Skip to main content

ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 మెయిన్స్‌ ఫలితాలు విడుదల: ఇంటర్వ్యూలు ఎప్పటినుంచంటే..

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి గత డిసెంబర్‌ 14 నుంచి 20వ తేదీవరకు నిర్వహించిన మెయిన్‌ పరీక్షల ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది.
ఈ ఫలితాలను కమిషన్‌ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు కమిషన్‌ కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణులై ఇంటర్వ్యూలకు అర్హత సాధించిన వారికి విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో మౌఖిక పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఉంటాయన్నారు. ప్రస్తుత కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ ఇంటర్వ్యూలను జూన్‌ 14 నుంచి నిర్వహించాలని తాత్కాలిక షెడ్యూల్‌ నిర్ణయించామన్నారు. అభ్యర్థులకు వ్యక్తిగతంగా కాల్‌ లెటర్లు పంపిస్తామని తెలిపారు. స్పోర్ట్స్‌ కోటాకు సంబంధించిన అభ్యర్థులు సంబంధిత ఫారం 1ను 48 గంటల్లోగా అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. శాప్‌కు పరిశీలన కోసం పంపిస్తామని తెలిపారు.

ఇంటర్వ్యూ టిప్స్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇంకా..
డిగ్రీ కాలేజీ ఎకనమిక్స్‌ లెక్చరర్‌ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను వెబ్‌సైట్లో ఉంచినట్లు తెలిపారు. నవంబర్‌లో నిర్వహించనున్న డిపార్టుమెంటల్‌ పరీక్షకు దరఖాస్తు చేయనివారికి మరో అవకాశం కల్పిస్తున్నామని, వీరు ఈనెల 29 నుంచి మే 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రీయ ఇండియన్‌ మిలటరీ కాలేజీ (డెహ్రాడూన్‌) ప్రవేశానికి సంబంధించి జూన్‌లో నిర్వహించే ప్రవేశపరీక్షకు దరఖాస్తు గడువును మే 21వ తేదీ వరకు పొడిగించినట్లు ఆయన ప్రకటనలో తెలిపారు.
Published date : 29 Apr 2021 03:32PM

Photo Stories