగ్వేజెస్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది.

  • డిమాండ్‌ ఉన్న భాషలు:
    ప్రపంచీకరణతో పారిశ్రామిక రంగంతోపాటు వివిధ రంగాల్లో వస్తున్న మార్పుల కారణంగా ఫారెన్‌ లాంగ్వేజెస్‌లో నిష్ణాతులైన అభ్యర్థుల అవసరం పెరుగుతుంది. ముఖ్యంగా నాన్‌-ఇంగ్లిష్‌ స్పీకింగ్‌ దేశాల భాష తెలిసిన వారికి మంచి అవకాశాలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో.. ఫ్రెంచ్‌, జర్మన్‌, రష్యన్‌, చైనీస్‌ భాషలకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. ఇటీవలి కాలంలో జపనీస్‌, స్పానిష్‌, కొరియన్‌ భాషలకు మంచి ఆదరణ లభిస్తుంది.
  • జాబ్‌ ట్రెండ్
    ప్రపంచం కుగ్రామంగా మారుతోంది. ప్రతి సంస్థ ప్రపంచవ్యాప్తంగా కార్యాలయాలు తెరుస్తోంది. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు పెరుగుతున్నాయి. ఎల్లలు దాటి ఉద్యోగం చేయడం నేటి యువతకు అనివార్యమైంది. ఫారిన్‌ లాంగ్వేజ్‌ వచ్చిన ఉద్యోగులకు కంపెనీలు ఆన్‌సైట్‌ అవకాశాలు కల్పిస్తున్నాయి. మరోవైపు వర్తకం, పర్యాటకం, ఆతిథ్యం విస్తరిస్తున్నాయి. యూరప్‌, ఆసియా దేశాల మధ్య ఐటీ వ్యాపారం పెద్దఎత్తున విస్తరిస్తోంది. ముఖ్యంగా యూరోపియన్‌ యూనియన్‌ దేశాల నుంచి ఇండియన్‌ ఐటీ, బీపీవో, కెపీవో కంపెనీలకు పెద్దఎత్తున ప్రాజెక్టులు వస్తున్నాయి. ఆయా దేశాల నుంచి వచ్చే ప్రాజెక్టుల సమాచారం తెలుసుకోవడం, నిబంధనలు, ఒప్పంద పత్రాలను తర్జుమా చేయడం, విదేశీ కంపెనీ ప్రతినిధులు, లేదా కై ్లంట్‌లతో సంభాషించడం... ఇలా అనేకరకాల అవసరాలు కంపెనీలకు పెరిగిపోయాయి. తాజాగా ఓ సర్వే అంచనా ప్రకారం- భారతదేశంలో ప్రస్తుతం 1,60,000 మంది భాషా నిపుణుల అవసరం ఉందని తేలింది. అంటే విదేశీ భాషలు మాట్లాడగలిగే ప్రతి నిపుణుడికి ఇప్పుడు ఉద్యోగం సిద్ధంగా ఉంది.
  • అవకాశాలు
    ఫారిన్‌ లాంగ్వేజ్‌లో ప్రావీణ్యం సంపాదిస్తే... ట్రాన్స్‌లేషన్‌, ఇంటర్‌ప్రిటేషన్‌, టీచింగ్‌, రీసెర్చ్‌లలో దేశ, విదేశాల్లో కెరీర్‌ను సొంతంచేసుకోవచ్చు. ప్రభుత్వ రంగంలోని జాబ్స్‌తో పాటు ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, ఇండియన్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌, రాయబార కార్యాలయాలు, మల్టీ నేషనల్‌ కంపెనీలు, కాల్‌ సెంటర్స్‌, టూరిజం సంస్థల్లో అవకాశాలు కోకొల్లలు. స్పానిష్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, ఇటాలియన్‌, అరబిక్‌, పర్షియన్‌, పోర్చుగీస్‌, చైనీస్‌, జపనీస్‌, రష్యన్‌.. ఇలా ఏ ఫారిన్‌ లాంగ్వేజ్‌ నేర్చుకున్నా అవకాశాలు అపారం.

