APPSC Group II: సాక్షిఎడ్యుకేషన్ - ఆర్.సి ఎగ్జామ్స్ కలిసి తిరుపతిలో ఉచిత అవగాహన సదస్సు!!
ఈ నేపథ్యంలో.. గ్రామీణ విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో.. సాక్షిఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com) రాష్ట్రంలోని ప్రముఖ పోటీ పరీక్షల సంస్థ ఆర్.సి ఎగ్జామ్స్ కలిసి జూన్ 11వ తేదీ (ఆదివారం) ఉదయం 09:00 నుంచి 12:30 వరకు తిరుపతిలోని Mahati Auditorium, Balaji Colony, Near Town Club నందు ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వివిధ పోటీపరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు సాక్షిఎడ్యుకేషన్.కామ్ తోడుగా ఉం టున్న విషయం మీ అందరికి తెల్సిందే.
చదవండి: ఏపీపీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్ | టీఎస్‌పీఎస్సీ
లెజండరీ ఫ్యాకల్టీతో..
ఈ అవగాహన సదస్సుకు రాష్ట్రంలోనే లెజండరీ ఫ్యాకల్టీలైన బి. కృష్ణారెడ్డి (పాలిటీ), అబ్దుల్ కరీం(హిస్టరీ), సి.హరికృష్ణ (సైన్స్ అండ్ క్నాలజీ), ఎండీ పాషా (ఎకానమీ), ప్రొ. చింతా గణేష్ (సోషియాలజీ), మట్టపల్లి రాఘవేం ద్ర(కరెంట్అఫైర్స్), శంకర్ రెడ్డి(మెంటల్ ఎబిలిటీ), జల్లు సద్గుణరావు (జాగ్రఫీ) లాంటి లెజండరీ ఫ్యాకల్టీలు హాజరుకానున్నారు. అవగాహన సదస్సుతో పాటు.. అదే రోజు టాలెంట్ టెస్ట్ నిర్వహించి జిల్లాలో మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు బహుమతులు, ప్రామాణిక స్టడీ మెటీరియల్ ఇవ్వనున్నారు. త్వరలోనే వెయ్యికి పైగా గ్రూప్-2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రానుండటం.. దీనికి తోడు గ్రూప్-2కు కొత్త సిలబస్ ను ప్రకటిం చిన నేపథ్యంలో ఈ అవగాహన సదస్సులు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. అవగాహన సదస్సు, టాలెంట్ టెస్టు హాజరయ్యే విద్యార్థులు ముందుగా 8985094499 ఫోన్ నెంబర్కు తమ పేరు, ఫోన్ నెం బర్, జిల్లా వివరాలను వాట్సప్ లో పంపాలి.
అవగాహన సదస్సు తేదీ: జూన్ 11, 2023 (ఆదివారం)
వేదిక : Mahati Auditorium, Balaji Colony, Near Town Club, Tirupati.
సమయం: ఉదయం 09:00 నుంచి 12:30 వరకు