Skip to main content

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2021-22

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో జనరంజక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అన్ని వర్గాల సంక్షేమం, అన్ని రంగాల్లో సత్వర అభివృద్ధే లక్ష్యంగా 2021–2022 బడ్జెట్‌ను రూ.2,29,779.27 కోట్లతో రూపొందించింది.

తొలిసారిగా జెండర్‌ బేస్డ్‌ బడ్జెట్‌ను తీసుకు వచ్చి సమాజంలో సగం ఉన్న మహిళలకు, పిల్లలకూ ప్రత్యేక కేటాయింపులు చేసింది. 2021–22 వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ 2021, మే 20వ తేదీన అసెంబ్లీకి సమర్పించారు. శాసన మండలిలో హోం మంత్రి మేకతోటి సుచరిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కోవిడ్‌ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ప్రత్యేక పరిస్థితుల్లో మే 20న ఒక్క రోజే బడ్జెట్‌ ప్రవేశపెట్టడం, ఆమోదించడం జరిగిపోయింది.


బడ్జెట్ స్వరూపం(అంకెలు రూ. కోట్లలో)

మొత్తం బడ్జెట్ 2,29,779.27
రెవెన్యూ ఆదాయం 1,77,196.48
రెవెన్యూ వ్యయం 1,82,196.54
మూలధన వ్యయం 31,198.38
కేంద్ర గ్రాంట్లు 57,930.62
రెవెన్యూ లోటు 5000.05
ద్రవ్య లోటు 37,029.79
కేంద్ర పన్నుల్లో వాటా 26,935.32

వ్యవసాయ బడ్జెట్

2019–20లో రూ.28,866 కోట్లతో తొలి వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం 2020–21లో కేటాయింపులను రూ.29,159.97 కోట్లకు పెంచింది. 2021-22 ఏడాది ఏకంగా రూ.31,256.35 కోట్ల కేటాయించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.2,096.38 కోట్లను అదనంగా బడ్జెట్‌లో కేటాయింపులు జరిపింది.


budget 2021

రంగాల వారీగా పన్నులు, పన్నేతర ఆదాయం

  • కేంద్ర పన్నుల్లో వాటా రూ.26,935.32 కోట్లు
  • పన్నుల రూపంలో వచ్చే ఆదాయం రూ.85,280.53 కోట్లు
  • పన్నేతర ఆదాయం రూ.7,050.01కోట్లు
  • గ్రాంట్ల రూపంలో వచ్చే ఆదాయం రూ.57,930.62 కోట్లు
  • మొత్తం రెవెన్యూ రాబడి రూ.1,77,196.48 కోట్లు

