AP Police Constable Prelims Question Paper and Exam Key 2023 : కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాతపరీక్ష కొశ్చన్ పేపర్ & 'కీ' సాక్షి ఎడ్యుకేషన్.కామ్‌లో..
రాష్ట్రవ్యాప్తంగా 997 కేంద్రాల్లో ఈ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించే ఈ పరీక్షకు పోలీసు నియామక మండలి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసింది. ప్రిలిమినరీ రాత పరీక్ష మొత్తం 200 ల మార్కులకు 3 గంటల వ్యవధిలో ఉంటుంది. ఈ పోస్టులకు దాదాపు 5,09,579 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు గరిష్టంగా 83 మంది పోటీపడుతున్నారు.
చదవండి: AP Police Constable and SI Exams Previous Papers
ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాత పరీక్షకు సంబంధించిన 'కీ' ని సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com) ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులతో ప్రిపేర్ చేయించనున్నారు. కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష ముగిసిన తర్వాత సాక్షి ఎడ్యుకేషన్.కామ్‌లో AP Police Constable Prelims Question Paper and Exam Key అందుబాటులో ఉండనున్నది. ఈ 'కీ' కేవలం ఒక అవగాహన కోసమే. అంతిమంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ విడుదల చేసే 'కీ' మాత్రమే మీరు ప్రామాణికంగా తీసుకోగలరు.