Skip to main content

కెరీర్ గైడెన్స్..హోమ్ సైన్స్

మారుతున్న పరిసరాలకనుగుణంగా మానవ వనరులను తీర్చిదిద్దడం కోసం గత కొంత కాలంగా సైన్స్ విభాగంలో ఎన్నో కొత్త కోర్సుల ఆవిర్భావం జరిగింది. అలాంటి వాటిల్లో ఇటీవలి కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చిన కోర్సుల్లో హోమ్ సైన్స్ ఒకటి.

హోమ్ సైన్స్ అంటే:
గృహ, కుటుంబ జీవితాన్ని మరింత మెరుగ్గా తీర్చుదిద్దుకోవడం కోసం రూపొందించిన కోర్సు హోమ్ సైన్స్. ఈ క్రమంలో ఎదురయ్యే సమస్యలను అవగాహన చేసుకోవడం, వాటికి శాస్త్రీయ దక్ఫథంతో పరిష్కారాలను కనుక్కోవడం వంటి అంశాలను ఈ కోర్సులో బోధిస్తారు. అంతేకాకుండా మారుతున్న జీవన విధానానికి తగ్గట్టు విద్యార్థినులను తీర్చిదిద్దడమే కాకుండా వారికి జీవనోపాధిని కల్పించే విధంగా కోర్సు రూపకల్పన ఉంటుంది.

కేవలం మహిళలకే:
ఈ కోర్సుకు కేవలం మహిళ అభ్యర్థులు మాత్రమే అర్హులు. నాలుగేళ్ల కోర్సులో.. మొదటి రెండేళ్లు ఐదు సబ్జెకులు కామన్‌గా ఉంటాయి. మూడో ఏడాది నుంచి ఏదో ఒక స్పెషలైజేషన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అవి..
  1. ఫుడ్ అండ్ న్యూట్రిషన్
  2. ఫ్యామిలీ రిసోర్స్ మేనేజ్‌మెంట్
  3. హోమ్ సైన్స్ ఎక్స్‌టెన్షన్ అండ్ కమ్యూనికేషన్ మేనేజ్‌మెంట్
  4. హ్యూమన్ డెవలప్‌మెంట్ అండ్ ఫ్యామిలీ స్టడీస్
  5. టెక్స్‌టైల్స్ అండ్ అపెరల్ డిజైనింగ్
ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
మన రాష్ట్రంలో కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్స్ (ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ)-సైఫాబాద్, హైదరాబాద్ మాత్రమే బీఎస్సీ (ఆనర్స్-హోమ్ సైన్స్) కోర్సును ఆఫర్ చేస్తుంది.
సీట్ల సంఖ్య: 100

అర్హత:
ఫిజికల్ సెన్సైస్, బయాలజికల్ సెన్సైస్, మ్యాథమెటిక్స్‌లలో ఏదేని ఒక కాంబినేషన్‌తో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. పల్లెల్లో పదో తరగతి వరకూ చదివి, కనీసం మూడు ఎకరాల పొలం ఉన్న రైతుల సంతానానికి ‘రైతుల కోటా’లో 40 శాతం సీట్లను కేటాయిస్తారు.
ప్రవేశం: మెరిట్ ఆధారంగా.
వివరాలకు: www.angrau.net

ఉన్నత విద్య:
బ్యాచిలర్ డిగ్రీ తర్వాత వివిధ రకాల స్పెషలైజేషన్స్‌తో పీజీ కోర్సులను చదివే అవకాశం ఉంది. తర్వాత ఆసక్తి ఉంటే పీహెచ్‌డీ కూడా చేయవచ్చు. ఈ క్రమంలో ఉండే స్పెషలైజేషన్లు..
పీజీ:
  1. న్యూట్రిషన్ అండ్ డైటిటిక్స్
  2. అపెరల్స్ అండ్ టెక్స్‌టైల్స్
  3. చైల్డ్ గెడైన్స్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలింగ్
  4. ఇంటీరియర్ డిజైన్
ఎంఎస్సీ(హోమ్ సెన్స్) కోర్సును ఆఫర్ చేస్తున్న వర్సిటీలు:
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి.
వెబ్‌సైట్: www.svuniversity.in

ఆచార్య ఎన్‌జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ-హైదరాబాద్.
వెబ్‌సైట్: www.angrau.net

శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్- అనంతపూర్ క్యాంపస్.
వెబ్‌సైట్: https://sssihl.edu.in

పీహెచ్‌డీ స్పెషలైజేషన్స్:
  1. ఫుడ్ అండ్ న్యూట్రిషన్
  2. హ్యూమన్ డెవలప్‌మెంట్ అండ్ ఫ్యామిలీ స్టడీస్
  3. రిసోర్స్ మేనేజ్‌మెంట్ అండ్ క న్జ్యూమర్ సెన్సైస్
  4. అపెరల్ అండ్ టెక్స్‌టైల్స్
  5. ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేషన్
అవకాశాలు:
హోమ్ సైన్స్ చేసిన వారికి అవకాశాలకు కొదవ లేదు. ఈ రంగంలో డిమాండ్, సప్లయ్ వ్యత్యాసం దాదాపు 60-40 ఉంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ప్రొడక్షన్ ఇండస్ట్రీ, టూరిజం, సర్వీస్ సెక్టార్, డాబర్ వంటి ఫుడ్ మేకింగ్ పరిశ్రమలు, ఆహార ఉత్పత్తుల మార్కెటింగ్ తదితర రంగాల్లో.. వివిధ హోదాల్లో అవకాశాలు ఉంటాయి. పరిశోధన రంగంలో రీసెర్చ్ అసోసియేట్, ఫుడ్ సైంటిస్ట్‌గా స్థిరపడొచ్చు. పీజీ పూర్తి చేస్తే టీచింగ్, రీసెర్చ్ ఫెలోషిప్ అవకాశాలు పుష్కలం. యూజీ స్థాయిలో ఎంచుకున్న స్పెషలైజేషన్ ఆధారంగా ఉద్యోగాలు లభిస్తాయి. ఉదాహరణకు న్యూట్రిషన్ అండ్ డైటిటిక్స్ స్పెషలైజేషన్‌తో డైటీషియన్స్‌గా స్థిరపడొచ్చు. ప్రభుత్వ రంగంలో కూడా మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు లభిస్తాయి. రీసెర్చ్ అనలిస్ట్, న్యూట్రిషన్ కన్సల్టెంట్‌గా, ఇంటీరియర్ డిజైనర్‌గా సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ అర్హతగా ప్రభుత్వం నిర్వహించే.. సివిల్స్, గ్రూప్-1,2 వంటి అన్ని రకాల ఉద్యోగ నియామక పరీక్షలకు హాజరు కావచ్చు.

వేతనాలు:
బ్యాచిలర్ డిగ్రీ అభ్యర్థులకు కెరీర్ ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి 20 వేల వరకు వేతనం లభిస్తుంది. చదువు, అనుభవం ఆధారంగా తర్వాత నెలకు రూ.40 వేల వరకు సంపాదించవచ్చు.
Published date : 08 Apr 2013 03:58PM

Photo Stories