బడ్జెట్‌ సమగ్ర స్వరూపం

వివరాలు 2019–20 2020–21 బడ్జెట్‌ అంచనా 2020–21 సవరించిన అంచనా 2021–22 బడ్జెట్‌ అంచనా
I. ప్రారంభ నిల్వ 25.65 –43.52 485.35 153.86
II. రెవెన్యూ వసూళ్లు 1,11,034.02 1,61,958.50 1,18,063.09 1,77,196.48
1. కేంద్ర పన్నుల్లో వాటా 28,224.50 32,237.68 24,441.40 26,935.32
2. పన్ను ఆదాయం 57,618.82 70,679.34 57,377.97 85,280.53
3. పన్నేతర ఆదాయం 3,314.74 5,866.07 3,309.61 7,050.01
4. గ్రాంట్స్‌ ఇన్‌ ఎయిడ్‌ 21,875.96 53,175.42 32,934.12 57,930.62
III. మూలధన వసూల్లు 63,126.59 62,830.68 67,073.01 52,582.79
5. ఓపెన్‌ మార్కెట్‌ రుణాలు 48,826.69 54,257.68 50,896.00 44,525.42
6. ఫ్లోటింగ్‌ రుణాలు (స్థూల) –369.73 1,500.00 ––––––––––– 1,500.00
7. కేంద్రం నుంచి రుణాలు 2,030.42 2,500.00 4,931.80 2,000.00
8. ఇతర రుణాలు 1,200.01 2,000.00 1,976.70 2,500.00
9. డిపాజిట్‌ లావాదేవీలు (నికర) 7,083.81 1,973.01 8,206.02 2,007.21
10. రుణాలు, అడ్వాన్సులు 4,355.24 599.99 1,062.49 50.16
11. ఇతర వసూళ్లు –––––––– ––––––– ––––––– ––––––
12. కంటింజెన్సీ నిధి (నికర) 0.15 ––––––– ––––––– ––––––
IV. మొత్తం వసూళ్లు (II+III) 1,74,160.61 2,24,789.18 1,85,136.10 2,29,779.27
V. రెవెన్యూ వ్యయం 1,37,474.54 1,80,392.65 1,52,989.89 1,82,196.54
13. వీటిలో వడ్డీ చెల్లింపులు 17,652.77 20,383.20 22,026.30 22,740.27
VI. మూలధన వ్యయం 12,242.08 29,907.62 18,797.39 31,198.38
VII. రుణాలు అడ్వాన్సులు 5,356.29 553.81 1,707.48 881.51
VIII. మూలధన చెల్లింపులు(14 – 18) 18,628.00 13,935.11 11,972.83 15,502.85
14. ఫ్లోటింగ్‌ రుణాలు ––––––––– ––––––––– ––––––––– –––––––––
15. ప్రభుత్వ రుణాల తిరిగి చెల్లింపు 15,383.16 10,418.40 8,987.61 10,359.60
16. కేంద్రం నుంచి రుణాలు 1,310.89 1,322.79 982.83 1,372.80
17. ఇతర రుణాలు 1,931.29 2,193.92 2,002.40 3,770.45
18. వడ్డీ సెటిల్మెంటు 2.66 –––––––– ––––––– –––––––––
IX. మొత్తం వ్యయం 1,73,700.91 2,24,789.18 1,85,467.59 2,29,779.27
X. మొత్తం లావాదేవీలు (IV–IX) 459.70 –––––––– –331.49 ––––––––––
XI. ముగింపు నిల్వ (I+X) 485.35 –43.52 153.86 153.86
XII.రెవెన్యూ లోటు లేదా మిగులు (II–V) –26,440.52 –18,434.14 –34,926.80 –5,000.05
XIII.ద్రవ్యలోటు (XII –VI–VII+10) –39,683.65 –48,295.58 –54,369.18 –37,029.79
XIV. ప్రాథమిక లోటు (–) (XIII – 13) –22,030.89 –27,912.38 –32,342.88 –14,289.51

ఆర్థిక, సామాజిక, సాధారణ సేవలకు కేటాయింపులిలా

1. ఆర్థిక సేవలకు రంగాల వారీ కేటాయింపులు (రూ.కోట్లలో)

వ్యవసాయ అనుబంధ సర్వీసులకు 13,517.87
గ్రామీణాభివృద్ది 16,221.32
జలవనరులు, వరద నియంత్రణ 13,237.78
ఇంధన 6,637.24
పరిశ్రమలు, మినరల్స్‌ 2,540.24
రవాణా 8,657.74
శాస్త్ర సాంకేతిక, పర్యావరణం 10.68
సాధారణ ఎకో సర్వీసెస్‌ 4,284.03

2. సామాజిక సేవలు వారీగా కేటాయింపులు (రూ.కోట్లలో)

సాధారణ విద్య 26,994.91
క్రీడలు, యువజన సర్వీసులు 138.05
సాంకేతిక విద్య 324.06
సాంస్కృతిక, కళలు 22.57
వైద్యం 13,830.44
తాగునీరు, పారిశుధ్యం 2,690.64
గృహ నిర్మాణం 4,715.02
పట్టణాభివృద్ధి 8,727.08
సమాచార శాఖ 278.82
సంక్షేమం 27,886.98
కార్మిక, ఉపాధి 936.26
సామాజిక భద్రత, సంక్షేమం 4,313.72

3. సాధారణ సేవలు  రూ. 73,813.28 కోట్లు


budget 2021

రాష్ట్ర అప్పు రూ.3,87,125 కోట్లు

2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి అప్పుల పెరుగుదల, రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం ఇలా..

