Skip to main content

SBI Clerk Admit Card 2025 Released: ఎస్‌బీఐ జూనియర్‌ అసోసియేట్‌ హాల్‌టికెట్స్‌ విడుదల.. డౌన్‌లోడ్‌ చేయడం ఎలాగంటే..?

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ).. జూనియర్‌ అసోసియేట్‌  (కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌) ప్రిలిమ్స్‌ అడ్మిట్‌ కార్డులను విడుదల చేసింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, పుట్టినతేది వివరాలతో హాల్‌టికెట్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా ఫిబ్రవరి 22- మార్చి 1 వరకు ఎస్‌బీఐ జూనియర్‌ అసోసియేట్స్‌ కోసం పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశ వ్యాప్తంగా 13,735 పోస్టులను భర్తీ చేయనున్నారు. 
SBI Clerk Admit Card 2025 Released  SBI Junior Associate Prelims admit card download notice  SBI Junior Associate Prelims exam dates and admit card download  SBI admit card for Junior Associate Prelims exam February to March 2025
SBI Clerk Admit Card 2025 Released

రెండు దశల రాత పరీక్ష

ఎస్‌బీఐ జూనియర్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి రెండు దశల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ముందుగా ప్రిలిమినరీ రాత పరీక్ష ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారికి రెండో దశలో మెయిన్‌ ఎగ్జామినేషన్‌ జరుగుతుంది.

100 మార్కులకు ప్రిలిమ్స్‌

ఎంపిక ప్రక్రియలో తొలిదశ ప్రిలిమినరీ పరీక్ష 100 ప్రశ్నలు–100 మార్కులకు ఉంటుంది. ఇందు­లో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30 ప్రశ్నలు–30 మార్కులకు, న్యూమరికల్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులకు, రీజనింగ్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులకు ఉంటాయి. పరీక్ష సమయం ఒక గంట. పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో ఆబ్జెక్టివ్‌ తరహాలో జరుగుతుంది. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ మినహా మిగతా విభాగాలకు సంబంధించి అభ్యర్థులు తమ రాష్ట్రానికి చెందిన లేదా తాము దరఖాస్తు చేసుకున్న రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతీయ భాషలో పరీక్ష రాయొచ్చు.

State Bank of India Recruitment 2022 – Apply For Senior Executive  (Economist) Posts

SBI Clerk Prelims హాల్‌టికెట్స్‌ ఎలా డౌన్‌లోడ్‌ చేయాలి?

  • ముందుగా అఫీషియల్‌ వెబ్‌సైట్‌ website at sbi.co.in.ను సంప్రదించండి. 
  • కెరీర్‌ సెక్షన్‌ని క్లిక్‌ చేయండి
  • తర్వాతి పేజీలో కనిపించే కెరీర్‌ ఓపెనింగ్స్‌- జూనియర్‌ అసోసియేట్‌ సెక్షన్‌ని క్లిక్‌ చేయండి. 
  • డౌన్‌లోడ్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి
  • భవిష్యత్‌ అవసరాల కోసం ప్రింట్‌ అవుట్‌ తీసుకోండి.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 12 Feb 2025 10:54AM

Photo Stories