ఇంటర్ తర్వాత.. ఉజ్వల భవితకు 24ఎంట్రెన్స్‌లు
Sakshi Education
విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన దశ ఇంటర్మీడియెట్. కెరీర్‌కు పునాది పడేది ఇక్కడే. దేశవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్‌ను పూర్తిచేసుకొని ఉన్నత విద్య దిశగా అడుగులేస్తున్నారు. మన రాష్ట్రంలో వీరి సంఖ్య దాదాపు 10 లక్షలు. ఇంటర్ ఉత్తీర్ణులైన వారికి లెక్కలేనన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్, మెడిసిన్, బీడీఎస్, బీఫార్మసీ, ఫార్మ్‌డీ, అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్, ఫిషరీసైన్స్, బీఆర్క్, హోటల్ మేనేజ్‌మెంట్, లా వంటి కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే ప్రవేశపరీక్షలనే మైలురాళ్లను దాటాలి. ఈ నేపథ్యంలో ఇంటర్ తర్వాత.. ముఖ్యమైన ప్రవేశపరీక్షలను తెలుసుకుందాం.
ఇంజనీరింగ్ ఎంట్రెన్స్‌లు..
జేఈఈ మెయిన్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)లు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో బీఈ/బీటెక్/బీఆర్క్/బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే జేఈఈ మెయిన్‌తోపాటు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలోనూ ర్యాంక్ సాధించాలి.
అర్హత: 2012, 2013లో కనీసం 45 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం) ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణులు మాత్రమే అర్హులు. 2014 మార్చిలో పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారూ అర్హులే.
వయోపరిమితి: అక్టోబర్ 1, 1989 తర్వాత జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, శారీరక వికలాంగులకు వయో పరిమితిలో ఐదేళ్లు సడలింపు ఉంటుంది.
ప్రవేశం కల్పిస్తున్న సంస్థలు: 30 ఎన్‌ఐటీలు, 5 కేంద్ర ప్రభుత్వ సంస్థలతోపాటు కొన్ని రాష్ట్రాలు, కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు కూడా మెయిన్ ర్యాంకింగ్‌ను పరిగణనలోకి తీసుకొంటున్నాయి. ఇవేకాకుండా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగళూరు), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (తిరువనంతపురం) జేఈఈ మెయిన్ ర్యాంక్ ఆధారంగా యూజీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి.
పరీక్ష విధానం: పరీక్ష రెండు పేపర్లుగా ఉంటుంది. బీఈ/బీటెక్ కోర్సుల కోసం పేపర్-1 రాయాలి. ఇది ఆన్‌లైన్/పెన్-పేపర్ విధానాల్లో ఉంటుంది. బీఆర్క్/బీప్లానింగ్ కోర్సుల కోసం పేపర్-2 రాయాలి. ఇది కేవలం పేపర్- పెన్ ఆధారిత పరీక్ష. పేపర్-1లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలపై మల్టిపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నలుంటాయి. మూడు విభాగాలపై సమాన స్థాయిలో ప్రశ్నలుంటాయి. పేపర్-2లో మ్యాథమెటిక్స్, ఆప్టిట్యూడ్ టెస్ట్, డ్రాయింగ్ టెస్ట్ ఉంటాయి. ఒక్కో పేపర్ పరీక్ష కాల వ్యవధి మూడు గంటలు.
ప్రవేశం: ర్యాంక్ ఆధారంగా. ఈ క్రమంలో జేఈఈ మెయిన్ ర్యాంక్‌కు 60 శాతం వెయిటేజ్, ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజ్ ఇచ్చి మెరిట్ లిస్ట్ తయారుచేస్తారు.