ఆర్థిక సంవత్సరం మొత్తం అప్పు(రూ.కోట్లలో) రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో శాతం
2017–18 2,23,705.95 27.83
2018-19 2,57,509.87 28.02
2019-20 3,01,802.34 31.02
2020-21 3,55,874.30 35.23
2021-22 3,87,125.39 36.46

వివిధ శాఖలు, రంగాలకు కేటాయింపులు

సంక్షేమ రంగం budget 2021

సర్వ జనుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్‌ రూపుదిద్దుకుంది. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి 2021-22 బడ్జెట్‌లో అగ్రతాంబూలం దక్కింది. బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు, బ్రాహ్మణులు, మైనార్టీలు.. ఇలా ప్రతి ఒక్కరి సంక్షేమానికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. గతేడాదికంటే అన్ని వర్గాలకు నిధుల కేటాయింపు పెరగడం విశేషం.

  • ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.17,403.14కోట్లు(గతేడాదికంటే రూ.3,184.38 కోట్లు అదనం)
  • ఎస్టీ సబ్‌ప్లాన్‌కు రూ.6,131.24కోట్లు(గతేడాదికంటే రూ.1,316.74 కోట్లు అదనం)
  • బీసీ సబ్‌ ప్లాన్‌కు రూ.28,237.62కోట్లు(గతేడాదికంటే రూ.6,920.38 కోట్లు అదనం)
  • ఈబీసీలకు రూ.5,478.19కోట్లు(గతేడాది కన్నా రూ.389.64 కోట్లు అదనం)
  • బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.359.19కోట్లు(గతేడాదితో పోలిస్తే 189 శాతం అదనపు నిధులు)
  • మైనార్టీల సంక్షేమానికి 3,840.72 కోట్లు
  • కాపు సంక్షేమానికి రూ.3,306 కోట్లు

విద్యా రంగం Budget 18-19

రాష్ట్ర ప్రభుత్వం 2021–22 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో విద్యా రంగానికి అత్యధిక మొత్తంలో కేటాయింపులు చేసింది. పిల్లల చదువులపై ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు విద్యారంగాన్ని సమున్నత స్థాయిలో తీర్చిదిద్దడానికి వీలుగా నిధులు కేటాయించింది. ‘ఏ సమాజమైనా అభివృద్ధి సాధించాలంటే పిల్లలు, మహిళల సంక్షేమంపై పెట్టే ప్రభుత్వ వ్యయమే కీలకం’ అని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన పేర్కొన్నారు. మొత్తం కార్యక్రమాల కేటాయింపులన్నీ కలుపుకుంటే విద్యా రంగానికి రూ.38,327.20 కోట్లు కేటాయించింది


విద్యా రంగానికి బడ్జెట్‌ కేటాయింపులు ఇలా..
పథకం/విభాగం కేటాయింపులు (రూ.కోట్లలో)

పాఠశాల, ఇంటర్మీడియెట్‌ విద్య 24,624.22
ఉన్నత విద్య 1,973.16
సాంకేతిక విద్య, నైపుణ్యాభివృద్ధి 899.31
జగనన్నఅమ్మఒడి 6,107.36
జగనన్న విద్యా దీవెన 2,500
జగనన్న వసతి దీవెన 2,223.15
మనబడి నాడు– నేడు 3,500
టీచింగ్‌ గ్రాంట్‌ 14,333.47
సమగ్ర శిక్ష 2,030.94
జగనన్నగోరుముద్ద 1,200.00
జగనన్న విద్యా కానుక 750.00
ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు 462.88
ప్రభుత్వ స్కూల్స్‌ 1,699.86
ప్రభుత్వ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ 120.34
ఇతర పథకాలు 526.73

ఆరోగ్య రంగం Budget 18-19

ఆరోగ్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం 2021–22 బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఆరోగ్య రంగానికి రూ.9,426.49 కోట్లు కేటాయించగా ఈ ఏడాది ఈ మొత్తాన్ని రూ.13,830.44 కోట్లకు పెంచింది. తొలిసారిగా బడ్జెట్‌లో కోవిడ్‌ టీకా కోసం రూ.500 కోట్లు, కోవిడ్‌ నియంత్రణకు రూ.500 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఆరోగ్య రంగానికి బడ్జెట్‌లో 4,403.95 కోట్లు అధికంగా కేటాయించారు.