    ప్రతి దేశానికీ ఏదో ఒక విషయంలో అవసరం/కొరత ఉంటుంది. ఆ కొరత తీరాలంటే.. ఇతర దేశాల సహకారం అనివార్యం. చైనాలో ఇంగ్లిష్‌ శిక్షకుల కొరత చాలా ఎక్కువ. జపాన్‌కు ఇంజనీర్లు, మలేషియాకు ఉపాధ్యాయులు, అమెరికాకు నర్సులు బాగా అవసరం. విదేశీ సంస్థల కార్యాలయాలు భారత్‌లోనూ.. భారత్‌కు చెందిన సంస్థల కార్యాలయాలు విదేశాల్లో ఏర్పాటవుతున్నాయి. అక్కడి వాళ్లకు ఇక్కడి భాష, మనవాళ్లకు వారి భాష తెలియదు. ఈ కొరత తీర్చడంలో విదేశీ భాష వచ్చినవాళ్లు ఎంతో ఉపయోగపడతారు. అందుకే పరదేశీ భాషలు... అవకాశాలకు బాటలేస్తున్నాయి. బహుళజాతి కంపెనీల్లో పనిచేసేవాళ్లు కొన్నిసార్లు క్లైంట్‌తో కలిసి పనిచేయడం, వాళ్లతో మమేకం కావడం తప్పనిసరి. ఇద్దరికీ ఇంగ్లిష్‌ వస్తే ఓకే. రాని పక్షంలో క్లైంట్‌ భాష మనకు తెలిసుండాలి. ఇలాంటి సందర్భంలో క్లైంట్‌ భాష వచ్చిన వారికే ఆన్‌సైట్‌ ఆఫర్‌.

    విదేశాల నుంచి భారత్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య ఏటా పెరుగుతోంది. భిన్న భాషలకు సంబంధించిన వాళ్లు ఇక్కడకు వస్తుంటారు. వాళ్ల భాష మనకు తెలిస్తే టూరిస్ట్‌ గైడ్‌గా వ్యవహరించొచ్చు. పెద్ద హోటళ్లలోనూ ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. చదువుకోసం విదేశాలకు వెళ్లడం ఇప్పుడు బాగా పెరిగింది. వెళ్లాలనుకుంటున్న దేశ భాషలో కనీస పరిజ్ఞానం ఉంటే అక్కడ సులువుగా నెట్టుకురావొచ్చు.
    మారుతున్న వాణిజ్య కార్యకలాపాల దృష్ట్యా ఒక భాషలోని సమాచారం మరో భాషలోకి తర్జుమా చేయాల్సిన అవసరం ఎక్కువైంది. పుస్తకాలు బాగా అనువాదమవుతున్నాయి. కాబట్టి విదేశీ భాషపై పట్టు ఉంటే ట్రాన్స్‌లేటర్‌గా అవతారమెత్తొచ్చు. అవుట్‌ సోర్సింగ్‌, మెడికల్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌, ఫార్మాస్యూటికల్‌ రంగాల్లో విదేశీ భాషలు వచ్చినవారి సేవలు తప్పనిసరి.

    వివిధ దేశాలకు చెందిన కంపెనీల ఉత్పత్తులు ఇప్పుడు ప్రతిచోటా లభిస్తున్నాయి. మొబైల్‌ ఫోన్లు, వాషింగ్‌ మెషీన్లు, టీవీలు... ఇవన్నీ భిన్న దేశాలకు చెందిన కంపెనీలు భిన్న ప్రాంతాల్లో అమ్ముతున్నాయి. ఆ ఉత్పత్తి వివరాల పత్రం సంబంధిత ప్రాంతీయ భాషలో వినియోగదారుడికి సులువుగా అర్థమయ్యేలా ఉండాలి. ఈ పనిచేసేవాళ్లే టెక్నికల్‌ రైటర్స్‌.
  • ఫారెన్‌ ఎడ్యుకేషన్‌
    నాన్‌ ఇంగ్లిష్‌ స్పీకింగ్‌ దేశాల్లో విద్యనభ్యసించాలనుకునే వారికి.. అక్కడి జాతీయ భాషలో పట్టు ఉండాలి. రష్యా, చైనా, మధ్య ఆసియా దేశాలు, స్పెయిన్‌, స్వీడన్‌, జర్మనీ వంటి దేశాలకు వెళ్లే వారికి అక్కడి జాతీయ భాష పరిజ్ఞానం.. చక్కని కమ్యూనికేషన్‌కు దోహదం చేస్తుంది.
