అడవుల అధ్యయనంపై ఆసక్తి ఉన్న వారికి అవకాశం.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఎఫ్‌ఆర్‌ఐ..
దీని ద్వారా వివిధ విభాగాల్లో రెండేళ్ల మాస్టర్ ఆఫ్ సైన్స్ కోర్సుల్లో ప్రవేశాలను కల్పించనుంది. జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా ఏప్రిల్ 16లోపు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
ఎఫ్‌ఆర్‌ఐ-డెహ్రాడూన్..
ఉత్తరఖండ్ డెహ్రాడూన్‌లోని కౌలగర్హ్ రోడ్‌లో ఉన్న ప్రముఖ పరిశోధనా సంస్థ.. ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఎఫ్‌ఆర్‌ఐ). ఫారెస్ట్రీ రీసెర్చ్‌కు సంబంధించి దేశంలోనే గొప్ప సంస్థగా పేరొందిన ఎఫ్‌ఆర్‌ఐని మొదటగా 1878లో బ్రిటీష్ ఇంపీరియల్ ఫారెస్ట్ స్కూల్‌గా ప్రారంభించారు. అనంతరం ఇంపీరియల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌గా 1906 దీనిని పునఃప్రారంభించారు. తదనంతరం ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఎఫ్‌ఆర్‌ఐ), డెహ్రాడూన్‌గా మార్చారు. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ 1991లో దీనిని డీమ్డ్ యూనివర్సిటీ హోదా ప్రకటించింది. ప్రస్తుతం ఎఫ్‌ఆర్‌ఐ 2021 విద్యాసంవత్సరానికిగాను మాస్టర్ ఆఫ్ సైన్స్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అర్హతలు..
- కోర్సు: ఎమ్మెస్సీ- ఫారెస్ట్రీ
- మొత్తం సీట్ల సంఖ్య -38
- అర్హతలు : బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, జువాలజీ సబ్జెక్టుల్లో ఏదైనా ఒక దానితో బీఎస్సీ/అగ్రికల్చర్ లేదా ఫారెస్ట్రీలో బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
- కోర్సు: ఎమ్మెస్సీ-ఉడ్‌సైన్స్ అండ్ టెక్నాలజీ
- మొత్తం సీట్ల సంఖ్య-38
- అర్హతలు: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో బీఎస్సీ/ఫారెస్ట్రీలో బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
- కోర్సు: ఎమ్మెస్సీ- ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్
- మొత్తం సీట్ల సంఖ్య -38
- అర్హతలు: బేసిక్/అప్లయిడ్ సైన్స్ ఏదైనా విభాగాల్లో బీఎస్సీ డిగ్రీ/అగ్రికల్చర్/ ఫారెస్ట్రీలో బీఎస్సీ డిగ్రీ / ఎన్విరాన్‌మెంట్ సైన్స్‌లో బీఈ /బీటెక్ ఉత్తీర్ణత ఉండాలి.
- కోర్సు: ఎమ్మెస్సీ- సెల్యూలోజ్ అండ్ పేపర్ టెక్నాలజీ
- మొత్తం సీట్ల సంఖ్య-20
- అర్హతలు: కెమిస్ట్రీ సబ్జెక్టుతో బీఎస్సీ డిగ్రీ లేదా కెమికల్/ మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఇంకా చదవండి: part 2: ఎఫ్‌ఆర్‌ఐ నోటిఫికేషన్ విడుదల.. ఎంపిక ప్రక్రియ ఇలా..