కోవిడ్‌ చికిత్సను ఆరోగ్యశ్రీలో....

పేద రోగులకు భరోసానిస్తూ 2,400 జబ్బులను ఆరోగ్యశ్రీలో చేర్చడంతోపాటు దేశంలోనే మొదటిసారిగా కోవిడ్‌ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చిన ఘనత రాష్ట్రానిది. అంతేకాకుండా ఖరీదైన బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సనూఆరోగ్యశ్రీలో చేర్చారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ పథకానికి బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. మన రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉచిత చికిత్సకు అవకాశం కల్పిస్తున్న ఈ పథకానికి 2021-22 ఏడాది రూ.2,258.94 కోట్లు కేటాయించింది. రూ.5 లక్షల వార్షికాదాయంలోపు ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఈ పథకాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే.


ఆరోగ్య రంగానికి కేటాయింపులు (రూ.కోట్లలో)

జాతీయ ఆరోగ్య మిషన్ 3202.33
ఆరోగ్యశ్రీ-డ్రగ్స్ 2258.94
నాడు-నేడు ఆస్పత్రులకు 1535.88
వైద్య విధానపరిషత్ 720.60
కోవిడ్-19 నియంత్రణకు 500
కోవిడ్-19 వ్యాక్సిన్ కు 500
104-108 సర్వీసులకు 300
ఏపీవీవీపీపారిశుద్యం 100
కిడ్నీ రీసెర్చ్ సెంటర్, పలాస 50
ఇతర పథకాలకు 4662.69

సాగునీటి రంగం Budget 18-19

2021–22 బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించింది. వీటికి రూ.13,237.78 కోట్లను కేటాయించింది. గత బడ్జెట్‌లో రూ.11,805.85 కోట్లను కేటాయించగా.. ఈ ఏడాది రూ.1,431.93 కోట్లు (12.13 శాతం) అధికంగా నిధులను కేటాయింపు చేసింది. సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించిన నిధుల్లో సింహభాగం రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు కేటాయించారు. పోలవరానికి రూ.4,510.41 కోట్లు కేటాయించారు.


ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు ఇలా..

ప్రాజెక్టు పేరు కేటాయించిన నిధులు (రూ.కోట్లలో)
పోలవరం 4,510.41
వెలిగొండ 1,595.38
హంద్రీ–నీవా 1,042.06
సోమశిల 70.22
పెన్నార్‌ డెల్టా సిస్టమ్‌ 210.00
తెలుగుగంగ 208.92
సోమశిల–స్వర్ణముఖి లింక్‌ కెనాల్‌ 57.05
తుంగభద్ర బోర్డు 124.12
గాలేరు–నగరి 250.15
పులివెందుల బ్రాంచ్‌ కెనాల్‌ 149.16
వంశధార 42.18
తోటపల్లి 189.70
జంఝావతి 5.01
మడ్డువలస 8.50
తారకరామతీర్థ సాగరం 201.00
మహేంద్రతనయ 227.00
గుండ్లకమ్మ 10.00
హెచ్చెల్సీ 260.00
హెచ్చెల్సీ స్టేజ్‌–2 169.75
చాగల్నాడు 26.22
తాడిపూడి 46.49
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి 79.95
పురుషోత్తపట్నం 14.33
ఎల్లెల్సీ 30.32
కేసీ కెనాల్‌ 61.70
గురు రాఘవేంద్ర 14.00
గోదావరి డెల్టా సిస్టమ్‌ 65.10
పులిచింతల 31.06
కృష్ణా డెల్టా సిస్టమ్‌ 370.00
చింతలపూడి 301.48
చిన్న నీటిపారుదల 367.38
కాడా 395.67

పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ

రాష్ట్ర సుస్థిర అభివృద్ధికి చోదకశక్తి వంటి పురపాలక, పట్టణాభివృద్ధిశాఖకు రాష్ట్ర ప్రభుత్వం 2021–22 బడ్జెట్‌ కేటాయింపుల్లో పెద్దపీట వేసింది. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తూ బడ్జెట్‌లో రూ.8,727.08 కోట్లు కేటాయించింది. గత ఏడాది కంటే 7.20 శాతం అధికంగా నిధులు కేటాయించడం విశేషం.


