Skip to main content

AP SI Prelims Paper-2 Question Paper with Key 2023 : ఎస్ఐ ప్రిలిమ్స్ పేప‌ర్‌-2 కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ' ఇదే.. ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎస్‌ఐ పోస్టుల‌కు సంబంధించిన పేప‌ర్ 1 & 2 ప్రిలిమ్స్ రాత‌ప‌రీక్ష‌ను ఫిబ్రవరి 19వ తేదీన (ఆదివారం) ఆంధ్రప్రదేశ్‌ పోలీసు నియామక మండలి ప్ర‌శాంతంగా నిర్వ‌హించింది. సివిల్, ఏపీఎస్పీ విభాగాల్లో మొత్తం 411 ఎస్‌ఐ పోస్టులను భర్తీ చేయనున్నారు.
AP SI Prelims Paper 2 Question Paper with Key 2023
AP SI Prelims Paper 2 Question Paper with Key

ఇందులో భాగంగా ప్రిలిమినరీ పరీక్షను  ప్రిలిమినరీ పరీక్షలో పేపర్‌–1ను (అర్థమెటిక్‌ అండ్‌ టెస్ట్‌ ఆఫ్‌ రీజనింగ్‌/మెంటల్‌ ఎబిలిటీ) ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు నిర్వ‌హించారు. ఈ పేప‌ర్‌-1ను 100 ప్ర‌శ్న‌లు.. 100 మార్కుల‌కు నిర్వ‌హించారు. ఈ ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో రెండు వందల మార్కులకు ఉంటుంది. రెండు పేపర్లుగా పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.

☛ AP SI Prelims Paper-1 Question Paper with Key 2023 : ఎస్ఐ ప్రిలిమ్స్ పేప‌ర్‌-1 కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ' ఇదే.. ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాంటే..?

ఎస్‌ఐ ప్రిలిమ్స్ రాత ప‌రీక్ష‌కు సంబంధించిన 'కీ' ని సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల‌తో ప్రిపేర్ చేయించారు. ఎస్‌ఐ ప్రిలిమ్స్ పేప‌ర్‌-2 రాత ప‌రీక్షకు సంబంధించిన 'కీ' సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌లో అందుబాటులో ఉంది. అలాగే పేప‌ర్‌-2 కొశ్చ‌న్‌పేప‌ర్ కూడా వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఈ 'కీ' కేవ‌లం ఒక అవ‌గాహ‌న కోస‌మే. అంతిమంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్ విడుద‌ల చేసే 'కీ' మాత్ర‌మే మీరు ప్రామాణికంగా తీసుకోగ‌ల‌రు. 

ఏపీ ఎస్ఐ ప్రిలిమ్స్ 2023 పేప‌ర్‌-2 కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ' ఇదే..

Published date : 19 Feb 2023 08:33PM
PDF

Photo Stories