ఆన్‌లైన్ పరీక్ష తేదీ: ఏప్రిల్ 9, 11, 12, 19
వెబ్‌సైట్: jeemain.nic.in
జేఈఈ అడ్వాన్స్‌డ్
16 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలతోపాటు ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ - ధన్‌బాద్‌లో బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశించాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించాలి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించాలంటే జేఈఈ మెయిన్ పేపర్-1లో మొదటి 1,50,000 మంది ర్యాంకర్‌లలో చోటు దక్కించుకోవాలి. ప్రవేశం పొందాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంక్‌తోపాటు ఆయా రాష్ట్రాల ఇంటర్ బోర్డ్ పరీక్షల్లో టాప్-20 పర్సంటైల్‌లో నిలవాలి.
వయో పరిమితి: అక్టోబర్ 1, 1989 తర్వాత జన్మించి ఉండాలి.
పరీక్ష విధానం: జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ వ్యవధి మూడు గంటలు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలపై మల్టిపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నలుంటాయి. అభ్యర్థి విషయావగాహన శక్తిని, తార్కిక, విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా,
దరఖాస్తుల ప్రారంభం: మే 4 నుంచి మే 9 వరకు
పరీక్ష తేదీ: మే 25, 2014,
వెబ్‌సైట్: www.jeeadv.iitd.ac.in
ఎంసెట్
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ/ప్రైవేట్ కళాశాలల్లో బీఈ/బీటెక్, ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీఎన్‌వైఎస్, బీఎస్సీ (అగ్రికల్చర్), బీవీఎస్సీ, బీఎస్సీ (హార్టికల్చర్), బీఫార్మసీ ఫార్మ్ డీ వంటి కోర్సుల్లో ప్రవేశానికి ఎంసెట్ నిర్వహిస్తారు.
అర్హత: ఇంజనీరింగ్ విభాగానికి 45 శాతం (ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం) మార్కులతో ఇంటర్ ఎంపీసీ, మెడికల్ విభాగానికి 50 శాతం మార్కులతో ఇంటర్ బైపీసీ, ఇంగ్లిష్ ఉత్తీర్ణత.
పరీక్ష: ఇంజనీరింగ్ విభాగంలో పరీక్ష రాసేవారికి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలపై 160 ప్రశ్నలుంటాయి. మ్యాథ్స్ నుంచి 80, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 40 ప్రశ్నల చొప్పున అడుగుతారు. మెడికల్/అగ్రికల్చర్ విభాగంలో.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీలపై ప్రశ్నలుంటాయి. ప్రతి భాగంలో 40 ప్రశ్నల చొప్పున మొత్తం ప్రశ్నలు 160. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. వ్యవధి మూడు గంటలు.
అపరాధ రుసుంతో ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 18, 2014
పరీక్ష తేదీ: మే 22, 2014,
వెబ్‌సైట్: www.apeamcet.org
సీవోఎంఈడీకే
కర్ణాటకలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో బీఈ కోర్సుల్లో ప్రవేశానికి కన్సార్టియం ఆఫ్ మెడికల్, ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక (సీవోఎంఈడీకే) యూజీఈటీ నిర్వహిస్తోంది.
అర్హత: 45 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణత.
పరీక్ష: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌లపై మొత్తం 180 ప్రశ్నలు ఉంటాయి. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 12, 2014
పరీక్ష తేదీ: మే 11, 2014,
వెబ్‌సైట్: www.comedk.org
బిట్‌శాట్
పిలానీ, హైదరాబాద్, గోవాలో ఉన్న బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ క్యాంపస్‌ల్లో ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశానికి బిట్‌శాట్ నిర్వహిస్తారు.
అర్హతలు: 75 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణత. ఒక్కో సబ్జెక్టులో కనీసం 60 శాతం మార్కులుండాలి.
పరీక్ష: మూడు గంటల వ్యవధిలో కంప్యూటర్ బేస్డ్ విధానంలో జరిగే పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ, లాజికల్ రీజనింగ్, మ్యాథమెటిక్స్‌లపై మొత్తం 150 ప్రశ్నలుంటాయి. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులుంటాయి.