ప్రధాన కేటాయింపులు ఇలా..

  • స్మార్ట్‌ సిటీల పథకానికి రూ.1,000 కోట్లు కేటాయించారు.
  • పట్టణాల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి రూ.226.18 కోట్లు. ఈ నిధుల్ని 2.62 లక్షల ఇళ్లతో నిర్మించనున్న జగనన్న నగర్‌లకు వెచ్చిస్తారు.
  • అమృత్‌ పథకం కింద రాష్ట్రంలో 32 పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.367.86 కోట్లు కేటాయించారు.
  • పట్టణ ప్రాంతాల్లో 13,800 పబ్లిక్‌ యూరినల్స్, 13,800 పబ్లిక్‌ టాయిలెట్ల నిర్మాణానికి రూ.179.22 కోట్లు కేటాయించారు. రూ.68.98 కోట్లతో పట్టణ పేదల ఇళ్లల్లో 54,667 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని నిర్ణయించారు.
  • పట్టణ ఉపాధి కల్పన పథకాలకు రూ.149.50 కోట్లు కేటాయించారు.
  • భూసమీకరణ చేపట్టిన అమరావతి ప్రాంతంలో వ్యవసాయ కూలీలకు పింఛన్ల కోసం రూ.120 కోట్లు, భూములిచ్చిన రైతులకు వార్షిక చెల్లింపుల కోసం రూ.195 కోట్లు కేటాయించారు.

కేంద్ర పథకాలకు రూ.1,989.68 కోట్లు

వ్యవసాయ అనుబంధ రంగాల బలోపేతానికి కేంద్ర ఆర్థిక చేయూతతో అమలు చేస్తున్న స్టేట్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ స్కీమ్స్‌ కోసం బడ్జెట్‌లో గతంలో ఎన్నడూలేనిరీతిలో నిధులు కేటాయించారు. 60:40 నిష్పత్తిలో ఈస్కీమ్స్‌ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌ కేటాయిస్తుంటాయి. కొన్ని పథకాలకు మనం ఎంత ఖర్చు చేస్తే ఆ స్థాయిలోనే కేంద్రం ఆర్థిక చేయూత ఇస్తుంది. వీటీ కోసం 2020–21 బడ్జెట్‌లో రూ.970.52 కోట్లు కేటాయించగా... తాజా 2021-22 బడ్జెట్‌లో రూ.1,989.68 కోట్లు కేటాయించారు.

వ్యవసాయ అనుబంధ రంగాల్లో కేంద్రం చేయూతతో అమలు చేస్తున్న పథకాలకు రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు (రూ.కోట్లలో)

పథకం పేరు 2020-21 2021-22
రాష్ట్రీయ కృషి వికాస యోజన (ఆర్‌కేవీవై) 237.23 583.44
నేషనల్‌ ఫుడ్‌ సెక్యురిటీ మిషన్స్‌ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం) 86.22 133.08
నేషనల్‌ ఫుడ్‌ సెక్యురిటీ మిషన్‌–ఆయిల్‌ సీడ్‌ 36.91 53.87
నేషనల్‌ మిషన్‌ ఆన్‌ అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ అండ్‌ టెక్నాలజీ (ఎన్‌ఎంఏఈటీ) 85.09 92.07
సబ్‌మిషన్‌ ఆన్‌ అగ్రికల్చర్‌ మెకనైజేషన్‌ (ఎస్‌ఎంఎఎం) 207.83 739.46
నేషనల్‌ మిషన్‌ ఆన్‌ సస్టైనబుల్‌ అగ్రికల్చర్‌ (ఎన్‌ఎంఎస్‌ఎ) 141.73 215.89
పరంపరాగత్‌ కృషి వికాస యోజన 175.51 171.87
మొత్తం 970.52 1,989.68

యూనివర్సిటీలకు నిధుల కేటాయింపులు ఇలా..

రాష్ట్ర బడ్జెట్‌ 2021–22కి సంబంధించి వివిధ యూనివర్సిటీలకు ప్రభుత్వం ఇతోధిక కేటాయింపులు చేసింది. ఆయా వర్సిటీల్లో వివిధ కార్యక్రమాల అమలు, నిర్మాణాలకు నిధులు కేటాయించింది.

