Skip to main content

రౌండ్ల వారీగా సీట్ల కేటాయింపు.. సీసీఎంటీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్ ఇలా..

సీసీఎంటీ కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొత్తం మూడు రౌండ్లు,రెండు స్పెషల్‌ రౌండ్లలో జరుగుతుంది. అభ్యర్థులు ఆయా రౌండ్లకు నిర్దేశించిన తేదీల్లోనే తమకు లభించిన సీటుకు ఆమోదం తెలిపి.. ఆన్‌లైన్‌లో ట్యూషన్‌ ఫీజు చెల్లించాలి. ట్యూషన్‌ ఫీజు చెల్లించే ముందే నిర్దేశిత డాక్యుమెంట్లు (అకడమిక్‌ సర్టిఫికెట్లు, గేట్‌ స్కోర్లు, రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు) ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఇలా అప్‌లోడ్‌ చేసిన డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లోనే వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తారు.

ఈ ఆన్‌లైన్‌ డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ను..సదరు విద్యార్థి సీటు పొందిన ఇన్‌స్టిట్యూట్‌ వర్గాలు చేపడతాయి. ఆన్‌లైన్‌లో సీటు యాక్సెప్టెన్స్, ఫీజు చెల్లింపు, డాక్యుమెంట్స్‌ అప్‌లోడ్‌ చేసిన అభ్యర్థులు.. తమకు సీటు లభించిన ఇన్‌స్టిట్యూట్‌లో నిర్దేశిత తేదీల్లో వ్యక్తిగతంగా హాజరై రిపోర్ట్‌ చేయాలి. ఈ సమయంలో వారు ఆన్‌లైన్‌ అప్లికేషన్, ఛాయిస్‌ ఫిల్లింగ్‌ కాపీ, ప్రొవిజినల్‌ అలాట్‌మెంట్‌ లెటర్‌ను కూడా సదరు ఇన్‌స్టిట్యూట్‌ అధికారులకు అందించాల్సి ఉంటుంది.

తదుపరి రౌండ్లకు హాజరు కావాలంటే..

  • విద్యార్థులు తదుపరి రౌండ్లలో పాల్గొనేందుకు ఫ్లోట్, స్లైడ్, ఫ్రీజ్‌ అనే మూడు ఆప్షన్లు వినియోగించుకోవచ్చు.
  • ఫ్లోట్‌ ఆప్షన్‌ ప్రకారం–మొదటి రౌండ్‌లో తమకు వచ్చిన సీటు లేదా ఇన్‌స్టిట్యూట్‌పై ఆసక్తి లేని విద్యార్థులు.. తదుపరి రౌండ్‌ కోసం ఫ్లోట్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • స్లైడ్‌ ఆప్షన్‌ ప్రకారం–తమకు సీటు వచ్చిన ఇన్‌స్టిట్యూట్‌లోనే మరో మంచి స్పెషలైజేషన్‌లో సీటు కోసం తదుపరి రౌండ్‌కు హాజరవ్వాలనుకునే విద్యార్థులు స్లైడ్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఈ ఆప్షన్‌ను ఎంచుకున్న విద్యార్థులను ముందుగా వారికి సీటు లభించిన ఇన్‌స్టిట్యూట్‌లోనే తదుపరి రౌండ్‌కు పరిగణనలోకి తీసుకుంటారు.
  • ఫ్రీజ్‌ ఆప్షన్‌ ప్రకారం–తమకు లభించిన సీటు విషయంలో సంతృప్తి చెంది.. ఇతర రౌండ్లలో పాల్గొనాల్సిన అవసరం లేదని భావించే వారు ఫ్రీజ్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • మూడు ఆప్షన్లను ఇచ్చినప్పటికీ.. అభ్యర్థులు తొలి రౌండ్‌లో తమకు లభించిన సీటుకు అనుమతి తెలిపి, ట్యూషన్‌ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ట్యూషన్‌ ఫీజు చెల్లించిన వారికే ఫ్లోట్, స్లైడ్, ఫ్రీజ్‌ ఆప్షన్లు అందుబాటులో ఉంచుతారు.

ఛేంజ్‌ ఆఫ్‌ విల్లింగ్‌నెస్, విత్‌డ్రాయల్‌..

