డిగ్రీ లెక్చరర్ అభ్యర్థులకు ఫిబ్రవరి 10 నుంచి ఇంటర్వ్యూలు: ఏపీపీఎస్సీ
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని వివిధ సబ్జెక్టుల లెక్చరర్ పోస్టులకు నిర్వహించిన పరీక్షలలో ఎంపికై న అభ్యర్థులకు ఈ నెల 10 నుండి 25వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇంటర్వ్యూలతో పాటు అభ్యర్థుల ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన కూడా అదే రోజున ఉంటుందని వివరించారు. అభ్యర్థులు ఏపీపీఎస్సీ సూచించిన నిర్ణీత ధ్రువపత్రాలను తమతో పాటు తీసుకురావాలన్నారు. ఏయే తేదీల్లో ఏయే సబ్జెక్టుల వారికి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారో రిజిస్టర్ నెంబర్ల వారీగా షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్లో పొందుపరిచామని తెలిపారు.
Published date : 03 Feb 2021 05:39PM