యూనివర్సిటీ కేటాయింపులు (రూ.కోట్లలో)
ఆంధ్రా 228.90
శ్రీ వేంకటేశ్వర 135.67
ఆచార్య నాగార్జున 39.70
శ్రీకృష్ణదేవరాయ 51.69
శ్రీ పద్మావతి మహిళ 44.62
ద్రవిడియన్‌ 18.16
ఆదికవి నన్నయ 7.83
యోగి వేమన 22.15
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 6.00
కృష్ణా 5.01
రాయలసీమ 7.44
విక్రమ సింహపురి 12.05
వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ 4.99
ఉర్దూ 1.00
ఆర్జీయూకేటీ 87.98
జేఎన్‌టీయూకే 34.60
జేఎన్‌టీయూఏ 167.58
తెలుగు 3.81
బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ 4.33
ఉన్నత విద్యామండలి 30.96
ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌ 32.11

వర్సిటీల్లో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు..

వర్సిటీ నిధులు (రూ.కోట్లలో)
ఆదికవి నన్నయ 7.42
విక్రమ సింహపురి 1.46
రాయలసీమ 1.78
యోగి వేమన 66.34
ఆర్జీయూకేటీ 50.00
వైఎస్సార్‌ గిరిజన వర్సిటీ 50.00
వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్, ఫైనార్ట్స్‌ 4.0

జెండర్‌ బడ్జెట్‌

రాష్ట్రంలో సాధారణ బడ్జెట్‌తో పాటు తొలిసారిగా పిల్లల బడ్జెట్‌, మహిళల బడ్జెట్‌(జెండర్‌ బేస్డ్‌ బడ్జెట్‌) ప్రవేశపెట్టారు. వారికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తోందో విడిగా కేటాయింపులు చూపుతూ సభకు వివరించారు. మొత్తం అంచనాల్లోనే పిల్లలు, మహిళల కేటాయింపులు కూడా కలిపి ఉంటాయి.


మహిళల కోసం...

మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. మహిళల అభ్యుదయానికి వివిధ పథకాల ద్వారా కేటాయిస్తున్న నిధుల వివరాలతో ప్రత్యేక నివేదిక విడుదల చేసింది. 2021–22 బడ్జెట్‌లో మహిళలకు రూ. 47,283.21కోట్లు కేటాయించింది. శాఖల వారీగా కేటాయింపులను ఆ నివేదికలో పొందుపరిచింది.

రెండు విభాగాలు.. 53 పథకాలు

మొత్తం 53 పథకాల కింద బాలికలు, మహిళలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. వాటిని రెండు విభాగాలుగా నివేదిక రూపంలో వెలువరించారు.

  • 100 శాతం నిధులను బాలికలు, మహిళలకు కేటాయించే పథకాల వివరాలను మొదటి విభాగంలో పొందుపరిచారు. అందులో 24 పథకాలు ఉన్నాయి. వాటికి మొత్తం రూ.23,463.10 కోట్లు కేటాయించారు.
  • బాలికలు, మహిళలకు 30 శాతం నుంచి 99 శాతం వరకు నిధుల కేటాయించిన పథకాలను రెండో విభాగంలో పొందుపరిచారు. అందులో 29 పథకాలు ఉన్నాయి. వాటికి మొత్తం రూ.23,820.11 కోట్లు కేటాయించారు.

గ్రామీణాభివృద్ధి శాఖదే అగ్రస్థానం

బాలికలు, మహిళలకు నిధుల కేటాయింపులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మొదటి స్థానం సాధించింది. ఆ శాఖ రూ.13,072.27 కోట్లు కేటాయించడం విశేషం. రూ.6,337.44 కోట్ల కేటాయింపులతో వైఎస్సార్‌ ఆసరా రెండో స్థానంలో నిలిచింది. జగనన్న అమ్మ ఒడి పథకం రూ.6,107.36 కోట్ల కేటాయింపులతో మూడో స్థానంలో ఉంది.


బాలల కోసం...

