కెరీర్ గెడైన్స్..కార్పొరేట్ సోషియల్ రెస్పాన్సిబిలిటీ
Sakshi Education
ఆగస్టు మొదటి వారంలో కంపెనీస్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.. ఈ బిల్లు ప్రకారం కంపెనీలు తమ లాభాల్లో 2 శాతం నిధులను కార్పొరేట్ సోషియల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) కోసం విధిగా కేటాయించాలి.. అంతేకాకుండా సంబంధిత నిపుణుడు డెరైక్టర్‌గా సీఎస్‌ఆర్ కోసం ప్రత్యేక విభాగాన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.. దీన్ని అచరణ సాధ్యం చేయాలంటే ప్రత్యేక నైపుణ్యం ఉన్న మానవ వనరులు అవసరం.. ఈ నేపథ్యంలో కెరీర్ డెస్టినేషన్స్‌లో సీఎస్‌ఆర్‌కు చోటు దక్కింది. విలక్షణ కెరీర్‌గా మారనున్న.. సీఎస్‌ఆర్ అంటే ఏమిటి? ఈ రంగంలో కెరీర్ ప్రారంభించడానికి అవసరమైన అర్హతలు తదితర అంశాలపై ఫోకస్..
ఆర్థిక సంస్కరణల తర్వాత.. దేశాభివృద్ధిలో కార్పొరేట్ సంస్థల పాత్ర పెరిగింది. ఈ నేపథ్యంలోనే తమకున్న వనరుల ద్వారా సమాజాభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు తమ వంతు చేయూతనందించాలనే అభిప్రాయం వ్యక్తమైంది.
అంకురార్పణ:
కంపెనీ తన సమయూన్ని, వనరులను సామాజిక శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వినియోగించాలి. ఎందుకంటే సమాజం లేనిదే ఈ సంస్థలకు మనుగడ లేదు. అవి వ్యాపారం చేసి, లాభాలు గడించాలంటే.. సమాజం అనుకూల వాతావరణాన్ని కలిగి ఉండాలి. వాటాదారుని పెట్టుబడి వృద్ధి చెందాలంటే సమాజం తోడ్పాటు ఎంతో అవసరం. వాటాదారులతో పాటు సమాజంలోని మిగతా వర్గాల ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఖాతాదారులు, ఉద్యోగులు సంతృప్తి చెంద కుంటే.. సదరు వ్యాపార సంస్థ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. ఈ నేపథ్యాల్లోంచే కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) అనే భావన వెలుగులోకి వచ్చింది. కేవలం వరద ముంపు ప్రాంతాల్లో ఆహారం పంపిణీ చేయడమే కాదు.. నాణ్యమైన ఉత్పత్తులను చౌక ధర లకు అందించడం, పర్యావరణ అనుకూల నిబంధనలను పాటించడం, తమ సంస్థల్లో కార్మిక చట్టాలను పక్కాగా అమలు చేయడం, ఉద్యోగులకు పని నిబంధనలను మెరుగుపరచడం వంటివి కూడా సామాజిక బాధ్యత కిందకే వస్తాయి. ఇందులో భాగంగానే టీసీఎస్, విప్రో వంటి సంస్థలు.. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉపయోగపడే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి, విద్యా రంగానికి సేవ చేస్తున్నాయి.
ప్రత్యేక విభాగం:
ప్రస్తుతం అన్ని రకాల కార్పొరేట్ కంపెనీలు, ఎంఎన్‌సీలలో సీఎస్‌ఆర్ కార్యకలాపాల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశాయి/చేస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆయా సంస్థల్లో మిగతా విభాగాల మాదిరిగానే ఇది విడదీయరాని, తప్పనిసరి భాగమైందని చెప్పొచ్చు. ఆయా కంపెనీలు సీఎస్‌ఆర్ నిర్వహణకు సంబంధించి తేడాలు ఉంటాయి. కొన్ని కంపెనీల్లో సీఎస్‌ఆర్‌ను హెచ్‌ఆర్ విభాగం పర్యవేక్షిస్తుంటే, మరి కొన్ని కంపెనీల్లో ఎన్విరాన్‌మెంటల్ డిపార్ట్‌మెంట్‌లో భాగంగా నిర్వహిస్తున్నారు.
