దీన్ని పర్యవేక్షించేలా నిపుణుల కమిటీ.. ఏఐ టూల్స్ ఆధారంగా..
ఏఐ టూల్స్ ఆధారంగా బోధన..
నీట్ విధానంలో..ఏఐ టూల్స్ ద్వారా ఆన్‌లైన్ లెర్నింగ్, ఈ–లెక్చర్స్‌ను సమర్థంగా అందించేందుకు వీలుగా ఏఐసీటీఈ నిబంధనలు రూపొందించింది. ప్రధానంగా ఏఐ ఆధారిత లెర్నింగ్ సొల్యూషన్స్‌ను అందుబాటులో ఉంచాలనే నిబంధన విధించింది. వినూత్నమైన, సృజనాత్మక టీచింగ్ విధానాలను అనుసరించాలని పేర్కొంది. తద్వారా విద్యార్థుల అభ్యసన తీరును మెరుగుపరచొచ్చని భావిస్తోంది. అలాగే ఎడ్‌టెక్ సంస్థలు అందించే కోర్సులను ఉన్నత విద్యాసంస్థలతో అనుసంధానం చేసి.. విద్యార్థులకు అధునాతన నైపుణ్యాలు అందించడం ద్వారా.. ఎంప్లాయబిలిటీ స్కిల్స్‌ను పెంచాలని ఏఐసీటీఈ లక్ష్యంగా నిర్దేశించుకుంది.
ఎడ్‌టెక్ కంపెనీలు ఏం చేయాలంటే..
నీట్ విధి విధానాల ప్రకారం–సదరు ఒప్పందం కుదుర్చుకున్న ఎడ్ టెక్ సంస్థలు పాటించాల్సిన విధులను కూడా ఏఐసీటీఈ నిపుణుల కమిటీ రూపొందించింది. అవి...
- నీట్ నేషనల్ పోర్టల్‌లో పొందుపరచిన అంశాలను విద్యా సంస్థలతో అనుసంధానం చేయాలి.
- అధ్యాపకులకు శిక్షణ అందించి.. బోధన పద్ధతుల్లో కొత్త విధానాలపై అవగాహన కల్పించాలి. అదే విధంగా విద్యా సంస్థలకు సాంకేతిక సహకారం అందించాలి.
- నిర్ణీత వ్యవధిలో నమోదు చేసుకున్న విద్యార్థుల సంఖ్య, వారి ప్రతిభ వంటి వాటిపై నివేదికలు అందించాలి.
ఇంకా చదవండి: part 5: విద్యార్థులకు.. కెరీర్ ఉన్నతి పరంగా అవసరమైన అన్ని రకాల సేవలు