రాష్ట్ర బడ్జెట్‌లో పిల్లలకు తగిన ప్రాధాన్యమిస్తూ ‘పిల్లల బడ్జెట్‌’ను ప్రభుత్వం రూపొందించింది. 2021–22 వార్షిక బడ్జెట్‌లో వివిధ శాఖల ద్వారా 18 ఏళ్లలోపు పిల్లల కోసం ఏకంగా రూ.16,748.47కోట్లు కేటాయించింది. బాలల సర్వతోముఖాభివృద్ధికి మూడు కేటగిరీలుగా ఈ నిధులను కేటాయించారు. నేరుగా సంక్షేమ పథకాలు, ఉపాధి కల్పన/ఆర్థిక సహకారం, శాశ్వత ప్రాతిపదికన మౌలిక సదుపాయాల అభివృద్ధి కేటగిరీలుగా నిధులు కేటాయించినట్టు నివేదికలో పేర్కొన్నారు.

రెండు విభాగాలు.. 39 పథకాలు

  • పిల్లల సంక్షేమం, అభివృద్ధి కోసం రూపొందించిన వివిధ పథకాలు, వాటికి నిధుల కేటాయింపు వివరాలను ప్రభుత్వం రెండు విభాగాల కింద తన నివేదికలో పేర్కొంది. రెండు విభాగాల్లో కలిపి మొత్తం 39 పథకాలు ఉన్నాయి.
  • మొదటి విభాగంలో 100 శాతం పిల్లల కోసం రూపొందించిన పథకాలకు కేటాయింపులను పొందుపరిచారు. ఆ పథకాల కోసం రూ.12,218.64 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. పూర్తిగా పిల్లల కోసం కేటాయించిన 20 పథకాలను ఈ విభాగంలో చేర్చారు.
  • రెండో విభాగంలో 100 శాతం కంటే తక్కువ నిధులను పిల్లల కోసం కేటాయిస్తూ రూపొందించిన పథకాలను పొందుపరిచింది. ఆ పథకాల కోసం ప్రభుత్వం రూ.4,529.83 కోట్లు కేటాయించింది. ఈ విభాగంలో 19 పథకాలను చేర్చారు.

పాఠశాల విద్యా శాఖదే సింహభాగం

  • పిల్లల బడ్జెట్‌ కేటాయింపుల్లో శాఖల వారీగా చూస్తే పాఠశాల విద్యా శాఖ మొదటి స్థానంలో ఉంది. ఆ శాఖకు రూ.8,228.67 కోట్లు కేటాయించారు.
  • రూ.3,314.90కోట్ల కేటాయింపులతో మహిళా, శిశు సంక్షేమ శాఖ రెండో స్థానంలో నిలిచింది. పిల్లలకు రూ.1,169.62 కోట్ల కేటాయింపులతో వైద్య, ఆరోగ్య శాఖ మూడో స్థానంలో ఉంది.

కొన్ని ముఖ్యమైన పథకాలకు కేటాయింపులు ఇలా

పథకం పేరు కేటాయింపు (రూ.కోట్లలో)
బియ్యం సబ్సిడీ 3,000
డోర్‌ డెలివరీ 283.34
వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ 1,556.39
వైఎస్సార్‌ బీమా 372.12
వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ 243.61
అంగన్‌వాడీ నాడు–నేడు 278
భూముల రీసర్వే 206.97
ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ 175
మచిలీపట్నం పోర్టు 150
రామాయపట్నం పోర్టు 100
భావనపాడు పోర్టు 100
ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌ 100

 