ఎంపిక: మెరిట్ ఆధారంగా..,
పరీక్ష తేదీలు: మే 14 నుంచి మే 29 వరకు
వెబ్‌సైట్: www.bitsadmission.com
ఎస్‌ఆర్‌ఎం ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్
కాంచీపురంలో ఉన్న ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ బీటెక్ కోర్సులో ప్రవేశానికి ప్రతిఏటా ప్రవేశ పరీక్ష (ఎస్‌ఆర్‌ఎంఈఈ)ను నిర్వహిస్తోంది.
అర్హతలు: 70 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణత.
ఎంపిక: ఎస్‌ఆర్‌ఎంఈఈ ర్యాంక్ ఆధారంగా.
పేపర్-పెన్సిల్ పరీక్ష తేదీ: ఏప్రిల్ 27, 2014
కంప్యూటర్ బేస్డ్ పరీక్ష: ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 22 వరకు
వెబ్‌సైట్: www.srmuniv.ac.in
వీఐటీ ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్
విశ్వవిద్యాలయ హోదా పొందిన వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి వీఐటీఈఈఈను నిర్వహిస్తోంది.
అర్హతలు: 60 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణత.
పరీక్ష: కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో 120 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. నెగెటివ్ మార్కులు లేవు. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు.
ఎంపిక: వీఐటీఈఈఈ ర్యాంక్ ఆధారంగా.
పరీక్ష తేదీలు: ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 20 వరకు
వెబ్‌సైట్: www.vit.ac.in
నాటా
దేశంలోని ప్రముఖ ఆర్కిటెక్చర్ కళాశాలల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్) కోర్సుల్లో ప్రవేశాలకు నాటా (నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్) రాయాలి. దీన్ని న్యూఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రతి ఏటా నిర్వహిస్తోంది.
అర్హత: మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్‌గా 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత.
పరీక్ష విధానం: పరీక్ష రెండు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం పేపర్ బేస్డ్ డ్రాయింగ్ టెస్ట్ కాగా, రెండో భాగం ఆన్‌లైన్ టెస్ట్. పరీక్షలో అభ్యర్థి డ్రాయింగ్ స్కిల్స్, పరిశీలన దృక్పథం, సెన్స్ ఆఫ్ ప్రొపర్షన్, యాస్థటిక్ సెన్సివిటీ, క్రిటికల్ థింకింగ్ ఎబిలిటీని పరీక్షిస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 31.
పరీక్ష తేదీలు: మొదటి దశ
మార్చి 14 - మే 25 వరకు,
రెండో దశ జూన్ 1 - ఆగస్టు 31 వరకు.
వెబ్‌సైట్: www.nata.in
వైద్య విద్య ప్రవేశ పరీక్షలు
ఎయిమ్స్ - న్యూఢిల్లీ
1956లో పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడిన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా పేరుగాంచింది. దీనికి న్యూఢిల్లీలో ప్రధాన క్యాంపస్ ఉంది. ఈ ఏడాది నుంచి కొత్తగా మరో ఆరు ఎయిమ్స్‌ల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. అవి.. పాట్నా (బీహార్), భోపాల్ (మధ్యప్రదేశ్), జోధ్‌పూర్ (రాజస్థాన్), రిషికేశ్ (ఉత్తరాఖండ్), భువనేశ్వర్ (ఒడిశా), రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్). వీటిల్లో ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశానికి ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు.
మొత్తం సీట్లు: ఎయిమ్స్ - ఢిల్లీలో 72, మిగిలినవాటిలో ఒక్కోదానిలో 100 చొప్పున సీట్లుంటాయి.
అర్హతలు: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం (ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం) మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత.
వయోపరిమితి: డిసెంబర్ 31 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి.