అర్హతలు ఇవి:
సమాజం, మావన సంబంధాలను అంతర్లీనంగా అవగాహన చేసుకునే నైపుణ్యం, సంబంధిత అంశాల్లో అకడమిక్ అర్హతలు ఉన్న వారిని కంపెనీలు సీఎస్‌ఆర్ కార్యకలాపాల కోసం నియమించుకుంటున్నాయి. ఈక్రమంలో సీఎస్‌ఆర్ రంగంలో కెరీర్ ప్రారంభించడానికి దోహదం చేసే కోర్సులు..
కొన్ని రంగాల్లో:
అన్ని రకాల కంపెనీల్లో సీఎస్‌ఆర్ విభాగాలున్నప్పటికీ.. కొన్ని సంస్థలు మాత్రం ఇతర సంస్థల కంటే విస్తృత స్థాయిలో సీఎస్‌ఆర్ కార్యకలాపాలను నిర్వహిస్తాయి. ప్రకృతిని నేరుగా ప్రభావితం చేసే రంగాలైన మైనింగ్, మాన్యుఫాక్చరింగ్, పవర్ జనరేషన్ వంటి రంగాలకు చెందిన కంపెనీలు ఈ కోవలోకి వస్తాయి.
కావల్సిన స్కిల్స్:
సీఎస్‌ఆర్ అనేది వ్యక్తిగతమైన వ్యవహారం కాదు. సమష్టిగా, జట్టుగా, సమన్వయంతో పని చేయాల్సి ఉంటుంది. అప్పుడే అనుకున్న ఫలితాలను సాధించవచ్చు. ఈ నేపథ్యంలో సమాజాన్ని అవగాహన చేసుకోవడం, భాగస్వామ్యాలను నిర్మించే నైపుణ్యం, స్టేక్ హోల్డర్లతో చక్కని సంబంధాలను కలిగి ఉండడం, వ్యూహాత్మకంగా వ్యవహరించడం వంటి అంశాలాధారంగా కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు అవసరం. అవి..
ప్రస్తుతం అన్ని కంపెనీలు/వ్యాపార సంస్థల్లో సీఎస్‌ఆర్ భాగంగా మారడంతో సంబంధిత అర్హతలు ఉన్న వారికి అవకాశాలు కూడా విస్తృత స్థాయిలో పెరుగుతున్నాయి. అంతేకాకుండా ఆసియా ఖండంలో కార్పొరేట్ వ్యవస్థల ద్వారా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్న మొదటి మూడు దేశాల్లో భారతదేశం ఒకటి కావడం కూడా
సీఎస్‌ఆర్ ప్రొఫెషనల్స్‌కు డిమాండ్ పెంచింది. వీరికి రూరల్ డెవలప్‌మెంట్, కమ్యూనిటీ మొబిలైజేషన్, మేనేజింగ్ కలెక్టివ్స్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ప్లానింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్, నేచురల్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో అవకాశాలు లభిస్తాయి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికోసం పని చేసే వివిధ ప్రైవేట్ సంస్థల్లో, ఎన్‌జీవోలలో ఉపాధి అవకాశాలు లభించవచ్చు. అంతేకాకుండా కొన్ని రకాల ప్రాజెక్ట్‌లకు సంబంధించి భూ సేకరణలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించడానికి, పునరావాస (రీసెటిల్‌మెంట్ అండ్ రిహాబలిటేషన్ -ఆర్ అండ్ ఆర్) సంబంధ అంశాలను పక్కాగా అమలు చేయడానికి కూడా సీఎస్‌ఆర్ విభాగం సేవలను కంపెనీలు వినియోగించుకుంటున్నాయి.
