అనుకున్న షెడ్యూల్ ప్రకారమే నీట్ ఏగ్జామ్.. సాధించే మార్గాలు ఇవిగో..
Sakshi Education
వైద్య విద్యలో చేరాలనుకునే విద్యార్థులు నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్)లో ఉత్తమ ర్యాంక్ సాధించాలన్న పట్టుదలతో ఉంటారు. కోవిడ్ మూలంగా నీట్ వాయిదా పడటంతో.. విద్యార్థులు తొలుత కొంత ఆందోళన చెందారు. ఇప్పుడు సెప్టెంబర్ 13న పరీక్ష నిర్వహించాలని నిర్ణయించడం.. ఈ షెడ్యూల్ వాయిదా వేయడం కుదరదని సుప్రీంకోర్టు చెప్పడంతో ముందుగా నిర్ణయించిన తేదీనే నీట్–2020 జరుగనుంది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య విద్య కోర్సుల్లో సీటు సాధించాలంటే.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ 20 రోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఉత్తమ స్కోర్ సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
పునశ్చరణ..
ప్రస్తుతం పరీక్షకు అందుబాటులో ఉన్న సమయం సుమారు ఇరవైSరోజులు. ఈ సమయంలో సిలబస్ ప్రకారం–ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ(జువాలజీ, బోటనీ) పరంగా రోజువారీ ప్రిపరేషన్ ప్రణాళిక రూపొందించుకోవాలి. సబ్జెక్టుల వారీగా కేటాయించుకొని.. రివిజన్ (పునశ్చరణ) చేసేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే ముఖ్యమైన ఫార్ములాలను రోజుకు ఒకసారైనా చదవాలి. అవి మీకు వచ్చినవే అయినా సరే మరోసారి చూడాలి. ఇప్పుడు కొత్త అంశాల జోలికి వెళ్లడం వల్ల గందరగోళానికి గురయ్యే ఆస్కారముంది.
సొంత నోట్స్..
ప్రస్తుతం ఉన్న సమయం చాలా తక్కువ. ఇప్పుడు మీరు ఎంత సిలబస్ పూర్తిచేశారు అనేదాని కంటే.. ఎంత గుర్తుంచుకున్నారు అనే దానిపైనే మీ స్కోర్ ఆధారపడుతుంది. అందువల్ల ఇప్పటికే చదివిన నోట్స్‌ను ప్రతిరోజూ చదవాలి. సిలబస్ ప్రకారం మీరు రాసుకున్న నోట్స్‌లోని ముఖ్యమైన పాయింట్స్‌ను చూడగానే.. మొత్తం చాప్టర్, దానికి సంబంధించిన అంశాలు సులభంగా గుర్తుకురావాలి. ఈ సమయంలో విస్తృతంగా చదవడం కాకుండా.. ఇప్పటికే చదివిన అంశాలను గుర్తు చేసుకోవడమే ఉత్తమం అనేది నిపుణుల సలహా.
మాక్ టెస్టులు..
నీట్ అభ్యర్థులు అందుబాటులో ఉన్న ఈ కొద్ది సమయంలో.. ప్రిపరేషన్ కోసం రోజుకు కనీసం 10 నుంచి 12 గంటలు సమయం కేటాయించాలి. దీనికి మాక్ టెస్టులు అదనం. వాస్తవ పరీక్ష ఎలా జరుగుతుందో అలాగే టైమ్ పెట్టుకుని మాక్ టెస్టులు ప్రతిరోజు రాయాలి. దీనివల్ల పరీక్ష హాల్‌లో ఎలాంటి ఆందోళన లేకుండా.. ఆయా సబ్జెక్టుల ప్రశ్నలకు సరిగా సమాధానాలు గుర్తించగలరు. మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్ష భయాన్ని(ఎగ్జామ్ ఫియర్) దూరం చేసుకోవచ్చు. మాక్ టెస్టులు ప్రిపరేషన్ స్థాయిని విశ్లేషించుకునేందుకు ఎంతగానో దోహదపడతాయి. దాంతోపాటు గత ఐదేళ్ల పాత ప్రశ్న పత్రాలను అధ్యయనం చేయాలి. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే.. అతి ముఖ్యమైన అంశం టైమ్ మేనేజ్‌మెంట్. కాబట్టి ప్రిపరేషన్ పరంగా, రివిజన్ కోసం, మాక్ టెస్టుల విషయంలో టైమ్ మేనేజ్‌మెంట్‌ను తప్పనిసరిగా పాటించాలి.
ఒత్తిడిని దరిచేరనివ్వొద్దు..
