Skip to main content

POLYCET 2022: అడ్మిషన్ల దరఖాస్తు గడువు పొడిగింపు

AP Polycet – 2022 అడ్మిషన్ల కౌన్సెలింగ్‌కు సంబంధించి దరఖాస్తు గడువును ఆగస్టు 11వరకు పొడిగిస్తున్నట్లు కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ డాక్టర్‌ పోలాభాస్కర్‌ ఆగస్టు 2న తెలిపారు.
POLYCET 2022
ఏపీ పాలిసెట్–2022 అడ్మిషన్ల దరఖాస్తు గడువు పొడిగింపు

ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపు, దరఖాస్తు సమర్పణ, సర్టిఫికెట్ల పరిశీలనకు ఆగస్టు 1 వరకు గడువును పొడిగిస్తున్నట్లు వివరించారు. ఆగçస్టు 3న టెన్త్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆ విద్యార్థులకు మేలు కలిగేలా పాలిసెట్‌ అడ్మిషన్ల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు ‘appolycet.nic.in’ను సందర్శించాలని కోరారు. తాజా షెడ్యూల్‌ ప్రకారం ఆగస్ట్‌ 6 నుంచి 11 వరకు ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఆగస్టు 12 వరకు ఆప్షన్ల సవరణకు అవకాశం ఉంది. సీట్లను 16న కేటాయించి 22 నుంచి తరగతులను ప్రారంభిస్తారు.

చదవండి: 

Published date : 03 Aug 2022 01:24PM

Photo Stories