సంస్థలివే:
సీఎస్‌ఆర్‌కు సంబంధించి పబ్లిక్, ప్రైవేట్, ఎన్‌జీవో సంస్థల్లో అధిక శాతం ఉద్యోగ అవకాశాలు ఉంటున్నాయి. ప్రభుత్వ ఏజెన్సీలు, ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలు), ఆంతర్జాతీయ సంస్థలు, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, ఇండస్ట్రీ అసోసియేషన్స్, కార్పొరేట్/వ్యాపార సంస్థలు, ఎంఎన్‌సీలు, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా సీఎస్‌ఆర్ కోసం సంబంధిత మానవ వనరులను నియమించుకుంటున్నాయి.
జాబ్ ప్రొఫైల్:
పని చేసే సంస్థ, నిర్వహించే ప్రాజెక్ట్‌లను బట్టి వివిధ హోదాలు ఉంటాయి. అవి.. కేపాసిటీ బిల్డింగ్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, ఫీల్డ్ కో-ఆర్డినేటర్, అకడమిక్ రిసోర్సెస్ కో-ఆర్డినేటర్, ప్రోగ్రామ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్, ప్రాజెక్ట్ మేనేజర్, కమ్యూనికేషన్ మేనేజర్, ప్రోగ్రామ్ అసోసియేట్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్. ఒక ప్రాజెక్ట్‌ను చేపట్టే ముందు దాని మూలాలను అన్వేషించి.. పరిష్కారం కనుక్కునే క్రమంలో కావల్సిన వనరులు, సాంకేతిక నైపుణ్యం, సంప్రదింపులు, తదితర అంశాలను దశల వారీగా ప్రణాళిక ప్రకారం అమలు చేయడానికి ఈ నిపుణులు కృషి చేస్తారు.
వేతనాలు ఇలా:
మీరు ఏ కంపెనీలో ఎటువంటి విభాగంలో పని చేయాలనుకుంటున్నారు అనే అంశం మీద వేతనాలు ఆధారపడి ఉంటాయి. పని చేస్తున్న సంస్థను బట్టి ప్రారంభ స్థాయిలో ఉండే కో-ఆర్డినేటర్, ఎగ్జిక్యూటివ్‌లకు రూ.15 నుంచి 20 వేల మధ్య వేతనం లభిస్తుంది. తర్వాత హోదా, అనుభవం, పనితీరు ఆధారంగా రూ. 30 నుంచి రూ. 50 వేలకు పైగానే సంపాదించవచ్చు.
సోర్సెస్:
సీఎస్‌ఆర్ కార్యకలాపాలు నిర్వహించే కంపెనీ, ఫౌండేషన్, ట్రస్ట్ వెబ్‌సైట్ ద్వారా సంబంధిత ఉద్యోగాల సమాచారాన్ని తెలుసుకోవచ్చు. కొన్ని కంపెనీలు వివిధ పత్రికల్లో ప్రకటనలను ప్రచురించడం ద్వారా రిక్రూట్ చేసుకుంటాయి. జాబ్ పోర్టల్స్ ద్వారా కూడా సంబంధిత సమాచారాన్ని పొందొచ్చు.
దీర్ఘకాలిక వ్యూహం:
సీఎస్‌ఆర్‌కు సంబంధించిన చాలా విభాగాల్లో పని చేయడానికి స్పెషలిస్ట్ నాలెడ్జ్‌తోపాటు అనుభవం కూడా అవసరం. ఈ తరహా నేపథ్యం ఉన్న వారినే నియమించుకోవడానికి కార్పొరేట్ సంస్థలు ప్రాధాన్యతనిస్తాయి. కాబట్టి తదనుగుణంగా దీర్ఘకాలిక వ్యూహాన్ని అనుసరించాలి. కంపెనీలు ఆశించిన స్కిల్స్, అనుభవాన్ని పెంచుకోవాలి. ఇందుకోసం ఏదైనా సంస్థ ఆఫర్ చేసే ఇంటర్న్‌షిప్ లేదా ఏదైనా ఎన్‌జీవో చేపట్టే ప్రాజెక్ట్‌లో స్వచ్ఛందంగా పని చేయడం ద్వారా అనుభవాన్ని గడించే అవకాశం ఉంది. అంతేకాకుం డా సంబంధిత అంశంలో చోటు చేసుకుంటున్న పరిణమాలను నిరంతరంగా గమనిస్తూండాలి. ఇందుకోసం ఆన్‌లైన్ సోర్స్, పత్రిలకలను మాధ్యమంగా ఉపయోగించుకోవాలి.