పరీక్ష తేదీ గుర్తుకు రాగానే చాలామంది విద్యార్థులు ఒత్తిడికి గురవుతుంటారు. ఇతరులు తమ కంటే బాగా చదివి ఉంటారని.. తాము పోటీలో వెనుకబడిపోతామని భావించి ఆందోళన చెందుతుంటారు. ప్రతి విద్యార్థి మీలాంటి వారేనని మరిచిపోవద్దు. మీరు చదివినట్టుగానే ఇతర విద్యార్థులు చదువుతారు. ఒత్తిడికి గురైతై అనారోగ్యం పాలై.. అసలు పరీక్ష రాసే అవకాశం కూడా కోల్పోయే ప్రమాదముంది. కాబట్టి పౌష్టికాహారం తీసుకుంటూ కనీసం 6 లేదా 7 గంటలు నిద్రకు తప్పనిసరిగా కేటాయించాలి.
సక్సెస్ టిప్స్..
నీట్ 2020– ముఖ్య సమాచారం..
అధిక వెయిటేజీ చాప్టర్స్‌కు ప్రాధాన్యం..
ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే నీట్, జేఈఈ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. విద్యార్థులు మరో ఆలోచన పెట్టుకోవద్దు. ప్రస్తుత సమయంలో రివిజన్ లో భాగంగా అధిక వెయిటేజ్ అంశాలను మరోసారి చదవాలి. ముఖ్యంగా బయో ప్లాంట్, హ్యూమన్ ఫిజియాలజీ, రీ ప్రొడక్షన్ (పునరుత్పత్తి), లివింగ్ వరల్డ్ (జీవన ప్రపంచం)తోపాటు ఫిజిక్స్‌లో మెకానిక్స్, హీట్ అండ్ కేటీజీ, కెమ్–ఆర్గానిక్ వంటి కీలక అంశాలను పునశ్చరణ చేయాలి. కోవిడ్ పరిస్థితుల్లో నీట్ పరీక్ష జరుగుతోంది. కాబట్టి అన్ని జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థి పరీక్షకు వెళ్లేటప్పుడు వెంట తల్లిదండ్రులు/ సంరక్షకులు ఎవరో ఒకరు తోడుండటం మంచిది. విద్యార్థులు హాల్ టికెట్‌లో పేర్కొన్న అన్ని సూచనలను పూర్తిగా చదివి, దానిప్రకారం నడచుకోవాలి. చివరి నిమిషంలో ఒత్తిడికి గురికాకుండా ఉండాలి.
– యశస్వి సంతోష్, స్పార్క్ అకాడమీ డైరెక్టర్
స్మార్ట్ స్టడీ..
నీట్ పరీక్షకు దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు హాజరవుతుంటారు. పోటీ అధికం. గతంలో అనుకున్న షెడ్యూల్ ప్రకారం పరీక్ష జరుగుతుందని ఊహించిన విద్యార్థులు.. అందుకు తగ్గట్టుగా సిలబస్ పూర్తిచేశారు. కొవిడ్ కారణంగా పరీక్ష వాయిదా పడటంతో కొంత డీలా పడినా.. మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో ప్రిపరేషన్ సాగిస్తున్నారు. ఇప్పుడున్న సమయంలో సిలబస్ అంతా పూర్తిచేయడం సాధ్యం కాదు. కాబట్టి గరిష్ట వెయిటేజీ అంటే ఎక్కువ మార్కులు సాధించి పెట్టే చాప్టర్స్‌ను గుర్తించి.. వాటిపై తదేక దృష్టిపెట్టాలి. మొదట ముఖ్యమైన అంశాల రివిజన్ ప్రారంభించాలి. దాంతోపాటే పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం మంచిది. ప్రతి సబ్జెక్టులో ముఖ్యమైన విషయాలు, గతంలో అధిక స్కోర్స్‌కు ఉపయోగపడిన పుస్తకాల నుంచి సినాప్సిస్ రాసుకున్న నోట్స్‌ను మళ్లీ మళ్లీ చదవాలి.
పునశ్చరణ..
ప్రస్తుతం పరీక్షకు అందుబాటులో ఉన్న సమయం సుమారు ఇరవైSరోజులు. ఈ సమయంలో సిలబస్ ప్రకారం–ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ(జువాలజీ, బోటనీ) పరంగా రోజువారీ ప్రిపరేషన్ ప్రణాళిక రూపొందించుకోవాలి. సబ్జెక్టుల వారీగా కేటాయించుకొని.. రివిజన్ (పునశ్చరణ) చేసేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే ముఖ్యమైన ఫార్ములాలను రోజుకు ఒకసారైనా చదవాలి. అవి మీకు వచ్చినవే అయినా సరే మరోసారి చూడాలి. ఇప్పుడు కొత్త అంశాల జోలికి వెళ్లడం వల్ల గందరగోళానికి గురయ్యే ఆస్కారముంది.