  • ప్రపంచ స్థాయి సంస్థలు:
    వివిధ దేశాల్లో సంబంధిత ప్రాజెక్ట్‌లలో పని చేయడానికి.. వరల్డ్‌ బ్యాంక్‌, యూఎన్‌ఓ, యునెస్కో, డబ్ల్యూహెచ్‌ఓ, యూనిసెఫ్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు ఫారెన్‌ లాంగ్వే జ్‌ ఎక్స్‌పర్ట్స్‌ను రిక్రూట్‌ చేసుకుంటున్నాయి. రెడ్‌క్రాస్‌ సొసైటీ, ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌, హ్యూమన్‌ రైట్‌ కమిషన్స్‌లో కూడా అవకాశాలు ఉంటాయి.
  • కెరీర్‌
    ఫారెన్‌ లాంగ్వేజ్‌ స్కిల్స్‌ ఉన్న అభ్యర్థులకు అవకాశాలు విస్తృతం. వీరికి సెక్రటేరియల్‌ పొజిషిన్‌ నుంచి ఎగ్జిక్యూటివ్‌ వరకు వివిధ స్థాయిల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయి. ట్రాన్స్‌లేటర్స్‌, ఇంటిప్రిటేటర్స్‌, డీకోడర్స్‌, టెక్నికల్‌ రైటర్స్‌, కంటెంట్‌ రైటర్స్‌, టూర్‌ ఆపరేటర్స్‌, ఫ్యాకల్టీ వంటి వివిధ స్థాయిల్లో స్థిర పడొచ్చు. వివిధ ఐటీ కంపెనీలు, మీడియా, పార్లమెంట్‌, బోధన, పరిశ్రమలు, కార్పొరేట్‌ హౌసెస్‌, రీసెర్చ్‌ ఆర్గనైజేషన్స్‌, పబ్లిషింగ్‌ హౌస్‌లు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశీ రాయబార కార్యాలయాల్లో అవకాశాలు ఉంటాయి.
  • ట్రాన్స్‌లేటర్స్‌:
    విదేశీ భాష నిపుణుల్లో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం ట్రాన్స్‌లేషన్‌(అనువాదం). భాషపై మంచి పట్టు, అర్థాన్ని మార్చకుండా చక్కగా అనువదించే నేర్పు ఉంటే ఎదగడానికి అవకాశాలెన్నో. మల్టీ నేషనల్‌ కంపెనీలు దేశంలో అడుగిడడం.. మన కంపెనీలు ఫారెన్‌ కంపెనీలతో జాయింట్‌ వెంచర్స్‌కు ప్రాధాన్యతనిస్తున్నాయి. ఈ ప్రక్రియలో విదేశీ ప్రతినిధులతో సంప్రదింపులు, డాక్యుమెంటేషన్‌ వ్యవహారాల కోసం సంబంధిత విదేశీ భాషపై పట్టు ఉన్న వారిని నియమించుకుంటున్నాయి. విదేశాలతో అవగాహన కారణంగా వచ్చే పత్రాలను.. అనువదించడం, సమాచారాన్ని క్రోడీకరించడం కోసం కూడా ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో ట్రాన్స్‌లేటర్లు అవసరమవుతున్నారు. టెక్నికల్‌, సైంటిఫిక్‌, బిజినెస్‌, సాహిత్యం, రంగాల్లో కూడా వీరు తప్పనిసరి కావడంతో సంబంధిత ఆర్గనైజేషన్స్‌ ఆకర్షణీయమైన ప్యాకేజీలతో ట్రాన్స్‌లేటర్లను రిక్రూట్‌ చేసుకుంటున్నాయి. భారత్‌లో ఐటీ రంగ వృద్ధి జోరుగా ఉంది. ప్రపంచదేశాల నుంచి అనేక ప్రాజెక్టులు ఐటీ కంపెనీలకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టు నివేదికల తర్జుమాకు పెద్ద ఎత్తున ట్రాన్స్‌లేటర్లు అవసరం ఉంది.
