గేట్-2020 విజయానికి నిపుణుల సూచనలు...
Sakshi Education
గేట్.. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. ఇది ఐఐటీలు, ఎన్‌ఐటీలు వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లలో.. ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ + పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రతిఏటా నిర్వహించే పరీక్ష!
ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ) ల్లో కొలువుకూ గేట్ స్కోర్ ఆధారం! అందుకే ‘గేట్’కు ఏటేటా పోటీ పెరుగుతోంది!! గేట్-2020 ఆన్‌లైన్ పరీక్షలు ఫిబ్రవరి 1,2,8,9 తేదీల్లో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో.. పరీక్షలో విజయానికి ఎగ్జామ్ డే టిప్స్...
ఏ పోటీ పరీక్ష అయినా.. ఎన్ని రోజుల నుంచి ప్రిపరేషన్ సాగిస్తున్నా.. పరీక్ష హాల్లో చూపే ప్రతిభే జయాపజయాలను నిర్ణయిస్తుంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా లక్షల మంది పోటీ పడే గేట్‌లో రాణించేందుకు పరీక్ష రోజు అప్రమత్తత చాలా అవసరం. చాలామంది అభ్యర్థులు సబ్జెక్ట్ నాలెడ్జ్, ప్రిపరేషన్, మాక్ టెస్ట్‌లు.. ఇలా అన్నింటిలోనూ ముందంజలో నిలిచినా.. పరీక్ష హాల్లో ఒత్తిడికిలోనై నిరాశకు గురవుతుంటారు. అందుకే పరీక్ష హాల్లో అందుబాటులో ఉండే మూడు గంటల సమయాన్ని సమర్థంగా సద్వినియోగం చేసుకోవడంపైనే సక్సెస్ ఆధారపడి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
8.5 లక్షల మంది పోటీ:
గేట్-2020 ఆన్‌లైన్ పరీక్ష ఫిబ్రవరి 1, 2, 8, 9 తేదీల్లో జరుగనుంది. మొత్తం 25 సబ్జెక్ట్‌లు(పేపర్స్)ల్లో పరీక్ష నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 8.5 లక్షల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 60 వేల నుంచి 70 వేల మంది పోటీ పడే అవకాశం ఉంది. ముఖ్యంగా సీఎస్‌ఈ, ఈసీఈ, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచ్‌ల అభ్యర్థులు 50 శాతం మేరకు ఉంటున్నారు.
పునశ్చరణే విజయ మంత్రం :
{పస్తుత సమయంలో విద్యార్థులు పునశ్చరణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఇప్పటివరకు చదివిన అంశాలనే మళ్లీ అధ్యయనం చేయాలి. అలాగే ముఖ్యాంశాలు, ఫార్ములాలతో రూపొందించుకున్న సొంత నోట్స్‌ను పరీక్షకు ముందు వరకూ రివిజన్ చేస్తుండాలి. పరీక్ష దగ్గరపడుతున్న సమయంలో అభ్యర్థులు ఆయా సబ్జెక్ట్‌లు, టాపిక్‌లకు సంబంధించి ముఖ్యమైన కాన్సెప్ట్‌లను పదే పదే చదవాలి. ముఖ్యంగా మెకానికల్, సీఎస్‌ఈ, ఈసీఈ అభ్యర్థులకు ఇది ఎంతో అవసరం. ఇలాంటి విధానం పరీక్ష హాల్లో మెరుగైన ప్రతిభ కనబర్చేందుకు దోహదం చేస్తుంది. అలాగే ప్రతిరోజు సిలబస్‌లోని అన్ని యూనిట్లు చదివేలా సమయం కేటాయించుకోవాలి. అప్లికేషన్ అప్రోచ్‌తో ప్రిపరేషన్ సాగిస్తే.. పరీక్షలో ప్రశ్న ఎలా అడిగినా సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది.
మాక్ టెస్ట్‌లు :
గేట్ ప్రిపరేషన్ చివరి అంకంలో ఉన్న అభ్యర్థులు, ప్రస్తుతం తమకు అందుబాటులో ఉన్న సమయంలో సాధ్యమైనన్ని మాక్ టెస్ట్‌లకు హాజరు కావాలి. గేట్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ‘మాక్ టెస్ట్’ సదుపాయాన్ని వినియోగించుకోవడం మేలు. అధికారిక వెబ్‌సైట్‌లోని మాక్ టెస్ట్‌లతో గేట్ పరీక్ష విధానం, ప్రశ్నలు అడిగే తీరుపై అవగాహన లభిస్తుంది. మాక్ టెస్టుల ఫలితాలను విశ్లేషించుకోవచ్చు. ఏదైనా టాపిక్‌లో తక్కువ మార్కులు వచ్చినా... ఇప్పుడు ఆ అంశాన్ని కొత్తగా చదవాలనుకోవడం సరికాదు. దీనికి బదులు ఇప్పటికే పట్టు సాధించిన సబ్జెక్ట్‌లలో మరింత మెరుగ్గా రాణించేందుకు కృషిచేయాలి.