సమాజ మార్పు దిశగా ఆలోచించే తత్వం ఉండాలి
ఒక సమస్యను ప్రాథమిక దశలోనే అంచనా వేయడానికి, దానికి పరిష్కారం కనుక్కునే క్రమంలో సంబంధిత ప్రజలు, ఇతర పక్షాలతో భాగస్వామ్యం నెలకొల్పడం వంటి లక్షణాలు సోషల్ వర్క్ నిపుణులకు ఉండాలి. కార్పొరేట్ కంపెనీల్లో సీఎస్‌ఆర్ తప్పనిసరిగా మారిన నేపథ్యంలో సంబంధిత నిపుణులకు అవకాశాలు గణనీయంగా పెరిగాయని చెప్పొచ్చు. వీరికి ప్రభుత్వ, ప్రైవేట్, ఎన్‌జీఓ సంస్థల్లో అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ప్రభుత్వం నిర్వహించే వివిధ పథకాల్లో సోషల్ అడిటింగ్, కమ్యూనిటీ మొబిలైజేషన్ వంటి విధులను నిర్వహించే అవకాశం కూడా ఉంటుంది. ఈ రంగంలో కెరీర్ ప్రారంభించాలంటే మాత్రం పీజీ స్థాయిలో ఉండే సోషల్ వర్క్, సంబంధిత కోర్సులను ఎంచుకోవాలి. సమాజాన్ని ప్రొఫెషనల్ దృక్ఫథంతో అవగాహన చేసుకోవడానికి సోషల్ వర్క్ కోర్సులు ఉపయోగపడతాయి. పీజీ తర్వాత సంబంధిత అంశంలో ఎంఫిల్, పీహెచ్‌డీ చేసే అవకాశం కూడా ఉంది. కేవలం ఏదో ఒక వర్గానికి పరిమితం కాకుండా అన్ని రకాల వ్యక్తులతో పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో కొన్ని నైపుణ్యాలు తప్పనిసరి. సమాజ మార్పు దిశగా ఆలోచించే తత్వం, ఆశావహ దృక్ఫథం, ప్రజలతో స్నేహంగా వ్యవహరించే సామర్థ్యం ఉన్న వారు ఈ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవచ్చు.
-ప్రొఫెసర్ లక్ష్మి లింగం,
డిప్యూటీ డెరైక్టర్, టిస్-హైదరాబాద్ క్యాంపస్.
అవకాశాలు పెరుగుతున్నాయి
సీఎస్‌ఆర్ కాన్సెప్ట్ వల్ల సోషల్ వర్క్ విద్యార్థులకు అవకాశాలు పెరుగుతున్నాయి. సోషల్ వర్క్‌కు సంబంధించి మెడికల్ సైకియాట్రిక్, కమ్యూనిటీ మొబిలైజేషన్, ఉమెన్ వెల్ఫేర్, హెచ్‌ఆర్‌ఎం తదితర స్పెషలైజేషన్లు ఉన్నాయి. వీరికి ఎన్‌జీఓలు, పారిశ్రామిక సంస్థలు, హాస్పిటల్స్, కార్పొరేట్ సంస్థలు, స్కూల్స్‌తోపాటు ప్రభుత్వ విభాగాలు సాంఘిక సంక్షేమ శాఖ, వెలుగు ప్రాజెక్ట్‌లలో కూడా అవకాశాలు ఉంటాయి. ప్రారంభంలో రూ. 8 వేల నుంచి 20 వేల మధ్య వేతనాలు అందుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మా యూనివర్సిటీలో సోషల్ వర్క్ కోర్సు హాట్ కేక్. ఈ కోర్సు చేసిన వారికి 100 శాతం ప్లేస్‌మెంట్స్ లభిస్తున్నాయి.
