వ్యవసాయానికి రూ. 7,531 కోట్లు
Sakshi Education
ప్రభుత్వం వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు బడ్జెట్లో రూ. 7,531.44 కోట్లు కేటాయించింది. భారీగా కేటాయింపులను చూపినా.. రైతుల రుణ మాఫీ పథకం కింద తొలి విడతగా బ్యాంకులకు చెల్లించిన రూ. 4,250 కోట్లను కూడా ఇందులోనే చేర్చింది. పాలిహౌస్‌లకు, ధరల స్థిరీకరణకు కొంత మెరుగ్గా నిధులను కేటాయించింది. వ్యవసాయం, అనుబంధ రంగాలకు ఇచ్చిన బడ్జెట్‌లో ప్రణాళిక కింద రూ. 2,661.66 కోట్లను, ప్రణాళికేతర కింద రూ. 4,869.78 కోట్లను ఇచ్చారు. కానీ ప్రణాళికేతర బడ్జెట్లోనే రుణ మాఫీకి చెల్లించిన రూ. 4,250 కోట్లను చూపారు. ఇక ప్రణాళిక కింద కేటాయింపుల వివరాలు..
- వ్యవసాయానికి రూ. 1,828.87 కోట్లు
- ఉద్యానవన విభాగానికి రూ. 502.75 కోట్లు
- పశు సంవర్థక శాఖకు రూ. 203.36 కోట్లు
- మత్స్యశాఖకు రూ. 64.96 కోట్లు
- సహకారశాఖకు రూ. 61.70 కోట్లు
- వ్యవసాయ ఉత్పత్తుల ధరల స్థిరీకరణ (మార్కెట్ ఇంటర్‌వెన్షన్ ఫండ్) కోసం రూ. 400 కోట్లు
- వెయ్యి ఎకరాల్లో పాలిహౌస్ (గ్రీన్‌హౌస్)ల్లో కూరగాయల సాగు కోసం రూ. 250 కోట్లు
- వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 100 కోట్లు
- కాప్ కాలనీలు, భూసార, నీటి పరీక్షలకు రూ. 20 కోట్లు
- పాల ఉత్పత్తికి ప్రోత్సాహకం కింద రూ. 16.30 కోట్లు
- సీడ్ బ్యాంక్ స్కీమ్ కోసం రూ. 11.90
- పంటల బీమా పథకం రూ. 139.77
- వ్యవసాయశాఖకు భవనాలు రూ. 5.19
- ఇతర రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ రూ. 6.88
- వడ్డీ లేని రుణాలు, పంటల బీమా రూ. 200
- రైతులకు విత్తనాల సరఫరా రూ. 63.61
- సీడ్ చైన్ బలోపేతానికి రూ. 50
- రైతు క్షేత్రస్థాయి పాఠశాల, ఎక్స్‌పోజర్ విజిట్స్ రూ. 10
- జాతీయ ఆహార భద్రతా మిషన్ రూ. 80.22
- విస్తరణ, టెక్నాలజీ జాతీయ మిషన్ రూ. 56.27
- సుస్థిర వ్యవసాయ జాతీయ మిషన్ రూ. 278.56
- ఆయిల్‌సీడ్, ఆయిల్ పాం మిషన్ రూ. 70.34
- రాష్ట్రీయ కృషి వికాస్ యోజన రూ. 280.14
- మైక్రో ఇరిగేషన్ రూ. 200
- కోళ్ల పరిశ్రమకు విద్యుత్ సబ్సిడీ రూ. 20
- సహకార సంఘాలకు రూ. 4.04
- ‘వైద్యనాథన్’ సిఫారసుల అమలుకు రూ. 49.77
Published date : 06 Nov 2014 03:38PM