2021-22 బడ్జెట్ ముఖ్యాంశాలు/కేటాయింపులు

  • ఇంధన రంగానికి రూ.6,438 కోట్లు
  • రాష్ట్ర హోం శాఖకు రూ.7,039.17 కోట్లు
  • పారిశ్రామిక, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.3673.34 కోట్లు
  • దిశ చట్టం అమలు కోసం రూ.33.77 కోట్లు
  • గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్యంకు రూ.2,881 కోట్లు
  • వైఎస్సార్‌ ఆసరా కోసం రూ.6,337 కోట్లు
  • అమ్మ ఒడి కోసం రూ.6,107 కోట్లు
  • బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు వైఎస్సార్‌ చేయూత కోసం రూ.4,455 కోట్లు
  • ఈబీసీ మహిళలకు ఆర్థిక సాయం కింద రూ.500 కోట్లు
  • వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకానికి రూ.1802.82 కోట్లు
  • ఇళ్ల నిర్మాణానికి వీలుగా బడ్జెట్‌లో రూ.5,661.57 కోట్ల
  • పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.3,673.34 కోట్లు
  • రోడ్లు, భవనాలు, రవాణా శాఖకు రూ.7,594.06 కోట్లు
  • మత్స్య రంగానికి రూ.329.48 కోట్లు
  • 2022 జనవరి నుంచి సామాజిక పెన్షన్లను రూ.2,250 నుంచి రూ.2,500కు పెంపు. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.17,000 కోట్లు ప్రతిపాదన.
  • వైఎస్‌ఆర్‌-పీఎంఫసల్‌ బీమా యోజనకు రూ.1802 కోట్లు
  • డ్వాక్రా సంఘాల సున్నా వడ్డీ చెల్లింపులకు రూ.865 కోట్లు
  • పట్టణ ప్రాంత డ్వాక్రా మహిళలకు రూ.247 కోట్లు
  • వైఎస్‌ఆర్‌ జగనన్నచేదోడు పథకానికి రూ.300 కోట్లు
  • వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర కోసం రూ.285 కోట్లు
  • వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం కోసం రూ.190 కోట్లు
  • వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా కోసం రూ.120 కోట్లు
  • మత్స్యకారులకు డీజిల్‌ సబ్సిడీ కోసం రూ.50 కోట్లు
  • అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లింపుల కోసం రూ.200 కోట్లు
  • రైతులకు ఎక్స్‌గ్రేషియా కోసం రూ.20 కోట్లు
  • లా నేస్తం కోసం రూ.16.64 కోట్లు
  • వైఎస్‌ఆర్‌ ఆసరా కోసం రూ.6,337 కోట్లు
  • వైఎస్‌ఆర్‌ చేయూత కోసం రూ.4,455 కోట్లు
  • వైఎస్‌ఆర్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లకు రూ.85.57 కోట్లు
  • పరిశ్రమలకు ఇన్సెంటివ్‌ల కోసం రూ.1000 కోట్లు
  • ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌కు రూ.200 కోట్లు
  • కడప స్టీల్‌ ప్లాంట్‌ కోసం రూ.250 కోట్లు
  • ఏపీఐఐసీకి రూ.200 కోట్లు కేటాయింపు
  • అర్చకుల ఇన్సెంటివ్‌లకు రూ.120 కోట్లు
  • ఇమామ్‌, మౌజాంలఇన్సెంటివ్‌లకు రూ.80 కోట్లు
  • పాస్టర్ల ఇన్సెంటివ్‌లకు రూ.40 కోట్లు
  • ల్యాండ్‌ రీసర్వే కోసం రూ.206.97 కోట్లు
  • జీఎస్‌డీపీలోద్రవ్యలోటు 3.49 శాతంగా ఉంది
  • రెవెన్యూలోటు 0.47 శాతంగా ఉంది
  • మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి రూ.123 కోట్లు
  • గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ.100 కోట్లు
  • రూ.2,217.43 కోట్లతో గ్రామీణ లింకురోడ్లు నిర్మించాలని ప్రతిపాదన
  • ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో ఉంది.
  • అర్హులైన రైతులకు బీమా సౌకార్యాన్ని అందించడం కోసం ఆంధ్రప్రదేశ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ(ఏపీజీఐసీ–ప్రభుత్వ రంగ సంస్థ) స్థాపన
  • ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ స్థానంలో నిలిచింది.
  • 2020–21లో రాష్ట్రానికి రూ.6,234.64 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీని ద్వారా 39,578 మందికి ఉపాధి దొరికింది.
  • భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, దగదర్తి విమానాశ్రయాలకు 2021–22లోగా భూసేకరణ పూర్తవుతుంది
  • అనంతపురం, తిరుపతి, విశాఖపట్నంలలో తొలి దశలో కాన్సెప్ట్‌ సిటీల అభివృద్ధి
  • కొత్తగా 16 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు


ఆర్థిక మంత్రి బుగ్గన బడ్జెట్ ప్రసంగం

Published date : 22 May 2021 06:10PM

Photo Stories