మ్యాట్(డిసెంబర్)-2019 ప్రిపరేషన్ ఇలా..
Sakshi Education
ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఎంబీఏ చేయాలనుకునే విద్యార్థుల కోసం మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్) కు ఆలిండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ స్థాయిలో ఏడాదికి నాలుగుసార్లు నిర్వహించే ఈ పరీక్షల్లో ఉత్తమ స్కోరు సాధించిన అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 600 విద్యాసంస్థల్లో ఎంబీఏలో ప్రవేశం పొందే అవకాశం లభిస్తుంది. మ్యాట్, 2019 డిసెంబర్‌కు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో.. అర్హతలు, దరఖాస్తు విధానం, పరీక్ష తీరుతెన్నులు, ప్రిపరేషన్‌పై సమగ్ర సమాచారం...
ఎంబీఏ :
సాంకేతిక రంగం ఎంతగా పరుగులు తీస్తూ ముందుకు పోయినా.. దాని నిర్వహణకు మేనేజ్‌మెంట్ నిపుణులు తప్పనిసరి. మేనేజ్‌మెంట్ మెలకువలను నేర్చుకోవడానికి ఉపయోగపడే కోర్సు.. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ). నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ వర్క్, నిర్వహణ సామర్థ్యం మేనేజ్‌మెంట్ విద్య ద్వారా అలవరచుకోవచ్చు. అందుకే మేనేజ్‌మెంట్ రంగంలో ఉన్నతస్థాయి ఉద్యోగాలు పొందేందుకు ఎంబీఏ కీలకంగా మారింది. దేశవ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థల్లో ఎంబీఏలో చేరేందుకు మార్గం.. జాతీయ స్థాయిలో నిర్వహించే మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్(మ్యాట్).
ఏటా.. నాలుగుసార్లు :
ఆలిండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్(ఏఐఎంఏ).. జాతీయ స్థాయిలో ఏటా నాలుగుసార్లు(ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్) మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్)ను నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలో ఎంబీఏలో చేరే అవకాశం లభిస్తుంది. ఇలా ఎంబీఏ పూర్తిచేసిన విద్యార్థులు మేనేజ్‌మెంట్ రంగంలో కొలువుల కోసం ప్రయత్నాలు ప్రారంభించొచ్చు.
అర్హతలు :
మ్యాట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే. డిగ్రీలో కనీస మార్కులు రావాలనే నిబంధన ఏమీ లేదు. మ్యాట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు.
పరీక్ష ఫీజు :
అన్ని కేటగిరీల(ఎస్సీ,ఎస్టీ,మహిళలు, దివ్యాంగులు) అభ్యర్థులు ఏదైనా ఒక పరీక్షకు (ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్) రూ.1550 చెల్లించాలి. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ రెండు విధానాల్లో హాజరుకావాలనుకునే వారు రూ.2650ను దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
పరీక్ష విధానం :
సిలబస్ :
మ్యాట్ పరీక్షలో లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, మ్యాథమెటికల్ స్కిల్స్, డేటా అనాలసిస్ అండ్ సఫిషియన్సీ, ఇంటెలిజెన్స్ అండ్ క్రిటికల్ రీజనింగ్, ఇండియన్ అండ్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
ప్రవేశ ప్రక్రియ :
మ్యాట్‌లో మంచి స్కోర్ సాధించిన విద్యార్థులను ఆయా విద్యాసంస్థలు గ్రూప్ డిస్కషన్(జీడీ), పర్సనల్ ఇంటర్వ్యూ(పీఐ) నిర్వహించి.. ఎంబీఏలో ప్రవేశం ఖరారు చేస్తాయి. పలు విద్యాసంస్థలు పదోతరగతి, ఇంటర్, డిగ్రీల్లో వచ్చిన మార్కులకూ వెయిటేజీ ఇస్తాయి.
జీడీ, ఇంటర్వ్యూ :
గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూల ప్రధాన ఉద్దేశం అభ్యర్థుల కమ్యూనికేషన్ స్కిల్స్‌ను, ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించడమే! జీడీలో ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై టాపిక్ ఇచ్చి.. దానిపై చర్చించమంటారు. అన్ని దశల్లోనూ ప్రతిభ చూపిన అభ్యర్థులను మాత్రమే ఫైనల్‌గా ఎంపిక చేస్తారు.
ప్రిపరేషన్ ఇలా..
మ్యాట్ పరీక్షకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సిలబస్‌లోని టాపిక్స్‌పై అవగాహన పెంచుకోవాలి. అలాగే ఏ టాపిక్‌కు ఎంత సమయం కేటాంచుకోవాలనేదానిపైనా ఒక స్పష్టత అవసరం. ప్రధానంగా పరీక్షలో విజయం సాధించేందుకు కాన్సెప్ట్‌లపై స్పష్టత ఉండాలి. ఆ తర్వాత ఒక ప్రణాళిక రూపొందించుకొని ఆయా సబ్జెక్టుల్లోని ప్రశ్నలను సాధనచేయాలి. ప్రతీ ప్రశ్నకు సమాధానం గుర్తించేలా సిద్ధమవ్వాలి. ఇందుకోసం ఎక్కువ మాక్ టెస్ట్‌లు, ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్ట్‌లు రాయడం మేలు. దీనివల్ల పరీక్ష హాల్లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు సాధించే వేగం అలవడుతుంది. అలాగే వివిధ రకాల మాక్ టెస్టులు, ఆన్‌లైన్ టెస్ట్‌లు రాయడం ద్వారా ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంది? ఎక్కడ పొరపాట్లు చేస్తున్నామో కూడా తెలుస్తుంది.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
పరీక్ష విధానం: ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ రెండు విధానాల్లోనూ పరీక్ష జరుగుతుంది.