-డా॥అశోక్ కుమార్,
అసిస్టెంట్ ప్రొఫెసర్,
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ.
కోర్సులు ఆఫర్ చేస్తున్న సంస్థలు:
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్
వెబ్‌సైట్: www.tiss.edu
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్-ఆనంద్
వెబ్‌సైట్: www.irma.ac.in
జేవియర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సర్వీస్-రాంచీ
వెబ్‌సైట్: www.xiss.ac.in
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్-హైదరాబాద్
వెబ్‌సైట్:www.nird.org.in
జేవియర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-భువనేశ్వర్
వెబ్‌సైట్: www.ximb.ac.in
గాంధీ గ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్-తమిళనాడు
వెబ్‌సైట్: www.ruraluniv.ac.in
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ-న్యూఢిల్లీ
వెబ్‌సైట్: www.ignou.ac.in
విశ్వభారతి-పశ్చిమ బెంగాల్
వెబ్‌సైట్: www.visvabharati.ac.in
ఢిల్లీ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.du.ac.in
ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్
వెబ్‌సైట్: www.osmania.ac.in
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ-గుంటూరు
వెబ్‌సైట్: www.nagarjunauniversity.ac.in

- ఎంబీఏ రూరల్ డెవలప్‌మెంట్
- మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (ఎంఎస్‌డబ్ల్యూ)
- పీజీ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్‌మెంట్
కొన్ని రంగాల్లో:
అన్ని రకాల కంపెనీల్లో సీఎస్‌ఆర్ విభాగాలున్నప్పటికీ.. కొన్ని సంస్థలు మాత్రం ఇతర సంస్థల కంటే విస్తృత స్థాయిలో సీఎస్‌ఆర్ కార్యకలాపాలను నిర్వహిస్తాయి. ప్రకృతిని నేరుగా ప్రభావితం చేసే రంగాలైన మైనింగ్, మాన్యుఫాక్చరింగ్, పవర్ జనరేషన్ వంటి రంగాలకు చెందిన కంపెనీలు ఈ కోవలోకి వస్తాయి.
కావల్సిన స్కిల్స్:
సీఎస్‌ఆర్ అనేది వ్యక్తిగతమైన వ్యవహారం కాదు. సమష్టిగా, జట్టుగా, సమన్వయంతో పని చేయాల్సి ఉంటుంది. అప్పుడే అనుకున్న ఫలితాలను సాధించవచ్చు. ఈ నేపథ్యంలో సమాజాన్ని అవగాహన చేసుకోవడం, భాగస్వామ్యాలను నిర్మించే నైపుణ్యం, స్టేక్ హోల్డర్లతో చక్కని సంబంధాలను కలిగి ఉండడం, వ్యూహాత్మకంగా వ్యవహరించడం వంటి అంశాలాధారంగా కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు అవసరం. అవి..
