వైద్య రంగానికి రూ.2,282.86 కోట్లు
Sakshi Education
బడ్జెట్‌లో వైద్యరంగానికి రూ.2,282.86కోట్లు కేటాయించారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ (రూ.1277.39కోట్లు) కంటే ఈ బడ్జెట్‌లో అధికంగా కేటాయించామని మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు.
- హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు చెరో రూ.వంద కోట్లు
- నిమ్స్‌కు రూ.200 కోట్లు
- నల్లగొండ జిల్లా బీబీనగర్ (రంగాపూర్) వద్ద కొత్తగా నిర్మించిన నిమ్స్‌కు కోటి రూపాయలు
- పతి జిల్లా ఆసుపత్రికి రూ.కోటి చొప్పున కేటాయించారు.
- ఎంపిక చేసిన పీహెచ్‌సీలను 24 గంటలు పనిచేసేందుకు రూ.10 కోట్లు
- అదనంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటుకు రూ.57.15 కోట్లు
- ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఆసుపత్రులను నిమ్స్ స్థాయికి పెంచేందుకు రూ.20 కోట్లు
- నిజామాబాద్ మెడికల్ కాలేజీ భవనాల నిర్మాణానికి రూ.92కోట్లు
- కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి రూ.10కోట్లు
Published date : 06 Nov 2014 03:44PM