పరీక్ష విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ విధానాల్లో నిర్వహిస్తారు. మూడున్నర గంటల వ్యవధిలో నిర్వహించే పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో అడుగుతారు. ఫిజిక్స్ (60 ప్రశ్నలు), కెమిస్ట్రీ (60 ప్రశ్నలు), బయాలజీ (బోటనీ అండ్ జువాలజీ 60 ప్రశ్నలు), జనరల్ నాలెడ్జ్ (20)లపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు. అదేవిధంగా తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగెటివ్ మార్కులుంటాయి. ఒక్కో ప్రశ్నకు సరైన సమాధానాలకిచ్చే మార్కుల్లోంచి 1/3 మార్కులను తగ్గిస్తారు.
ఎంపిక: ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంక్ ఆధారంగా..
మన రాష్ట్రంలో పరీక్ష కేంద్రం: హైదరాబాద్
పరీక్ష తేదీ: జూన్ 1, 2014,
వెబ్‌సైట్: www.aiims.edu
ఏఐపీఎంటీ
దేశవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత వైద్య, దంత కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి సీబీఎస్‌ఈ నిర్వహించే పరీక్ష.. ఆలిండియా ప్రీ-మెడికల్/ప్రీ డెంటల్ టెస్ట్. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న వైద్య, దంత కళాశాలల్లో 15 శాతం సీట్లను భర్తీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్ సెంట్రల్ పూల్‌లో చేరనందువల్ల ఈ రాష్ట్రాల విద్యార్థులు అర్హులు కాదు. అయితే ఈ ఏడాది నుంచి ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కళాశాల - పుణె, బెనారస్ హిందూ యూనివర్సిటీ ఏఐపీఎంటీ ర్యాంక్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నందువల్ల మన రాష్ట్ర విద్యార్థులు పరీక్ష రాయొచ్చు. ప్రవేశం ఈ రెండింటికి మాత్రమే పరిమితం.
అర్హతలు: 50 శాతం మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణత, వయోపరిమితి: డిసెంబర్ 31 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. 25 ఏళ్లు మించరాదు.
పరీక్ష విధానం: మూడు గంటల వ్యవధిలో నిర్వహించే పరీక్షలో మొత్తం 180 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలన్నీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ, జువాలజీ)ల నుంచి అడుగుతారు.
పరీక్ష తేదీ: మే 4, 2014,
వెబ్‌సైట్: www.aipmt.nic.in
సీఎంసీ-వెల్లూర్
దేశంలోనే మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ.. క్రిస్టియన్ మెడికల్ కాలేజ్(సీఎంసీ)-వెల్లూర్. ఎంబీబీఎస్‌లో ప్రవేశానికి ప్రతి ఏటా ప్రవేశపరీక్ష నిర్వహిస్తోంది.
అర్హత: 60 శాతం మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణత.

ఎంపిక: మొదటి దశలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. రెండు గంటల వ్యవధిలో నిర్వహించే పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీల నుంచి ప్రశ్నలడుగుతారు. ప్రతి సబ్జెక్టు నుంచి 60 ప్రశ్నలుంటాయి. దీంతోపాటు జనరల్ ఎబిలిటీ టెస్ట్‌ను కూడా నిర్వహిస్తారు. ఇందులో సాధించిన ర్యాంకు ఆధారంగా ఇంటర్వ్యూకు పిలుస్తారు.
పరీక్ష తేదీ: మే 23, 2014,
వెబ్‌సైట్: www.cmch-vellore.edu
శ్రీరామచంద్ర యూనివర్సిటీ
చెన్నైలో ఉన్న శ్రీరామచంద్ర యూనివర్సిటీ ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రతి ఏటా ప్రవేశపరీక్షను నిర్వహిస్తోంది. కోర్సులు: ఎంబీబీఎస్, బీడీఎస్
అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: నిర్దేశిత తేదీనాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి.
ఎంపిక: ప్రవేశపరీక్ష ద్వారా, దరఖాస్తులకు చివరి తేదీ: మే 15, 2014
ప్రవేశపరీక్ష: జూన్ 1, 2014,
వెబ్‌సైట్: www.sriramachandra.edu.in
సీవోఎంఈడీకే
సీవోఎంఈడీకే నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశం పొందొచ్చు.

