సమకాలీన అంశాలపైనా అవగాహన ఏర్పరచుకుంటూ.. పదో తరగతి సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ సాగించండిలా..
కరోనా కారణంగా ఆన్‌లైన్ క్లాస్‌లు,సిలబస్ కుదింపునకు అనుగుణంగా పరీక్షల విధానంలో పలు మార్పులు చేశారు. ఈ నేపథ్యంలో.. సోషల్ స్టడీస్లో 10/10 జీపీఏ సాధించేందుకు మార్గాలు ఇవే..
సోషల్ స్టడీస్‌లో మంచి మార్కులు సాధించడానికి విద్యార్థులు.. సమకాలీన అంశాలపైనా అవగాహన ఏర్పరచుకోవాలి. పాఠ్యపుస్తకంలో ఒక అంశం గురించి ఉంటే.. దానికి సంబంధించి మన నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనలతో పోల్చుకుంటూ చదవడం ఎంతో లాభిస్తుంది. సమకాలీన అంశాల విషయంలో ప్రతిస్పందన, ప్రశ్నించడం, ప్రశంస/అభినందనలపై సాధన చేయడం ఎంతో అవసరం. అవగాహనకు సంబంధించి ఒక నిర్దిష్ట అంశాన్ని చదివి.. సొంత పరిజ్ఞానంతో రాసే విధంగా నైపుణ్యం పెంచుకోవాలి. జాగ్రఫీ, ఎకనామిక్స్ విషయంలో భారతదేశం-భౌగోళిక స్వరూపం, శీతోష్ణస్థితి, భారతదేశ నీటి వనరులు, వలసలు, ఆహార భద్రత, ఉత్పత్తి-ఆదాయం, సుస్థిరాభివృద్ధి పాఠ్యాంశాలకు ప్రాధా న్యం ఇవ్వాలి. హిస్టరీ విషయంలో రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ప్రపంచం; సమకాలీన సామాజిక ఉద్యమాలపై దృష్టి పెట్టాలి. భారత జాతీయోద్యమ చరిత్రపై ప్రత్యేక దృష్టితో చదవాలి. సివిక్స్‌కు సంబంధించి రాజ్యాంగం మూల సూత్రాలు, రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలను ఏఏ దేశాల రాజ్యాంగాల నుంచి అనుస రించారు? వంటి కోణాల్లో చదవాలి.
- బి. శ్రీనివాస్, సబ్జెక్ట్ టీచర్
ఇంకా చదవండి: part 1: రెండు తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల.. 10/10 జీపీఏ సాధించండిలా..