ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2016-2017
Sakshi Education
అమరావతి వేదికగా తొలిసారి ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే రంగాల వారీగా రాష్ట్ర స్థితిగతులను వివరించింది. సొంత ఆదాయం తగ్గడం, నిత్యావసరాల సరుకుల ధరలు భారీగా పెరగడం వంటి విషయాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర వార్షిక బడ్జెట్‌తో పాటు 2017 సామాజిక ఆర్థిక సర్వేను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మార్చి 15న శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సర్వే ముఖ్యాంశాలు మీ కోసం...
సర్వే ముఖ్యాంశాలు
రాష్ట్ర జీఎస్‌డీపీ
2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.4,90,134 కోట్లు(సవరణ)గా ఉన్న రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) 2016-17లో రూ.5,47,021 కోట్లకు చేరుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. మొత్తంగా 2016-17లో రాష్ట్రం 11.61 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని పేర్కొంది.
స్థూల రాష్ట్ర ఉత్పత్తి
2015-16 : రూ.4,90,134 కోట్లు
2016-17 : రూ.5,47,021 కోట్లు (11.61 శాతం వృద్ధి)
స్థూల వస్తు ఉత్పత్తి (జీవీఏ)
పన్నులు అవి కాకుండా స్థూలంగా రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వస్తువుల విలువ గ్రాస్ వాల్యూ యాడెడ్ (జీవీఏ) 2016-17లో రూ.4,97,894 కోట్లు ఉండవచ్చని సామాజిక ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఇందులో వ్యవసాయ రంగ నుంచి 31.77 శాతం సమకూరితే పరిశ్రమల 22.23 శాతం, సేవల రంగం నుంచి 46 శాతం వచ్చాయి. 2015-16 జీవీఏ రూ. 4,47,819 కోట్లతో పోలిస్తే 11.18 శాతం వృద్ధి నమోదయ్యింది.
తలసరి ఆదాయం రూ.1,22,376
ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం 13.14 శాతం వృద్ధితో రూ. 1,22,376కు చేరవచ్చని సర్వే అంచనా. 2015-16లో తలసరి ఆదాయం రూ. 1,08,163గా ఉంది. బేస్ ఇయర్ 2011-12 నాటి ధరల ప్రకారం చూసినా తలసరి ఆదాయంలో 10.97 శాతం వృద్ధి నమోదయ్యింది. అప్పటి ధరల ప్రకారం తలసరి ఆదాయం రూ. 86,118 కోట్ల నుంచి రూ. 95,566 కోట్లకు పెరిగింది.
తలసరి అప్పు రూ.43 వేలు
2015-16 సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం తలసరి అప్పు రూ.38,597 కాగా 2017-18లో చేసే అప్పులతో ఇది రూ.43, 205కు పెరగనుంది.
2016-17లో రూ. 1,92,984 కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పులు 2017-18 ఆర్థిక సంవత్సరం మార్చి నాటికి రూ.2,16,026.59 కోట్లకు పెరుగుతుందని బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్నారు. ఈ అప్పులో రూ.33,477.52 కోట్లు తెలంగాణ, ఏపీ మధ్య పంపిణీ చేయాల్సి ఉంది.
తగ్గిన సొంత ఆదాయం
రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయంలో (పన్నులు కాకుండా) 8.5 శాతం క్షీణత నమోదయ్యింది. గనులు, ఖనిజాలు, అడువులు, విద్య వంటి వివిధ రంగాల నుంచి ప్రభుత్వానికి వచ్చే సొంత ఆదాయం 2016-17లో రూ. 4,500 కోట్లకు పరిమితమవుతుందని సర్వే అంచనా వేసింది. 2015-16లో సొంత ఆదాయం రూ. 4,920 కోట్లుగా ఉంది. ఇదే సమయంలో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం రూ. రూ. 39,922 కోట్ల నుంచి రూ. 49,282 కోట్లకు పెరిగితే, కేంద్రం నుంచి వచ్చే ఆదాయం రూ. 45,249 కోట్ల నుంచి రూ. 54,011 కోట్లకు పెరగనున్నారుు.
వడ్డీలకు రూ. 12,208కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలకు 2015-16లో వడ్డీ రూపంలో రూ. 12,208 కోట్లు చెల్లించనుంది. అంతకు ముందు ఏడాదికి వడ్డీల కింద రూ. 9,848 కోట్లు చెల్లించింది.
పరిశ్రమలకు రూ.5,051.04 కోట్ల పెట్టుబడులు
2016-17 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ నాటికి 57 పెద్ద తరహా పరిశ్రమలు వచ్చినట్లు ఆర్థిక సర్వే పేర్కొంది. వీటి పెట్టుబడి విలువ రూ. 5,051.04 కోట్లు కాగా, వీటి ద్వారా 23,756 మందికి ఉపాధి లభించవచ్చని అంచనా. ఇదే సమయంలో రూ.2,542.30 కోట్ల విలువైన 6,849 సూక్ష్మ, చిన్న తరహా కంపెనీలు ఏర్పడ్డారుు.