  • ఇంటర్‌ప్రిటేటర్‌:
    ఒక వ్యక్తి మాటలను అనువాదం చేసి మరొక వ్యక్తికి అప్పటికప్పుడు వినిపించే ప్రక్రియే ఇంటర్‌ప్రిటేషన్‌. ఈ తరహా బాధ్యతలను నిర్వహించే వారే ఇంటర్‌ప్రిటేటర్లు. ఈ వృత్తిలో రాణించడానికి వెర్బల్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ కీలకం. వీరు కూడా రకరకాల బాధ్యతలను నిర్వహించాలి. ఒక వ్యక్తి ప్రసంగాన్ని అప్పటికప్పుడు అనువదించాల్సి ఉంటుంది. ఇటువంటి అవసరం సెమినార్లు, కాన్ఫరెన్స్‌లు, సభలలో ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల సంభాషణను ఇంటర్‌ప్రిటేషన్‌ చేయడానికి ఉండే వారిని లెసియన్‌ ఇంటర్‌ప్రిటేటర్‌ అంటారు. వీరికి లోక్‌సభ, విదేశీ మంత్రిత్వ శాఖ, కార్పొరేట్‌ హౌసెస్‌లో అవకాశాలు ఉంటాయి.
  • టీచింగ్‌:
    ఫారెన్‌ లాంగ్వేజెస్‌ అభ్యర్థులకు ఉపాధి వేదికగా నిలుస్తోన్న మరో రంగం టీచింగ్‌. ఈ వృత్తిలో ప్రవేశించిన వారికి బోధనతోపాటు సంబంధిత భాషలో మరింత నిష్ణాతులుగా తయారయ్యే అవకాశం దీని వల్ల లభిస్తుంది. ప్రస్తుతం దేశంలోని పలు కార్పొరేట్‌ స్కూళ్లు, కాలేజీలు విదేశీ భాష కోర్సులను నిర్వహిస్తున్నాయి. కాబట్టి ఆ దిశగా కూడా అవకాశాలు అనేకం.
  • ఫ్రీలాన్సింగ్‌:
    లాంగ్వేజ్‌లలో పట్టు సాధించినా.. పూర్తి స్థాయి ఉద్యోగంపై ఆసక్తి లేని వారికి... అప్పటికే మరో ఉద్యోగంలో ఉన్న వారికి ఈ ఫ్రీలాన్సింగ్‌ ఎంతో ప్రయోజనకరం. ముఖ్యంగా పుస్తక ప్రచురణ విభాగంలో వీరికి అవకాశాలు పుష్కలం. అదే విధంగా కొందరు పీహెచ్‌డీ స్కాలర్స్‌ తాము రూపొందించే పరిశోధన పత్రాలను ఇంగ్లిష్‌లో అనువదించడానికి ఫ్రీలాన్సర్ల వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే ఏ విభాగంలో పట్టు సాధించాలన్నా సహనం, ప్రాక్టీస్‌ అత్యంత ఆవశ్యకం. వీటితోపాటు వెర్బల్‌ స్కిల్స్‌ను మెరుగు పర్చుకోవడం ముఖ్యమే.
  • మరికొన్ని రంగాలు
    విదేశీ భాష నిపుణుల అవసరం హాస్పిటల్స్‌, క్లినిక్స్‌, ఫార్మాస్యూటికల్‌ రంగాల్లో ఉంటోంది. కారణం ఈ రంగాల్లో ఉన్న సంస్థలు పలు విదేశీ సంస్థలతో సంయుక్తంగా వ్యాపారం నిర్వహిస్తుండటమే. ఫలితంగా అక్కడి నుంచి వచ్చే డాక్యుమెంట్ల అనువాదం కోసం కార్పొరేట్‌ ఆసుపత్రులు, హెల్త్‌ కేర్‌ ఆర్గనైజేషన్స్‌, ఫార్మాస్యూటికల్‌ కంపెనీలు ట్రాన్స్‌లేటర్స్‌ను నియమించుకుంటున్నాయి. అయితే ఈ వృత్తిలో రాణించాలంటే సంబంధిత టెర్మినాలజీపై పట్టు ఉండాలి. టూరిస్ట్‌ గైడ్లు, ఎయిర్‌హోస్ట్‌లు, ప్రముఖ హోటళ్ల తరఫున ప్రతినిధులు, ఫ్రీలాన్సర్‌లు, పీఆర్‌వోలతో పాటుగా బిజినెస్‌ రంగంలో బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌లు, పర్సనల్‌ మేనేజర్లు, స్టెనోగ్రఫీ, సెక్రటరీ, ప్రొఫెసర్లు, విదేశీవిద్య సమన్వయకర్తలు, పాఠ్యపుస్తకాల రచయితలు, న్యాయస్థానాల్లో అనువాదకులు, ఫెడరల్‌ ఏజెన్సీలు, ట్రావెల్‌ రైటర్లు, టెక్నికల్‌ ట్రాన్స్‌లేటర్లు, సాఫ్ట్‌వేర్‌ డిజైనర్‌, టెక్నికల్‌ సపోర్ట్‌ స్పెషలిస్టు, సాఫ్ట్‌వేర్‌ కన్సల్టెంట్‌, వెబ్‌ లోకలైజేషన్‌ స్పెషలిస్టులు ఇలా... ఎన్నోరకాల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.
