Skip to main content

Union Budget Top 10 Interesting Facts : పోటీప‌రీక్ష‌ల కోణంలో.. తొలి కేంద్ర‌ బడ్జెట్ నుంచి నేటి బడ్జెట్ వ‌ర‌కు టాప్‌-10 Interesting Facts ఇవే..

కేంద్ర బడ్జెట్ అనేది రాబోయే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ ఆదాయ, వ్యయాల వివరాలను అందించే ఆర్థిక పత్రం. కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వ ఆర్థిక విధానాలు, కార్యక్రమాల వివరాలు కూడా ఉంటాయి.
Union Budget Top 10 Interesting Facts  Budget Planning Session  Revenue and Expenditure Overview GovernmentPrograms  Expenditure Allocation Chart   Economic Forecast Graph

కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థికవేత్తలు, ఆర్థిక నిపుణులు అధ్యయనం చేసి విశ్లేషిస్తారు. కేంద్ర బడ్జెట్ భారత ఆర్థిక వ్యవస్థపై, ప్రజల జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఈ నేప‌థ్యంలో తొలి కేంద్ర‌ బడ్జెట్ నుంచి నేటి బడ్జెట్ వ‌ర‌కు టాప్‌-10 Interesting విశేషాల‌ను అందిస్తుంది సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) మీకోసం..


కేంద్ర‌ బడ్జెట్ టాప్‌-10 Interesting Facts ఇవే..
1. భారతదేశపు మొట్ట మొదటి బడ్జెట్‌ను 1860 ఏప్రిల్ 7న బ్రిటిష్ పాలనలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ను ఈస్టిండియా కంపెనీ ఆర్థిక మంత్రి జేమ్స్ విల్సన్ ప్రవేశపెట్టారు. జేమ్స్ విల్సన్ దీనిని బ్రిటిష్ క్రౌన్ కు బహూకరించారు.

2. భార‌త దేశంలో ఇప్పటివరకూ 77 పూర్తి స్థాయి బడ్జెట్‌లు, 14 తాత్కాలిక బడ్జెట్‌లు ప్రవేశపెట్టారు. స్వతంత్ర్య‌ భారతదేశపు తొలి బడ్జెట్‌ను 1947 నవంబర్ 26న ప్రవేశపెట్టారు. అదే అప్పటి తొలి తాత్కాలిక బడ్జెట్ కూడా. నాటి బడ్జెట్‌లో ప్రభుత్వ ఆదాయం అంచనా 171 కోట్లు. తొలి ఆర్ధిక మంత్రి షణ్ముగ శెట్టి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తరువాత 1948 ఏప్రిల్ 1న పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు.

3. మొరార్జీ దేశాయ్ ఏకంగా 10 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా దేశ చరిత్రలో రికార్డు సృష్టించారు . అలాగే మోరార్జీ దేశాయ్ తన పుట్టిన రోజు సందర్భంగా అంటే ఫిబ్రవరి 29న రెండుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఒకటి లీప్ ఇయర్ అయిన 1964లో, ఇంకోటి 1968 లో ప్రవేశపెట్టారు.

☛ Union Budget 2024-25 Live Updates : కేంద్ర బడ్జెట్ 2024 కేటాయింపులు ఇలా.. ఈ సారి వీటికి అధిక ప్రాధాన్యత.. ఇంకా..

4. బడ్జెట్ చుట్టూ గోప్యత పాటించడానికి 'హల్వా వేడుక' తర్వాత లాక్-ఇన్ అనుసరిస్తారు. అయితే 1950లో కేంద్ర బడ్జెట్ లీక్ అయింది. అప్పటి వరకు రాష్ట్రపతి భవన్‌లోనే బడ్జెట్ ముద్రణ జరిగేది. లీకేజీ తర్వాత దాన్ని న్యూఢిల్లీలోని మింటో రోడ్డులోని ప్రెస్‌కు తరలించాల్సి వచ్చింది. అలా 1980లో నార్త్ బ్లాక్ లోని బేస్ మెంట్‌లో ప్రభుత్వ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

5 . జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు మాత్రమే ప్రధానులుగా ఉన్నప్పుడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.  అలాగే ఆర్థిక మంత్రిగా పని చేసి ఒక్కసారి కూడా బడ్జెట్‌ను సమర్పించని సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఆర్థికమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ బడ్జెట్‌ ప్రవేశపెట్టని జాబితాలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకరు హెచ్ఎన్ బహుగుణ కాగా మరొకరు కేసీ నియోగి. వీరిద్దరూ ఆర్థిక మంత్రులుగా పనిచేసినప్పటికీ కేంద్ర బడ్జెట్‌ను సమర్పించలేదు. హెచ్ఎన్ బహుగుణ, కేసీ నియోగి చాలా తక్కువ కాలంపాటు పదవీ బాధ్యతలు నిర్వర్తించారు.

6. 21 సెప్టెంబర్ 2016 న రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ లో విలీనం చేయడానికి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 

7. 2016 నుంచి ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఆమోదం లభించింది. ఈ సమయంలో ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ ఉన్నారు. అలాగే 2017లో రైల్వే బడ్జెట్‌ను కేంద్ర బడ్జెట్‌లో విలీనం చేశారు. స్వతంత్ర భారతావనిలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన తొలి ఉమ్మడి బడ్జెట్ ఇది. దీంతో 92 ఏండ్ల సాధారణ బడ్జెట్, రైల్వే బడ్జెట్ సంప్రదాయానికి తెరపడింది.

8.  2016 వరకు కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి చివరి పనిదినం నాడే ప్రవేశపెట్టేవారు. దీనిని మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2017లో ఫిబ్రవరి 1గా మార్చారు.

9. 1999 వరకు కేంద్ర బడ్జెట్ ను ఫిబ్రవరి చివరి పనిదినం సాయంత్రం 5 గంటల సమయంలో ప్రకటించేవారు. మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా దానిని ఉదయం 11 గంటలకు మార్చారు.

10. కేంద్ర బడ్జెట్‌ను వరుసగా ఆరో సారి ప్రవేశపెట్టిన తొలి మహిళ ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించనున్నారు. గతంలో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ 6 సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. తద్వారా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ రికార్డును సమం చేయనున్నారు.2019 జూలై నుంచి వరుసగా ఐదు సంవత్సరాలు దేశానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను అందించిన మహిళా ఆర్థికమంత్రి సీతారామన్‌. మొరార్జీ దేశాయ్‌ ఆర్థిక మంత్రిగా 1959–1964 మధ్య ఐదు వార్షిక బడ్జెట్‌లు, ఒక మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు.   వరుసగా ఐదు బడ్జెట్‌లు సమర్పించిన ఆర్థిక మంత్రుల జాబితాలో నిర్మలా సీతారామన్‌. గతంలో మన్మోహన్‌ సింగ్, అరుణ్‌ జైట్లీ, చిదంబరం, యశ్వంత్‌ సిన్హా ఐదుసార్లు బడ్జెట్‌లు ప్రవేశపెట్టారు.

☛ గ‌తంలోని కేంద్ర, రాష్ట్ర‌ బడ్జెట్ల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

Published date : 01 Feb 2024 05:34PM

Photo Stories