పెరిగిన నిత్యావసరాల ధరలు
బియ్యం దగ్గర నుంచి అన్ని నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగినట్లు సామాజిక ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. డిసెంబర్, 2015తో పోలిస్తే డిసెంబర్, 2016 నాటికి వివిధ నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల ఈ విధంగా ఉంది. కిలో ఎండుమిర్చి (రెండోరకం) ధర రూ. 107.78 నుంచి రూ. 140.14 (30.03%) పెరిగారుు. కిలో చింతపండు ధర రూ. 78.05 నుంచి రూ. 89.20 (14.29%), వేరుశెనగ నూనె రూ. 104.48 నుంచి రూ.118.63 (13.55%) పెరిగారుు. ఇదే విధంగా బియ్యం, కందిపప్పు ధరలు కూడా పెరిగాయి.
రాష్ట్రంలో వాహనాల సంఖ్య 95.36 లక్షలు
2016, డిసెంబర్ 1 నాటికి రాష్ట్రంలో 95.36 లక్షల వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయని సామాజిక ఆర్థిక సర్వే పేర్కొంది. వాటి వివరాలు...
జాతీయ రహదారులు
రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తీర్ణం పెరుగుతోంది. గతేడాది 4,423 కి.మీగా ఉన్న జాతీయ రహదారులు ఇప్పుడు 5,293.43కి.మీ చేరాయి. దీనికి అదనంగా మరో 1,344.30 కి.మీ జాతీయ రహదారులుగా మారుస్తున్నట్లు ప్రాధమికంగా ప్రకటించారు. ఇవి కాకుండా రాష్ట్ర రోడ్లు రహదారులు భవనాల శాఖ 47,002 కి.మీ నిర్వహిస్తోంది. రాష్ట్రంలో ప్రతి లక్ష జనా భాకు జాతీయ రహదారుల సాంద్రత 10.81 కి.మీగా ఉంది. జాతీయ సగటు 8.60 కి.మీ.
అంకెల్లో ఆంధ్రప్రదేశ్
2011 జనాభా లెక్కల ప్రకారం
రంగాల వారీగా ఉపాధి పొందుతున్న వారు

ద్విచక్ర వాహనాలు | 74,71,397 ( 78.34 శాతం) |
ఆటో రిక్షాలు | 4,81,034 |
కాంట్రాక్ట్ క్యారేజ్ వెహికల్స్ | 3,461 |
స్టేజ్ క్యారేజ్ వెహికల్స్ | 14,951 |
స్కూల్ బస్సులు | 23,579 |
కార్లు | 5,89,276 |
ట్రాక్టర్లు, ట్రయలర్స్ | 2,59,506 |
జాతీయ రహదారులు
రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తీర్ణం పెరుగుతోంది. గతేడాది 4,423 కి.మీగా ఉన్న జాతీయ రహదారులు ఇప్పుడు 5,293.43కి.మీ చేరాయి. దీనికి అదనంగా మరో 1,344.30 కి.మీ జాతీయ రహదారులుగా మారుస్తున్నట్లు ప్రాధమికంగా ప్రకటించారు. ఇవి కాకుండా రాష్ట్ర రోడ్లు రహదారులు భవనాల శాఖ 47,002 కి.మీ నిర్వహిస్తోంది. రాష్ట్రంలో ప్రతి లక్ష జనా భాకు జాతీయ రహదారుల సాంద్రత 10.81 కి.మీగా ఉంది. జాతీయ సగటు 8.60 కి.మీ.
అంకెల్లో ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం | 1,62,970 చ.కి.మీ. ( దేశంలో 8వ అతిపెద్ద రాష్ట్రం) |
ఏపీ తీర ప్రాంతం | 974 కి.మీ.( దేశంలో రెండో పొడవైన ప్రాంతం ) |
అటవీ విస్తీర్ణం | 36,909.36 చ.కీ.మీ. |
2011 జనాభా లెక్కల ప్రకారం
పట్టణ జనాభా | 29.7 |
అత్యధిక పట్టణ జనాభా కలిగిన జిల్లా విశాఖపట్నం | 47.5 శాతం |
జనసాంద్రత | 304 |
లింగ నిష్పత్తి | 997 ((విజయనగరం జిల్లా - 1,019) |
అక్షరాస్యత | 67.35 శాతం |
రాష్ట్రంలో పాఠశాలలు | 61,528 |
టీచర్ల సంఖ్య | 1,64,852 |
జూనియర్ కాలేజీల సంఖ్య | 3,264 |
ప్రభుత్వ డిగ్రీ కాలేజీల సంఖ్య | 146 |
వృత్తి విద్యా కళాశాలలు | 1,360 |
హెచ్‌ఐవీ బాధితులు | 3 లక్షలుగా అంచనా (దేశంలో 25 లక్షలు) |
రంగాల వారీగా ఉపాధి పొందుతున్న వారు
విద్యా రంగం | 4.60 లక్షలు |
ఆర్థిక, బీమా రంగం | 2.20 లక్షలు |
ఆరోగ్య, సామాజిక సేవా రంగం | 1.38 లక్షలు |
కళలు, సాంస్కృతికం, క్రీడలు | 21,214 |
చేనేత, చేతివృత్తుల వారు | 2.53 లక్షలు |
శాశ్వత నిర్మాణాలు లేని చోట పనిచేస్తున్న వారు | 2.16 లక్షలు |
సురక్షిత భవనాల్లో పనిచేస్తున్న వారు | 37,109 |
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పనిచేస్తున్న నిపుణులు | 43,321 |
Published date : 18 Mar 2017 05:40PM