సొంత నోట్స్..
ప్రస్తుతం ఉన్న సమయం చాలా తక్కువ. ఇప్పుడు మీరు ఎంత సిలబస్ పూర్తిచేశారు అనేదాని కంటే.. ఎంత గుర్తుంచుకున్నారు అనే దానిపైనే మీ స్కోర్ ఆధారపడుతుంది. అందువల్ల ఇప్పటికే చదివిన నోట్స్‌ను ప్రతిరోజూ చదవాలి. సిలబస్ ప్రకారం మీరు రాసుకున్న నోట్స్‌లోని ముఖ్యమైన పాయింట్స్‌ను చూడగానే.. మొత్తం చాప్టర్, దానికి సంబంధించిన అంశాలు సులభంగా గుర్తుకురావాలి. ఈ సమయంలో విస్తృతంగా చదవడం కాకుండా.. ఇప్పటికే చదివిన అంశాలను గుర్తు చేసుకోవడమే ఉత్తమం అనేది నిపుణుల సలహా.
మాక్ టెస్టులు..
నీట్ అభ్యర్థులు అందుబాటులో ఉన్న ఈ కొద్ది సమయంలో.. ప్రిపరేషన్ కోసం రోజుకు కనీసం 10 నుంచి 12 గంటలు సమయం కేటాయించాలి. దీనికి మాక్ టెస్టులు అదనం. వాస్తవ పరీక్ష ఎలా జరుగుతుందో అలాగే టైమ్ పెట్టుకుని మాక్ టెస్టులు ప్రతిరోజు రాయాలి. దీనివల్ల పరీక్ష హాల్‌లో ఎలాంటి ఆందోళన లేకుండా.. ఆయా సబ్జెక్టుల ప్రశ్నలకు సరిగా సమాధానాలు గుర్తించగలరు. మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్ష భయాన్ని(ఎగ్జామ్ ఫియర్) దూరం చేసుకోవచ్చు. మాక్ టెస్టులు ప్రిపరేషన్ స్థాయిని విశ్లేషించుకునేందుకు ఎంతగానో దోహదపడతాయి. దాంతోపాటు గత ఐదేళ్ల పాత ప్రశ్న పత్రాలను అధ్యయనం చేయాలి. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే.. అతి ముఖ్యమైన అంశం టైమ్ మేనేజ్‌మెంట్. కాబట్టి ప్రిపరేషన్ పరంగా, రివిజన్ కోసం, మాక్ టెస్టుల విషయంలో టైమ్ మేనేజ్‌మెంట్‌ను తప్పనిసరిగా పాటించాలి.
ఒత్తిడిని దరిచేరనివ్వొద్దు..
పరీక్ష తేదీ గుర్తుకు రాగానే చాలామంది విద్యార్థులు ఒత్తిడికి గురవుతుంటారు. ఇతరులు తమ కంటే బాగా చదివి ఉంటారని.. తాము పోటీలో వెనుకబడిపోతామని భావించి ఆందోళన చెందుతుంటారు. ప్రతి విద్యార్థి మీలాంటి వారేనని మరిచిపోవద్దు. మీరు చదివినట్టుగానే ఇతర విద్యార్థులు చదువుతారు. ఒత్తిడికి గురైతై అనారోగ్యం పాలై.. అసలు పరీక్ష రాసే అవకాశం కూడా కోల్పోయే ప్రమాదముంది. కాబట్టి పౌష్టికాహారం తీసుకుంటూ కనీసం 6 లేదా 7 గంటలు నిద్రకు తప్పనిసరిగా కేటాయించాలి.
సక్సెస్ టిప్స్..
- ఎంబీబీఎస్ సీటు పొందలంటే.. విద్యార్థి 550 నుంచి 650 మార్కులు లక్ష్యంగా పెట్టుకోవాలి.
- ఎగ్జామ్ హాల్‌లో ప్రశ్న పత్రం ఇచ్చాక.. మొదట కొన్ని నిమిషాలపాటు ఇచ్చిన ప్రశ్నలను చదివి అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి.
- ప్రశ్నను పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే సమాధానాలు గుర్తించాలి.