పరీక్ష విధానం: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్‌లపై 240 ప్రశ్నలు అడుగుతారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 12, 2014 పరీక్ష తేదీ: మే 11, 2014
వెబ్‌సైట్: www.comedk.org
జిప్‌మర్ - పుదుచ్చేరి
మన రాష్ట్రం నుంచి ఎక్కువ మంది విద్యార్థులు హాజరయ్యే పరీక్షల్లో ఒకటి.. జిప్‌మర్ ఎంబీబీఎస్ ఎంట్రెన్స్ ఎగ్జామ్. పుదుచ్చేరిలో ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రతి ఏటా ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాలకు పరీక్ష నిర్వహిస్తోంది. వివరాలు..
అర్హత: 50 శాతం (ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం) మార్కులతో ఇంటర్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/బయోటెక్నాలజీ, ఇంగ్లిష్) ఉత్తీర్ణత.
వయోపరిమితి: 17 ఏళ్లు నిండి ఉండాలి.
పరీక్ష విధానం: రెండున్నర గంటల వ్యవధిలో ఆన్‌లైన్‌లో మల్టిపుల్ చాయిస్ విధానంలో నిర్వహించే పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్, బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు. నెగెటివ్ మార్కులు లేవు. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మే 2, 2014
పరీక్ష తేదీ: జూన్ 8, 2014,
వెబ్‌సైట్: jipmer.edu.in
డీవై పాటిల్ మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్
పుణెలో ఉన్న డాక్టర్ డీవై పాటిల్ విద్యాపీఠ్ ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా ప్రవేశపరీక్షను నిర్వహిస్తోంది. వివరాలు..
అర్హత: 50 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం) ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణత. ఎంపిక: ప్రవేశపరీక్ష ద్వారా. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలుంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు. దరఖాస్తు విధానం: దరఖాస్తును వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తులకు చివరి తేదీ: మే 10, 2014
పరీక్ష తేదీ: మే 24, 2014,
వెబ్‌సైట్: www.dypatil.ac.in
ఎంజీఐఎంఎస్- వార్ధా
మహారాష్ట్రలో వార్ధాలో ఉన్న మహాత్మాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎంజీఐఎంఎస్) ఎంబీబీఎస్‌లో ప్రవేశాలకు ప్రతి ఏటా పరీక్షను నిర్వహిస్తోంది.
అర్హత: మొదటి ప్రయత్నంలోనే 50 శాతం మార్కులతో ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: నిర్దేశిత తేదీనాటికి 17 ఏళ్లు మించరాదు.
ఎంపిక: ప్రవేశపరీక్ష ఆధారంగా..
పరీక్ష తేదీ: ఏప్రిల్ 20, 2014,
వెబ్‌సైట్: www.mgims.ac.in
ఆల్ ఇండియా ప్రీ వెటర్నరీ టెస్ట్
వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (వీసీఐ) ప్రతి ఏటా జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా ప్రీ-వెటర్నరీ టెస్ట్(ఏఐపీవీటీ)ను నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వెటర్నరీ(జమ్మూ-కాశ్మీర్ మినహా) కళాశాలల్లో బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ (బీవీఎస్సీ - ఏహెచ్) కోర్సులో 15 శాతం సీట్లను భర్తీ చేస్తారు.
అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్ బైపీసీ, ఇంగ్లిష్ ఉత్తీర్ణత.
పరీక్ష విధానం: ఏఐపీవీటీని ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారు. మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ఫిజిక్స్ 60 ప్రశ్నలు, కెమి్రస్ట్రీ 60 ప్రశ్నలు, బయూలజీ (బోటనీ అండ్ జువాలజీ) 80 ప్రశ్నలు. వీటికి మూడు గంటల్లో సమాధానాలను గుర్తించాలి. ప్రతి సరైన సమాధానానికి మూడు మార్కులు. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులుంటాయి.
పరీక్ష తేదీ: మే 10, 2014.
