Skip to main content

ఇంగ్లీష్‌ రావాలంటే.. ఇలా మాట్లాడాల్సిందే..

మాతృభాష తెలుగును సంధులు, సమాసాలు లాంటి గ్రామర్‌ నేర్చుకున్న తర్వాతనే నేర్చుకున్నామా? మరి గ్రామర్‌ ద్వారా ఇంగ్లీషు ఎలా నేర్చుకోగలం..?
వందేళ్లు కష్టపడినా సరే పార్ట్స్‌ ఆఫ్‌ స్పీచ్, టెన్స్‌స్‌ ఒకాబులరీ లాంటి గ్రామర్‌ నేర్చుకుని ఇంగ్లీష్‌ లో మాట్లాడడం సాధ్యం కాదు. ఇంగ్లీష్‌ లాంటి పరాయి భాషను నేర్చుకునే విధానం లోపభూయిష్టంగా ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే గ్రామర్‌ను పక్కన పడేసి సునాయాసంగా ఇంగ్లీష్‌ లో మాట్లాడవచ్చు. ఇంగ్లీష్‌ భాష కోసం ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని కోచింగులకు వెళ్లినా, ఎంత గ్రామర్‌ నేర్చుకున్నా ప్రయోజనం ఉండదు. ప్రపంచంలో ఏ భాషనూ గ్రామర్‌ ద్వారా నేర్చుకోరు. గ్రామర్‌ ద్వారా భాషలు నేర్చుకోవడం అసాధ్యం కూడా.

పరిసరాల ప్రభావంతో...
ప్రధానంగా భాషలు రెండు రకాలుగా నేర్చుకుంటారు. మొదటిది పరిసరాల ద్వారా, రెండోది అభ్యసనం ద్వారా. ప్రతి ఒక్కరూ వారి, వారి మాతృభాషలు సహజంగా నేర్చుకుంటారు. ఉదాహరణకు హైదరాబాద్‌ లో నివసించేవారు మాతృభాష తెలుగుతోపాటు హిందీ/ఉర్దూలో మాట్లాడుతారు. వినే మాటలను అనుకరించడం ద్వారా పరిసరాల నుంచి భాషలు సహజంగా, సులభంగా వస్తాయి. చదవటం, రాయటం తెలియకున్నా, గ్రామర్‌ పరిజ్ఞానం లేకున్నా భాషలు నేర్చుకోవచ్చని మన చుట్టూ ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకు నెమలి ఈకలు అమ్ముకునే ముంబయి యువకుడు జాతీయ, అంతర్జాతీయ భాషలు కలిపి 16 భాషలు నేర్చుకున్నాడు. రైల్వే కూలీ ఒకరు అక్షరం అనేది తెలియకున్నా ఇంగ్లీష్‌ అనర్గళంగా మాటాడుతున్నాడు. బుల్లి తెర యాంకర్‌ సుమ తెలుగు అనర్గళంగా మాట్లాడతారు. కానీ ఆమె మాతృభాష మలయాళం. తెలుగింటి కోడలు కావడం మూలంగానే ఆమె తెలుగు నేర్చుకోగలిగింది. భాషల్ని పరిసరాల ద్వారా నేర్చుకోవడంలో వినటం, మాట్లాడటం ప్రధాన పాత్ర పోషిస్తాయి. కానీ ఇంగ్లీష్‌ ఇలా నేర్చుకునే అవకాశం మనలాంటి దేశాల్లో లేదు. కారణం మన పరిసరాల్లో ఇంగ్లీష్‌ వాతావరణం లేకపోవడమే. దీంతో కేవలం పుస్తకాల ద్వారానే ఇంగ్లీష్‌ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మనసు , శరీరానికి అనుసంధానం...
బాష మాట్లాడటం మనసు , శరీరానికి సంబంధించిన నైపుణ్యం. కేవలం మనసు ద్వారానో లేదా శారీరక ప్రయత్నం ద్వారానో భాషను నేర్చుకోవడం సాధ్యం కాదు. భాష నేర్చుకునే ప్రయత్నంలో మనసు, శరీరం అనుసంధానం చేస్తేనే మాట్లాడే నైపుణ్యం సిద్ధిస్తుంది. సైక్లింగ్, స్విమ్మింగ్‌ పుస్తకాల ద్వారా ఎలాగైతే నేర్చుకోలేమో.. ఇంగ్లీష్‌ మాట్లాడటం కూడా కేవలం పుస్తకాల ద్వారా రాదు. కానీ మన విద్యా విధానంలో ఇంగ్లీష్‌ బోధన, అభ్యసన పుస్తకాలకే పరిమితమమయ్యాయి. ఇలా ఎంతకాలం ప్రయత్నించినా ఇంగ్లీష్‌ నేర్చుకోవడం సాధ్యం కావడం లేదు. వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం క్రమంలో అభ్యసిస్తేనే భాషలు నేర్చుకోగలం. మన ఇంగ్లీష్‌ అభ్యసనలో వినడం, మాట్లాడడం గల్లంతు కావడం మూలంగానే ఇంగ్లీష్‌ నేర్చుకోవడం గతి తప్పింది. ఫలితంగా ఇంగ్లీష్‌ పట్ల ఎన్నో అపోహలు ఏర్పడ్డాయి. ఈ అపోహలే అడుగు ముందుకు వేయనివ్వడంలేదు, నోరు తెరిచి మాట్లాడనివ్వడంలేదు.