వర్చువల్ కాలిక్యులేటర్ :
అభ్యర్థులు వర్చువల్ కాలిక్యులేటర్ వినియోగంపై పూర్తి అవగాహన కలిగుండటం చాలా అవసరం. 65 ప్రశ్నలతో మూడు గంటల వ్యవధిలో జరిగే పరీక్షలో అంచెల వారీగా సాధన చేసి సమాధానం రాబట్టే ప్రశ్నలు కూడా ఉంటాయి. వీటి సాధనలో కాలిక్యులేషన్స్ కీలకం. కాబట్టి కాలిక్యులేటర్‌ను వేగంగా ఉపయోగించే నైపుణ్యం ఉంటే.. ఆయా ప్రశ్నకు వీలైనంత త్వరగా సమాధానం ఇచ్చేందుకు వీలుంటుంది.
పరీక్ష నిబంధనలు:
అభ్యర్థులు పరీక్ష నిబంధనలు, పరీక్ష హాల్లోకి తీసుకువెళ్లాల్సిన డాక్యుమెంట్స్ గురించి ముందుగానే తెలుసుకోవాలి. ముఖ్యంగా అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. లాస్ట్ మినిట్‌లో టెక్నికల్ ఎర్రర్స్, వెబ్‌సైట్ ట్రాఫిక్ పెరిగి.. వెబ్‌సైట్ ఓపెన్ అవకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి వీలైనంత ముందుగా దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి. దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసిన వ్యక్తిగత ఫోటో ఐడెంటిటీ కార్డ్ ఒరిజినల్ కాపీని పరీక్ష హాల్లో చూపించాల్సి ఉంటుంది. వీటిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి.
పరీక్ష రోజు ఇలా..
మొత్తం ప్రశ్నల సంఖ్య: 65
మొత్తం మార్కులు: 100
పరీక్ష సమయం: మూడు గంటలు
విభాగాలు: 3 (జనరల్ ఆప్టిట్యూడ్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, సంబంధిత సబ్జెక్ట్)
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ సదుపాయం: జనవరి మూడు నుంచి పరీక్ష తేదీ వరకు
వివరాలకు వెబ్‌సైట్: gate.iitd.ac.in
గేట్ -2020 పరీక్ష తేదీలు, సెషన్స్:
మూడు గంటలు ఎంతో కీలకం :
{పస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో రివిజన్, మాక్ టెస్ట్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలి. అభ్యర్థులు ఏడాది కాలంగా ప్రిపరేషన్ సాగిస్తున్నా.. పరీక్ష రోజు చూపే ప్రతిభ ఎంతో ప్రధానం. పరీక్ష హాల్లో ముందుగా జనరల్ ఆప్టిట్యూడ్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ సెక్షన్లను పూర్తి చేయడం వల్ల సబ్జెక్ట్ సెక్షన్‌కు ఎక్కువ సమయం కేటారుుంచే అవకాశం లభిస్తుంది. పరీక్షకు ముందు రోజు ఔట్‌లైన్‌స చూసుకుంటే సరిపోతుంది. మానసికంగా ఒత్తిడి లేకుండా పరీక్షకు హాజరవ్వాలి.
- ఎం.వి.రెడ్డి, డెరైక్టర్, గేట్ కోచింగ్, టైమ్ ఇన్‌స్టిట్యూట్

- పరీక్ష ఆన్‌లైన్‌లో జరుగుతుంది. సంబంధిత పోర్టల్‌లో నిర్దిష్ట స్లాట్‌కు 20 నిమిషాల ముందుగానే లాగిన్ అయ్యే సదుపాయం ఉంది. అభ్యర్థులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలి. తద్వారా పరీక్షకు సంబంధించి ముఖ్యమైన నిబంధనలు పూర్తిగా చదివే సమయం లభిస్తుంది.
- సమాధానాలు ఇచ్చేందుకు ఉపక్రమించే ముందు.. ఆన్‌లైన్ విండోలో 'వ్యూ ఆల్ కొశ్చన్స్' ట్యాబ్ పై క్లిక్ చేయడం మేలు. దీనివల్ల మొత్తం అన్ని ప్రశ్నలను చదివేందుకు వీలవుతుంది. ఇలా చేయడం వల్ల ఏ ప్రశ్న లేదా సెక్షన్‌ను ముందుగా ప్రారంభించాలనే అనే విషయంపై స్పష్టత వస్తుంది. ముందుగా సులువైన సెక్షన్స్‌ను ఎంచుకొని త్వరగా పూర్తి చేసుకోవడం ద్వారా క్లిష్టమైన సెక్షన్‌లవైపు దృష్టి సారించొచ్చు.