  • ఛేంజ్‌ ఆఫ్‌ విల్లింగ్‌నెస్‌ ప్రకారం–తమకు లభించిన సీటును సరెండర్‌ చేసి..తదుపరి రౌండ్‌లో పాల్గొనాలనుకునే విద్యార్థులకు ఈ అవకాశం కల్పిస్తున్నారు. ఇలాంటి అభ్యర్థులు సరెండర్‌ అండ్‌ పార్టిసిపేట్‌ ఇన్‌ నెక్ట్స్‌ రౌండ్‌ను ఎంచుకోవాలి. ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటే..అప్పటికే వారికి లభించిన సీటు రద్దవుతుంది. తదుపరి రౌండ్‌లో పాల్గొనే అవకాశం లభిస్తుంది.
  • విత్‌డ్రాయల్‌ ఆప్షన్‌ ప్రకారం–ఒక రౌండ్‌లో సీటు వచ్చి, ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్‌ డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ను కూడా పూర్తి చేసుకొని..ఆ తర్వాత తమ నిర్ణయం మార్చుకొని.. సీసీఎంటీ–2021 ప్రక్రియ నుంచి వైదొలగాలనుకుంటున్న విద్యార్థులు విత్‌డ్రాయల్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

రెండు రౌండ్లలో స్పెషల్‌ కౌన్సెలింగ్‌..
మూడు రౌండ్లలో సీసీఎంటీ కౌన్సెలింగ్‌కు అదనంగా మరో రెండు స్పెషల్‌ రౌండ్లలోనూ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. రెగ్యులర్‌ రౌండ్ల కౌన్సెలింగ్‌ తర్వాత మిగిలిపోయిన సీట్ల భర్తీకి ఈ స్పెషల్‌ రౌండ్ల కౌన్సెలింగ్‌ జరుగుతుంది. సీసీఎంటీ ప్రక్రియ సాధారణ రౌండ్లకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులతోపాటు, కౌన్సెలింగ్‌లో పాల్గొని సీటు పొందిన విద్యార్థులు కూడా స్పెషల్‌ రౌండ్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సీసీఎంటీ 2021.. ముఖ్య తేదీలు

  • ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, దరఖాస్తు ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్‌ ఛాయిస్‌ ఫిల్లింగ్‌ తేదీలు: జూన్‌ 7 నుంచి జూన్‌ 28 వరకు..
  • ఆన్‌లైన్‌ ఛాయిస్‌ ఫిల్లింగ్, లాకింగ్‌కు చివరి తేదీ: జూన్‌ 29
  • మొదటి రౌండ్‌ సీట్‌ అలాట్‌మెంట్‌ ప్రకటన: జులై 3, 2021
  • సీటు యాక్సప్టెన్స్‌ ఫీజు చెల్లింపు, డాక్యుమెంట్‌ అప్‌లోడ్, విల్లింగ్‌నెస్, విత్‌డ్రాయల్‌ తేదీలు: జులై 3 – జులై 8
  • ఆన్‌లైన్‌ డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ తేదీలు: జులైæ 4– జులై 9
  • రెండో రౌండ్‌ సీట్‌ అలాట్‌మెంట్‌ ప్రకటన: జులై 14, 2021
  • రెండో రౌండ్‌ సీటు యాక్సప్టెన్స్‌ ఫీజు చెల్లింపు, డాక్యుమెంట్‌ అప్‌లోడ్, విల్లింగ్‌నెస్, విత్‌డ్రాయల్‌ తేదీలు: జులై 14– జులై 19
  • రెండో రౌండ్‌ ఆన్‌లైన్‌ డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ తేదీలు: జులై 15–జులై 20
  • మూడో రౌండ్‌ సీటు అలాట్‌మెంట్‌ ప్రకటన: జులై 24
  • సీటు యాక్సెప్టెన్స్‌ ఫీజు, డాక్యుమెంట్‌ అప్‌లోడ్‌: జులై 24–జులై 28(మూడో రౌండ్‌లో సీటు పొందిన వారికి విత్‌డ్రాయల్, విల్లింగ్‌నెస్‌ ఆప్షన్లు అందుబాటులో ఉండవు)
  • మూడో రౌండ్‌ ఆన్‌లైన్‌ డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ తేదీలు: జులై 25–జులై 29
  • అన్ని రౌండ్లు పూర్తయ్యాక చివరగా సీటు లభించిన ఇన్‌స్టిట్యూట్‌లో ఆన్‌లైన్‌ అడ్మిషన్, ఫీజు చెల్లింపు: జులై 25 – జులై 30
  • ఆన్‌లైన్‌ విత్‌డ్రాయల్‌: జులై 25 – జులై 30.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://ccmt.nic.in  

ఇంకా చ‌ద‌వండి : part 1: నిట్‌ల్లో ఎంటెక్‌కు సీసీఎంటీ.. కౌన్సెలింగ్ ప్ర‌క్రియ ఇలా..

Published date : 15 Jun 2021 06:10PM

Photo Stories