- బిజినెస్ స్కిల్స్ (కమ్యూనికేషన్ స్కిల్స్, నిర్ణయాత్మక సామర్థ్యం, వినూత్న ఆలోచన, నాయకత్వ లక్షణాలు, సంక్లిష్టతను తట్టుకునే సామర్థ్యం, సమస్యను సాధించడంలో నేర్పు)
- పీపుల్ స్కిల్స్ (భిన్న పరిసరాలకనుగుణంగా ఒదిగి పోవడం, దయ, విశాల దృక్పథం, ఇతరులను ప్రభావితం చేసే నేర్పు, సామాజిక అవగాహన, సహ భాగస్వామ్యాన్ని నిర్మించే తత్వం, జట్టుగా పని చేసే నేర్పు, ప్రశ్నించే తత్వం)
- టెక్నికల్ స్కిల్స్ (వివిధ అంశాల ప్రభావాన్ని అంచనా వేయడం, స్టేక్ హోల్డర్లతో చర్చించే నైపుణ్యం, మానవ హక్కులు, ధారణత (సస్టైనబిలిటీ) వంటి అంశాలను అవగాహన చేసుకునే నేర్పు)
ప్రస్తుతం అన్ని కంపెనీలు/వ్యాపార సంస్థల్లో సీఎస్‌ఆర్ భాగంగా మారడంతో సంబంధిత అర్హతలు ఉన్న వారికి అవకాశాలు కూడా విస్తృత స్థాయిలో పెరుగుతున్నాయి. అంతేకాకుండా ఆసియా ఖండంలో కార్పొరేట్ వ్యవస్థల ద్వారా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్న మొదటి మూడు దేశాల్లో భారతదేశం ఒకటి కావడం కూడా
సీఎస్‌ఆర్ ప్రొఫెషనల్స్‌కు డిమాండ్ పెంచింది. వీరికి రూరల్ డెవలప్‌మెంట్, కమ్యూనిటీ మొబిలైజేషన్, మేనేజింగ్ కలెక్టివ్స్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ప్లానింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్, నేచురల్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో అవకాశాలు లభిస్తాయి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికోసం పని చేసే వివిధ ప్రైవేట్ సంస్థల్లో, ఎన్‌జీవోలలో ఉపాధి అవకాశాలు లభించవచ్చు. అంతేకాకుండా కొన్ని రకాల ప్రాజెక్ట్‌లకు సంబంధించి భూ సేకరణలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించడానికి, పునరావాస (రీసెటిల్‌మెంట్ అండ్ రిహాబలిటేషన్ -ఆర్ అండ్ ఆర్) సంబంధ అంశాలను పక్కాగా అమలు చేయడానికి కూడా సీఎస్‌ఆర్ విభాగం సేవలను కంపెనీలు వినియోగించుకుంటున్నాయి.
సంస్థలివే:
సీఎస్‌ఆర్‌కు సంబంధించి పబ్లిక్, ప్రైవేట్, ఎన్‌జీవో సంస్థల్లో అధిక శాతం ఉద్యోగ అవకాశాలు ఉంటున్నాయి. ప్రభుత్వ ఏజెన్సీలు, ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలు), ఆంతర్జాతీయ సంస్థలు, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, ఇండస్ట్రీ అసోసియేషన్స్, కార్పొరేట్/వ్యాపార సంస్థలు, ఎంఎన్‌సీలు, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా సీఎస్‌ఆర్ కోసం సంబంధిత మానవ వనరులను నియమించుకుంటున్నాయి.
జాబ్ ప్రొఫైల్:
పని చేసే సంస్థ, నిర్వహించే ప్రాజెక్ట్‌లను బట్టి వివిధ హోదాలు ఉంటాయి. అవి.. కేపాసిటీ బిల్డింగ్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, ఫీల్డ్ కో-ఆర్డినేటర్, అకడమిక్ రిసోర్సెస్ కో-ఆర్డినేటర్, ప్రోగ్రామ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్, ప్రాజెక్ట్ మేనేజర్, కమ్యూనికేషన్ మేనేజర్, ప్రోగ్రామ్ అసోసియేట్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్. ఒక ప్రాజెక్ట్‌ను చేపట్టే ముందు దాని మూలాలను అన్వేషించి.. పరిష్కారం కనుక్కునే క్రమంలో కావల్సిన వనరులు, సాంకేతిక నైపుణ్యం, సంప్రదింపులు, తదితర అంశాలను దశల వారీగా ప్రణాళిక ప్రకారం అమలు చేయడానికి ఈ నిపుణులు కృషి చేస్తారు.
