ఏఎస్‌ఆర్‌బీ నెట్-2019తో ప్రయోజనాలెన్నో..
Sakshi Education
వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో లెక్చరర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్లో చేరేందుకు వీలుకల్పించే.. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) కు అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఏఎస్‌ఆర్‌బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యవసాయ వర్సిటీల్లో, ఇతర వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే.. ఏఎస్‌ఆర్‌బీ నెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో... ఏఎస్‌ఆర్‌బీ నెట్‌కు పరీక్ష విధానం, ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...
పరీక్ష విధానం :
కేటగిరీల వారీగా కనీస అర్హత మార్కులు..
జనరల్ అభ్యర్థులు 50శాతం మార్కులు (75మార్కులు), ఓబీసీ(నాన్-క్రీమీలేయర్) 45శాతం మార్కులు(67.5), ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులు 40 శాతం మార్కులు(60 మార్కులు) సాధించాలి.
ప్రయోజనాలు:
రాష్ట్ర లేదా జాతీయస్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఇతర అగ్రికల్చర్ ఇన్‌స్టిట్యూట్‌లలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, లెక్చరర్‌గా కెరీర్ ప్రారంభించాలంటే.. ఏఎస్‌ఆర్‌బీ-నెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. ఏఎస్‌ఆర్‌బీ-నెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఏఎస్‌ఆర్‌బీ సర్టిఫికెట్లను కూడా జారీ చేస్తుంది. తద్వారా వీరికి అగ్రికల్చర్ యూనివర్సిటీలలోని అధ్యాపక పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది.
ముఖ్యాంశాలు :
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.asrb.org.in
- ఏఎస్‌ఆర్‌బీ నెట్-2019 వ్యవసాయ, దాని అనుబంధ 57 సబ్జెక్టుల్లో ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. వేర్వేరు షిప్టుల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షగా నిర్వహిస్తారు.
- పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో 150 మార్కులకు ఉంటుంది. ఇందులో అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్ నుంచి పీజీ స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు. హిందీ,ఇంగ్లిష్ మాధ్యమాల్లో పరీక్ష జరుగుతుంది. 120 నిమిషాల్లో(2గంటలు) సమాధానాలు గుర్తించాలి. నెగిటివ్ మార్కింగ్ విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత విధిస్తారు. సబ్జెక్టుల వారీగా సిలబస్ అంశాలు అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
కేటగిరీల వారీగా కనీస అర్హత మార్కులు..
జనరల్ అభ్యర్థులు 50శాతం మార్కులు (75మార్కులు), ఓబీసీ(నాన్-క్రీమీలేయర్) 45శాతం మార్కులు(67.5), ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులు 40 శాతం మార్కులు(60 మార్కులు) సాధించాలి.
ప్రయోజనాలు:
రాష్ట్ర లేదా జాతీయస్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఇతర అగ్రికల్చర్ ఇన్‌స్టిట్యూట్‌లలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, లెక్చరర్‌గా కెరీర్ ప్రారంభించాలంటే.. ఏఎస్‌ఆర్‌బీ-నెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. ఏఎస్‌ఆర్‌బీ-నెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఏఎస్‌ఆర్‌బీ సర్టిఫికెట్లను కూడా జారీ చేస్తుంది. తద్వారా వీరికి అగ్రికల్చర్ యూనివర్సిటీలలోని అధ్యాపక పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది.
ముఖ్యాంశాలు :
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.asrb.org.in
Published date : 05 Nov 2019 03:38PM