భయపడి పారిపోవద్దు :
ఊహా తెలిసిన దగ్గర నుంచి ఇంగ్లీష్‌ ఒక బ్రహ్మ పదార్థ్ధం. చదవడం, బట్టీ పట్టడం, పరీక్షలు రాయడం, తరగతులు మారడం పట్టాలు అందుకోవడం.. ఇది ఒక అంతు లేని కథ. అప్పుడప్పుడు ఇంగ్లీష్‌ నేర్చుకోవాలని ఆసక్తి కలిగినా అది అసాధ్యమని సర్దుకున్నాం. ఎప్పటికైనా ఇంగ్లీష్‌లో మాట్లాడటం అవసరమని ఊహించం లేదు. తప్పని సరి అని తెలుసుకునే లోపే.. బాష పట్ల అపోహలు నిండి పోతాయి. సుదీర్ఘ కాలం అభ్యసించినా భాష రాకపోవడంతో ఇంగ్లీష్‌ కష్టమైన భాష, ప్రతిభావంతులే నేర్చుకోగలుగుతారు అని దానిజోలికి వెళ్లే సాహసం చేయడంలేదు. వాస్తవంగా మనసుది మూగభాష, నాలుకది గోలబాష. మనసుని, నాలుకని అనుసంధానం చేస్తేనే మాటల భాష వస్తుంది. నోరు విప్పి మాట్లాడకుండా, ఎంత విన్నా, ఎంత చదివినా. మాట్లాడటం రాదు. సంవత్సరాలుగా ఇంగ్లీష్‌ చదువుతున్నా మాట్లాడలేక పోవడానికి ప్రధాన కారణం నోరు విప్పక పోవడమే. బాష ఏదైనా మాట్లాడితేనే వస్తోంది.. ఎంత ఎక్కువ మాట్లాడితే అంత బాగా మాట్లాడగలుగుతాం. ఇంగ్లీష్‌ బాషకు భయపడి దూరంగా పరుగులు తీస్తుంటాం. చదువుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరు ఇంగ్లీష్‌లో ఈజీగా మాట్లాడటం సాధ్యమే. – బీకే రెడ్డి, ఇంగ్లీష్‌నిపుణులు

ఆన్‌లైన్‌ ద్వారా...
కరోనా నేపథ్యంలో క్లాస్‌రూమ్‌కు వెళ్లలేని పరిస్థితుల కారణంగా ప్రస్తుతం ఆన్‌లైన్‌ ద్వారా ఇంగ్లీష్‌ కోర్సును అందిస్తున్నారు ఇంగ్లీష్‌ నిపుణులు బీకే రెడ్డి ఇంగ్లీష్‌ భాష సునాయాసంగా మాట్లాడే విధంగా శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే వేలాది మందికి ఈ తరహా శిక్షణ ఇచ్చారు. వివరాలకు ఫోన్‌ నెంబర్‌∙9912343940 లేదా వెబ్‌సైట్‌. www.bkreaenfirh.com సంప్రదించవచ్చు.

ఇంగ్లీష్‌ ఇలా...
  • విడి పదాలు కాకుండా నిజ జీవితంలో మాట్లాడే మాటలు నేర్చుకోవాలి
  • ఇంగ్లీష్‌ మాటల అనుకరణ, మాట్లాడే స్వీయ అభ్యాసం కీలకం
  • మన పరిసరాల్లో ఇంగ్లీష్‌ మాట్లాడే వాతావరణం లేనందున స్వీయ అభ్యాసం (మైండ్‌టాక్, సెల్ఫ్‌టాక్, క్రాస్‌టాక్‌) పాటించాలి
  • గ్రామర్‌ద్వారా భాషలు నేర్చుకోవడం వీలు కాదన్న విషయం గ్రహించాలి.
  • సరైన మెటీరియల్, మెథడ్, ప్రాక్టీస్‌ ఇంగ్లీష్‌ అభ్యాసనలో కీలక పాత్ర పోషిస్తాయని గుర్తించాలి.
Published date : 09 Dec 2020 05:28PM

Photo Stories