దరఖాస్తు ప్రారంభ తేదీ (పీబీటీ, సీబీటీ ): అక్టోబర్ 4, 2019
దరఖాస్తు ముగింపు తేదీ (పీబీటీ): డిసెంబర్ 01, 2019
దరఖాస్తు ముగింపు తేదీ (సీబీటీ): డిసెంబర్ 06, 2019
అడ్మిట్ కార్డ్ (పీబీటీ): డిసెంబర్ 02, 2019
అడ్మిట్‌కార్డ్ (సీబీటీ): డిసెంబర్ 10, 2019
మ్యాట్ పీబీటీ పరీక్ష తేదీ: డిసెంబర్ 08, 2019
మ్యాట్ సిబీటీ పరీక్ష తేదీ: డిసెంబర్ 14, 2019
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.aima.in

- మ్యాట్‌ను ఆఫ్‌లైన్(పీబీటీ-పేపర్ బేస్డ్ టెస్ట్), ఆన్‌లైన్ (సీబీటీ-కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) రెండు విధానాల్లో నిర్వహిస్తారు. అభ్యర్థులు ఏ పద్ధతిలోనైనా పరీక్షను రాసే వెసులుబాటు ఉంది.
- మొత్తం ఐదు సెక్షన్‌లు.. ఒక్కో సెక్షన్‌కు 40 ప్రశ్నలు-40 మార్కుల చొప్పున 200 ప్రశ్నలకు-200 మార్కులకు మ్యాట్ జరుగుతుంది. పరీక్ష సమయం 2 గంటల 30(150) నిమిషాలు. ప్రతీ ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. ప్రతీ తప్పు సమాధానానికి 1/4 వంతు మార్కుల కోత ఉంటుంది.
సిలబస్ :
మ్యాట్ పరీక్షలో లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, మ్యాథమెటికల్ స్కిల్స్, డేటా అనాలసిస్ అండ్ సఫిషియన్సీ, ఇంటెలిజెన్స్ అండ్ క్రిటికల్ రీజనింగ్, ఇండియన్ అండ్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
ప్రవేశ ప్రక్రియ :
మ్యాట్‌లో మంచి స్కోర్ సాధించిన విద్యార్థులను ఆయా విద్యాసంస్థలు గ్రూప్ డిస్కషన్(జీడీ), పర్సనల్ ఇంటర్వ్యూ(పీఐ) నిర్వహించి.. ఎంబీఏలో ప్రవేశం ఖరారు చేస్తాయి. పలు విద్యాసంస్థలు పదోతరగతి, ఇంటర్, డిగ్రీల్లో వచ్చిన మార్కులకూ వెయిటేజీ ఇస్తాయి.
జీడీ, ఇంటర్వ్యూ :
గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూల ప్రధాన ఉద్దేశం అభ్యర్థుల కమ్యూనికేషన్ స్కిల్స్‌ను, ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించడమే! జీడీలో ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై టాపిక్ ఇచ్చి.. దానిపై చర్చించమంటారు. అన్ని దశల్లోనూ ప్రతిభ చూపిన అభ్యర్థులను మాత్రమే ఫైనల్‌గా ఎంపిక చేస్తారు.
ప్రిపరేషన్ ఇలా..
మ్యాట్ పరీక్షకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సిలబస్‌లోని టాపిక్స్‌పై అవగాహన పెంచుకోవాలి. అలాగే ఏ టాపిక్‌కు ఎంత సమయం కేటాంచుకోవాలనేదానిపైనా ఒక స్పష్టత అవసరం. ప్రధానంగా పరీక్షలో విజయం సాధించేందుకు కాన్సెప్ట్‌లపై స్పష్టత ఉండాలి. ఆ తర్వాత ఒక ప్రణాళిక రూపొందించుకొని ఆయా సబ్జెక్టుల్లోని ప్రశ్నలను సాధనచేయాలి. ప్రతీ ప్రశ్నకు సమాధానం గుర్తించేలా సిద్ధమవ్వాలి. ఇందుకోసం ఎక్కువ మాక్ టెస్ట్‌లు, ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్ట్‌లు రాయడం మేలు. దీనివల్ల పరీక్ష హాల్లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు సాధించే వేగం అలవడుతుంది. అలాగే వివిధ రకాల మాక్ టెస్టులు, ఆన్‌లైన్ టెస్ట్‌లు రాయడం ద్వారా ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంది? ఎక్కడ పొరపాట్లు చేస్తున్నామో కూడా తెలుస్తుంది.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
పరీక్ష విధానం: ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ రెండు విధానాల్లోనూ పరీక్ష జరుగుతుంది.
దరఖాస్తు ప్రారంభ తేదీ (పీబీటీ, సీబీటీ ): అక్టోబర్ 4, 2019
దరఖాస్తు ముగింపు తేదీ (పీబీటీ): డిసెంబర్ 01, 2019
దరఖాస్తు ముగింపు తేదీ (సీబీటీ): డిసెంబర్ 06, 2019
అడ్మిట్ కార్డ్ (పీబీటీ): డిసెంబర్ 02, 2019
అడ్మిట్‌కార్డ్ (సీబీటీ): డిసెంబర్ 10, 2019
మ్యాట్ పీబీటీ పరీక్ష తేదీ: డిసెంబర్ 08, 2019
మ్యాట్ సిబీటీ పరీక్ష తేదీ: డిసెంబర్ 14, 2019
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.aima.in
Published date : 04 Nov 2019 04:25PM