AP Forest Department Jobs 2023 : అటవీ శాఖలో ఈ పోస్టులకు ఎంపికైన వారికి..
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలోని అసిస్టెంట్ కన్జర్వేటర్ పోస్టులకు ఎంపికైన వారికి వాకింగ్ టెస్టు, మెడికల్ టెస్టులను నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ఫిబ్రవరి 22వ తేదీ (బుధవారం) తెలిపింది.
ap forest department jobs 2023

ఈ టెస్టులకు ఎంపికైన వారి జాబితాను ‘ https://psc.ap.gov.in ’ వెబ్‌సైట్‌లో పొందుపరచింది. అభ్యర్థుల వారీగా వాకింగ్ టెస్టు, మెడికల్ టెస్టుల తేదీ, సమయాలను తరువాత తెలియజేయనుంది. బీసీ సంక్షేమ శాఖలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్–2 (ఉమెన్) పోస్టులకు ఎంపికైన వారి జనరల్‌ర్యాంకింగ్ జాబితాలను వైఎస్సార్ కడప, విశాఖ జిల్లాలకు తదుపరి ప్రక్రియల కోసం పంపినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.
Published date : 23 Feb 2023 07:44PM