- తొలుత బాగా తెలిసిన విభాగం నుంచి సమాధానాలు గుర్తించడం మొదలు పెడితే.. ఒత్తిడి, ఆందోళన తగ్గి.. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
- పరీక్షకు కేటాయించిన మూడుగంటల్లో.. మొదటి గంటలో బాగా తెలిసినవి లేదా సులభమైన ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. రెండో రౌండ్ లేదా రెండో గంటలో కాస్త కష్టమనిపించే ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. చివరి గంటలో బాగా క్లిష్టమైన ప్రశ్నలకు జవాబులు రాసేందుకు ప్రయత్నించాలి.
- నెగిటివ్ మార్కుల విధానం ఉన్నందున తెలియని ప్రశ్నలను వదిలివేయడమే మేలు.
- ఏ ప్రశ్నకూ 2 నిమిషాల కంటే ఎక్కువ సమయం కేటాయించవద్దు.
- సాధ్యమైనంత ఎక్కువ ప్రశ్నలకు ఖచ్చితత్వంతో సమాధానాలు గుర్తించడం ద్వారా మంచి స్కోర్ సాధించొచ్చు.
- పరీక్షకు కనీసం రెండురోజుల ముందు వరకు మీ ప్రిపరేషన్ స్థాయిని తెలుసుకునేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) అందుబాటులో ఉంచిన ఉచిత మాక్ ఎగ్జామ్స్ రాయడం మంచిది.
నీట్ 2020– ముఖ్య సమాచారం..
- నీట్ యూజీ అంటే: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(అండర్ గ్రాడ్యుయేట్)
- నిర్వహణ సంస్థ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ)
- నీట్ ద్వారా ప్రవేశం కల్పించే కోర్సులు: ఎంబీబీఎస్/బీడీఎస్, బీఏఎంఎస్/బీఎస్‌ఎంఎస్ /బీయూఎంఎస్/బీహెచ్‌ఎంఎస్ తదితర వైద్య విద్య సంబంధ కోర్సులు.
- నీట్ 2020 పరీక్ష తేది: 13.09.2020
- పరీక్ష సమయం: మూడు గంటలు(మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు)
- పరీక్ష విధానం: పెన్ పేపర్ విధానంలో పరీక్ష జరుగుతుంది.
- మొత్తం ప్రశ్నల సంఖ్య: 180(ఫిజిక్స్–45 ప్రశ్నలు,కెమిస్ట్రీ–45 ప్రశ్నలు,బయాలజీ (బాటనీ, జువాలజీ) 90 ప్రశ్నలు)
- మొత్తం మార్కులు: 720
- మార్కుల విధానం: సరైన సమాధానానికి 4 మార్కులు కేటాయిస్తారు. తప్పు సమాధానానికి ఒక మార్కు కోత ఉంటుంది. అటెంప్ట్ చేయని ప్రశ్నకు జీరో మార్కులు.
- పూర్తి వివరాలకు వెబ్ సైట్: https://ntaneet.nic.in/ntaneet/welcome.aspx
అధిక వెయిటేజీ చాప్టర్స్‌కు ప్రాధాన్యం..
ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే నీట్, జేఈఈ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. విద్యార్థులు మరో ఆలోచన పెట్టుకోవద్దు. ప్రస్తుత సమయంలో రివిజన్ లో భాగంగా అధిక వెయిటేజ్ అంశాలను మరోసారి చదవాలి. ముఖ్యంగా బయో ప్లాంట్, హ్యూమన్ ఫిజియాలజీ, రీ ప్రొడక్షన్ (పునరుత్పత్తి), లివింగ్ వరల్డ్ (జీవన ప్రపంచం)తోపాటు ఫిజిక్స్‌లో మెకానిక్స్, హీట్ అండ్ కేటీజీ, కెమ్–ఆర్గానిక్ వంటి కీలక అంశాలను పునశ్చరణ చేయాలి. కోవిడ్ పరిస్థితుల్లో నీట్ పరీక్ష జరుగుతోంది. కాబట్టి అన్ని జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థి పరీక్షకు వెళ్లేటప్పుడు వెంట తల్లిదండ్రులు/ సంరక్షకులు ఎవరో ఒకరు తోడుండటం మంచిది. విద్యార్థులు హాల్ టికెట్‌లో పేర్కొన్న అన్ని సూచనలను పూర్తిగా చదివి, దానిప్రకారం నడచుకోవాలి. చివరి నిమిషంలో ఒత్తిడికి గురికాకుండా ఉండాలి.
– యశస్వి సంతోష్, స్పార్క్ అకాడమీ డైరెక్టర్
Published date : 25 Aug 2020 11:44AM