వేతనాలు ఇలా:
మీరు ఏ కంపెనీలో ఎటువంటి విభాగంలో పని చేయాలనుకుంటున్నారు అనే అంశం మీద వేతనాలు ఆధారపడి ఉంటాయి. పని చేస్తున్న సంస్థను బట్టి ప్రారంభ స్థాయిలో ఉండే కో-ఆర్డినేటర్, ఎగ్జిక్యూటివ్‌లకు రూ.15 నుంచి 20 వేల మధ్య వేతనం లభిస్తుంది. తర్వాత హోదా, అనుభవం, పనితీరు ఆధారంగా రూ. 30 నుంచి రూ. 50 వేలకు పైగానే సంపాదించవచ్చు.
సోర్సెస్:
సీఎస్‌ఆర్ కార్యకలాపాలు నిర్వహించే కంపెనీ, ఫౌండేషన్, ట్రస్ట్ వెబ్‌సైట్ ద్వారా సంబంధిత ఉద్యోగాల సమాచారాన్ని తెలుసుకోవచ్చు. కొన్ని కంపెనీలు వివిధ పత్రికల్లో ప్రకటనలను ప్రచురించడం ద్వారా రిక్రూట్ చేసుకుంటాయి. జాబ్ పోర్టల్స్ ద్వారా కూడా సంబంధిత సమాచారాన్ని పొందొచ్చు.
దీర్ఘకాలిక వ్యూహం:
సీఎస్‌ఆర్‌కు సంబంధించిన చాలా విభాగాల్లో పని చేయడానికి స్పెషలిస్ట్ నాలెడ్జ్‌తోపాటు అనుభవం కూడా అవసరం. ఈ తరహా నేపథ్యం ఉన్న వారినే నియమించుకోవడానికి కార్పొరేట్ సంస్థలు ప్రాధాన్యతనిస్తాయి. కాబట్టి తదనుగుణంగా దీర్ఘకాలిక వ్యూహాన్ని అనుసరించాలి. కంపెనీలు ఆశించిన స్కిల్స్, అనుభవాన్ని పెంచుకోవాలి. ఇందుకోసం ఏదైనా సంస్థ ఆఫర్ చేసే ఇంటర్న్‌షిప్ లేదా ఏదైనా ఎన్‌జీవో చేపట్టే ప్రాజెక్ట్‌లో స్వచ్ఛందంగా పని చేయడం ద్వారా అనుభవాన్ని గడించే అవకాశం ఉంది. అంతేకాకుం డా సంబంధిత అంశంలో చోటు చేసుకుంటున్న పరిణమాలను నిరంతరంగా గమనిస్తూండాలి. ఇందుకోసం ఆన్‌లైన్ సోర్స్, పత్రిలకలను మాధ్యమంగా ఉపయోగించుకోవాలి.