  • వేతనాలు:
    అనువాదకులు, ఇంటర్‌ప్రిటేటర్లుగా పనిచేసేవారికి ఆదాయం కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. భాష ఆధారంగా ట్రాన్స్‌లేటర్లకు ఒక్కో పేజీకి దాదాపు ’ 200 నుంచి ’ 500 వరకు లభిస్తంది. నెల వారీగా ’ 20 నుంచి 40 వేల వరకు జీతాలు వచ్చే అవకాశం ఉంది. అధ్యాపకులకు ప్రారంభంలో 25వేలకుపైగా వేతనం లభిస్తుంది. ఇంటర్‌ప్రిటేటర్లకు గంట చొప్పున చెల్లిస్తారు. వీరికి గంటకు ’ 400-500 వరకు చెల్లిస్తున్నారు. రాయబార కార్యాలయాలు, కార్పొరేట్‌ హౌసెస్‌, ఫార్మాస్యూటికల్‌, మెడికల్‌, తదితర రంగాల్లో స్థిర పడిన వారికి ’ 15 వేల నుంచి ప్రారంభంలో వేతనం ఉంటుంది. తర్వాత అనుభవం ఆధారంగా పెరిగే అవకాశం ఉంటుంది.
  • టాప్‌ రిక్రూటర్స్‌
    వీరికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశీ రాయబార కార్యాల యాలు, హెచ్‌పీ, ఒరాకిల్‌, స్యామ్‌సంగ్‌, హ్యుందాయ్‌, ఎల్‌జీ, థామ్సన్‌, జీఈ, ఎవన్‌టీస్‌, మౌలీనెక్స్‌, టూరిజం సంస్థలు, హోటల్‌ పరిశ్రమ, ఎయిర్‌లైన్‌ ఆఫీస్‌లు, ఎక్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్స్‌ తదితరాల్లో కూడా అవకాశాలు ఉంటాయి.
  • ఆఫర్‌ చేస్తున్న యూనివర్సిటీలు:
    దేశంలో ఫారెన్‌ లాంగ్వేజెస్‌ సంబంధిత కోర్సుల్లో చేరడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. బేసిక్స్‌ నుంచి అడ్వాన్స్‌డ్‌ స్థాయి వరకు వివిధ స్థాయిల్లో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఫ్రొఫెషనల్‌ కోర్సుల మాదిరిగానే ఈ కోర్సుల్లో ప్రవేశానికి కావల్సిన అర్హత ఇంటర్మీడియెట్‌ లేదా తత్సమానం. కొన్ని యూనివర్సిటీలు.. డిప్లొమా/సర్టిఫికెట్‌ కోర్సులను అందిస్తుంటే మరికొన్ని ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులను కూడా ఆఫర్‌ చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఇంగ్లిష్‌ అండ్‌ ఫారెన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ(ఈఫ్లూ), జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ-ఢిల్లీ.. పీహెచ్‌డీ స్థాయి కోర్సులను సైతం అందిస్తున్నాయి. వివిధ దేశాల రాయబార కార్యాలయాలు, కన్సల్టెన్సీలు కూడా సంబంధిత భాషల్లో కోర్సులను నిర్వహిస్తున్నాయి.
  • ఉస్మానియా యూనివర్సిటీ
    ఎంఏ: అరబిక్‌, ఫ్రెంచ్‌, పర్షియన్‌ కోర్సులు రెగ్యులర్‌ విధానంలో అందిస్తోంది. డిగ్రీలో కనీసం 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి. సంబంధిత భాష డిగ్రీ స్థాయిలో చదివినవాళ్లు అర్హులు. జూనియర్‌ డిప్లొమా: ఫ్రెంచ్‌, జర్మన్‌, రష్యన్‌, మోడర్న్‌ అరబిక్‌, పర్షియన్‌ కోర్సులు రెగ్యులర్‌ విధానంలో నిర్వహిస్తోంది. కోర్సు వ్యవధి ఏడాది. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులు అర్హులు. పరీక్ష ద్వారా ప్రవేశం లభిస్తుంది.
