జూన్ 17 నుంచి ఏపీపీఎస్సీ గ్రూప్–1 ఇంటర్వ్యూలు
Sakshi Education
సాక్షి, అమరావతి: గ్రూప్ – 1 పరీక్షల్లో అర్హత సాధించి ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులకు జూన్ 17వ తేదీ నుంచి మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఇంటర్వ్యూలు పనిదినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. అదేరోజు ధ్రువపత్రాల పరిశీలన కూడా ఉంటుంది. ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఇంటర్వ్యూలకు సంబంధించి అభ్యర్థులకు వ్యక్తిగతంగా మెమోలను ఈ– మెయిల్, వాట్సాప్, స్పీడ్ పోస్టు, కొరియర్ ద్వారా పంపనున్నారు. మెమోలను అందుకున్న అనంతరం అభ్యర్థులు ఏపీపీఎస్సీ వెబ్‌లింక్ ద్వారా ధ్రువీకరించాలని సూచించారు.
ఏపీపీఎస్సీ గ్రూప్ – 1, 2,3,4 పరీక్షలకు సంబంధించిన స్టడీమెటీరియల్, బిట్ బ్యాంక్స్, ఆన్‌లైన్ కోచింగ్ క్లాసులు, ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్, ప్రీవియస్ పేపర్స్, ప్రిపరేషన్ గైడెన్స్... ఇతర తాజా అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి.

Published date : 02 Jun 2021 01:16PM