సమాజ మార్పు దిశగా ఆలోచించే తత్వం ఉండాలి
ఒక సమస్యను ప్రాథమిక దశలోనే అంచనా వేయడానికి, దానికి పరిష్కారం కనుక్కునే క్రమంలో సంబంధిత ప్రజలు, ఇతర పక్షాలతో భాగస్వామ్యం నెలకొల్పడం వంటి లక్షణాలు సోషల్ వర్క్ నిపుణులకు ఉండాలి. కార్పొరేట్ కంపెనీల్లో సీఎస్‌ఆర్ తప్పనిసరిగా మారిన నేపథ్యంలో సంబంధిత నిపుణులకు అవకాశాలు గణనీయంగా పెరిగాయని చెప్పొచ్చు. వీరికి ప్రభుత్వ, ప్రైవేట్, ఎన్‌జీఓ సంస్థల్లో అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ప్రభుత్వం నిర్వహించే వివిధ పథకాల్లో సోషల్ అడిటింగ్, కమ్యూనిటీ మొబిలైజేషన్ వంటి విధులను నిర్వహించే అవకాశం కూడా ఉంటుంది. ఈ రంగంలో కెరీర్ ప్రారంభించాలంటే మాత్రం పీజీ స్థాయిలో ఉండే సోషల్ వర్క్, సంబంధిత కోర్సులను ఎంచుకోవాలి. సమాజాన్ని ప్రొఫెషనల్ దృక్ఫథంతో అవగాహన చేసుకోవడానికి సోషల్ వర్క్ కోర్సులు ఉపయోగపడతాయి. పీజీ తర్వాత సంబంధిత అంశంలో ఎంఫిల్, పీహెచ్‌డీ చేసే అవకాశం కూడా ఉంది. కేవలం ఏదో ఒక వర్గానికి పరిమితం కాకుండా అన్ని రకాల వ్యక్తులతో పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో కొన్ని నైపుణ్యాలు తప్పనిసరి. సమాజ మార్పు దిశగా ఆలోచించే తత్వం, ఆశావహ దృక్ఫథం, ప్రజలతో స్నేహంగా వ్యవహరించే సామర్థ్యం ఉన్న వారు ఈ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవచ్చు.
-ప్రొఫెసర్ లక్ష్మి లింగం,
డిప్యూటీ డెరైక్టర్, టిస్-హైదరాబాద్ క్యాంపస్.
అవకాశాలు పెరుగుతున్నాయి
సీఎస్‌ఆర్ కాన్సెప్ట్ వల్ల సోషల్ వర్క్ విద్యార్థులకు అవకాశాలు పెరుగుతున్నాయి. సోషల్ వర్క్‌కు సంబంధించి మెడికల్ సైకియాట్రిక్, కమ్యూనిటీ మొబిలైజేషన్, ఉమెన్ వెల్ఫేర్, హెచ్‌ఆర్‌ఎం తదితర స్పెషలైజేషన్లు ఉన్నాయి. వీరికి ఎన్‌జీఓలు, పారిశ్రామిక సంస్థలు, హాస్పిటల్స్, కార్పొరేట్ సంస్థలు, స్కూల్స్‌తోపాటు ప్రభుత్వ విభాగాలు సాంఘిక సంక్షేమ శాఖ, వెలుగు ప్రాజెక్ట్‌లలో కూడా అవకాశాలు ఉంటాయి. ప్రారంభంలో రూ. 8 వేల నుంచి 20 వేల మధ్య వేతనాలు అందుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మా యూనివర్సిటీలో సోషల్ వర్క్ కోర్సు హాట్ కేక్. ఈ కోర్సు చేసిన వారికి 100 శాతం ప్లేస్‌మెంట్స్ లభిస్తున్నాయి.
-డా॥అశోక్ కుమార్,
అసిస్టెంట్ ప్రొఫెసర్,
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ.
కోర్సులు ఆఫర్ చేస్తున్న సంస్థలు:
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్
వెబ్‌సైట్: www.tiss.edu
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్-ఆనంద్
వెబ్‌సైట్: www.irma.ac.in
జేవియర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సర్వీస్-రాంచీ
వెబ్‌సైట్: www.xiss.ac.in
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్-హైదరాబాద్
వెబ్‌సైట్:www.nird.org.in
జేవియర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-భువనేశ్వర్
వెబ్‌సైట్: www.ximb.ac.in
గాంధీ గ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్-తమిళనాడు
వెబ్‌సైట్: www.ruraluniv.ac.in
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ-న్యూఢిల్లీ
వెబ్‌సైట్: www.ignou.ac.in
విశ్వభారతి-పశ్చిమ బెంగాల్
వెబ్‌సైట్: www.visvabharati.ac.in
ఢిల్లీ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.du.ac.in
ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్
వెబ్‌సైట్: www.osmania.ac.in
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ-గుంటూరు
వెబ్‌సైట్: www.nagarjunauniversity.ac.in
Published date : 16 Sep 2013 02:56PM