    సీనియర్‌ డిప్లొమా: ఫ్రెంచ్‌, జర్మన్‌, రష్యన్‌. సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో జూనియర్‌ డిప్లొమా ఉత్తీర్ణులు, డిగ్రీలో సంబంధిత భాష చదివిన వాళ్లు ఈ కోర్సుకు అర్హులు. ప్రత్యేక పరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తారు.
    అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా: ఫ్రెంచ్‌, జర్మన్‌, రష్యన్‌. సంబంధిత భాషలో సీనియర్‌ డిప్లొమాలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు. పరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తారు.
    ఎంఫిల్‌: అరబిక్‌, ఫ్రెంచ్‌, పర్షియన్‌ కోర్సులు నిర్వహిస్తోంది. పీజీలో సంబంధిత భాషలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు. పరీక్ష ద్వారా ప్రవేశం లభిస్తుంది.
    పీహెచ్‌డీ: అరబిక్‌, ఫ్రెంచ్‌, పర్షియన్‌.
    అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత, లేదా ఆ సబ్జెక్టులో ఎంఫిల్‌ ఉత్తీర్ణత.

    For more details Click here
  • రామకృష్ణ మఠం, హైదరాబాద్‌
    ఆఫర్‌ చేస్తోన్న కోర్సులు: ఫ్రెంచ్‌, స్పానిష్‌, జర్మన్‌ భాషలను ఆరు స్థాయిల్లో నేర్పుతుంది. జపనీస్‌ ఐదు స్థాయిలు. ఒక్కోస్థాయి వ్యవధి మూడు నెలలు. ఏడాదికి మూడుసార్లు జనవరి, జూన్‌, సెప్టెంబర్‌ సెషన్లలో క్లాసులు ప్రారంభమవుతాయి. మూడు సమయాల్లో తరగతులు నిర్వహిస్తారు. మిగతా సంస్థలతో పోల్చితే ఫీజులు నామమాత్రంగా ఉంటాయి. సమర్థులైన బోధనా సిబ్బంది, క్రమశిక్షణ.. రామకృ ష్ణ మఠం ప్రత్యేకత.

    For more details Click here
  • ఇంగ్లిష్‌ అండ్‌ ఫారెన్‌ లాంగ్వేజెస్‌ యూనివ ర్సిటీ(ఇఫ్లూ)
    రీసెర్చ్‌ ప్రోగ్రామ్స్‌: అరబిక్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, జపనీస్‌, రష్యన్‌, స్పానిష్‌.
    అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా కోర్సులు: అరబిక్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, జపనీస్‌, రష్యన్‌, స్పానిష్‌; ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ కోర్సులు: అరబిక్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, జపనీస్‌, రష్యన్‌, స్పానిష్‌ రెండేళ్ల ఎంఏ కోర్సులు: అరబిక్‌ అండ్‌ ఫ్రెంచ్‌ పీజీ డిప్లొమా కోర్సులు: టీచింగ్‌ ఆఫ్‌ అరబిక్‌ డిప్లొమా కోర్సులు: అరబిక్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, జపనీస్‌, రష్యన్‌, స్పానిష్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ ప్రొఫిషియన్సీ: అరబిక్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, జపనీస్‌, రష్యన్‌, స్పానిష్‌
    For more details Click here
  • యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీ
    పీహెచ్‌డీ: జర్మన్‌, హిస్పానిక్‌, పర్షియన్‌
    ఎంఫిల్‌: అరబిక్‌, బల్గేరియన్‌ లాంగ్వేజ్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, హిస్పానిక్‌ ఇటాలియన్‌, లింగ్విస్టిక్స్‌, పర్షియన్‌, రష్యన్‌.