వివరాలకు: www.vci.nic.in
మణిపాల్ మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్
కర్ణాటకలోని మణిపాల్ యూనివర్సిటీ ఎంబీబీఎస్, బీడీఎస్, బీఫార్మ్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రతి ఏటా జాతీయస్థాయిలో ఆన్‌లైన్ పరీక్షను నిర్వహిస్తోంది.
అర్హత: 55 శాతం మార్కులతో ఇంటర్ బైపీసీ.
పరీక్ష విధానం: రెండున్నర గంటల వ్యవధిలో ఆన్‌లైన్‌లో నిర్వహించే పరీక్షలో 200 ప్రశ్నలుంటాయి. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. ఫిజిక్స్ నుంచి 50 ప్రశ్నలు, కెమిస్ట్రీ నుంచి 50 ప్రశ్నలు, బయాలజీ నుంచి 70 ప్రశ్నలు, ఇంగ్లిష్ అండ్ జనరల్ ఆప్టిట్యూడ్‌ల నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు.
ఆన్‌లైన్ పరీక్ష తేదీలు: ఏప్రిల్ 14 - మే 15 వరకు
వెబ్‌సైట్: www.manipal.edu
అమృత విశ్వవిద్యాపీఠం
కోయంబత్తూరు, కోచిల్లో క్యాంపస్‌లున్న అమృత విశ్వవిద్యాపీఠం ప్రతి ఏటా ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశానికి ప్రవేశపరీక్షను నిర్వహిస్తోంది.
అర్హత: ఒకే ప్రయత్నంలో 60 శాతం మార్కులతో 10+2 బైపీసీ, ఇంగ్లిష్ ఉత్తీర్ణత.
వయోపరిమితి: డిసెంబర్ 31 నాటికి 17 ఏళ్లు నిండి ఉండి 23 ఏళ్లు మించరాదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 25, 2014
ప్రవేశ పరీక్ష తేదీ: మే 18, 2014
వెబ్‌సైట్: www.amrita.edu
హోటల్ మేనేజ్‌మెంట్ ప్రవేశ పరీక్ష
ఎన్‌సీహెచ్‌ఎంసీటీ-జేఈఈ
బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులో ప్రవేశాలకు ఏటా నిర్వహించే పరీక్ష జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్. దీని ద్వారా 21 కేంద్ర, 16 రాష్ట్ర ప్రభుత్వ, 15 ప్రైవేటు హోటల్ మేనేజ్‌మెంట్ విద్యా సంస్థల్లో 7454 సీట్లను భర్తీ చేస్తారు.
అర్హత: ఇంగ్లిష్ ఒక సబ్జెక్ట్‌గా 10+2 ఉత్తీర్ణత.
వయసు: జూలై 1 నాటికి 22 ఏళ్లు మించరాదు.
పరీక్ష విధానం: పరీక్షలో ఐదు విభాగాలు ఉంటాయి. అవి.. న్యూమరికల్ ఎబిలిటీ అండ్ సైంటిఫిక్ ఆప్టిట్యూడ్ (30 ప్రశ్నలు), రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్ (30 ప్రశ్నలు), జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ (30 ప్రశ్నలు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (60 ప్రశ్నలు), ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్ (50 ప్రశ్నలు). మొదటి నాలుగు విభాగాల్లో ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు కేటాయిస్తారు. ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్‌లో సమాధానాన్ని బట్టి 0.25, 0.5, 0.75, 1.00 లలో ఒక దాన్ని ఇస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 11
పరీక్ష తేదీ: ఏప్రిల్ 26, 2014
వెబ్‌సైట్: applyadmission.net/nchmjee2014/
లా ప్రవేశ పరీక్షలు
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)
ఇంజనీరింగ్ కోర్సులకు జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్; మేనేజ్‌మెంట్ కోర్సులకు క్యాట్, ఈ కోవలోనే లా కోర్సులకు క్లాట్. దేశవ్యాప్తంగా 14 న్యాయ విద్యాలయాలు, యూనివర్సిటీల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏ ఎల్‌ఎల్‌బీ, బీఎస్సీ ఎల్‌ఎల్‌బీ, బీబీఏ ఎల్‌ఎల్‌బీ, బీకాం ఎల్‌ఎల్‌బీ, బీఎస్‌డబ్ల్యు ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశానికి క్లాట్‌ను నిర్వహిస్తారు.