- గేట్‌లో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, జనరల్ ఆప్టిట్యూడ్ సెక్షన్స్ కొంత సులభంగా ఉంటాయి. అభ్యర్థులు ముందుగా వీటికి సమాధానాలు ఇవ్వాలి. దీనివల్ల ఈ సెక్షన్లను తక్కువ సమయంలో పూర్తి చేసుకుని తర్వాత సమయంలో సబ్జెక్ట్ ఆధారిత సెక్షన్లకు ఎక్కువ సమయం కేటాయించేందుకు వీలవుతుంది.
- మొత్తం మూడు గంటల సమయంలో మొదటి గంటన్నర సమయంలో తమకు బాగా తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం పూర్తి చేయాలి.
- ఏదైనా క్లిష్టమైన ప్రశ్న కనిపిస్తే దాని కోసం సమయం వృథా చేయకుండా..వేరే ప్రశ్నకు వెళ్లాలి.
- నెగెటివ్ మార్కింగ్ నిబంధన ఉంది. కాబట్టి సమాధానం తెలియని ప్రశ్నలని వదిలి వేయడమే మేలు.
- ఆన్‌లైన్ పరీక్షలో గుర్తించిన సమాధానాల రివ్యూకు కూడా కొంత సమయం కేటాయించాలి. అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాక... మరోసారి సరిచూసుకోవాలి.
- సమాధానాలిచ్చే క్రమంలో రఫ్ వర్క్ చేయడం మేలు. ఇలా కాకుండా.. ప్రశ్నను చదివి నేరుగా సమాధానాలివ్వడం ఒక్కోసారి తప్పు సమాధానాలకు దారితీస్తుంది. కాబట్టి పరీక్ష హాల్లో అందించే స్క్రిబిల్ ప్యాడ్‌పై ప్రశ్నను సాధించి.. సరైన సమాధానమని నమ్మకం కలిగితేనే గుర్తించాలి.
- పరీక్షకు ఒక రోజు ముందుగానే తమకు కేటాయించిన పరీక్ష కేంద్రం వివరాలు తెలుసుకోవాలి.
మొత్తం ప్రశ్నల సంఖ్య: 65
మొత్తం మార్కులు: 100
పరీక్ష సమయం: మూడు గంటలు
విభాగాలు: 3 (జనరల్ ఆప్టిట్యూడ్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, సంబంధిత సబ్జెక్ట్)
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ సదుపాయం: జనవరి మూడు నుంచి పరీక్ష తేదీ వరకు
వివరాలకు వెబ్‌సైట్: gate.iitd.ac.in
గేట్ -2020 పరీక్ష తేదీలు, సెషన్స్:
పరీక్ష తేదీ | సెషన్ నెంబర్ | సమయం | పేపర్స్ కోడ్ |
ఫిబ్రవరి 1 | ఎస్1 | 9:30-12:30 | ఐఎన్, ఎంఈ1, ఎంటీ, పీఈ, పీహెచ్ |
ఫిబ్రవరి 1 | ఎస్2 | 2:30-5:30 | సీవై,ఎంఈ2, పీఐ |
ఫిబ్రవరి 2 | ఎస్3 | 9:30-12:30 | ఏఆర్, బీఎం, బీటీ, సీహెచ్, ఎంఏ, ఎంఎన్, ఎస్‌టీ, ఎక్స్‌ఈ, ఎక్స్‌ఎల్ |
ఫిబ్రవరి 2 | ఎస్4 | 2:30-5:30 | ఏఈ, ఏజీ, ఈసీ, జీజీ |
ఫిబ్రవరి 8 | ఎస్5 | 9:30-12:30 | ఈఈ, ఈవై, టీఎఫ్ |
ఫిబ్రవరి 8 | ఎస్6 | 2:30-5:30 | సీఎస్ |
ఫిబ్రవరి 9 | ఎస్7 | 9:30-5:30 | సీఈ1 |
ఫిబ్రవరి 9 | ఎస్8 | 2:30-5:30 | సీఈ2 |
మూడు గంటలు ఎంతో కీలకం :
{పస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో రివిజన్, మాక్ టెస్ట్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలి. అభ్యర్థులు ఏడాది కాలంగా ప్రిపరేషన్ సాగిస్తున్నా.. పరీక్ష రోజు చూపే ప్రతిభ ఎంతో ప్రధానం. పరీక్ష హాల్లో ముందుగా జనరల్ ఆప్టిట్యూడ్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ సెక్షన్లను పూర్తి చేయడం వల్ల సబ్జెక్ట్ సెక్షన్‌కు ఎక్కువ సమయం కేటారుుంచే అవకాశం లభిస్తుంది. పరీక్షకు ముందు రోజు ఔట్‌లైన్‌స చూసుకుంటే సరిపోతుంది. మానసికంగా ఒత్తిడి లేకుండా పరీక్షకు హాజరవ్వాలి.
- ఎం.వి.రెడ్డి, డెరైక్టర్, గేట్ కోచింగ్, టైమ్ ఇన్‌స్టిట్యూట్
Published date : 27 Jan 2020 02:25PM