    ఎంఏ: అరబిక్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, హిస్పానిక్‌, ఇటాలియన్‌, లింగ్విస్టిక్స్‌, పర్షియన్‌
    బీఏ (ఆనర్స్‌): ఫ్రెంచ్‌, జర్మన్‌, పర్షియన్‌, స్పానిష్‌, జోంగా, అరబిక్‌ డిప్లొమా/అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా/సర్టిఫికెట్‌ కోర్సులు: అప్లైడ్‌ లింగ్విస్టిక్స్‌, బల్గేరియన్‌/క్రొయేషియన్‌/చెక్‌/ఫ్రెంచ్‌/జర్మన్‌/హంగేరియన్‌/ఇటాలియన్‌/పర్షియన్‌/పోలిష్‌/సెర్బియన్‌/స్లోవేక్‌ లాంగ్వేజెస్‌.
    For more details Click here
  • బెనారస్‌ హిందూ యూనివర్సిటీ
    ఎంఏ: అరబిక్‌, చైనీస్‌, జర్మన్‌, పర్షియన్‌, రష్యన్‌, నేపాలీ, పాళీ, లింగ్విస్టిక్స్‌.
    పీజీ డిప్లొమా: జపనీస్‌ స్డడీస్‌; వ్యవధి: ఏడాది
    బీఏ (ఆనర్స్‌): అరబిక్‌, పర్షియన్‌, పాళీ, నేపాలీ, చైనీస్‌, జర్మన్‌, ఫ్రెంచ్‌, రష్యన్‌, లింగ్విస్టిక్స్‌.
    యూజీ డిప్లొమా: అరబిక్‌, చైనీస్‌, ఫ్రెంచ్‌ స్టడీస్‌, జర్మన్‌ స్టడీస్‌, నేపాలీ, పర్షియన్‌, రష్యన్‌, సింహళీస్‌.
    For more details Click here
  • యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్‌
    ఎంఫిల్‌:
    ఫ్రెంచ్‌; ఎంఏ: ఫ్రెంచ్‌‌
    డిప్లొమా/సర్టిఫికెట్‌: ఫ్రెంచ్‌, జర్మన్‌, ఇటాలియన్‌, స్పానిష్‌ ‌
    For more details Click here
  • జామియా మిలియా ఇస్లామియా
    పీహెచ్‌డీ:
    అరబిక్‌, పర్షియన్‌; ఎంఏ: అరబిక్‌, పర్షియన్‌
    బీఏ (ఆనర్స్‌): అరబిక్‌, పర్షియన్‌
    అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా: మోడర్న్‌ అరబిక్‌ లాంగ్వేజ్‌ అండ్‌ ట్రాన్స్‌లేషన్‌, మోడర్న్‌ పర్షియన్‌, టర్క్‌మెనియన్‌, టర్కిష్‌, స్పానిష్‌, పోర్చుగీస్‌, ఫ్రెంచ్‌, రష్యన్‌, ఇటాలియన్‌. డిప్లొమా కోర్సులు: మోడర్న్‌ అరబిక్‌, మోడర్న్‌ పర్షియన్‌, టర్క్‌మెనియన్‌, టర్కిష్‌, కజక్‌, ఉజ్బెక్‌, క్రెగ్‌, స్పానిష్‌, పోర్చుగీస్‌, ఫ్రెంచ్‌, రష్యన్‌, ఇటాలియన్‌.
    For more details Click here
  • యూనివర్సిటీ ఆఫ్‌ ముంబై
    పీహెచ్‌డీ:
    అరబిక్‌, ఫ్రెంచ్‌, పర్షియన్‌
    ఎంఏ: అరబిక్‌, ఫ్రెంచ్‌, పర్షియన్‌
    బీఏ: అరబిక్‌, చైనీస్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, జపనీస్‌, పాళీ, పర్షియన్‌, పోర్చుగీస్‌, రష్యన్‌.
    అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా: అరబిక్‌, జర్మన్‌, రష్యన్‌
    డిప్లొమా: అరబిక్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, పాళీ, పర్షియన్‌, రష్యన్‌
    సర్టిఫికెట్‌: అరబిక్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, ఇటాలియన్‌, పర్షియన్‌, పోలిష్‌, రష్యన్‌

    For more details Click here
  • ఇగ్నో పీహెచ్‌డీ:
    అరబిక్‌, ఫ్రెంచ్‌ సర్టిఫికెట్‌:
    జర్మన్‌, జపనీస్‌, ఫ్రెంచ్‌, అరబిక్‌ డిప్లొమా: టీచింగ్‌ జర్మన్‌ లాంగ్వేజ్‌ For more details Click here
Published date : 20 Feb 2012 02:23PM

Photo Stories