అర్హతలు: 45 శాతం (ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం) మార్కులతో 10+2 ఉత్తీర్ణత.
వయోపరిమితి: జూలై 1, 2014 నాటికి 20 ఏళ్ల లోపు వయసును కలిగి ఉండాలి.
పరీక్ష: రెండు గంటల వ్యవధిలో జరిగే పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున మొత్తం మార్కులు 200. ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, లీగల్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్‌లపై ప్రశ్నలుంటాయి. ఎంపిక: క్లాట్ ర్యాంకు ఆధారంగా..
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 15, 2014,
పరీక్ష తేదీ: మే 11, 2014
వెబ్‌సైట్: www.clat.ac.in
ఆలిండియా లా ఎంట్రెన్స్ టెస్ట్ (ఏఐఎల్‌ఈటీ)
ఐదేళ్ల బీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్) కోర్సులో ప్రవేశానికి ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ ఏటా ఏఐఎల్‌ఈటీని నిర్వహిస్తోంది.
సీట్లు: 80, అర్హతలు: 50 శాతం మార్కులతో 10+2 ఉత్తీర్ణత.
వయోపరిమితి: జూలై 1, 2014 నాటికి 21 ఏళ్ల లోపు ఉండాలి.
పరీక్ష: గంటన్నర వ్యవధిలో నిర్వహించే పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున 150 మార్కులుంటాయి. ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్ (కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్), లీగల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌ల నుంచి ప్రశ్నలడుగుతారు.
ఎంపిక: ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా..
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ విధానాల్లో.
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 7, 2014
ప్రవేశపరీక్ష తేదీ: మే 4, 2014
వెబ్‌సైట్: nludelhi.ac.in
లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్ (ఎల్‌శాట్) -ఇండియా
ఐదేళ్ల బీఏ ఎల్‌ఎల్‌బీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నిర్వహించే ఎల్‌శాట్ ప్రామాణిక పరీక్ష విధానాన్ని అమెరికాకు చెందిన లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్(ఎల్‌ఎస్‌ఏసీ) రూపొందించింది.
అర్హత: 45 శాతం మార్కులతో 10+2 ఉత్తీర్ణత.
పరీక్ష విధానం: పేపర్-పెన్సిల్ విధానంలో నిర్వహించే పరీక్షలో ఎనలిటికల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్ (1, 2), రీడింగ్ కాంప్రహెన్షన్‌లపై మల్టిపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి రెండు గంటల 20 నిమిషాలు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2014
పరీక్ష తేదీ: మే 18, 2014
వెబ్‌సైట్: www.pearsonvueindia.com/isatindia
లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (లాసెట్)
మన రాష్ట్రంలో ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులో ప్రవేశానికి ఏటా లాసెట్‌ను నిర్వహిస్తారు.

వయోపరిమితి: డిసెంబర్ 31 నాటికి 20 ఏళ్లు మించరాదు.
పరీక్ష విధానం: గంటన్నర వ్యవధిలో నిర్వహించే పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున మొత్తం మార్కులు 120. పరీక్షలో మూడు భాగాలు ఉంటాయి. అవి.. జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ (30 ప్రశ్నలు), కరెంట్ అఫైర్స్ (30 ప్రశ్నలు), ఆప్టిట్యూడ్ ఫర్ ది స్టడీ ఆఫ్ లా (60 ప్రశ్నలు).
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 26, 2014
పరీక్ష తేదీ: జూన్ 8, 2014,
వెబ్‌సైట్: www.aplawcet.org

Published date : 07 Apr 2014 01:17PM