Skip to main content

APPSC: ఆంగ్లంతో పాటు తెలుగులోనూ ఈ పరీక్షలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక విభాగపు పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షలను ఆంగ్లంతో పాటు తెలుగులోనూ నిర్వహించాలని Andhra Pradesh Public Service Commission (APPSC) నిర్ణయించింది.
APPSC
ఆంగ్లంతో పాటు తెలుగులోనూ ఈ పరీక్షలు

దీనివల్ల అభ్యర్థులందరికీ మేలు జరుగుతోందని కమిషన్‌ భావిస్తోంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్య­దర్శి జె.ప్రదీప్‌ కుమార్‌ ఏప్రిల్‌ 3న ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని సాంకేతిక, ప్రత్యేక అర్హతలతో కూడిన పోస్టుల నియామకాలకు ఏపీపీఎస్సీ ఇప్పటివరకు ఆంగ్లంలోనే పరీక్షలు నిర్వహిస్తూ వస్తోంది. వీటిని తెలుగు మాధ్యమంలో కూడా నిర్వహించాలని గత కొంతకాలంగా గ్రామీణ, తెలుగు మాధ్యమం అభ్య­ర్థులు కోరుతున్నారు.

చదవండి: ఏపీపీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్‌ | టీఎస్‌పీఎస్సీ

ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ ఈ పరీక్షలకు సంబంధించిన పేపర్‌–1ను ఆంగ్లం, తెలుగు మాధ్యమాల్లో నిర్వహించాలని నిర్ణయించింది. పేపర్‌–1లో జనరల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబిలిటీ ప్రశ్నలుంటాయి. ఆంగ్లం ప్రశ్నలను తెలుగులో అనువదించి ఇస్తారు. అయితే ఈ రెండు మాధ్యమాల్లో ఆంగ్లంలోని ప్రశ్నలను మాత్రమే పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇక పేపర్‌–2లో సబ్జెక్టు పేపర్లను మాత్రం ఆంగ్ల మాధ్యమంలోనే నిర్వహించనున్నారు.

Published date : 04 Apr 2023 01:29PM

Photo Stories