క్యాట్ సాధించాలంటే.. మాక్ టెస్టులు ఎంతో కీలకం..
గత ఐదేళ్ల ప్రశ్నల శైలిని తెలుసుకొని.. ఏ టాపిక్ నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో గుర్తించాలి. అలాగే సాధ్యమైనన్ని మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేయాలి. ఈ సమయంలో కొత్త టాపిక్స్ జోలికి వెళ్లకపోవడమే మంచిది. పూర్తిగా పరీక్ష కోణంలోనే ప్రాక్టీస్ సాగించాలి. అప్రధానమైన విషయాల వైపు దృష్టి పెట్టకూడదు.
పరీక్ష రోజు ఇలా..
పరీక్ష రోజు చాలామంది అభ్యర్థులు.. ముఖ్యంగా మొదటసారి రాస్తున్నవారు ఒత్తిడి గురవుతుంటారు. ఇప్పటికే మీకు డిగ్రీ స్థాయి పరీక్షలు రాసిన అనుభవం ఉంది. కాబట్టి ఈ పరీక్ష కూడా అలాంటిదేనని భావించాలి. అంతేకాని డూ ఆర్ డై ధోరణి సరికాదు. దీనివల్ల ఒత్తిడి పెరిగి.. పరీక్షలో ప్రదర్శనపై ప్రతికూల ప్రభావం పడే ఆస్కారం ఉంటుంది. పరీక్ష హాల్లో మొదట సులువైన ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. ఆ తర్వాత మోడరేట్‌గా ఉండే వాటిని అటెంప్ట్ చేయాలి. ప్రతి ప్రశ్నకు సగటున కొంత సమయం కేటాయించుకోవాలి. సులువైన ప్రశ్నలకు మొదట సమాధానాలు గుర్తిస్తూ, కఠినమైన వాటికి తర్వాత క్రమంలో జవాబులు గుర్తించాలి. ‘నెగెటివ్ మార్కులు’ ఉన్నందున తెలియని ప్రశ్నలు, అలాగే ఎక్కువ సమయం తీసుకుంటాయని భావించిన ప్రశ్నలను వదిలేయడమే మేలు!!
ఇంకా చదవండి: part 1: నవంబర్ 29న క్యాట్ 2020.. పరీక్ష విధానంలో కీలక మార్పులు..