AP Constable Results 2023 : కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల.. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారు..
వీరిలో 95,208 మంది అభ్యర్తులు ఉత్తీర్ణత సాధించారు. 6,100 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెల్సిందే.5,03,487 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారు..
రెండో దశ దరఖాస్తు ప్రక్రియను ఫిబ్రవరి 13వ తేదీ సాయంత్రం 3 గంటలకు ప్రారంభించనున్నట్లు తెలిపింది ఏపీ రిక్రూట్మెంట్ బోర్డ్ తెలిపింది. అభ్యర్థులు ఫిబ్రవరి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారికి మాత్రమే తదుపరి దశ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అభ్యర్థులు ఏమైనా సందేహాలుంటే 9441450639, 9100203323 నంబర్లకు ఫోన్ చేయవచ్చు. లేదా mail-slprb@ap.gov.in మెయిల్ ద్వారా కూడా తెలియపరవచ్చు.
ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి
కటాఫ్ మార్కులు ఇలా..
కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా 35 ప్రాంతాల్లోని 997 పరీక్షా కేంద్రాల్లో దీన్ని నిర్వహించినట్లు రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులు తెలిపారు. 200 మార్కులకు నిర్వహించిన ఈ పరీక్షలో ఓసీలకు 40 శాతం(80 మార్కులు), బీసీలకు 35(70 మార్కులు), ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు 30 శాతం (60 మార్కులు) కటాఫ్‌గా నిర్ణయించిన విషయం తెలిసిందే.
AP Police Constable : కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాతపరీక్ష 'కీ' విడుదల.. కొశ్చన్ పేపర్ ఇదే.. ఈ ప్రశ్నలకు మాత్రం..
ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల పూర్తి వివరాలు ఇవే..